అమరత్వమునకు సంబందించిన పూర్తి వివరణ

 


అమరత్వమునకు సంబందించిన పూర్తి వివరణ

Note: సాధకులు కేవలం మాస్టర్ గారి సాహిత్యం ఆధారంగా ఈ వ్యాసాన్ని అర్థం చేసుకొనవలెను, మాస్టర్ గారి మీడియంస్ యొక్క కథనాలు కేవలం అదనపు సమాచారంగా భావించడం మంచిది.


To refer Master's Independence Declaration please follow below provided URL's


Independence Declaration in Telugu



Points Extracted from Master's Independence Declaration in context to our present topic:
కుటుంబ జీవితము గడుపుతూనే మనకు వ్యాధి, వృద్ధాప్యము, మరణము లేని స్థితి కలిగించుటకై మార్గము ఏర్పర్చబడినది.

_________________________

To refer Master's Pillar Test Speech please follow below provided URL's



Master's Pillar Test Speech in Telugu



Master's Pillar Test Speech in English



Points Extracted from Master's Pillar Test Speech in context to our present topic:

మీరందరు గ్రహాల ప్రభావాలను సరిదిద్దుటయే కాక వాటి నుంచి బయట పడ గలిగే అంత గొప్పగా మీరంతా అభివృద్ధి చెందాలి అంతేకాక నిప్పు మొదలగు ఏ ఇతర పరికరాలు వస్తువులు మిమ్మల్ని గాయపరచలేనటువంటి ఉన్నత స్థితికి మీరు ఎదగాలి.

వ్యాధులు, యాక్సిడెంట్స్(Accidents), మొదలగునావి మనల్ని ఏమిచేయలేని విధంగా మనము ఒక ఆధార పూర్వకంగా నిలబడాలి ఎలా అంటే 4 is 4, and 4 and 4 is 8 అనే విధంగా. ఈ విషయం అర్థం చేసుకొని గృహస్థ సమస్యలనుంచి బయటపడి మనపై గ్రహాల ప్రభావం ఎంత ఎక్కువ స్థాయిలో ఉందొ అర్థం చేసుకొని ఎవరికీ వారు ఎటువంటి ప్రకటనలు(శాశ్వతత్వం(Eternity) సాధించామని) ప్రకటితం చేయరాదు., వ్యాధులు, ఆక్సిడెంట్లు మొదలగునవి ఏమిచేయలేని విధంగా మీ మాస్టర్ గారే ఒక ఆధార పూర్వకంగా నిలబడినట్లు ఇంకా ప్రకటించలేదు కావున మీరు ఈ విషయానికి సంబంధించి ఎటువంటి తప్పుడు ప్రకటనలు చేయరాదు. 

మన పూర్వికులు మానవ భౌతిక దేహము పనికిరానిదని ఇది ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగించునని త్వరగా క్షిణింప బడునని దురభిప్రాయం కలిగి ఉన్నారు. కానీ నేను ఈ భౌతిక దేహాన్ని క్షిణించని విధంగా ఎల్లవేళలా జ్ఞానాన్ని ప్రసాదించునంతటి ఉన్నత స్థితికి అభివృద్ధి చేయ దలచినాను.

ఉదాహరణకు దశరథ మహారాజు ఎటువంటి యోగ ప్రక్రియ ద్వారా 60,000 సంవత్సరాలు జీవించినారు, ఈ విషయములో మనము తాను ఏ కాలమానమున జీవించి ఉన్నారు మరియు ఆ కాలమానమున సాధారణ జనాల ఆయువు పరిమితి ఏమిటి అని ఆలోచించ వలెను. (Explanation: Dasaratha Maharaja and his people doesn't belongs to manform of  present root race(theosophical term) so their age differs to man-form of present root race) మనము ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆయువు పరిమితిని 100 సంవత్సరాలను మించి కొనసాగించడం సాధ్యం కానీ పని అని వేదాల ద్వారా ప్రకటించబడింది.(Explanation: 100 Years is average living age for manform of present root race) (గమనిక: సమిష్టి మానవాళికి సంబంధించి అర్థం చేసుకొనవలెను, ఏదో ఒకరిద్దరు ఉన్నత సిద్ధులు సాధించి వారి వారి ఆయు పరిమితిని పెంచుకున్న వారి గురించి పట్టించుకొనరాదు.)

నా ఈ ప్రేయర్ కాంట్రాక్టు ద్వారా నేను తెలియ చేసినదేమనగా, పది సంవత్సరములు నిర్విరామముగా సాధన చేసినచో, వారి భౌతిక దేహము, వారి వారి భౌతిక ప్రజ్ఞకు తెలియు విధంగా, ఈ జన్మలోనే వృద్ధి చెందును. 10 సంవత్సరాల సాధన కాల వ్యవధి పూర్తికాకుండానే ఎవరవుతే కోల్పోతారో వారికీ నా ప్రేయర్ కాంట్రాక్టు వర్తించదు.

__________________________

To refer Sri S. Narayan Aiyer's Version please follow below provided URL's



Sri S. Narayan Aiyer's Version in Telugu

Points Extracted from Master's Direct Medium Sri S. Narayana Aiyer's Version in context to our present topic:

భౌతిక స్థితి అనగా మన శరీరాన్ని తయారు చేసే ఎముకలు, కండరాలు మొదలైన వాటి మిశ్రమం కాదు. మన కంటికి కనిపించే శరీరం కాస్మోస్(cosmos)ప్రభావితమైనదే కాకా వాటి మూలకాలతో రూపుదిద్దుకోబడినది కావున ఈ శరీరం వాటి సొంతం అగును కానీ మానవుని సొంతం కాజాలదు.

ప్రస్తుత మానవుని అసలైన భౌతిక శరీరము కంటికి కనిపించని పారాభౌతిక శరీరమైన ఎథిరిక్(Etheric) మాతృక(Matrix). ప్రాణిక శక్తుల(Pranic Energies) శరీరం. కంటికి కనిపించే శరీరములోని అణువణువును నియంత్రిస్తూ జీవితాంతము దానిని సక్రమంగా నడిపే ఈ కనిపించని శరీరం అసలైన మానవ భౌతిక శరీరం. 

ఈ ఎథెరిక్ బాడీ మరిన్ని బ్రహ్మాణువుల (మూలప్రకృతి నుండి ఉద్భవించే పరమాణువులు) ఎక్కువ నిక్షేపంతో ఘనీభవించి, ఘనమైన మానవ ఆకృతిలో "దైవాంగంగా" నిలబడాలి. 

ఈ విధంగా ఘనీభవించిన క్షణం, ఈథరిక్ వెలుపల కాస్మోస్ మూలకాలతో నిర్మితమైన భౌతిక శరీరం, ఈథరిక్ శరీరం యొక్క శక్తి ద్వారా, అణువులుగా మారి ఈ ఎథిరిక్ శరీరం యందు ఐక్యమవుతుంది.

కాబట్టి అరువు(Borrowed from cosmos) తెచ్చుకున్న ఈ కండకలిగిన శరీరం దైవాంగంగా మారి ఈ విశ్వం పై ఆధారపడకుండా మన ద్వారా మాత్రమే మరింతగా ఘనీభవించి శాశ్వతమైన భౌతికంగా నిలుస్తుంది. 

ఈ భౌతికం అమరత్వం పొందాలని ఎక్కడ చెప్పబడినా అది మన స్వంత నిర్మితమైన ఘనీభవించిన ఈథరిక్ శరీరం అని అర్థం చేసుకోవాలి, అంతేకాని ప్రస్తుతం మన కంటికి కనిపించే కాస్మోస్ ద్వారా  అరువు(Borrowed from cosmos) తీసుకోబడ్డ భౌతిక శరీరానికి కాదు. 

_________________________

Sri Potharaju Narsimham Gari Version
Page 04.


మాస్టరుగారు భౌతికదేహ పరిత్యాగం చేసిన తరువాత శ్రీ నరసింహం పంతులు గారికి మాస్టరుగారు చెప్పిన “మరణ రాహిత్యం” అన్న మాటకు “భౌతిక దేహ మరణ రాహిత్యం” అని అర్థం కాదనీ ఈ యోగం ఒక దివ్య శరీరాన్ని కల్పిస్తుందని ఆ శరీరానికి ఆకలి దప్పులు, జరామరణములు, ఉండవు అనే అభిప్రాయం ఏర్పడింది.

ఈ దివ్య దేహము ఎటువంటిదో తన నోట్స్ యందు వివరముగా నిశ్శసంకోచముగా వర్ణించారు.

Please listen Statements given by Satyavathamma Garu from below podcast. (Wife of Sri. Potharaju Narsimham Garu)
(Audio Recorded by Sri. A.V. Srinivasacharyulu)

సత్యవతమ్మ గారు మాస్టర్ గారి డైరెక్ట్ మీడియం, ఆడియో లో కొన్నిచోట్ల సత్యవతమ్మ గారు మాస్టర్ గారి తో మాట్లాడినట్లు స్పష్టంగా పేరుకొన్నారు, అంతేకాకుండా తన జీవితంలో జరిగిన అనేక విచిత్రాలను తన సంభాషణలో వ్యక్తపరిచినారు.

Points to be Noted:

శ్రీ నరసింహం పంతులు గారికి మాస్టరుగారు చెప్పిన “మరణ రాహిత్యం” అన్న మాటకు “భౌతిక దేహ మరణ రాహిత్యం” అని అర్థం కాదనీ ఈ యోగం ఒక దివ్య శరీరాన్ని కల్పిస్తుందని ఆ శరీరానికి ఆకలి దప్పులు, జరామరణములు, ఉండవు అనే అభిప్రాయం ఏర్పడింది.


_______________________

Sri. A.V. Srinivasacharyulu Gari Version
Please Refer Page 13, 14, 15
శ్రీ. ఏ. వి. శ్రీనివాసాచార్యులు.


6 వ ప్రశ్న- 

మాస్టరుగారి డైరెక్టు మీడియములైన శ్రీ ఎస్‌. నారాయణయ్యర్‌ ఎమ్‌. మీడియం నెం, 46; శ్రీ జస్టిస్‌ పి. చెంచయ్య ఎమ్‌. నెం.728; శ్రీ పి. నర్సింహం మీడియం నెం.123; శ్రీ ఎమ్‌. నరసింహ మీడియం నెం.666; శ్రీ ఎన్‌.అర్‌.బి. వెంకటాచలపతి మీడియం, నెం.650 గార్లు ఇంకా చాలామంది ఎటర్నటీ రక్తమాంసాదులతో కూడిన ఈ స్థూల శరీరానికి కాదు. ఈథరిక్‌, ఆస్ట్రల్ శరీరాలకే అన్నారు కదా మీరేమంటారు?

అడిగినవారు:- శ్రీ వి.ఆర్‌.ఎల్‌.ఎన్‌. సింగుగారు, అసిస్టెంట్‌ రిజిస్తార్‌, యన్‌.వి. యూనివర్శిటి, తిరుపతి.

సమాధానము:- గురుతుల్సులు శ్రీ ఎస్‌. నారాయణయ్యర్‌ గారు రచించిన న్యూ యోగ అనే ఆంగ్ల గ్రంథమంతా తప్పుల తడక. ఆయన శంకరమతానుయాయి. (అద్బైత మతమునకు చెందినవారు ఆయన తన అద్వైత సిద్ధాంతమును వదలుకోలేక దానినీ మాస్టరుగారి సిద్ధాంతాలనూ కలిపి, ఆయన బుఱ్ఱను చెడగొట్టుకొని అందరి బుఱ్ఱలను చెడగొట్టినారు. తమిళంలోని బ్రహ్మజ్ఞాన గీతము అనే పాటలను అనుసరించి ఈ గ్రంథమును రచించినట్లు తెలుస్తూంది. ఇది మాస్టరుగారి సిద్ధాంతాలకు, నిర్ణయాలకు విరుద్ధమైన అభిప్రాయాలు కల గ్రంథము. 

నారాయణయ్యర్‌గారు మీడియం నెం.46 మాస్టరు గారికి ఆంతరంగికుడు. అందుకే ఈయనకు స్పెషల్‌ లిప్టు ఇచ్చినారు. (చూ డైరి పుట 86)

అదే నారాయణయ్యర్‌ను నస్పెండ్‌ చేసినారు.

“ఎందుకంటే అయ్యర్‌ ఆలోచనలు వేరే విధంగా ఉండడంవలన, ఈ సొసైటి రూల్సుకు వ్యతిరేకంగా నడవడంనలన అభివృద్ధికి అడ్డు తగులుతూ ఉంది ఇతని ఆలోచనలు, అందువల్ల ఇతనికి వార్నింగ్ ఇచ్చినారు. అయినా బాగుపడలేదు. అందుకని సస్పెండ్ చేసినాను” అన్నారు. (చూ. డైరి పుట 69).

మాస్టరుగారికి తెలియకుండ, ఆయన అనుమతి లేకుండ కోర్సులు ఇతరులకు ఇఛ్చి తగిన శిక్షను అనుభదించినారు అయ్యారుగారు.

ఈయన తన భార్యను ఆస్టల్‌ సైట్‌కు పురికొలిపి చీవాట్లు తిన్నారు. (చూ. డైరి. పుట. 272.)

ఇంకా కొంతమంది మద్రాసులోని మీడియములు మాస్టరుగారి రూల్సుకు విరుద్ధంగా ప్రవర్తించడముచేత రీ అడ్మిషన్‌ అనే సందర్భంలో- “ఎట్టి పరిస్థితులలోను మద్రాసు మీడియములను తిరిగి చేర్చుకోవద్దు” వారికి సలహాలు ఇఛ్చినాను- వార్షింగ్‌ ఇచ్చినాను- ఇకపై తప్పగా నడవము అని ప్రమాణము చేసినారు, అయినా తిరిగి తప్పుగా నడుస్తున్నారు; వారు క్షమాపణ చెప్పినా వారి యెడల ఉదారభావాన్ని చూపవద్దు” అని మాస్టరుగారికి తెలుపగా వారు డైరీలో వ్రాసినారు.  ( డైరి పుట 322).

గురుతుల్యులు శ్రీ పి. చెంచయ్యగారు మీడియం నెం.728 గార్జియన్‌ అనే ఆంగ్ల పత్రికలో మాస్టరుగారిని గూర్చి ఒక వ్యాసాన్ని వ్రాసి ప్రకటించినారు. అందులో ఆయనకూడా మాస్టరుగారి యోగాన్ని గూర్చి సరిగా ప్రామాణికంగా వ్రాయలేదు.

ఈయన క్రైస్తవ మతానికి చెందినవారు కాబట్టి బైబిల్‌తో సరిపోలుస్తూ వ్రాసినారు. అరవిందునితో పోలుస్తూ వ్రాసినారు. తనకు తోచినట్లు వ్రాసినారు.

గురుతుల్యులు శ్రీ పోతరాజు నరసింహంగారు మీడియం నెం.123. ఈయన ఫిలాసఫి లెక్టరర్‌గా మదరాసు ప్రెసిడెన్సీ కాలెజీలో ఆనాడు పనిచేసేవారు. తాను చదువుకొన్న ఫిలాసఫీని ఆధారం చేనుకొని ఏవేవో వ్రాసినారు ఆ రచనలన్నీ మాన్టరుగారి
యోగనూత్రాలకు లక్ష్యాలకు అనుగుణమైనవి కావు. ఈయనకు తోచిన విధంగా వ్రాసినారు.

గురుతుల్యులు శ్రీ మైనంపాటి నరసింహంగారు మీడియము నెం.666. ఈయనగారు కూడా తమ ఉపన్యాసాలలో మాన్టరుగారి రూల్సుకు, రెగ్యులేషన్సుకు, యోగానికి, యోగ సూత్రాలకు విరుద్ధంగా భాగవతం వగైరాలను గూర్చి ఉపన్యసించి
నారు. ఈయనకు తోచినఏ ఈయన ఉపన్యసించినారు.

గురుతుల్యులు శ్రీ  ఎన్‌.ఆర్‌.బి. వెంకటాచలపతిగారు మీడియము నెం.650. ఈయన కాకాభుజండర్‌ అనే ఆయన రచించిన  కాకాభుజండర్ నాడీ గ్రంథాన్ని ఆధారం చేసుకొని అందులోని విషయాలనే చిత్రవిచిత్రాలుగా పదాల విరుపులు విరున్తూ
వల్లించినారేగాని మాస్టరుగారి రూల్సు, రెగ్యులేషన్సు యోగ విషయాలను గూర్చి సరిగా ఉపన్యసించలేదు. ఏ విషయం చెప్పినా నాడీ గ్రంథంలో ఇలా చెప్పి ఉంది అని అనేవారు.

అందుచేత గురుతుల్యులైన పైవారి వ్రాతలన్నీ మాస్టరుగారి రూల్స్, రెగ్యులేషన్సును, ఆ యోగాన్ని యోగ నూత్రాలను అనునరించి రచించలేదు అని నవినయుంగా నత్యాన్ని తెలియజేన్తున్నాను. నత్యం ఎప్పడూ కటువుగానే ఉంటుంది. క్షమించండి. 

ప్రశాంతమైన హృదయంతో మొత్తం గ్రంథాన్ని చదివితే మీకే సత్యం తెలుస్తుంది. ఏది సరియైన మార్గమో తెలుస్తుంది.

' తమిళ భాషలో ఉండిన పిల్లర్‌ టెస్టును 20-8-1917న మాస్టరుగారి ఇంటి మేడమీద నారాయణయ్యరుగారే చదివినారు. మాస్గరుగారు దానిని ఆంగ్లంలోకి తర్దుమా చేసినారు. ఆనాటి మీడియములూ విన్నారు. అందరికీ దాని నకలు పంపినారు. అందులో- “ఈ రక్తమాంసాదులతో కూడిన మానవ శరీరము ఎందుకూ పనెకిరానిది, ఆత్మజ్ఞానము అభివృధ్ధి పరచుకోవడానికి ఆటంకము కలిగించేది, ఇది నశించి పోయేదానికి సిద్ధంగా ఉండేది అని ప్రాచీనులు చెప్తున్నారు. అయితే ఈ మానవ శరీరము అత్యవసరమైనది, దీనికి తగిన శిక్షణ ఇచ్చి తీర్చి దిద్ది చావు లేకుండా చేయడమే నా ఉద్దేశ్యము” అన్నారు.

అప్పుడే గురుతుల్యులు శ్రీ కెయస్‌. కోదండరామయ్యార్‌ మీడియం నెం.76 మాన్టరుగారికి వ్రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించినారు. ఆ ఉత్తరంలో- “ప్రాచీన శాస్త్రాలూ, వేదాలూ. .మానవుని ఆయుఃపరిమాణము నూరు సంవత్సరాలు అని చెప్పుతున్నాయి కదా; మరి మీరు మానవ శరీరాన్ని శాశ్వతంగా నిలపాలని అంటున్నారు కదా? అది సాధ్యమేనా?” అన్న ప్రశ్ష వేసినట్టున్నది.

దానికి గాను మాస్టరుగారు ఏమన్నారో వినండి - “ఇటువంటి సందేహాలు మీ బుఱ్ఱలలో మీకు ఎందుకు కలిగినాయి? ఇదిగో చూడండి. మీకు బక ఉదాహరణ ఇస్తాను.

దశరథమహారాజు అరవైవేల సంవత్సరాలు జీవించినాడు కదా! ఆయన ఏ యోగాన్ని చేసి అన్నివేల నంవత్సరాలు జీవించినాడు? ఆనాడు ఆయనతో జీవించిన సామాన్య మానవుని ఆయు: పరిమాణము ఎంత?” అన్నారు. వీటన్నిటిని విన్న చదివిన  మాస్టరుగారి మీడియములే పిచ్చి పిచ్చిగా వ్రాసినారు అంటే ఏమనుకోవాలి. మాస్టరుగారి యోగాన్ని గురించి సరిగా అవగాహన చేసుకోకుండా మనము మీడియములు కదా మనము ఏమి చెప్పినా చెలామణి అవుతుందని వారికి తోచిన విధంగా వ్రాసినారు అని అనుకోవలసి వస్తుంది కదు.

Points to be noted:

గురుతుల్సులు శ్రీ ఎస్‌. నారాయణయ్యర్‌ గారు రచించిన న్యూ యోగ అనే ఆంగ్ల గ్రంథమంతా తప్పుల తడక. ఆయన శంకరమతానుయాయి. (అద్బైత మతమునకు చెందినవారు ఆయన తన అద్వైత సిద్ధాంతమును వదలుకోలేక దానినీ మాస్టరుగారి సిద్ధాంతాలనూ కలిపి, ఆయన బుఱ్ఱను చెడగొట్టుకొని అందరి బుఱ్ఱలను చెడగొట్టినారు. తమిళంలోని బ్రహ్మజ్ఞాన గీతము అనే పాటలను అనుసరించి ఈ గ్రంథమును రచించినట్లు తెలుస్తూంది. ఇది మాస్టరుగారి సిద్ధాంతాలకు, నిర్ణయాలకు విరుద్ధమైన అభిప్రాయాలు కల గ్రంథము. 

నారాయణయ్యర్‌గారు మీడియం నెం.46 మాస్టరు గారికి ఆంతరంగికుడు. అందుకే ఈయనకు స్పెషల్‌ లిప్టు ఇచ్చినారు. 

నారాయణయ్యర్‌గారు తన భార్యను ఆస్టల్‌ సైట్‌కు పురికొలిపి చీవాట్లు తిన్నారు. 

' తమిళ భాషలో ఉండిన పిల్లర్‌ టెస్టును 20-8-1917న మాస్టరుగారి ఇంటి మేడమీద నారాయణయ్యరుగారే చదివినారు. మాస్గరుగారు దానిని ఆంగ్లంలోకి తర్దుమా చేసినారు. ఆనాటి మీడియములూ విన్నారు. అందరికీ దాని నకలు పంపినారు. అందులో- “ఈ రక్తమాంసాదులతో కూడిన మానవ శరీరము ఎందుకూ పనెకిరానిది, ఆత్మజ్ఞానము అభివృధ్ధి పరచుకోవడానికి ఆటంకము కలిగించేది, ఇది నశించి పోయేదానికి సిద్ధంగా ఉండేది అని ప్రాచీనులు చెప్తున్నారు. అయితే ఈ మానవ శరీరము అత్యవసరమైనది, దీనికి తగిన శిక్షణ ఇచ్చి తీర్చి దిద్ది చావు లేకుండా చేయడమే నా ఉద్దేశ్యము” అన్నారు.

దశరథమహారాజు అరవైవేల సంవత్సరాలు జీవించినాడు కదా! ఆయన ఏ యోగాన్ని చేసి అన్నివేల నంవత్సరాలు జీవించినాడు? ఆనాడు ఆయనతో జీవించిన సామాన్య మానవుని ఆయు: పరిమాణము ఎంత?” అన్నారు. వీటన్నిటిని విన్న చదివిన  మాస్టరుగారి మీడియములే పిచ్చి పిచ్చిగా వ్రాసినారు అంటే ఏమనుకోవాలి. మాస్టరుగారి యోగాన్ని గురించి సరిగా అవగాహన చేసుకోకుండా మనము మడియుములు కదా మనము ఏమి చెప్పినా చెలామణి అవుతుందని వారికి తోచిన విధంగా వ్రాసినారు అని అనుకోవలసి వస్తుంది కదు.

______________________

Derivations from above Sources:

Derivation 1:

మాస్టర్ గారు వారి భౌతిక దేహం విడిచిన తరువాత, డైరెక్ట్ మీడియూములనేకాక ఏ ఒకరితో సంబాషించినట్లుకాని సూచనలు ఇచ్చినట్లుకాని పరిగణించకపోతే ఈ క్రింద ఇచ్చిన వివరణలు సత్యముగా భావించ వలెను. 

కుటుంబ జీవితము గడుపుతూనే మనకు వ్యాధి, వృద్ధాప్యము, మరణము లేని స్థితి కలిగించుటకై మార్గము ఏర్పర్చబడినది. (Statements from Master's Hand Written - Independence Declaration. (Year 1910))
Note: Master declared only "THE PATH IS SET". but he did not declared that he will provide DEATHLESS STATE or IMMORTALITY.

Note: మరణము లేని స్థితి కలిగించుటకై మార్గము ఏర్పర్చబడినది అని మాస్టర్ గారు ప్రకటించారు కాని మరణము లేని స్థితిని ప్రసాదిస్తానని మాస్టర్ గారు ప్రకటించలేదు.


వ్యాధులు, యాక్సిడెంట్స్(Accidents), మొదలగునావి మనల్ని ఏమిచేయలేని విధంగా మనము ఒక ఆధార పూర్వకంగా నిలబడాలి, ఎలా అంటే 4 is 4, and 4 and 4 is 8 అనే విధంగా. ఈ విషయం అర్థం చేసుకొని గృహస్థ సమస్యలనుంచి బయటపడి మనపై గ్రహాల ప్రభావం ఎంత ఎక్కువ స్థాయిలో ఉందొ అర్థం చేసుకొని ఎవరికీ వారు ఎటువంటి ప్రకటనలు(శాశ్వతత్వం(Eternity) సాధించామని) ప్రకటితం చేయరాదు., వ్యాధులు, ఆక్సిడెంట్లు మొదలగునవి ఏమిచేయలేని విధంగా మీ మాస్టర్ గారే ఒక ఆధార పూర్వకంగా నిలబడినట్లు ఇంకా ప్రకటించలేదు కావున మీరు ఈ విషయానికి సంబంధించి ఎటువంటి తప్పుడు ప్రకటనలు చేయరాదు. 

మన పూర్వికులు మానవ భౌతిక దేహము పనికిరానిదని ఇది ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగించునని త్వరగా క్షిణింప బడునని దురభిప్రాయం కలిగి ఉన్నారు. కానీ నేను ఈ భౌతిక దేహాన్ని క్షిణించని విధంగా ఎల్లవేళలా జ్ఞానాన్ని ప్రసాదించునంతటి ఉన్నత స్థితికి అభివృద్ధి చేయ దలచినాను. (Statements from Master's Hand Written - Master's Pillar Test Speech (Aug 26, 1917)

Note: మాస్టారు గారు స్వయంగా తాను ఇంకా చావులేని స్థితిని సాధించలేదు అని ప్రకటించారు.

పైన పేరుకున్న మాస్టర్ గారి వాక్యాలు అనుసారంగా మాస్టర్ గారి ప్రయత్నం శ్రీ A. V. శ్రీనివాసాచార్యులు వారు తెలియ చేసినవిధంగా మాస్టర్ గారు భౌతిక దేహమును అభివృద్ధి పరుచుటకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది. కాని మాస్టర్ గారి ప్రయత్నం పరిపూర్ణం కాలేదు అని కూడా అర్థమవుతున్నందు వలన ఈ యోగము చేసినంత మాత్రాన ఈ భౌతిక దేహమునకు చావులేని స్థితి లేదా శాశ్వతత్వం ఏర్పడునని భావించరాదు.

నా ఈ ప్రేయర్ కాంట్రాక్టు ద్వారా నేను తెలియ చేసినదేమనగా, పది సంవత్సరములు నిర్విరామముగా సాధన చేసినచో, వారి భౌతిక దేహము, వారి వారి భౌతిక ప్రజ్ఞకు తెలియు విధంగా, ఈ జన్మలోనే వృద్ధి చెందును. 10 సంవత్సరాల సాధన కాల వ్యవధి పూర్తికాకుండానే ఎవరవుతే కోల్పోతారో వారికీ నా ప్రేయర్ కాంట్రాక్టు వర్తించదు.

50 మంది దగ్గు జ్వరమును కేవలం ఒక రకమైన మందుతో ఎలాగైతే సంపూర్ణంగా తగ్గించలేమో ఏ ఇరువురి శరీరాకృతి ఒకేవిధంగా ఉండదు కనుక మోక్షమును ఏకకాలంలో ఏ ఇరువురు సాధించలేరు. (Statements from Master's Hand Written - Master's Pillar Test Speech (Aug 26, 1917))

Note: మాస్టర్ గారి ప్రసంగం వారి మీడియంలను ఉద్దేశించి కావున ఈ ప్రేయర్ కాంట్రాక్టు కేవలం మాస్టర్ గారి మీడియంలకు మాత్రమే వర్తిస్తుంది. 10 సంవత్సరములు నిర్విరామముగా సాధన చేసినచో, వారి భౌతిక దేహము, వారి వారి భౌతిక ప్రజ్ఞకు తెలియు విధంగా, ఈ జన్మలోనే వృద్ధి చెందును అని అన్నారు కాని శాశ్వతత్వం సిద్ధిస్తుందని నిర్ధారించలేదు అంతే కాకుండా అందరికి అభివృద్ధి ఒకే విధంగా ఉండదు అని కూడా తెలియచేయడం జరిగినది.

ప్రేయర్ కాంట్రాక్టు కేవలం మాస్టర్ గారి మీడియంలకు మాత్రమే వర్తించినప్పటికీ, ప్రస్తుత సాధకుల సాధన సమయములో వారి వారి దేహములలో ఎంతో కొంత ఆక్షన్ జరుగుట విశేషం దీనిని ఆధారం చేసుకొని మాస్టర్ గారి మీడియూములకు ఇచ్చిన ప్రేయర్ కాంట్రాక్టు మనకు వర్తించునని ఒక నమ్మకంతో ఎంతో మంది ఈ నాటి సాధకులుకూడా లబ్ది పొందుట జరిగెను.

ప్రస్తుతం అభివృద్ధి చెంది ఉన్న వెన్నుపూసను బోర్(Bore) చేసి సుషుమ్న ఏర్పాటు చేయు  నిర్మాణ ప్రక్రియ జరుగుచున్నది. ఈ ప్రక్రియను తట్టుకొని స్థిరత్వంతో నిలబడుటకు మీ భౌతిక దేహమునకు 10 సంవత్సరముల కాల వ్యవధి కావలెను. ఇంకను మీ భౌతిక దేహము మరియు ఆస్ట్రల్ దేహము మధ్య ఏర్పడి ఉన్న 12 డివిషన్ల(12 Divisions) మధ్య నిర్మితం అవవలసిన ఫిట్టింగ్స్ ఇంకను చాలా వరకు నిర్మించబడలేదు ఇదేవిధంగా ఆస్ట్రల్ దేహము మరియు మెంటల్ దేహము మధ్య ఏర్పడవలసి ఉన్నదీ.(Statement from Master's Hand Written - Master's Pillar Test Speech (Aug 26, 1917))

Note: పది సంవత్సరములు సాధన చేయుట ద్వారా ప్రస్తుత మానవునిలో అసంపూర్ణంగా ఏర్పడిఉన్న పారభౌతిక శరీరాలు, నాడులు అనేక ఫిట్టింగులు అభివృద్ధి పడునని అర్థంచేసుకొనవలెను అంతేకాని భౌతిక శరీరం శాశ్వతత్వం సంతరించుకొనున్నని అపోహ పడరాదు.

ఈ యోగములో జరిపిన అనేక రకములైన పరీక్షలు మీ మాస్టర్ అభివృద్ధి కొరకే కానీ మీ లోని ఏ ఒకరి కోసం కాదు.(Statement from Master's Hand Written - Master's Pillar Test Speech (Aug 26, 1917))

మాస్టర్ గారి దేహమున జరిగిన అనేక పరీక్షలు ద్వారా మానవ భౌతిక దేహములో మరియు పారభౌతిక దేహములో ఉన్న లోపాలను అర్థంచేసుకొని తదుపరి దశలలో రాబోవు మానవ భౌతిక మరియు పారభౌతిక దేహమును శాశ్వతత్వం దిశగా అభివృద్ధి పరుచుటకు చేసిన ప్రయోగాత్మక ప్రయత్నంగా మాత్రమే అర్థంచేసుకొనవలెను.


ఈ యోగ లక్ష్యం ఈ సొసైటీ యందు సాదించలేనిచో కేవలం అది నా ఆజ్ఞఅధికారాల వల్లనే. (Statement from Master's Hand Written - Master's Pillar Test Speech (Aug 26, 1917))

పురాణాలూ శాస్త్రాల అనుసారం భౌతిక ప్రపంచమున పుట్టినవాడు గిట్టక తప్పదు కాని సర్వ మానవాళికి మరణము లేని స్థితి కలిగించుటకై మార్గము ఏర్పర్చబడినది అని తెలియచేసిన వారు మాస్టర్ గారు, సర్వ మానవాళి కోసం అతి ఉన్నత ప్రయోగాలు నిర్వహించిన ఘనత చరిత్రలో కేవలం మాస్టర్ గారికి తప్ప వేరొకరికి లభించదు - ఈ మార్గమునకు కేవలం మాస్టర్ గారే అథారిటీ(Authority).

ఈ విధంగా మాస్టరుగారి ద్వారా మానవ దేహమును శాశ్వతత్వం దిశగా తీర్చిదిద్దు ఒక నూతన అధ్యాయం మొదలైనట్లు బావించవలెను.

ఈ ప్రయోగాత్మక ప్రయత్నములలో మొదట మాస్టర్ గారికి శాశ్వతత్వం చేకూరి ఆతరువాత సర్వ మానవాళికి శాశ్వతత్వం చేకూరుట తథ్యం.

Derivation 2: 

మాస్టర్ గారు వారి భౌతిక దేహం విడిచిన తరువాత, డైరెక్ట్ మీడియంలతో(ముఖ్యంగా S. నారాయణ అయ్యారు గారితో) సంబాషించినట్లు(Astral to Astral) మరియు వారికీ సూచనలు ఇచ్చినట్లు నమ్మినట్లైతే ఈ క్రింద ఇచ్చిన వివరణ సరైన వివరణగా బావించవొచ్చును.

Noted Points:
సత్యవతమ్మ గారు మాస్టర్ గారి డైరెక్ట్ మీడియం, ఆడియో లో కొన్నిచోట్ల సత్యవతమ్మ గారు మాస్టర్ గారి తో మాట్లాడినట్లు స్పష్టంగా పేరుకొన్నారు. (Astral to Astral Communication)
(Statement by P. Sathyavathamma Garu)

నారాయణయ్యర్‌గారు మీడియం నెం.46 మాస్టరు గారికి ఆంతరంగికుడు. అందుకే ఈయనకు స్పెషల్‌ లిప్టు ఇచ్చినారు. (Statement by Sri. A.V. Srinivasacharyulu Garu)

Note: శ్రీనివాసాచార్యులు వారు అనేక విషయాలు తన వ్యాసములో తెలియపరిచినప్పటికి, మాస్టర్ గారి సిద్ధాంతాల అనుసారం ఒకరిని తప్పు పట్టకూడదు కనుక వాటి గురించి మనము చర్చించకూడదు, కావున కేవలం నారాయణ అయ్యారు గారి పుస్తకం THE NEW YOGA గొప్పతనం గురించి మాత్రమే ఇక్కడ వివరించడం జరిగినది.


పైన పేర్కొన్న విషయాలని బట్టి నారాయణ అయ్యారు గారు ఎంతో కొంత అభివృద్ధి సాధించినవారు గా గమనించవోచ్చును. సత్యవతమ్మ గారి వలె మాస్టర్ గారి ద్వారా సందేశాలను స్వీకరించి మాస్టర్ గారి అనుమతితో THE NEW YOGA పుస్తకము రచించి  ముద్రణ(Year 1943) చేసి ఉన్నట్లయితే, స్వయానా మాస్టర్ గారే వారి మీడియం(S. నారాయణ అయ్యారు) ద్వారా ఇచ్చిన పుస్తకం కనుక THE NEW YOGA పుస్తకము తప్పక ముఖ్యమైన పుస్తకముగా పరిగణించవలసి ఉంటుంది.

T.S. శంకర్ అయ్యర్ గారు కూడా  THE NEW YOGA  పుస్తకమును సమర్థించినట్లు తెలుస్తుంది కాని వ్యతిరేకించినట్లు లేదు.

1970 దశకం వరకు ముద్రణ కాని శ్రీ. పోతరాజు నర్సింహం గారి నోట్స్ యందలి ముఖ్యమైన విషయములు కొన్ని THE NEW YOGA పుస్తకంతో పోలి ఉండడం గమనించవోచ్చును.

శ్రీ నారాయణ అయ్యారు గారి పుస్తకం THE NEW YOGA, 1943  సంవత్సరం నాటి ప్రజానీకానికి అర్థమవువిధంగా మాస్టర్ గారి యోగాన్ని వివరించే ప్రయత్నములో కొన్ని సనాతన ధర్మ సిద్ధాంతాలను ఉదహరించినప్పటికీ మాస్టర్ గారి నియమాలను ఉల్లంఘించినట్లు కనపడదు.

శ్రీ నారాయణ అయ్యారు గారి పుస్తకం THE NEW YOGA, ప్రస్తుత సమాజములోని ఒక సామాన్య సాధకుడు అసలు మాస్టర్ గారి యోగము అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పుస్తకము. 


S. నారాయణ అయ్యారు Final Statement:

ఈ భౌతికం అమరత్వం పొందాలని ఎక్కడ చెప్పబడినా అది మన స్వంత నిర్మితమైన ఘనీభవించిన ఈథరిక్ శరీరం అని అర్థం చేసుకోవాలి, అంతేకాని ప్రస్తుతం మన కంటికి కనిపించే కాస్మోస్ ద్వారా  అరువు(Borrowed from cosmos) తీసుకోబడ్డ భౌతిక శరీరానికి కాదు. 
Above Statement is applicable for only Manform of Present Root Race(Theosophical Term)?


మాస్టర్ గారు సమస్త మానవాళికి భౌతిక దేహమునకు(Physical Body) అమరత్వం కోసం ప్రయత్నం చేసినట్లు పైన వివరించిన విషయాలు మరియు మాస్టర్ గారి నోట్స్, డైరీలు ద్వారా అర్థమవుతుండగా, మరి S. నారాయణ అయ్యారు గారు అమరత్వం కేవలం ఎథిరిక్ దేహానికి మాత్రమే అని ఎందుకు చెప్పవలసి వొచ్చింది?

1. మాస్టర్ గారు ప్రయోగాత్మకంగా చేపట్టిన అనేక ఉన్నత స్థాయి ప్రయోగాలు కాస్మోస్(Cosmos) యందు మార్పు తీసుకొనిరావడానికి ఎంత సమయము పట్టనుందో అర్థంకాని విషయముగా మిగిలిపోయింది.

2. వ్యాధులు, Accidents, మొదలగునావి మనల్ని ఏమిచేయలేని విధంగా మనము ఒక ఆధార పూర్వకంగా నిలబడాలి ఎలా అంటే 4 is 4, and 4 and 4 is 8 అనే విధంగా. ఈ విషయం అర్థం చేసుకొని గృహస్థ సమస్యలనుంచి బయటపడి మనపై గ్రహాల ప్రభావం ఎంత ఎక్కువ స్థాయిలో ఉందొ అర్థం చేసుకొని ఎవరికీ వారు ఎటువంటి ప్రకటనలు(శాశ్వతత్వం(Eternity) సాధించామని) ప్రకటితం చేయరాదు., వ్యాధులు, ఆక్సిడెంట్లు మొదలగునవి ఏమిచేయలేని విధంగా మీ మాస్టర్ గారే ఒక ఆధార పూర్వకంగా నిలబడినట్లు ఇంకా ప్రకటించలేదు కావున మీరు ఈ విషయానికి సంబంధించి ఎటువంటి తప్పుడు ప్రకటనలు చేయరాదు.
ప్రస్తుతం అభివృద్ధి చెంది ఉన్న వెన్నుపూసను బోర్(Bore) చేసి సుషుమ్న ఏర్పాటు చేయు  నిర్మాణ ప్రక్రియ జరుగుచున్నది. ఈ ప్రక్రియను తట్టుకొని స్థిరత్వంతో నిలబడుటకు మీ భౌతిక దేహమునకు 10 సంవత్సరముల కాల వ్యవధి కావలెను. ఇంకను మీ భౌతిక దేహము మరియు ఆస్ట్రల్ దేహము మధ్య ఏర్పడి ఉన్న 12 డివిషన్ల(12 Divisions) మధ్య నిర్మితం అవవలసిన ఫిట్టింగ్స్ ఇంకను చాలా వరకు నిర్మించబడలేదు ఇదేవిధంగా ఆస్ట్రల్ దేహము మరియు మెంటల్ దేహము మధ్య ఏర్పడవలసి ఉన్నదీ.
(Statements from Master's Hand Written - Master's Pillar Test Speech (Aug 26, 1917))

3. మాస్టర్ గారి భౌతిక దేహమునకు అమరత్వం సిద్దించిన తరువాతనే సమస్త మానవాళికి భౌతిక అమరత్వం సుసాధ్యమగును కావున అంతవరకు అమరత్వం అనగా అది కేవలం ఎథిరిక్ దేహమునకు మాత్రమే అని ప్రస్తుత సాధకులు (Manform of Present Root Race) అంగీకరించక తప్పదు అనే ఉద్దేశముతో చెప్పిన మాటలుగా అర్థమవుచున్నది.
___________________

Final Assumption:


శాశ్వతత్వం ఎథిరిక్ దేహమునకు కాదు భౌతిక దేహమునకు అని మాస్టర్ గారి సాహిత్యం ద్వారా నిరూపించబడినది. కాని శ్రీ S. నారాయణ అయ్యారు గారి అంచనా ప్రకారం మొదట ఎథిరిక్ దేహమునకు శాశ్వతత్వం ఏర్పడిన తరువాత కాని భౌతిక దేహమునకు శాశ్వతత్వం ఏర్పడు అవకాశము లేకపోలేదు. ఇదే విషయాన్నీ శ్రీ A. V. శ్రీనివాసాచార్యులు వారు కూడా ద్రువీకరించినట్లు క్రింది కథనాలను చదవడం ద్వారా అర్థమవుతుంది.

Note: మాస్టర్ గారు తన సాహిత్యములో భృక్త రహిత తారక రాజా యోగము చేయడము ద్వారా ఎథిరిక్ దేహమునకు పరిపూర్ణంగా శాశ్వతత్వం ఏర్పడునని స్పష్టంగా నిర్దారించలేదు.
_____________________

భౌతిక దేహానికి శాశ్వతత్వం ఎప్పటికి ఏర్పడును?

Below Statement based on Sri Potharaju Narsimham Garu Notes:
Please Refer Page 8



మానవుడు గ్రహ యానము చేసిననాడు పసిఫిక్ మహా సముద్రములోనుంచి నూతనముగా కొండలు పైకి ఉబికి వొచ్చిననాడు యోగ ప్రచారము ఆరంభమవుతుందని అంతవరకు యోగప్రచారము చేయరాదు అని మాస్టర్ గారు తనతో అన్నారు అని నారాయణ అయ్యారు గారు శ్రీ పోతరాజు నర్సింహం గారికి చెప్పినట్లు - శ్రీ పోతరాజు నర్సింహంగారి నోట్స్ ల ద్వారా మనకి అర్థమవుచున్నది.
Note: Coincidently the above statement slightly matches with theosophical leader C.W. Leadbeater's statements regarding Root Races and Sub Root Races of Manform.

మానవుడు గ్రహ యానము చేయడానికి ఇంకా చాల సమయం గడవవలసి ఉంది కావున దీని ఆధారముగా భౌతిక దేహమునకు శాశ్వతత్వం చేకూరడానికి మరింత సమయము పట్టునని అర్థమవుతుంది.

________________________


మాస్టర్ గారు భౌతిక అమరత్వమును ఈ భూమి పై నిలుపుటకు ఎప్పుడు ఎక్కడ జన్మ తీసుకోనున్నారు.

Please Refer Page 17 and Page 18
Note: Vissas are close relatives of Gurudev Sri VPS.

Sri Jr. Vissa Apparao Garu.

Facts revealed by Jr. Vissa Apparao Garu.

Once during 1964-65 Smt.Mahalakshmamma (Medium No.516), wife of Gurudev Sri VPS(Veturi Prabhakara Sastry) told me(Jr. Vissa Apparao Garu) that “Master CVV’s Yoga will be definitely Fulfilled and when it happens all the Devatas and Deities of the Temples will Run on the Streets Requesting Paramātma (Universal Soul) that they also would like to have Mānava Janma (Birth of a Human Being) for attaining Eternity!”

My mother Smt. Lalita Vissa was seriously ill for three days during September 1993 and left her Physical Body at 11.30 PM on the 16th September at Salem, Tamilnadu. My Father tried to convey the information over Phone to me at New Delhi, but unfortunately due to a heavy rainfall in Delhi at that time the phone lines were not working. At the same time I had a severe Migraine Headache and I was very restless. I had a vision in which My Mother was telling my Father that my Paternal Grandfather came from his outstation Visit and Father should look to his Conveniences! Then on the next day morning I got a Telegraphic Message about the Bereavement, when I realised that my Mother was trying to convey that she was joining the company of grandfather who left his physical body in June 1966 earlier! The next day I went to Salem and Performed the Last Rights for her under the supervision of Gurudev AVS. After the Ceremonies I enquired from Sri AVS(A.V. Srinivasacharyulu) whether my Mother will take a Rebirth. He said “Under Master CVV’s Yoga Fulfilment all Sincere Yoga Followers including your Mother, Paternal Grandfather and others are nowin their Ether (Astral) Bodies in the Company of Master CVV and Gurudev VPS at Himalayas and all of them have no rebirth but will come back with their Permanent Bodies at the Time of Establishment of Eternity”

Sri AVS once revealed to Sri T.Sundara Siva Rao, a Yoga Disciple that “When Eternity on Earth is established Master CVV will come back in Eternal body on a new Island which will emerge in the Arabian Sea offshore Mumbai and at that time there will be changes in the Offshore area of Pakistan Coast and large parts of Indus River course will be submerged under Ocean!”.


(Telugu Version)
Please Refer Page 17 and Page 18
Note: Vissas are close relatives of Gurudev Sri VPS.

Jr. Vissa Apparao Garu తెలియచేసిన విషయాలు

శ్రీమతి మహాలక్ష్మమ్మ (మీడియం నం.516)

1964-65 సమయంలో ఒకసారి గురుదేవ్ శ్రీ విపిఎస్ (వేటూరి ప్రభాకర శాస్త్రి) భార్య శ్రీమతి మహాలక్ష్మమ్మ (మీడియం నం.516) నాతో(Jr. విస్సా అప్పారావు గారితో) మాట్లాడుతూ “మాస్టర్ సివివి గారి యోగం ఖచ్చితంగా నెరవేరుతుంది మరియు యోగము నెరవేరిన తరువాత  మానవ జన్మ కావాలని కోరుకుంటు దేవి దేవతలు ఆ పరమాత్మను అభ్యర్థిస్తారు".

నా తల్లి శ్రీమతి. లలితా విస్సా సెప్టెంబర్ 1993లో మూడు రోజుల పాటు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు మరియు సెప్టెంబరు 16వ తేదీ రాత్రి 11.30 గంటలకు తమిళనాడులోని సేలం వద్ద ఆమె భౌతికకాయాన్ని విడిచిపెట్టారు.

మా నాన్న న్యూ ఢిల్లీలో నాకు ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలియజేయడానికి ప్రయత్నించారు, కానీ దురదృష్టవశాత్తు ఆ సమయంలో ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ఫోన్ లైన్లు పని చేయలేదు. అదే సమయంలో నాకు తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పి వచ్చింది మరియు నేను చాలా దిగ్భ్రాంతితో ఉన్నాను.

మా అమ్మగారి నాన్న గారు ఔట్‌స్టేషన్ విజిట్(Outstation Visit) నుండి వచ్చారని, మా నాన్న గారు తన సౌకర్యాలను చూసుకోవాలని మా అమ్మ గారు నాన్నకు చెప్పే దృశ్యం నాకు కనిపించింది!

మరుసటి రోజు ఉదయం నాకు మా అమ్మ గారి మరణం గురించి టెలిగ్రాఫిక్ సందేశం వచ్చింది, 1966 జూన్‌లో తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తాతగారి చెంతన చేరుతున్నట్లు మా అమ్మ తెలియజేయడానికి ప్రయత్నించినట్లు నేను అప్పుడు గ్రహించాను!

మరుసటి రోజు నేను సేలం వెళ్లి గురుదేవ్ AVS పర్యవేక్షణలో ఆమె కోసం చివరి కార్యక్రమాలను నిర్వహించాను. అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత నేను మా అమ్మ పునర్జన్మ తీసుకుంటారా అని శ్రీ A.V. శ్రీనివాసాచార్యులు గారిని అడిగాను.

శ్రీ A. V. శ్రీనివాసాచార్యులు గారు ఈ విధంగా చెప్పినారు మీ అమ్మగారు, మీ అమ్మగారి నాన్నగారు ఇంకా మరెంతోమంది వారి వారి ఎథిరిక్ ఆస్ట్రల్ శరీరాలతో మాస్టర్ గారు మరియు గురుదేవులైన వేటూరి ప్రభాకర శాస్ట్రీ గారి సమక్షంలో హిమాలయాలలో ఉన్నారని, వీరందరూ మరల జన్మలు తీసుకోవడం ఉండదని భూమండలం మీద శాశ్వతత్వం ఏర్పడిన తరువాత వారి శాశ్వత దేహముతో భూమి పై అవతరిస్తారు అని అన్నారు.
(Note: భౌతిక శరీరమునకు శాశ్వతత్వం ఏర్పడనంతవరకు ఎథిరిక్ శరీరముతో మనుగడ సాగించవలెనని శ్రీ A.V.S గురువు గారి మాటలు ద్వారా అర్థమవుచున్నది.)

శ్రీ A. V. శ్రీనివాసాచార్యులు ఒకసారి యోగా శిష్యుడైన శ్రీ టి.సుందర శివరావుకు “భూమిపై శాశ్వతత్వం స్థాపించబడినప్పుడు మాస్టర్ సివివి గారు ముంబై ఆఫ్‌షోర్‌(Mumbai Offshore) ప్రాంతములో అరేబియా సముద్రముయందు ఉద్భవించే కొత్త ద్వీపంలో శాశ్వతమైన శరీరముతో తిరిగి వస్తారని అప్పటికి పాకిస్తాన్ offshore ఏరియాలో అనేక మార్పులు ఏర్పడునని, ఇండస్ నది పరివాహక ప్రాంతం చాలావరకు సముద్ర గర్భములో కలిసిపోవునని వివరముగా చెప్పినారు.

Above essay is not only an extract of Master C.V.V direct disciples(mediums) Potharaju Narsimham Garu,  Gali Balasundar Rao Garu, T.S. Sankara Iyer, S. Narayana Aiyar Writings but also an extract from Sri. A.V. Srinivasacharyulu Garu and Sri Jr. Vissa Apparao Gari writings.

References:

1) Master's Independence Declaration

2. Master's Pillar Test Speech

3) The New Yoga - S.Narayana Aiyar

4) Sri Potharaju Narsimham Garu Notes translated 

in to telugu by Gali Balasundar Rao Garu.

5) Question and Answers by Sri. A.V. Srinivasacharyulu

6) Yoga life of Vissa's practicing Bruktha Rahitha Taraka Raja Yoga.


Below video approximately refers to the statement of Sri A.V. Srinivasacharyulu (About Island that is going to arise near mumbai offshore)


These kind of developments make us to think that geographical situations are changing very fast compared to earlier expected time intervals. (Hopefully physical eternity to manform will be successful to the present root race(5th Root Race) of manform.)

This is the greatness of our yoga line, more discipline we all maintain more miraculously higher energies help us to believe and develop faith.

Master Namaskaram.

--------------------------------------------



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?