మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ నేటి సాధకులు, మీడియంలు చేరినప్పుడు మాస్టర్ గారిచే ఇవ్వబడిన కార్డు పై ఉన్నట్లుగానే సాధన చేయవలెను. ఇది మాత్రమే మాస్టర్ గారు ఇచ్చిన కనీస సాధన. ప్రచారములో ఉన్న ఇతర విధానములన్నీ మాస్టర్ గారి ఆదేశములకు విరుద్దమైనవే. Master CVV Namaskaram Please rectify and develop my system “మాస్టర్ సి.వి.వి.” నమస్కారం. నా శరీర ప్రకృతిని స్వస్థత చేసి ఉద్ధరింప వేడుచున్నాను.” 4.2.1915 న సాధనాక్రమము గురించి మిడియంలకు ఇలా తెలిపినారు. “ఆదేశములు: అందరికి. సాధన ప్రక్రియ, పైన ఉన్న ప్రవేశరంధ్రము నుంచి కిందకు ప్రసరించవలెను. కాళ్ళ నుంచి పైకి ప్రసరించుట సాధన నిరోధ ప్రయత్నముగా గమనించవలెను. అట్టి చర్యను తప్పించవలెను.” మాస్టర్ సి.వి.వి. గారిచే, శ్రీ కప్పగంతుల సత్యనారాయణ మూర్తి, మీడియం నెం. 627 గారికి 24.2.1922 న ఆంగ్లములో వ్రాయబడిన లేఖ భాగము. ప్రియమైన కె. ఎన్, ప్రతి ఉదయము సాయంత్రము ప్రార్థన కొరకు కలవండి. హాజరు పట్టి రాయండి (Attendance) దగ్గరలో ఉన్న మీడియంల వివరములు మీకు వంవబడ...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి