Understanding the Concept of K (Kundalini) and the New Yoga - Sri C.R. Sreenivasa Iyer (Medium No. 38)

 

Understanding the Concept of K (Kundalini) and the New Yoga - Sri C.R. Sreenivasa Iyer (Medium No. 38)

C.R. Sreenivasa Iyer Diary (21-9-1914)

ప్రస్తుతము ఉన్న విశ్వ సూత్రముల ప్రకారము ఏర్పడిన మానవ వ్యవస్థలో ఒక నూతన లైఫ్ ప్రినిపుల్ ను ప్రవేశపెట్టడము ద్వారా ఒక క్రొత్త విధాన ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావడమే ఈ నూతన యోగ మార్గము యొక్క లక్ష్యము. 

చుట్టూరా జరుగుచున్న సాధారణ పరిణామ ప్రక్రియ యధావిధిగా జరుగుతున్నపుడే, ఈ నూతన ప్రాణ శక్తి వాహకులుగా ఉండగలరు అనే భావనతో మనలను మీడియంలు అని పిలచినారు.

సాధారణ పరిణామప్రక్రియ ప్రస్తుత మానవ రూపములో తన పరిమితిని చేరినది. 

ఈ పరిణామ సూచన మానవ కుండలినిలో నిక్షిప్తమయి ఉన్నది.  

తగిన విధముగా పరిశీలించినట్లయితే, అది పొందిన అనేక పరిణామస్థితులను తెలియజేయగలదు.  

ఈ పరిణామమునకు బ్రహ్మగా ఉన్నది ఏ ప్రాధమిక జీవసిద్ధాంతము నుంచి వచ్చినదో,
దాని నుంచే ఈ కుండలిని అనే సిద్దాంతము కూడా తీసుకోబడినది. 

ఈ నూతన యోగమార్గము ద్వారా ప్రవేశపెట్టబడుచున్న ప్రాణ శక్తికి కూడా మూలము అదే కానీ, ఈ ప్రాణ శక్తి విశ్వపరిణామములోని పరిమితులకు లోబడినది కాదు.   

ఈ నూతన ప్రాణశక్తి,
కుండలిని చేరిన పరిణామ పరిమితికి గుర్తుగా చెప్పబడే K (Kundalini) లోకి 
చొచ్చుకొని పోవుటలో,
ప్రస్తుత పరిణామము చేత ప్రభావితమవకుండా ఉండటమే కాక, ఈ ప్రస్తుత పరిణామమునకు ఇబ్బంది కలుగకుండా తన ప్రస్థానమును కొనసాగిస్తుంది. 

అది తనదైన సూక్ష్మమును ఏర్పరచుకొని, ప్రస్తుత పరిణామములో మానవునికి అసంభవమైన వాటిని అందుకొనే స్థాయికి మానవుని చేరుస్తుంది. 

మానవుని అసంభవమైన వాటిని అందుకొనేలా చేయడములో,
ప్రస్తుత విశ్వ సిద్ధాంతముల ప్రకారము ఉన్నత స్థాయిలకు సంబంధించిన స్పృహను అందుకోవడము కొరకు,
ప్రస్తుత మానవ వ్యవస్థలో ఇతర సిద్దాంతములకు అనుగుణముగా నడిచే కొన్ని అంతర్గత వ్యవస్థలను తాత్కాలికముగా నిలిపి వేయుట ద్వారా మాత్రమే కుదురుతుంది.

కానీ ఈ నూతన ప్రాణసిద్ధాంతము, వివిధ విశ్వస్థితులలోని స్పృహని చేరడములో ప్రస్తుత మానవుని భౌతికస్పృహ  కోల్పోకుండా కొనసాగుతూ ఉండేలా చూస్తుంది. 

ఈ నూతన ప్రాణసిద్ధాంతము అన్ని ప్లేన్ లలో ఏకకాలములో ఉండి తమ ఉనికిని గుర్తించగలిగేలా చేస్తుంది. పర్యవసానముగా, విశ్వములో మరణముగా చెప్పబడే మార్పు అనే స్థితిని అసంభవము చేస్తుంది.


The podcast linked below may not be completely accurate, 
but it’s helpful for getting a rough idea of the concept.



విశ్వ ప్రణాళికకు ప్రతినిధులుగా ఉండగలిగే మనకు ఈ నూతన ప్రాణ శక్తి ప్రవేశపెట్టబడే విధము ఇలా ఉంటుంది.

కుండలినిని Triple అనే ఎందుకు చెప్పబడుతుంది అంటే అది ఇప్పటికే మూడు విధములైన మార్పులు చెంది, ప్రస్తుతము నాలుగవ మార్పులో (Fourth Field) ఉన్నది. 

ఈ కుండలిని యొక్క మార్పులో మానవ మొనాడ్ (theosophical term)  యే పరిమితి దగ్గర ఏర్పడినదో దానికి K అనేది ఒక సూచనగా మనము అనుకోవచ్చు. 

ప్రాణజీవులు యే మూలము(paramathma) నుంచి ఉద్భవించినవో అక్కడి నుంచే వచ్చిన మానవుడు ఈ విశ్వము యొక్క బ్రహ్మ (creator) చేత పరిణామము చేయబడి  ప్రస్తుత మానవ స్థాయికి చేరినాడు.

ఆ విధానములో ఇకముందు ఏమి పరిణామము మానవునికి జరుగుతుంది అనేది అప్రస్తుతము.

K. ఫస్ట్ కీ

యాదృచ్చికముగా
ఒక మానవ రూపము యొక్క జోక్యముతో చేసిన సంకల్పమునకు,
ప్రస్తుతము ఉన్న విశ్వస్థితులలో ఏ విశ్వ సిద్ధాంతములు మానవ సంకల్పమునకు అనుగుణముగా కూడా ప్రతిస్పందించలేని విధముగా ఉండగా, 

ఈ నూతన ప్రాణ శక్తి విశ్వప్రవాహమునకే మాతృక(matrix) అయిన కారణముగా,
ఈ శక్తి ఆ విశ్వప్రవాహముకంటే సున్నితముగా, దానిలోనుంచే ప్రసరిస్తూ ఈ నూతన యోగమార్గములో పనిచేస్తుంది.  

అందువలననే ఈ స్కూల్ లోని పద్దతులు సాధనాలు పూర్తిగా క్రొత్తగా ఉండి మరే ఇతర సాహిత్యములో కానీ తత్వశాస్త్రములలో కానీ కనపడవు.

ఈ నూతన తరంగము మన నాడీవ్యవస్థ కేంద్రములో(Nerve Centers) తనదైన వ్యవస్థను ఏర్పరచుకొని చర్యలు చేస్తుండగా,
బాహ్యపొర అనగా భౌతిక దేహము విశ్వనాడీవ్యవస్థ ప్రకారము నిలిచి ఉన్నందువలన,  దేహనడవడికి కావలసిన కాస్మిక్ ప్రక్రియలకు వ్యతిరేకత లేకుండా ఉంటుంది. 

ఇప్పుడు ఉన్న తత్వ, యోగ సాహిత్యం అంతా నాలుగవ గోళ (Fourth Field) వ్యవస్థకు సంబంధించి ఉండడము వలన, ఏ యోగి కూడా ఇంతవరకు K యొక్క అసలైన పరిణామములను శోధించలేకపోయినారు. 

ఈ నూతన జీవతరంగము మాత్రమే అందులో ఉన్న వాటిని తెలియపరచగలదు. ఎందుకంటే ఇది దానికి మాతృక కనుక. ఇది మాత్రమే K3 ను శాసించి అందలి 3 పరిణామదశలను (previous 03 fields) బహిరంగపరచగలదు. 

అందువలననే ఈ K3 లేదా ట్రిపుల్ అనేది ఈ సృష్టికి ఒక రహస్యముగా ఉండి ఒక్కటయినదిగా చూడబడుతోంది. 

ఆ రహస్యమును బహిర్గతపరచగలిగినది ఈ నూతన యోగము (Briktha Rahitha Taraka Raja Yogam) ఒక్కటే. 

ఈ నూతన జీవ తరంగము సహాయముతో మాత్రమే మనము ఈ ట్రిపుల్ కాస్మిక్ ఇవల్యుషణ్ ను శోదించగలుగుతాము అర్థముచేసుకోన గలుగుతాము.


Approximate English Version:

According to the present laws of the universe, humans function in a certain way. This new yoga method aims to introduce a new ‘life principle (Prana)’ into that human system. By adding this new prana, a completely new way of progress and development becomes possible for humans.

As the natural evolutionary process continues normally, certain individuals act as vehicles for this new prana. For this reason, these individuals were named mediums.

Human Evolution, as it naturally happens, has developed humans as far as it can for now. Human beings, in their current state, are the maximum result of the ordinary evolutionary process. 

The indication or sign of this evolution is hidden within the Human Kundalini.

If you study the Kundalini carefully, it can show you all the different stages of evolution it has already gone through in the past.

The fundamental life-principle(Source) on which Brahma, the Creator, relied is the same principle from which Kundalini has received its own fundamental life-principles. (Both evolution (through creator or brahma) and Kundalini have their origin in the same primary source or Adi or Paramatma.)

The new prana introduced through this new yoga path also comes from the same original source. However, this new prana is not limited by the boundaries of the current universal evolution. It is beyond those limits.

This new prana-shakti can enter into the Kundalini, which is the symbol of human evolution up to this point. Yet, this new prana does not disturb or interfere with the current evolutionary process. At the same time, this new prana-shakti is not influenced by the existing evolution of the universe.

By creating its own subtle system, this new prana-shakti enables humans to reach heights that normal evolution cannot provide.

To gain abilities beyond normal human limits, some internal systems in the body that follow ordinary principles must be temporarily paused. This makes it possible present day human to access higher levels of awareness.

But this new prana allows a person to experience advanced levels of perception while still keeping their existing human body awareness fully active.

This new prana exists simultaneously on all planes and allows beings to be aware of its presence everywhere. As a result, the change that is usually called ‘death’ in the universe becomes impossible.

The podcast linked below may not be completely accurate, 
but it’s helpful for getting a rough idea of the concept.
https://youtu.be/AHIt9f8WtEU?si=xd4wUNZ8HJtRI8Sn

This is the method by which the new prana reaches those of us (Humans) who can act as representatives of the universe’s plan.

Kundalini is known as ‘Triple’ (K3) because it has already undergone three transformations. At present, it is in the fourth stage, called the Fourth Field.

During the transformation of Kundalini, the stage where it reaches the human Monad’s (theosophical term) limit is marked by the symbol ‘K.’

Humans come from the same origin as all life (Paramatma), and have developed through the universe’s creation process by Brahma (creator) to their present form.

In this present ongoing process of evolution, what further evolution will happen to humans is not at all a relevant subject to us.

K. First Key.

By chance, if a human makes a deliberate decision (human will power), the current universal conditions (nature) are such that no existing universal principles (principles of nature) can respond or align with that human will power.

The new prana shakti serves as the framework of the universal flow, spreading subtly and operating through the principles of new yoga methods.

That is why the methods and practices in this school are completely new. They cannot be found in any other literature or philosophy.

This new wave of prana shakti functions within the nerve centers,

The prana shakti we know—the one that runs the universe—is only an outer layer. The real core is this new prana, which is actually the matrix behind that outer prana.

and because the outer body stays in harmony with the normally known nerve system (outer layer), normal cosmic processes for bodily movement continue without hindrance.

All present day yogas and philosophical texts we know relate to the Fourth Field,
Which is why no yogi has so far investigated the true transformations of  Human Kundalini (K).

Since this new prana is the matrix, it alone can command K3 and reveal the three earlier fields of transformation.

That is why K3, also called the Triple, is considered a secret of this creation and is seen as unique.

Only this new yoga method, can reveal this secret.

This new prana is the only means by which we can investigate and make sense of the Triple cosmic evolution (K3).

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?

Hierarchy of Universe