మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ


మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ


నేటి సాధకులు, మీడియంలు చేరినప్పుడు మాస్టర్‌ గారిచే ఇవ్వబడిన కార్డు పై ఉన్నట్లుగానే సాధన చేయవలెను. 

ఇది మాత్రమే మాస్టర్‌ గారు ఇచ్చిన కనీస సాధన. 

ప్రచారములో ఉన్న ఇతర విధానములన్నీ మాస్టర్‌ గారి ఆదేశములకు విరుద్దమైనవే.


Master CVV

Namaskaram

Please rectify and develop my system


“మాస్టర్‌ సి.వి.వి.” 

నమస్కారం. నా శరీర ప్రకృతిని స్వస్థత చేసి ఉద్ధరింప వేడుచున్నాను.” 


4.2.1915 న సాధనాక్రమము గురించి మిడియంలకు ఇలా తెలిపినారు. 


“ఆదేశములు: 

అందరికి. సాధన ప్రక్రియ, పైన ఉన్న ప్రవేశరంధ్రము నుంచి కిందకు ప్రసరించవలెను. 

కాళ్ళ నుంచి పైకి ప్రసరించుట సాధన నిరోధ ప్రయత్నముగా గమనించవలెను. 

అట్టి చర్యను తప్పించవలెను.” 


మాస్టర్‌ సి.వి.వి. గారిచే, శ్రీ కప్పగంతుల సత్యనారాయణ మూర్తి, మీడియం నెం. 627 గారికి 24.2.1922 న 

ఆంగ్లములో వ్రాయబడిన లేఖ భాగము. 


ప్రియమైన కె. ఎన్‌, 


ప్రతి  ఉదయము సాయంత్రము ప్రార్థన కొరకు కలవండి. 

హాజరు పట్టి రాయండి  (Attendance)

దగ్గరలో ఉన్న మీడియంల వివరములు మీకు వంవబడుతాయి. 

అందరూ కలిసి నిశ్శబ్దముగా  సాధనచేసుకొనే గదిని పవిత్ర ప్రదేశముగా భావింపవలెను. 

సాధకులు వ్యక్తిగతమైన, రాజకీయపరమైన, లేదా సామాజికపరమైన విషయములు గురించి గాని, 

ఇతరేతర వ్యర్థమైన మాటలు, చర్చలు చేయరాదు.

అంతగా కావాలనుకుంటే నా ఫోటో పెట్టుకొనవొచ్చు.

భజనలు లేదా ప్రార్థనా క్రతువులు లేదా పూజ పద్ధతులలో ఆరాధన చేయరాదు. 

మన మార్గము సత్య జ్ఞాన మార్గమని తెలుసుకొనవలెను  

ప్రార్థన గదిని థియొసాఫికల్ లోని ఎసోటెరిక్ సెక్షన్ లోని వారి ఆలయం మాదిరి చూడవలెను. 

అంతేకాక బ్రదర్ హుడ్  అఫ్ మేసోన్ లోని వారి వలే సోదర భావము కలిగి ఉండవలెను.


బెస్ట్ విషెస్

సి.వి.వి 

--------------

Reference: Master CVV's Yoga - Basic  Information 

Thanks to Umakant Akkiraju Garu and Prabhakar Mitra Mandali for their continuous efforts to reveal the master's true and authentic knowledge.

--------------------------------------------

Join our Whatsapp Community:

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?