ఈ వ్యాస రచయిత శ్రీ పోతరాజు నర్సింహం గారు. పై ఫొటోలో మాస్టరు గారికి కుడివైపున కూర్చొని వున్న వారు.
శ్రీ పోతరాజు నర్సింహం గారు రచించిన ఈ ఆంగ్ల వ్యాసమును తెలుగులోనికి అనువదించిన వారు డాక్టర్ శ్రీ గాలి బాలసుందర్ రావు గారు.
PART - I
హిందూ తత్వవేత్తల జీవన సంభావనా-సారాంశమని భావింపబడే గీతోప-దేశమును ఆకళింపు చేసుకున్న నేను గీతావిజ్ఞానము అసమగ్రమనీ మరియు ఆపరి – పూర్ణమనీ(overall it is incomplete) భావించి మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో ఎందుకు చేరేను?
జవాబు:-
గీతలోగాని, ఇతర ప్రామాణిక హిందూ తాత్విక గ్రంథములలో గాని
(1) మనము ఏ కారణముచేత భూమి పై ఉద్భవించాము ?
(2) పరిణామ ప్రక్రియలో మానవుడి అత్యంత దశ యేమిటి?
(3) ఎందుకు మనం మన కర్మలను ఈశ్వరుడికి(one point) ఆరోపిస్తున్నాము?
(4) ఈశ్వరుడి నుంచి వేరుపడిన మన ఉనికి యేమిటి ?
(5) దేనికై ప్రకృతి, సర్వాధారభూతమైన ఈ శరీరాన్ని, ఇంత సంక్లిష్టంగా నిర్మించింది?
(6) ఈ శరీరాన్ని, దాన్ని అనుసరించి వున్న, ఇంద్రియాలను నిరోధించడానికి ఏమైనా సమర్థనీయమైన కారణం వున్నదా?
(7) ‘కర్మ’ అంటే ఏమిటి? ‘ఎందుకై ‘మనం’ మనకు బాహిరమూ(outside), యితరము అయిన యీ శరీర పంజరంలో అస్వచ్చందంగా వుంచబడి, ఆశరీర ధర్మములకు బాధ్యులము చేయబడుతున్నాము.
(8) భగవంతుడంటే ఏమిటి ? ఎవరు?
(9) అనశ్వరత్యము(నశించారని) శాశ్వతత్వము మొదలైన ధ్యేయములు విగత-శరీరమైన(without any anxiety and complete body) ఉనికిలో ఎల్లా సాధింపబడతవి?
అందుకై మార్చవలసిన పరిస్థితులన్నీ మనకు ప్రసాదింపబడిన యీ శరీరాన్నిఆశ్రయించుకుని ఉన్నవేగదా.
ఇలా అనేక సందేహాలు కలుగుతూ వుంటవి. అవన్నీ గీతాపఠనంతో తీరడం లేదు.
మన ఉనికి ఎక్కడ ప్రారంభించిందో, జీవితానికి ‘ఆది’ యేదో, అక్కడి పరిస్థితులన్నీ సంతృప్తిగా వుండి వుంటే. అక్కడ నుంచి యిక్కడకు రావడానికి ఇక్కడ నుంచి తప్పించుకుని మళ్ళీ ఎక్కడనుంచి వచ్చామో అక్కడకు పోవాలని ప్రయత్నిచడానికి అవసరంగాని అర్థంగాని ఉండదు.
జీవితమును గురించిన ఈ శంశయాత్మక దృక్పథం, మన అవివేకానికి ఫలితమైనా అయివుండాలి. లేదా కేవలం సృష్టి-పరిణామ ఫలితమైన మనం, ఆ పరిణామమును పురికొల్పిన శక్తిచేత ఈ జీవిత యాత్ర ప్రారంభించడానికి ప్రేరేపింపబడి అయినా వుండాలి.
ఏ విషయమును గురించి అయినా, వ్యక్తి యేర్పరచుకునే అభిప్రాయంగానీ, చేసుకునే నిర్ణయం గానీ, అతని బుద్ధి మీదనో, హేతువాదం(activity believes only by scientific reason) మీదనో, విచక్షణ శక్తిమీదనో ఆధారపడుతుంది.
ఈ నూతన యోగము, యీ సృష్టి పరిణామ ఉద్దేశ్యము, సృష్ట్యారంభదశలో ఉన్న అవ్యక్తస్థితికి పోవడం కాదని, ఆ దృక్పథం ఆ-సంభావనకే విరుద్ధమనీ హేతువాద రీత్యా స్థాపిస్తుంది.
ఇంద్రియ గోచరంగా, అనుభవసిద్ధంగా, ఇక్కడే, యీ పరిణామ దశలోనే సత్యంగా, నిజంగా ‘బ్రహ్మం’ లేక ‘ఆధి శక్తి’ని గురించి యేర్పడిన సంభావనలో నిగుంభితమైన(obscure) పూర్ణత్వాన్ని, పుష్కలత్వాన్నీ అనంత శక్తిమయత్వాన్నీ, మన అనుభవానికి తేవడమే ఈ నూతన యోగపు అత్యంత ఆదర్శము.
‘ఆధి’ శక్తిలో(One-Point) వున్నదని మనము ఊహించుకుంటున్నా సంభావించుకుంటున్న లక్షణాలన్నీ ఇచ్చటికి క్రమంగా దిగినవే కాని, ఆ మొదటి సంభవనీయమైన అవ్యక్తస్థితికి(One-Point) అవి మళ్లీ ఆరోహించడం(చేరుకోవడం) ఆ శక్తి ధ్యేయంకాదు.
వృక్షంనుండి రాలినపండు వృక్షంలోనే మళ్ళీ చేరదు.
ఏ చెట్టునుండి అది విడిపోయిందో ఆ చెట్టుగానీ, దాని శాఖలుగానీ, దాని వేరుగాని ఆ పండును వ్యుత్పత్తి చేయడంకోసమే కల్పింపబడ్డవి.
ఆదిలో వున్నది బ్రహ్మం ఒక్కడే అయితే, అదే కోరి బహు రూపములు ఉద్భవించి పరిణమిస్తుంటే, జీవులు మళ్ళీ బ్రహ్మమును చేరగోరటంలో అర్థం లేదు. ఒక వేళ చేరినా, సముద్రంలో విసరిన కొబ్బరి బోండమును సముద్రుడు మళ్ళీ ఒడ్డుకు విసరివేసినట్లు బ్రహ్మము తన్ను చేరిన ఆత్మను మళ్ళీ యిక్కడ కేపంపేస్తాడు గదా? కనుక జీవికి పరమ ధ్యేయము బ్రహ్మ నియోగించిన కార్యమును సాధించడమే: అది బ్రహ్మత్వమును సాధించడమే ఆయుండాలి.
జన్మ ఎత్తి, కొంత సంస్కారం పొంది, మరణించి, ఊర్ధ్వలోకాలలో అధోలోకాలకో పోయి అక్కడ సంస్కారం పొంది బ్రహ్మత్వసిద్ధికి అవసరమైన సంస్కారం, పొందేవరకు జనన మరణాలను పొంది చివరకు ముక్తుడౌతాడా?
ముక్తి జీవి శాశ్వత నివాస మెక్కడ?
భూమిమీదనా లేక విశ్వంలో యింకెక్కడైనానా ? లేక విశ్వ మంతటా ఎక్కడ బడితే అక్కడనా?
ఇవన్నీ సందేహాలు అనుసరించిన ఆత్మ, శాశ్వతము, స్వయం సంపూర్ణమూ, వాంధావి రహితమూ(without objections), సత్యమూ నిత్యమూ అయినది కావడానికి అంటే బ్రహ్మత్వము పొందడానికి మనం చేయ వలసినదేమిటి?
ప్రకృతి శక్తుల విన్యాస ఫలితమైన మనమే ఈ కార్యాన్ని సాధించాలా? లేక ఈశ్వరుడే(one-point / param-jyothi / paramathma) తన అనంతకరుణతో యీ కార్యానికి పూనుకోవాలా?
జ్ఞాన వాంఛా విరహితములైన పాశ్చాత్య విజ్ఞానములు, పరిణామ గతిలో ఉత్తమశ్రేణిని అందుకోడానికి అవసరములైన ప్రేరణలన్నీ పరిణామ కారణమైన ఈశ్వరుడివే గాని తత్ఫలితములైన వాటివికాదు.’ అని భావించి ఇందుకు ఈశ్వరుడే పూనుకోవాలా!! అంటున్నవి.
పై సమస్యకు సమాధానం కావాలంటే మాస్టరు సి. వి. వి. అంటే ఎవరు? ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి.
మొట్టమొదట మాస్టరుగారి వ్యక్తి సంబంధమైన విశేషాలను గురించి తెలుసుకుందాము.
మాస్టరు గారు క్రీ. శ. 1868, ఆగస్టు 4వ తేదీనాడు పూర్వాహ్ణము 10-24 గంటలకు కుంభకోణంలో జన్మించారు.
సాయన సిద్ధాంతానుసారంగా ప్రవచింపబడిన ధృవనాడి, నిరయన సిద్ధాంతము ననుసరించి ప్రవచింపబడిన ధ్రువనాడి నిరయన సిద్ధాంతం అనుసరించి ప్రవచింపబడిన కాకయార్ నాడి వంటి పురాతన జ్యోతిష, గ్రంథములు, మాస్టరుగారిని, త్రిమూర్తులు, గ్రహములవంటి సృష్టి కార్య-క్రమాధికారులకు (Heirarachies) కూడా తెలియకుండా నశ్వరులైన(mortal) మానవులనుండి వినశ్వరమైన(immortal) దివ్య మానవులను సృజింపమని సాక్షాత్ పరబ్రహ్మముచే(onepoint) అదేశింపబడి భూమిపై అవతరించిన బ్రహ్మంశ సంభూతునిగా అభివర్ణించినవి.
వారు ప్రస్తుత పరిణామపు తదుపరి కల్పనకు(present evolution's next phase) అవసరమైన వీణములను స్థాపించి, ఇతర అవతార పురుషులవలెనే, మన భౌతిక ‘ప్రకృతికి కనపడి కదిలాడే విధముగా ధరించిన భౌతికదేహమును వదలి(భౌతిక దేహ ఇంద్రియములకు కనపడే) దివ్యమైన స్వరూపముతో మరల అవతరిస్తారనీ (సర్వమతము లూహించిన) దివ్యలోకవాసుల వలెనే దురాశా-ద్వేష కలుషితము కానిదీ, దారిద్ర్య--జరామరణ విరహిత మైనదీ అయిన జీవితమును ప్రసాదిస్తారనీ, అప్పుడు వివిధములైన మత విధానములు అంతరించి పరబ్రహ్మ సాక్షాత్కార-ప్రదమైన ఏకైక మార్గము మిగులుతుందని ఆ గ్రంథములు ఉద్గాటిస్తున్నవి.
అప్పుడు మానవులు యీ తప్పుల తడక ప్రభుత్వ విధానములచేత గాక, కరుణామయుడైన భగవత్ శక్తి చేతనే ప్రాభావితులౌతారనీ చెప్తున్నవి.
ఈ జ్యోతిష్య-శాస్త్ర గ్రంథములు అభివర్ణించిన యీ విషయములనే మాస్టరు గారి యొక్క బోధనలు, ఆదేశములు వారి వివరణలు నిరూపిస్తున్నవి. ఆ విషయమును అట్లా వుంచి కేవలం మానవునిగా మాస్టరుగారిని గురించి తెలుసుకుందాము.
మన అందరిలాగే మాస్టరుగారు, 43 వ సంవత్సరం వరకు సామాన్య గృహస్తుని లాగే జీవయాత్ర సాగించారు. ఆయన సర్వజన సులభుడనీ, దయాశీలి అనీ, మృదుభాషి అనీ, స్నేహశీలి అనీ, తప్పులను క్షమించగల ఉదార స్వభావుడనీ, క్షమాగుణ సంపన్నుడనీ, ఆశ్రిత జన సేవా-నిరతుడనీ వారితో బాగా పరిచయమున్న అందరూ చెప్తారు.
తన్ను నమ్మినవారు, స్నేహితులు తన ఔదార్యాన్ని అవకాశంగా తీసుకుంటున్నారని తెలిసినప్పుడు కూడా, అట్టి వారిని మాస్టరుగారు పల్లెత్తు మాట కూడా అనేవారు కారు. పైగా వారిని సమర్థించేవారు, ఆయన పేద కుటుంబంలో పుట్టారు. అయినా సంపన్నులకు దత్తత పోయినారు. వారికి ఆస్తి రెండు లక్షలకు పైగా వుండేది. స్నేహితులకూ, ఆశిత్రులకూ ధారాలంగా ఖర్చు చేయడంవల్ల ఆ ఆస్తి అంతా పోయి చివరకు మాస్టరుగారు అప్పుల పాలైపోయినారు.
కేవలం దరిద్రుడైపోయిన తర్వాతనే ఆయన తన జన్మ కారణాన్ని గ్రహించారు. అప్పుడే పరమోత్కృష్టమైన బ్రహ్మతేజం ఆయనలో ప్రవేశించి, యీ నూతన మార్గ స్థాపనకు దారి తీసింది.
ఒక శిష్యుడితో తన్ను గురించి మాట్లాడుతూ తను సర్వోత్కృష్టమూ అత్యంతమూ అయిన భగవచ్ఛక్తి ప్రతినిధినని ఆ శక్తి ఆదేశాన్ని పాటించి, ఈ ప్రాపంచిక విధానము ఎలా సాగుతున్నదో అందులో లోపము లేమిటో, సృష్టి-క్రమాధికారులైన దేవ-గ్రహాలకు తెలియకుండా, ఆ లోపములను సవరించే విధానమును తెలుసుకుని, అందుకవసరములైన మార్గములు ఎప్పుడు ఎలా అవలంబించాలో నిర్ణయించడానికై భూమిపై అవతరించాననీ ప్రస్తానించారు.
ఇది ఒక సామ్రాట్టు, తన రాజ్యంలో పరిస్థితులు ఎల్లా ఉన్నాయ్యో, తన సామంతులకూ, ఉన్నతోద్యోగులకు తెలియకుండా గూఢచారుల ద్వారా తెలుసుకుని, తన పాలితులు సంపన్నులూ, సంతృప్తులూ, సౌభాగ్యవంతులు కావడానికి ఆ ప్రభుత్వ యంత్రాంగంలో ఏ ఏ సవరణలు చేయాలో స్వయంగా తెలుసుకుంటానికి తన ప్రతినిధిని నిర్ణయించినట్లుగా ఉన్నది.
తన జన్మ కారణం వివరిస్తూ మాస్టరుగారే యీ ఉపమానాన్ని ఉపయోగించారు. సామ్రాట్టే పరమబ్రహ్మం(One Point). ఆ మూర్తి నుండి ప్రభవించిన శక్తి కిరణమే మాస్టరు. నశ్వరములైన మన శారీరక-వ్యక్తిత్వాలు, మన స్వస్వరూప(appearance) సం-జనితములైన(One who is born) కిరణప్రాయములు(radiation of main beam of light) మాత్రమే. అవి ఇప్పుడున్న స్థితిలో తమ ధర్మములు నిర్వహించలేకుండా వున్నవి. వాటి ప్రస్తుత శరీరములు ప్రకృతి నుంచి యెరుపు(made with the help of present earthly elements) తెర్చుకున్నవే గానీ నిజకాయములు(not real bodies) కావు.
(ఈ భౌతిక దేహము నిజమైన శాశ్వతమైన దేహనిర్మాణ ప్రక్రియలో ఒక దశ మాత్రమే. నిజ దేహము ఏర్పడేవరకు అది నశిస్తూ తిరిగి ఏర్పడుతునే ఉంటుంది. -- అనువాదకుడు శ్రీ గాలి బాలసుందర్ రావు గారు)
ఒక మాటు సూస్టరుగారిని “మీ వికాసం (Development) పూర్తికాగానే మీరు మీ నిజస్వరూపంలో దర్శనమిస్తారా? అని యెవరో అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి,
“నాకే వికాసం అవసరంలేదు. నా వికాసం పరిపూర్ణమైనది. నేను వచ్చినది. ఇతరులకు వికాసం కలిగించడానికి.
మీరు నిరీక్షించవలసింది మీయొక్క, యితరుల యొక్క వికాసం. నేను సంకల్పించిన పని పూర్తికాగానే యితరుల వికాసము పూర్తి అవుతుంది.
సకల మానవులను నా అంతవారిని చెయ్యడమే నేను సాధించవలసిన వికాసం” అన్నారు.
ఒకప్పుడు మాస్టరుగారు “జోస్ట్ ” పంకా(జోస్ట్ ఫేన్ :- కిరసిన్ ఆయిల్ దీపంలో వేడిమితో తిరిగే పంకా) చాలా శబ్దం చేస్తుంటే రిపేరు చేస్తున్నారు. అందుకాయన చేసిన మూడు ప్రయత్నాలు విఫలమైనవి.
ఫేన్: మరమ్మత్తులో ఆయనకు సహకరిస్తున్న ఒక శిష్యుడి ప్రాణం విసిగి, “ఇప్పుడిక్కడ కెవడైనా వచ్చి “సాక్షాత్ బ్రహ్మం భూమిపై అవతరించి యిక్కడే వుంటున్నారని విని వచ్చాను. ఆయన ఎక్కడున్నారు?” అని ఆడిగితే, అతనికి “ఇదుగో యీ ’జోస్టు’ ఫేన్తో సతమతమవుతున్నారు. ఆయనే బ్రహ్మం” అని జవాబు చెప్తే అతనెంత బాగా నిర్ఘాంతపోతాడు?” అన్నారుట.
మరొక సందర్భంలో మరొక శిష్యుడు మాస్టరుగారిని జ్ఞాపకార్థమై యేదైనా స్మృతిచిహ్నం (SOUVENIR) యిమ్మని వేడుకున్నారు.
“ఈ నశ్వరములైన దేహులనించి (Perishable) ఏ స్మృతిచిహ్నం నీవు కోరుతున్నావు? నేను నీలోనే వున్నాను? అంతకన్నా ఏం కావాలి నీకు?” అన్నారు మాస్టరుగారు.
(Perishable అంటే నశించేవి. ఈ పెరిషబుల్స్ అని బహువచనం వాడేరు. అది తన్నుద్దేశించే అన్నారని ఆయన జవాబు సూచిస్తుంది. మాస్టరుగారు సంకల్పించిన మరణ విరహితమైన(immortal) దివ్య కాయకల్పన యీ భౌతిక దేహంతో సంబంధించింది కాదనీ, Initiation చేసినప్పుడు తనలో ఒక భాగము (ఉపదేశము) అతనికి ఇచ్చాననీ అదే వికాసం పొంది అతన్ని తనంతవాణ్ణిగా చేస్తుందనీ అదే శాశ్వతమైన సూవెనీరనీ(Souvenir) యీ ఛలోక్తివల్ల సూచించారు -- అనువాదకుడు శ్రీ గాలి బాలసుందర్ రావు గారు)
సాధారణ మానవుడుగా మాస్టరుగారు లేమిని అనుభవించారు.
ఆయనకు “విశ్వాసంతో, పట్టుదలతో దీక్షగా, పారిశ్రామిక వైజ్ఞానిక రంగములలో నూతన మార్గ ప్రదాతలైన ‘పారిసీ’, ‘కొలంబస్’ వంటి మహాపురుషులలాగా, యీ నూతన మార్గమును అభ్యసించండి” అని ఆదేశిస్తూ వుండేవారు.
ఈ మార్గమును నిలకడ తోనూ అకుంఠిత విశ్వాసంతోనూ అనుసరిస్తే పరమానందకరమైన సత్యత్వము ఇక్కడే లభిస్తుంది.
సాధారణమైనవిగా కనిపించే ఈ చిన్న సంఘటనలు బహుళార్థ ప్రయుక్త ఈ నూతన మార్గానుసరణకు, విస్తరణకు, బంధుమిత్రులు వ్యతిరేకంగాములుగా వున్నా — అకుంఠిత దీక్షతో యీ మార్గ నిర్మాణానికి ఆయన పరిశ్రమించారు.
ఆ సంగతి తెలుసుకుంటే ఆయన తన పదవిని స్వలాభానికి ఉపయోగించుకునే స్వామిగానీ, కేవలం గ్రహచార ఫలితంగా గురుత్వము లభించిన సామాన్య గురువుల వంటివాడుగానీ కాడనీ ఇహలోక సంబంధమైన పరమాత్మ స్వరూపమేననీ తెలుసు కుంటాము.
ఉపదేశ మార్గంద్వారా నేను నీ హృదయంలో ప్రవేశించానని యే గురువూ చెప్పలేదు.
కేవలం క్షేత్రజ్ఞుడైన(అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే.) బ్రహ్మం మాత్రమే ఆ విధంగా చెప్పగలడు.
సాధారణ గురువులు ఏ మంత్రం ఏ దేవతా సంబంధమైందో, దాన్ని ఎలా ఉపాసించాలో, ఏ యోగసాధన ఎలా చెయ్యాలో చెప్పి పూరుకుంటారు.
తరువాత శిష్యుల-భవిష్యత్తు వారి ప్రయత్నానికే వదిలేస్తారు.
అదృష్ట వశాత్తు అతను ఉపాసించిన దేవత అతనికి సిద్ధి అయితే ఈ గురువులు దక్షిణకు తయారవుతారు.
ఆ మంత్రం ఖరీదు దక్షిణ మాత్రమే నన్నట్లుగా! ఈ విధంగా మంత్రోపదేశాలవల్ల శిష్యుడికి లభించేది విడుదల(Freedom) కాని ముక్తి కానే కాదు, ఉపాస్య-దేవతకు(మంత్రం ద్వారా ఉపాసించిన దేవతకు) దాస్యం. అవిడ మీద ఆధారపడ్డ జీవితం మాత్రమే.
అహంకార స్వరూపులైన రాక్షసులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గురించి ఘోర తపస్సు చేసి వరములు పొంది సాధించింది ముక్తి గాదు. ఇతరులను దాసులను చేసుకొనే శక్తి.
వారికి దేవతా సాక్షాత్కారమైనప్పుడు “నాకు కావలసింది వరములు కాదు. నన్ను మీ అంతవాడినిగా వికసింపజేయండి!” అని ప్రార్థించి వుంటే అందు వల్ల లభించే శక్తిని వారు ఇతరులను దాసుల్ని చేసుకుంటానికై వినియోగించక దానంగా అనుగ్రహించి వారిని తమంతవారినిగా చేసి ఉండేవారు.
భక్తులు మరణ రాహిత్యాన్నే కోరినప్పుడు త్రిమూర్తులలో ఏ ఒక్కరూ కూడా ఆ వరం ఇవ్వలేక పోయినారు. ఎందుచేత? వారికే ఆశక్తి లేదు గనుక.(కల్పాంతమందు వారికి మరణం వున్నదని భావన. --- అనువాదకుడు శ్రీ గాలి బాలసుందర్ రావు గారు)
కాని ఈ నూతన యోగ-విధాత (Master) యీ పద్ధతిని అవలంభించలేదు! తన శిష్యులకు వారు తాముగానే యీ సిద్ధికై ఏ విధంగా ప్రయత్నించి సాధించాలో ఎవరిని ప్రార్థించాలో చెప్ప బూనుకున్నారు.
శిష్యులను బ్రహ్మత్వం స్వీకరించడానికి అర్హులను చేయడమే ఆయన పని.
బ్రహ్మమును(one-point/paramathma/param-jyothi/parameshwara/parabramha) తెలుసుకున్న తరువాత (Realise) బ్రహ్మమే శిష్యుల మధ్యభాగంలో - చేవలో (Core) బ్రహ్మబీజముగా ప్రవేశించి, శిష్యదేహములో ప్రవృద్ధిచెంది అతని దేహాంతర్భాగముగా వృద్ధిచెంది, అక్కడ ఉండిపోతుంది. అంటే బ్రహ్మ కార్యసిద్ధి లభిస్తుంది.
అప్పుడు గురువు (Master) శిష్యుడు (Disciple or Medium) ఇద్దరూ ఒకటే అయిపోతారన్న మాట.
అంటే ఆయనే, మనము మనమే ఆయనగా మారిపోతామన్నమాట. “నీవే బ్రహ్మము”, “ఇదంతా బ్రహ్మం” (సర్వం బ్రహ్మమయం), “బ్రహ్మను తెలుసుకుంటే బ్రహ్మమైపోతాడు” మొదలయిన ఉపవిషద్వాక్యాల సారాంశమిదే? అటువంటి పరిపూర్ణత్వాన్ని ప్రసాదిస్తానని మాస్టరుగారు శిష్యకోటికి వాగ్దానం చేశారు.
ఇంతేకాదు. శిష్యులను(mediums)వికసింపజేసి, అర్హులను చేసి జాగ్రదావస్థలోనే (స్వప్నావస్థలో గాని సమాధి స్థితిలోకాని కాకుండా) బ్రహ్మమును ఇంద్రియ గ్రాహ్యము(make it understandable to sensory organs) చేసి జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తామన్నారు.
మాస్టరుగారి యీ బోధ, వారు ఇతర దైవములవంటివారు కారని సర్వలోక స్రష్ట(Creator) అయిన ఆది-శక్తి (One Point) అనీ సూచిస్తున్నది.
ఇతర దైవములుగాని, గురువులుగాని, ఆఖరుకు త్రిమూర్తులుగాని ఇటువంటి వాగ్దానం చేయడానికి సాహసించలేదు.
ఇది ఆత్మోత్కర్ష(self attraction) అనుకోవడం ఆయన వ్యక్తి-స్వభావాన్ని తెలుసుకోకపోవడమో, విస్మరించడమో అవుతుంది. ఆయన వినయసంపన్నత, తన గురుత్వాన్ని అభిలషించి వచ్చిన వారి విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ, ప్రదర్శించిన అభిలాష తెలిసిన వారు అనుకోరు.
ఆయనతో పరిచయమున్న ఎవరైనా ఆయన అహంభావి కాదని గ్రహిస్తారు.
ప్రాపంచిక సుఖదుఃఖాలను, దోషాలనూ ఆయన సాధారణ మానవులలాగే అనుభవించారు. వాటి నివారణార్థమై ఆయన తన అమోఘశక్తులు ఉన్నప్పటికీ వాటిని ఎప్పుడు వినియోగించలేదు.
తన్నాశ్రయించిన వారితో సమానంగా పంచుకోలేని ఏ సంపద, శక్తులనూ ఆయన ఐహిక జీవితంలో అనుభవించలేదు.
అటువంటి “మాస్టరు – గురువు” తో సన్నిహితత్వం యేర్పడ్డ వారూ, వారిని సంపూర్ణంగా విశ్వసించిన వారూ, ఇటువంటి అత్యంత ఆదర్శమైన-జన్మ ఈ భూమి పై యెత్తడమేనని విశ్వసించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఎవరైనా వారి శిష్యులను అందవిశ్వాసం కలవారనీ, మత-విహీనులనీ, సమ్మోహితులు (Hypnotise) కాబడినవారనీ, భావించడం ఆలోచనా-శూన్యమైన దురభిప్రాయమే అవుతుంది.
వారి శిష్యత్వం లభించిన వారు పరమధన్యులు.
(మానవుల పరమ ధ్యేయం ఉత్తమ లోక ప్రాప్తి అని బ్రహ్మ-ఐక్యమని ఆధ్యాత్మిక జిజ్ఞాస గల వారిలో 99% విశ్వసించే కాలములో మానవ జన్మ ఉత్తమోత్తమమని, అతీత కాయకల్పన చేసి మరణాన్ని జయించడమే పరమ ధ్యేయమని బోధించే గురువు ఆయనచే ఆకర్షించబడిన వారూ ఆయనను నిస్సంకోచముగా నమ్మినవారూ మొదట్లో అపహసింప-బడటంలో ఆశ్చర్యం లేదు. --- అనువాదకుడు శ్రీ గాలి బాలసుందర్ రావు గారు)
ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, పంచ భూతములు, మనవి కావనీ, మనం కామనీ, మరణానంతరమో మళ్ళీ జన్మ యెత్తినప్పుడో మనం వాటిని విడిచి పెట్టి తీరాలనీ తెలిసినవారు, బ్రహ్మత్వ ప్రాప్తికై ఈ శరీరమును కృశింపజేయడము, నిరోధించడమూ కేవలం మూర్ఖంగానూ అనవసరంగా కాలమునూ ప్రయత్నమునూ వృధాచేయడంగానూ కనబడుతుంది. (బ్రహ్మత్వ ప్రాప్తికై : మోక్షం కొరకు ఇతర కష్టతరమైన మార్గాలు అవలంబించడం)
మనము కాని, మనది కాని. యీ శరీరానికి యిచ్చే శిక్షణకు ప్రయోజన మేమిటి? ప్రగతి హేతువైన మార్గము మరొకటై పుండాలి.
సన్యాసాశ్రమ స్వీకారం చేయకుండా, బ్రహ్మచర్యావసరం లేకుండా అనవసర ఆడంబరములు విసర్జించి, జీవితానికి అవసరములైన వాటినే ఉపయోగించుకుంటూ సాధారణ సాంసారిక జీవితం సాగిస్తూ, మనల్ని సృజించిన(Created by) ఆది-శక్తిని (One Point) కలుసుకుంటానికి తీవ్రంగాంచించటమే ఆ మార్గము.
(ఆయా కాలములలో ఏది లేకపోతే జీవనం సాగదో అది జీవితావసరం. చేతి వాచీ ఈ కాలములో అవసరము. వజ్రాలు పొదిగిన ఉంగరము కాదు. నిరాడంబర జీవనమని భావము
చేయవల్సిన-దానికి మించి చేస్తే ఏ పని అయినా హానికరమౌతుందో అది "అతి" -- "అతి సర్వత్ర వర్జయేర్" బుధజనవాక్యము -- అనువాదకుడు శ్రీ గాలి బాలసుందర్ రావు గారు)
అందుకనే మాస్టరుగారు, సాధారణమూ, సహజమూ, శాంతియుతమూ పర-హింసా-రహితమూ అయిన జీవితం ఇతర మానవులతో ప్రేమ స్నేహములను పెంపొందించేది అయిన జీవితం గడపవలెనని శిష్యులను ఆదేశించారు.
మన జీవితంలో యేదీ అతిగా ఉండగూడదనీ, సన్యాసంగాని, తత్తుల్యమైన(Balanced) యితర మార్గములుగాని కూడవనీ, సహజమైన సాంసారిక జీవనం చేయడ-మవసరమని వారు ప్రబోధించారు.
అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశించినట్లుగా మాస్టరుగారు “నేను చెప్పిన రీతిగా సాధనచేస్తూ నాలో పూర్ణ విశ్వాసం వుంచి, మీ వికాసానికి సంబంధించిన అన్ని బాధ్యతలు నాకు వదిలెయ్యమన్నారు. మనుష్యుడిగా తనని గుడ్డిగా నమ్మ-వద్దనీ, పరబ్రహ్మమునకు ప్రతినిధియైన మాస్టరుగా తనను నమ్మవలసిందనీ అన్నారు.
మన విశ్వాసం:
విశ్వాసమంటే ఏమిటి ? మన విశ్వాసమును గురించి చర్చించడానికి ముందు అసలు విశ్వాసమంటే యేమిటో విచారిద్దాము. విశ్వాసం స్వభావ లక్షణము లేమిటి?
“మనకు గోచరముగాని, అనుభూతికందని వస్తువున్నదని నమ్మినప్పుడు మనం దానిని విశ్వసిస్తున్నాము లేక నమ్ముతున్నాము.” అంటాము.
ఆ వస్తువు దూరస్తమో(distant), భావనాజనితమో (Conceptual) అయి, మనం అనుభూతికందని ఎరుకకు రాని దానిని ఉన్నదని నమ్మడం విశ్వాసం.
మన విశ్వసించిన దాన్ని బట్టి ఆచరించడం జరుగుతుంది.
అందువల్ల ఆ విశ్వాసం మన స్వభావాని (Nature) కంతటికీ నచ్చాలి. మన బుద్ధి వివేకములకు అనుకూలంగా వుండాలి. అది మనకు మంచిదీ, క్షేమకరమూ అని తోచేటట్లుగా వుండాలి ఆ విషయంలో యే అపనమ్మకమూ కలగకూడదు.
అపనమ్మకం విశ్వాసానికి వ్యతిరేకం.
అలా మన స్వభావానికంతటికీ నమ్మకం కుదురుస్తూ మనకు అత్యంతశ్రేయస్సు కలిగించగల దనేటట్లుగా సందేహ-కారణం కానిదిగా వుండాలి.
ఏ తాత్వికాదర్శమైనా(philosophical) “భగవద్గిత” మొదలైన వేదాంత గ్రంథములలో ప్రతిపాదింపబడిన జీవితా-దర్శములు(way of life), అభిప్రాయములు ఇంతముందు పేర్కొన్న విషయములలో అసమగ్రములుగా(unable to cover all topics) కనుపించి-నందున, జీవితమును గురించి ఒక నూతన సంభావన, నూతన దృకృతము అవసరమౌతున్నవి.
ఈ నూతన యోగము వాటిని సమకూరుస్తున్నది.
ఆ యోగ-సిద్ధాంతములు, సాధనా విధానములూ తరువాత వివరిస్తాను.
కేవలం మేధా సంబంధమయిన అభిరుచి మాత్రం కలిగించేవి. మనలో కదలిక కలిగించనే లేవు. అవి భావోద్రేకమును మాత్రమే ప్రేరేపించే విషయములు, అవి మనల్ని అంధులను, మూఢనుయాయులుగా(మూఢనమ్మకాలను నమ్మేవారిగా) తయారు చేస్తవి.
మన నిశ్చయము సద్యోజనకముగా(పది-మందికి ఉపయోగకరంగా) వుండాలి.
మనము అభిలషించే వస్తువో గమ్యస్థానమో ఇక్కడనే ఇప్పుడే సాధింపబడదగినది సత్యమైనదిగా వుండాలి. అంతేగాని మనం పరీక్షించలేని, పరిశీలించలేని, నిజమని నిరూపించలేని, లోకాలో, పరిస్థితులో, మరణము అనంతరము సంభవించే ఏవి మనకు నచ్చవు.
పుణ్యజనులని ఋషులనీ పిలవబడేవారు వెలిబుచ్చిన అభిప్రాయములనూ, స్థాపించిన సంప్రదాయాలనూ ఒక మూల వుంచి, మనమాశించే గమ్యస్థానమో, స్థితియో మనం చూడగలిగినదీ, అనుభావ్యమూ(అనుభవించ తగినదా), సత్యమూ అయినదా?
అది హోమియోపతి మందు ప్రభావము నిరూపించబడినట్లు మన నిత్యజీవితములో నిరూ పించబడాలి. అప్పుడే మనమంతా బ్రహ్మస్వరూపులమే అన్న ఉపనిషద్వాక్యము సార్థక మౌతుంది. ఆ బ్రహ్మత్వసిద్ధి అందుకోగలమన్న నమ్మకం కుదురుతుంది.
బుద్ధినీ మనస్సునూ సంతృప్తిపరచ గలిగినా మూడవదీ అతి ముఖ్యమైనదీ అయిన ఇంద్రియ గ్రాహ్యత(sensory perception) ఇంకా స్థాపించబడవలసి వున్నది.
ప్రస్తుతం ప్రచారంలో వున్న ఆధ్యా త్మిక సంభావనలన్నీ మేధస్సునూ జ్ఞానతృష్ణ(thirst for knowledge)నూ కూడా సంతృప్తిపరచలేకుండా వున్నవి. మేధోజ్ఞాన(మేధస్సు యొక్క జ్ఞానము) సమన్వయమును(coordination) సాధించలేకపోతున్నవి. ఇక మానసికానుభూతుల మాట వేరే చెప్పనవసరంలేదు…
ఇప్పుడు “యోగము” అన్న మాటకు అర్థమేమిటో విచారిద్దాము
యోగము అన్నమాట ఎన్ని అర్థములతో ఉపయోగించడానికి వీలుందో అన్ని అర్ధములతో—అంటే ఇదమిద్ద(exact meaning is this)మన్న అర్థం లేకుండా గీతలో ఉపయోగించ బడింది;
జనసామాన్యంచేత ఉపయోగింపబడుతున్నది.
ఒక విధంగా చూస్తే అన్ని ప్రయత్నములు, సాధనలూ కూడా యోగములే.
ఐహిక వాంఛాసిద్ధికి చేసినదైనా ఆధ్యాత్మిక, నైతిక, రస సౌందర్య కళాత్మక రంగములలో ఏ సిద్ధికి చేసిన ప్రయత్నమైనా యోగమే అనబడుతుంది.
భాషా శాస్త్రీయంగా ‘యోగ’ మంటే ఐక్యము చేయడం అని అర్థం.
ప్రకృతి విషయ-బాహుక్యం(multiple things) గలది. మన మానసిక-భౌతిక-తత్వము వాటన్నింటిలోకి సంక్లిష్టమైనది.
ప్రకృతిలో కనుపించే ఏ రెండు విషయముల కలయికలో ఒక ఐక్యత సాధింపబడి, అది ఒకటిగా(Unit) అస్తిత్వము పొందడము యోగఫలితము. కాని వివిధములైన భాగముల కలయిక మాత్రమే యోగం కాదు.
వైద్యములోనూ రసాయనిక వ్యాపారములోనూ అనేక వస్తువులు యాంత్రికంగా కలిస్తే యోగం కాదు.
నిజమైన యోగంలో విశిష్టమైన ఏకీకరణ దక్షమైన ముఖ్యవస్తువేదో (Principle) వుండాలి. జీవుల విషయంలో ప్రాణం, ఆత్మవంటిదేదో అధికంగా వుండాలి.
భగవద్గీతలో చెప్పినట్లు ‘క్షేత్రము’ లేక ‘ప్రకృతి’ విడివిడిగా వుండే అనేక భాగముల కలయిక. క్షేత్రజ్ఞుడు లేక ‘పురుషుడు’
ప్రాణవస్తువు, ప్రాణవస్తువుల్ల విడివిడిగా వుండే వివిధ భాగములు ఒకటిగా కలిసి జీవిగా వ్యక్తిగా ఆస్తిత్వమును పొందుతున్నవి.
‘బోసన్ క్వెట్’ (Bosanquet) అనే తత్వశాస్త్రవేత్త(Philosopher) “పూర్ణతాభావము, ఏకత్వ సంభావన, ఏకత్వమును సాధించిన వివిధ భాగములకంటే భిన్నమైనది” అన్నాడు.
ఈ అభిప్రాయమునే మానవుడు యోగ విషయంలో పరిపూర్ణ వ్యక్తిత్వ సాధనకు సకల ప్రయత్నములకు అన్వయించినపుడు(when applied), ప్రతి ప్రాణి విషయంలోనూ యీ పని ప్రకృతి చే సాధింపబడే ఆత్మలోనే విశ్వాత్మ ప్రతిఫలించడం గమనిస్తున్నాము. (అదే జీవనసూత్రము)
అదే యావత్ విశ్వమును ఏకీభస్తున్నది. కాని ఆ విధంగా సమీకృతమైన(integrated) వస్తువులకు భిన్నమైవున్నది.
(రాగి తీగలో విద్యుచ్ఛక్తి ప్రవహిస్తున్నది. స్విచ్ ఆఫ్ చేస్తే ప్రవహించదు. అందువల్ల విద్యుచ్ఛక్తి విద్యుద్వాహిక(conductor - copper wire) ఒకటి కాదని తెలుస్తున్నది.
శరీర ధాతువులు అనేక రకములు. అన్నింటినీ ప్రాణము ఏకీభవించి ‘ప్రాణి’గా మార్చి, ‘ప్రాణం’ ప్రాణి - శరీరంలో వేరై సంచరిస్తున్నది. ప్రాణి శరీరములకు ప్రాణధారణ శక్తి ఉన్నది. ఆ శక్తి కొంత కాలానికే పరిమితము. ఆ కాలమే ఆయుర్దాయము.
శరీరం ప్రాణధారణ శక్తి కాలం పెరగడమే ఆయుర్దాయము పెరగడం, ఆధునిక విజ్ఞానులు ప్రయత్నిస్తున్నది ఇందుకే ఆయుర్వేద లక్ష్యమూ ఇదే వైజ్ఞానిక ఫలితంగా ఆయుర్దాయం పెరుగుతున్నది.
విజ్ఞానంవల్ల జీవితకాలాన్ని పెంచగలుగుతున్నామే గాని చావులేకుండా చెయ్యడంలేదు. కాని విజ్ఞానులు అందుకే ప్రయత్నిస్తున్నారు.
ప్రయత్నం చేయకపోవడం, ఆజ్ఞానం; పిరికితనం; నిరాశావాదం పనికిరాదు. ఆయుర్దాయం పెరగడానికి యోగవిద్య ఒక సాధన. ఒక మార్గము. ఆయుర్దాయం పెంచడమే గాక మానవులలో ప్రేమభావం అధికం చేస్తుంది. ఇది నా అనుభవం.
దేహాన్ని కల్పించింది ఎవరు? లేని దానినుంచి ఉన్నది రాదు. ఆదిలో బ్రహ్మ మొక్కటే వుంటే ప్రకృతి దానివల్లనే ఏర్పడి వుండాలి. దానిలో ఒక భాగంగా అది రూపాంతరం పొందటంవల్లనే ఏర్పడి వుండాలి.
దేహంలో వుందా మనుకునే, దేహి(life ray of a body) అందులో ప్రవేశిస్తున్నాడు. అతని మోజు తీరేవరకు ఉందామను కుంటే అందాకా ఆ దేహం-సరిగా ఉండటంలేదు.
దేహం ప్రకృతి నిర్మితం దేహి(life ray of a body) బ్రహ్మనుంచి వచ్చిన రేణువు. -- అనువాదకుడు శ్రీ గాలి బాలసుందర్ రావు గారు)
ఇల్లాగే గత కాలంలో చాలామంది యోగులు భావించి ప్రయత్నించి రకరకాల ఉనికిని సాధించారు. కానీ శాశ్వతత్వాన్ని సాధించలేకపోయినారు. కారణం వారు విశ్వమును ఏకీకృతం గావించిన బ్రహ్మసూత్రమును శాశ్వతంగా నిలుపుకోగల శరీరాలను నిర్మించుకోలేకపోవడమే.
అల్లా నిర్మించుకోవడం సాధ్యం కాక చేసిన విచారణా ఫలితములే మనస్సు, బుద్ధి, మొదలైన సంభావనలు. వాటిని తెలుసుకోవడం తోనే వారు తృప్తిపడ్డారు.
శాశ్వతత్వానికై చేసిన ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఎందుచేతనంటే అవి ఆత్మకు యితరమైన దేహ భాగములకు సంబంధించినవి.
‘ఆత్మేమనం’ అనుకుంటే యితరమైన దేహ భాగములు మనకు సంబంధించినవీ కావు. మన నుంచి ఉద్భవించినవీ కావు.
ఇక్కడే యీ నూతన యోగానికి పాత యోగాలకూ ఉన్న భేదం కనిపిస్తుంది.
పాత సిద్ధాంతాల ప్రకారం, వ్యక్తి, విశ్వ-భాగముల ప్రతినిధులో- ఫలితములో అయిన దేహ-భాగముల(Assumption: Human Body parts are co-related to the divisions of Universe - Example: Sahasrara co-relates to Mahapara Nirvanic, Agnya(brain and it's all glands) co-relates to Para Nirvanic Division of Universe, etc.) మధ్య మాత్రమే సమన్వయము(coordination) ఏర్పరచడానికి ప్రయత్నించారు. అవి అవినాశంగాను, శాశ్వతంగాను నిలవలేవు.
శరీరం యెప్పుడూ తనకు మూలస్థానమైన ప్రకృతిలోకి పోవాలనే ప్రయత్నిస్తుంది.
యోగశక్తివల్ల గాని తపశ్శక్తివల్ల గాని ఆ సమన్వయ కాలమును పొడిగించ వచ్చునేమో! కాని యీ శరీరమును శాశ్వతం చేయలేము.
ఇందుకు కారణము ప్రయత్నములన్నీ క్రిందినుంచి -- అంటే ఇంద్రియ గోచరమైన మానవశరీరం నుంచి పైకి జరిగినవి. ఈ నూతన యోగములో ఆ ప్రయత్నము కేవలం వ్యతిరేకంగా -- అంటే బ్రహ్మము(One-Point) నుంచి మానవుడివరకూ- జరిగింది.
ఇక్కడ వ్యక్తి నిర్నిరోధంగా(Passive), భగీరధుడు పై నుంచి వచ్చిన గంగను స్వీకరించినట్లు వచ్చిన దానిని స్వీకరించి తృప్తిపడి ఏర్పడ్డాడు.
నూతన మార్గంలో గురువు, శిష్య పరిణామ ఫలితంగా యేర్పడ్డవాడు కాడు. ఆయన తిన్నగా బ్రహ్మం నుంచి వచ్చినవాడు.
బ్రహ్మకిరణమైన మానవుడు శాశ్వతమైన దేహానికై ఉబలాటపడుతున్నాడు.
మాస్టరుగారు శిష్యుడికి
“ఎవరిని ప్రార్థించాలి?
ఎవరికై తన ప్రార్థనలను నిర్దేశించాలి?
ఎలా ఆ శిష్యుడిలో బ్రహ్మబీజ నివాస యోగ్యమైన నిర్మాణము ఏర్పడుతున్నది?
దానిని ఎలా గమనించాలి?
తనే(గురువే, బ్రహ్మమే) ఉపదేశ (Initiation) విధానం ద్వారా ఎల్లా ప్రవేశించి అతని శరీరమును శాశ్వత బ్రహ్మవాస యోగ్యమైన మందిరంగా మారుస్తున్నాడు?
శిష్యుడిచేతనే గ్రహింప జేస్తున్నారా?"
అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేరు.
కాగా ఇక్కడ సర్వనాశనధక్షమైన “కాలం” ప్రభావంవల్ల శిష్యుడు జీర్ణించడానికి(decompose) గానీ నశించడానికి గానీ ఎంత మాత్రమూ అవకాశములేదు.
శిష్యుడు గురువు ఐక్యమైనందున,
ఆ గురువు సాక్షాత్ బ్రహ్మమే అయినందున,
కాలం బ్రహ్మస్వరూపమే అయినందున,
కాలంలోనే శిష్యుడు లీనమవుతాడు.
బ్రిక్త రహిత తారక రాజా యోగమనే ఈ నూతన యోగ మార్గానికి పాతయోగ విధానాలకు యిదే ప్రధాన భేదము, పాతయోగములు బద్దములైన(broken), పరిమితములైన(with boundaries) పరోక్ష మార్గములు(only alternatives)
ఈ నూతన యోగము కాలా తీతమైన ఆపరోక్ష మార్గము(Direct). ఇది కాల ప్రభావమునకు గురికాదు.
ఇక్కడ ఒక ముఖ్యవిషయమును తెలుసుకోవాలి. మాస్టరుగారిచే యినిషియేట్(Initiate) చేయ బడిన శిష్యులు సామాన్య మానవులు కారు. వారు తమ పూర్వజన్మలలో యితర మార్గములవలంబించి, అవి లోపభూయిష్టములు అసంపూర్ణములు అని తెలుసు కొని మరల ఈ లోకములో జన్మించిన వారు
(మాస్టరుగారి శిష్యులలో అధిక సంఖ్యాకులు సాధారణ మానవులుగానే సామాన్య అనుభవములతో భౌతిక దేహములు విడిచి పెట్టేరు.
నాకు తెలిసినంత వరకు శ్రీమతి నారాయణయ్యరు జీవితకాలములో స్మరించినప్పుడల్లా మాస్టరును చూడగలిగేదని విశ్వసించడానికి, ఆమె ప్రశ్నలకు, ఏ ఆదృశ్యశక్తియో సరైన సమాధానమిస్తుందనీ, మీడియం శరీరంలో ఏమి జరుగుతున్నది – ఆ మీడియమే గమనించలేనిదీ, గమనించగలిగినది – చూడగలదనడానికి, తగినంత సాక్ష్య మున్నది. ఆమెను నేను స్వయముగా యెరుగుదును.
ఆమె, ఆమె భర్త కూడా మాస్టరుగారి (ఆకాశ) మండలం(Loka of Master) చేరుకున్నారని, వారి మరణానంతరం చదివిన హోరా శాస్త్ర భాగములు చెపుతున్నవి.
ఇప్పుడు జీవించి వున్న వారిలో డాక్టరు వెంకటరంగం నాయుడుగారు, వెంకట రమణరావుగారు ప్రార్ధనా సమయంలో మాస్టరుగారి పూర్వ రూపంవంటి రూపాన్ని చూస్తారు.
“మూర్తి కనబడుతుంది. కాని వారు మాట్లాడే మాట వినపడదు” అని అతి వృద్ధులైన నాయుడుగారు నాతో చెప్పేరు.
శ్రీమతి నారాయణయ్యరు కూడా మరణించిన భర్త భౌతిక శరీరం కన బడుతుందనీ మాట్లాడుతుందనీ ఆ మాటలు వినబడవనీ, తనకివ్వడానికి తెచ్చిన వస్తువులు తన చేతిలో వుంచగానే మాయమౌతాయని నాతో చెప్పారు. -- అనువాదకుడు శ్రీ గాలి బాలసుందర్ రావు గారు)
వారి ప్రార్థనలు విని వారికి జన్మరాహిత్య వాంచాసిద్ధి సమకూర్చుటకై బ్రహ్మయే మాస్టరు రూపములో వచ్చి వారినందరినీ ఆకర్షించి, తనలో వున్న మాస్టరు ప్రిన్సుపులు(Principles) వ్యాపించి, వారిలో ప్రకాశించినప్పుడు వారు మానవకోటి బాధలను తొలగించి లోకంలో శాంతి సౌఖ్యములను స్థాపించడానికై వారిని మీడియములుగా(Disciples) ఉపయోగించుకుని ఉండవచ్చును, వారిలో మాస్టరు ప్రకాశించేటంతవరకు వారు మామూలు మనుష్యులాగే కనపిస్తారు: ప్రవర్తిస్తారు.
వారిలో ప్రవృద్ధి పొందిన శక్తులేమయినా వున్నా అవి ప్రదర్శింపబడవు.
(సర్వశక్తిమంతుడని భావింపబడే బ్రాహ్మయినా తృటికాలంలో పరిణామగతిని మార్చివేయలేడు.
Sire అంటే ఇంగ్లీషు భాషలో ప్రభువు, ఈశ్వరుడు అని అర్ధము
De అన్న ఉపసర్ద(prefix) వ్యతిరేకార్థమును సూచిస్తుంది.
డిసైర్స్(Desire = De+Sire) అంటే వాంఛలు, వాంచేలేని బ్రహ్మము సర్వశక్తి మంతము
సృష్టి వాంఛ కలగంగానే సర్వశక్తిమంతము బ్రహ్మ త్రిగుణాత్మకమైన ఈశ్వరుడుగా లేక శక్తిగా మారిపోతాడు.
సృష్టిశక్తి 9/10 బ్రహ్మ.
సెంటీగ్రేడ్ Centigrade 10 x 10 = శతమానం
సృష్టింపబడిన ప్రాణి బీజముల పరిణామ కార్యం జరుగుతూ వుండగానే దాని ప్రక్క ప్రక్కలనే ప్రకృతిలో ఏ అలజడి లేకుండా నూతన ఆది-మానవ సృష్టికి అవసరమైన విప్లవం జరిగి పోతూండాలి. (Revolution along with evolution)
ఇప్పటికి 21,000 జన్మలు ఎత్తేనని మాస్టరుగారే చెప్పేరు
-- అనువాదకుడు శ్రీ గాలి బాలసుందర్ రావు గారు)
ప్రకృతి జనితమైన మాయా-వరణము(Deluding-One). వారిని కమ్మి వుంటుంది. అప్పుడప్పుడు వారు వారిలో వున్నవి లేనట్లుగానూ లేనివి ఉన్నట్ల గానూ బ్రమచెందవచ్చును కూడా.
వారి నిజప్రకృతియే వారు గమనించలేక పోవచ్చును.
ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. మాస్టరు భూమిపై మానవ దేహంతో అవతరించడం ఇపుడే కాదు. మానవజాతి పరిస్థితి ఎట్లా వున్నదో స్వయంగా గమనించడానికి, గమనించి వారిని దివ్య మానవులుగా మార్చడానికి అవసరమైన మార్గములు సూచించడానికి యిదివరకే అనేక జన్మలు తీసుకోవడం జరిగింది.
ఆయా జన్మలలో వారి శిష్యులు జన్మాంతరములలో మాస్టరు గారిని అనుసరిస్తూ వారి శిష్యులుగా జన్మిస్తూనే ఉన్నారు.
ఈ జన్మలో మాస్టరు గారు తను సంకల్పించిన పని పూర్తిచేసినారు. ఆ సంగతి చివరి సమావేశాలలో వారే స్వయంగా వెల్లడించారు. శిష్యులమైన మేము కొంతకాలం నిరీక్షించాలనీ ఆకాలం అనిర్దిష్టమైనదనీ ('అనిర్దిష్టమైనదనీ' వారు చివర సమావేశాలలో చెప్పిన సంగతులనుబట్టి ఊహించుకోవచ్చు.) చెప్పేరు.
అప్పుడు, చల్లిన విత్తనములనుంచి బీజాంకురములు పొడుచుకుని వచ్చినట్లుగా గుడ్డు డొల్లలో ఏర్పడిన అండము అంకురావస్త అయిపోగానే పిల్లగా రూపొంది డొల్లను పగుల్చుకొని బయ టకు వచ్చినట్లుగా, నూతనంగా దివ్య మానవులు ఆవిర్భవిస్తారు.
మన ప్రస్తుత శరీరం కర్మ జనితమైన ప్రకృతి ఆవరణగామారి అంతరించి పోతుంది. ఆ సంఘటన జరిగినప్పుడు విశ్వజనులందరూ ఇంద్రియ గ్రాహ్యములైన(observable with sensory organs) సంఘటనలెన్నింటినో గమనిస్తారు. అవే నూతన యుగారంభాన్ని నవ-మానవత్వారంభాన్ని చాటి వెల్లడి చేస్తవి.
ఈ నూతనయోగ ప్రయోజనం వ్యక్తిగతమైన ముక్తిగానీ లాభంగానీ కాదని అందరూ గ్రహించాలి. అది ఒకరి కొరకుగానీ కొందరికొరకుగానీ ఉద్దేశింపబడింది కాదు. దాని ఫలితము మానవజాతికంతకూ పంచబడుతుంది. వ్యక్తి మానవకోటిలో ఒక భాగమే గదా! బ్రహ్మకిరణ ప్రాయమైన ప్రాణము సర్వజీవ పరివ్యాప్తము.
అది ఒకరిలో వెలుగొందినపుడు ఆ కాంతి పుంజము తేజస్సు అందరికి అంద జేయబడుతుంది.
(మన యింట్లో వెలిగించిన విద్యుద్దీప కాంతిగానీ, రేడియో సంగీతం గానీ మన ఇంటిలోనే ప్రసారితం కాదు. దాని శక్తిననుసరించి యెంతో కొంత ఇతర ప్రదేశములకూ వ్యాపిస్తుంది. నూతన యోగ సాధనా ఫలితంగా సాదకుడిలో ప్రజ్వలితమైన యోగదీప కాంతి విశ్వ వ్యాప్తమౌతుంది.
విద్యుచ్ఛక్తి ఎలక్ట్రిక్ బల్బులో నుంచి ప్రవహించినప్పుడే కాంతి రూపం పొందుతుంది. యోగ సాధకుడి శరీరం బ్రహ్మతేజః ప్రసరణ యోగ్యమయిన బల్బుగా మారిపోతుందన్న మాట.
హోరాశాస్త్రమనే ప్రాచీన తాళపత్ర జ్యోతిష గ్రంథములో మాస్టరుగారి జాతకంలో యీ యోగమతము “నహి అవైదికం స్యాత్" (ఇది) ఆవైదిక మైంది కాదు” అని చెప్పబడింది. -- అనువాదకుడు శ్రీ గాలి బాలసుందర్ రావు గారు)
ఈ నూతన యోగం “సర్వము బ్రహ్మస్వరూపము. సర్వమూ ఏకాంతము – (ఒక Unit)గా ఉనికిని చెందుతున్న బహురూపములుగా ప్రదర్శితమౌతున్నవన్నీ “బ్రహ్మ స్వరూపములే” అన్న మూలసూత్రము ననుసరించి ఏర్పడింది.
ఇందులో భిన్నములూ వ్యక్తిగతములూ అయిన దృక్పథాలుండడానికి అవ కాశంలేదు. ఇది ఒక నిజమైన ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యము. (రాజకీయ ప్రజా స్వామ్యము దాని ఛాయ మాత్రమే.)
ఈ యోగము పాత విధానాలు మాదిరిగా ఒక వ్యక్తికి మాత్రమే ప్రయోజనము సమకూర్చు పద్ధతికి పూర్తిగా వ్యతిరేకం, ఈ యోగము ద్వారా సర్వ మానవాళి ప్రయోజనం పొందును.
పాత విధానాలు స్వప్రయోజన ముక్తిని మాత్రమే ఆశించే స్వార్థపరత్వమువల్ల స్వప్రయోజన వ్యాఘాతములుగా పరిణమించినవి.
(General Advice: మాస్టర్ గారి యోగమునందు కోర్సులు రెగులషన్స్ మొదలగు ప్రార్థనలు ద్వారా స్వయం ఎదుగుదల కోసం ప్రయత్నించరాదు, స్వార్థపూరితమైన ఎదుగుదలకు మాస్టరు గారి యోగమున ఎటువంటి తావు లేదు, ఈ యోగము సమిష్ట మానవాళి కొరకై అని ప్రతి ఒక్కరు అర్థంచేసుకొనవలెను. -- Blog Admin)
సర్వ జీవన ఏకత్వమును మనసారా విశ్వసించినపుడు ఈ యోగ విధానంలో అది నైతికాదర్శంగా పరిణమిస్తుంది. అటువంటి దృక్పథంతో చేసిన ఏ కార్యకలాపము తప్పుగా పరిణమించదు.
ఇదే భగవద్గీత ఆదేశించిన నిష్కామ కర్మ, సర్వం బ్రహ్మార్పణం చేయడంలో ఉద్దేశ్యమూ యిదే.
ఎందుకంటే సకల జీవిత సర్వస్వమే భగవంతుడు! “సర్వం బ్రహ్మార్పణమస్తు” అనడంలో అర్థమూ యిదే. అప్పుడు కామక్రోధాది అరిషడ్వర్గములకు తావుండదు.
అందువల్ల ఈ యోగమును మానవ-నిర్మితమైనదిగా భావించకూడదు. మన పురాణాల్లో బ్రహ్మ తపస్సు చేసి యీ భువనాల్ని(all lokas) సృష్టించాడని వుంది. అల్లాగే ఈ యోగము తపః ఫలితమైంది.
బ్రహ్మయే మాస్టరు సి.వి.వి గా అవతరించి సర్వమానవ శ్రేయస్సు కోరి యోగ రూపమైన తేజస్సు చేత మానవజాతి దివ్యత్వమును(immortality) సాధింపగలందులకై భూమిపై అవతరించాడు.
ఆయనే సర్వ ప్రాణులయందున్నాడు గదా! అందుచేత శిశ్యులు (మీడియములు) యోగ ఫలితము గురించిగానీ, తమ్ము-గురించిగానీ ఎప్పుడు ఏ విధంగా యీ నూతన మార్గం పరిపూర్ణమౌతుంది! అని గానీ ఆందోళన పడనవసరం లేదు.
ఆ విధమైన ఆందోళన పడవలసింది వాళ్ళు కాదు బ్రహ్మయే? వారు చేయవలసింది సర్వమూ ఆయన అధీనం చేయడమే. నిజమైన స్వతంత్ర స్థితి, తనలో వున్న బ్రహ్మకు అర్పణ చేయడంలోనే అనుభూత-మౌతున్నది.
పరమాత్మ అయిన ‘ఆది (One-Point)’కి వేరై-వుండడము నశ్వరత్వము(Mortal). అదే ఆత్మేతరమైన(ఆత్మకు సంబంధం లేనటువంటి) బాహ్య - ప్రకృతి మీద ఆధారపడి వుండే అస్వతంత్రత(dependence).
“ఆ సర్వ-స్వతంత్రుడికి వేరయిన స్వతంత్ర సిద్ధి అనూహ్యము. అచింతనీయము, (There is no independence of the one Independent -- One ever conceivable).
నూతన సృష్టి లేక నూతన(శరీర) నిర్మాణమంటే ఏమిటి?
ఈ యోగము నూతనయోగము. అంటే యింతకు పూర్వమున్న సృష్టి విధానములన్నిటికంటే వేరయిన అపూర్వసృష్టి. అంటే యిది ఒక నూతన ప్రయోగ విధానము. ఈ విధాన భవిష్యత్తు ఆనిర్దిష్టము. అనిశ్చితము. దానివల్ల కలిగే ఫలితములనుబట్టి దాని భవిష్యత్తును అదే నిర్ణయించుకుంటుంది.
సాధారణంగా ప్రయోగ మంటే ఏ ఫలితం కలుగుతుందో ముందు తెలియకుండా చేసే పని. (ఆ ఫలితం మనం అనుకున్నది కావచ్చు, మరొకటి కావచ్చు) అందుచేత ప్రయోగ ఫలితము సందేహాస్పద మైనదిగా ఉంటుంది. ఇది మానవులు చేసే ప్రయోగముల మాట
ఈ నూతన యోగము సర్వజ్ఞుడైన బ్రహ్మము చేసే ప్రయోగము. అందుచేత దాని ఫలితము విజయమేకాని ఆపజయము గాజాలదు.
ఇదివరకున్న ప్రపంచ సృష్టి విధానంలోనే ప్రగతిని సాధించే చర్యలను ప్రయోగాత్మకంగా మాస్టరుగారు తీసుకుని ఇంతకుపూర్వం ఆయన అవలంభించిన సృష్టి విధానంలో ఒక నమూనాను (Model) తయారుచేసి ఆ నమూనా ప్రకారంగా సర్వమానవుల ఆత్మలను మార్చదలచుకున్నారు. ఆ మారిన దివ్యాత్మలకు యోగ్యమైనవి వినశ్వరములైనవీ(immortal) అయిన దివ్య ఆవరణలను లేక దివ్యదేహములను ఆ ఆత్మ నమూనా-లే ఏర్పరుచుకుంటవి.
(“సోకామమతా బహుశ్శమ్ ప్రజాయె యేతి” అన్న వేద వాక్యాను సారంగా సృష్టి కాలంలో బ్రహ్మము బహు-రూపములలో పుట్టినా బహు రూపములైన జీవరాసుల ఆకారములలో భేదములున్నా ఆత్మలలో భేదం లేదు.
ఇప్పుడు ఆత్మ నిర్మాణ విధానమే మారుతుంది. వివిధ వర్ణముల గాజు ముక్కలలో నుంచి ప్రస రించే సూర్యకిరణము ఆయా వర్ణములను ధరించినట్లు యీ నూతన ఆత్మలు ఒకే రంగు ధరించి, వినశ్వరమూ(నశింపరాని), ప్రేమాత్మకము భేద రహితము అయిన ఒకే మాదిరి శరీరములను ధరిస్తవా?
ఒకే రకం దేహం కలిగి, నేను అనే ఒకే గుణం కలిగి వికారములులేని మానవులను సృష్టించడం యీ యోగ విధానపు పరమాశయమా? దీనితో పరిణామ ప్రక్రియ పరిపూర్ణ మవుతుందా?
-- అనువాదకుడు శ్రీ గాలి బాలసుందర్ రావు గారు)
అప్పుడు ఇప్పుడు కోరికలతో బాధితములైన మానవరూపములు మారి, వాంచా-రహితములైనవీ జరామరణ విరహితములైనవీ అయిన మానవ రూపములు ఏర్పడినవి, విశ్వపరిణామ గతిలో ప్రస్తుత స్థితిలో యీ మార్పులు జరుగవలసిన తరుణము అసన్నమైంది.
(అనిర్మలమైన వస్తువులనుండి నిర్మలమైన ప్లాస్టిక్ వస్తువులను మానవులు తయారుచేస్తున్నారు. వంచితే విరిగే గాజు నుండి, వంచితే విరగని గాజు తయారుచేస్తున్నారు.
మానవులకే ఇది సాధ్యమయితే సర్వజ్ఞుడైనట్టి, సర్వశక్తి సంపన్ను డైనట్టి బ్రహ్మమునకు సాధ్యముకాదా?
చచ్చినవారి ఆత్మలు (Souls) ఈ మాటకు సరియైన పదం కనపడడం లేదు.
చచ్చినవారు మళ్ళీ జన్మ యెత్తరనీ తీర్పు దినం దాకా వుండి తరువాత కర్మానుభవమును బట్టి పుడతారనీ క్రైస్తవుల విశ్వాసము.
ఈ యోగంతో ముక్తులైనవారు ఆకాశంలో సూర్యమండలం సామీప్యంలో యేర్పడిన నూతన మండలంలో శాశ్వత రూపులై ఉంటారని హోరా శాస్త్రంలో, యోగకాండలో చెప్పబడింది.
కానీ భూమి మీద ఈ యోగ సాధన చేసే యోగులు అనేకమంది, మానవ దేహేంద్రియములతోనే వారిని చూడగలిగినప్పుడు వారికి ఈ యోగ విషయములో “విశ్వాసం” యేర్పడుతుంది.
సకృతుగా యే కొద్దిమందికో అనుభూతమైంది భ్రమ. (Hallucination; Delusion; Illusion)
ఆ బ్రమే చాలామందికి కలుగుతూ ఇంద్రియానుభూతమౌతుంటే “విశ్వాసం” (Faith) అవుతుంది.
యోగాభ్యాసం చేసినవారికల్లా కలిగితే అదే వైజ్ఞానిక సత్యమౌతుంది.
ఈ మాస్టరు మతం (Masterism) వైజ్ఞానిక మతం అవుతుందని హోరా నాడీ గ్రంథాలలో ఉంది.
-- అనువాదకుడు శ్రీ గాలి బాలసుందర్ రావు గారు)
__________________________________
Join our Whatsapp Community:
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి