మాస్టర్ గారి సంఘటనా క్రమము


సంఘటనా క్రమము


మాస్టర్ గారి జన్మ పూర్వ క్రమము  

ప్రస్తుత జన్మమునకు వచ్చు సమయమునకు ముందు మాస్టర్ గారి మెమరీ, తన జన్మరాశి వద్ద అనేక స్థాయిల అనుభవములను పొంది ప్యూర్ మెమరీ రూపములో వేచియున్న రూపమును గమనించెను. ఈ ప్యూర్ మెమరీయే తదనంతరము చందుగా జన్మ తీసికొనెను.

ఆ సమయములో, మాస్టర్ గారి మెమరీ మొదటి జన్మనుంచి పొందిన అనుభవములనన్నింటినీ ప్రస్తుత జన్మములో భౌతిక స్పృహకు అందజేయవలెనని నిశ్చయించుకొనెను.

25.9.1921 సా. గం 5:20 నాటి మాస్టర్ గారి నోట్స్ ప్రకారము


1868

మాస్టర్ గారి జననం


1868 – 1904

మాస్టర్ గారి 15 సం:ల ప్రాయము నుండి, వారు జన్మలు తీసికొన్న రాశుల లక్షణ స్వరూపముల వివరములు (స్టెబిలిటీ) వారి కుండలిని నందలి శూన్య ప్రదేశములో నింప సాగెను.

6 రాశి గృహముల లక్షణ స్వరూపములు (హౌస్ స్టెబిలిటీ) వారి భౌతికములో నింపబడు ప్రక్రియ జరిగినది.

25.9.1921 సా. గం 6:05 నాటి మాస్టర్ గారి నోట్స్ ప్రకారము


1904

6వ హౌస్ స్టెబిలిటీ వాయు రూప స్థితిలోనే ఉండి వారి దేహములో నింపబడలేదు. ఆ కారణముగా 6 వ మరియు 7 వ హౌస్ స్టెబిలిటీలు హెచ్చించిన వేగముతో భౌతికమునకు ప్రవేశింపబూనినవి. అట్టి వేగ ప్రభావము వలన, అప్పటికి గర్భముతో ఉన్న మాస్టర్ గారి సతీమణి శ్రీమతి రుక్మిణి గారి మరియు శిశువు యొక్క లగ్న స్థితి కారణముగా రుక్మిణమ్మ గారు మరణించిరి. అయితే వారి స్టెబిలిటీని, మాస్టర్ గారు తమ వద్దనే ఉంచుకొని నారు. అనగా వారిని మరు జన్మమునకు వెళ్లనీయలేదు.  

మాస్టర్ గారి లో 7 హౌస్ స్టెబిలిటీల వ్యూ తో కుండలినందలి శూన్య ప్రదేశము పూర్తిగా నిండిపోయెను. 

25.9.1921 సా. గం 8:00 నాటి మాస్టర్ గారి నోట్స్ ప్రకారము


1906

మాస్టర్ గారు తమ స్నేహితులైన శ్రీ ఎస్. సుందరశర్మ (SS) గారిపై ఒక ప్రయోగము జరిపినారు. రక్త సంబంధీకులు కాని వారి స్టెబిలిటీ స్థానములో వేరొక స్టెబిలిటీ ఉంచి దేహమును నడిపించ వచ్చునా అని. అందులకు వాయు రూప స్థితిలో ఉండిన తమ 6 వ స్టెబిలిటీని ఉపయోగించినారు. ప్రయోగము సఫలమాయెను.

SS స్టెబిలిటీ మాస్టర్ గారి వద్దనే ఉండెను.

మాస్టర్ గారు శ్రీమతి వెంకమ్మాళ్ (CV) గారిని వివాహము చేసికొనినారు.

మాస్టర్ గారి దేహములో ఖాళీ లేని కారణముగా, మాస్టర్ గారి 8 వ హౌస్ స్టెబిలిటీ CV గారిలో నింపసాగెను.

CV గారి స్టెబిలిటీని మాస్టర్ గారు తన వద్దే ఉంచుకొనినారు

25.9.1921 సా. గం 8:00 నాటి మాస్టర్ గారి నోట్స్ ప్రకారము


1908 – 1910

CV గారి గర్భములో, వినూత్న పద్ధతిలో చందు రూప నిర్మాణ ప్రారంభము

ఏప్రిల్ 1909 లో చందు జననము

దేహములో స్టెబిలిటీ లేకుండగనే చందు జన్మించిన కారణముగా శిశువునకు ఈథరిక్ దేహము ఏర్పడలేదు. తల్లి అయిన CV గారి ఈథరిక్ సహకారముతో దేహము జీవించసాగెను. 3.1.1921 సా. గం 9:10 నాటి మాస్టర్ గారి నోట్స్ ప్రకారము.

జూన్ 1909 లో CV గారి భౌతిక దేహముపై, మగత (గిడ్డినెస్) కు సంబంధించిన ప్రయోగమును మాస్టర్ గారి ప్రారంభించినారు. మే 1910 నాటికి ఈ ప్రయోగము సఫలమాయెను. 

5.1.1921 నాటి మాస్టర్ గారి నోట్స్ ప్రకారము


మే 1910

ఈథరిక్ మరియు స్టెబిలిటీ దేహములలో లేకుండగానే, CV గారి మరియు చందుల భౌతికములను నిలుపుటను పరీక్షించుటకు మాస్టర్ గారు మరియొక ప్రయోగమును CV గారి పై ప్రారంభించినారు. తత్సమయములో K యొక్క వత్తిడి ఈథరిక్ వలె పనిచేయవలెనని ప్రయోగము.

CV గారి ఈథరిక్, స్టెబిలిటీ దేహమును నుండి విడివడి భౌతికమును వెలుపల నుండి గమనించుచుండెను

15 రోజుల అనంతరము, చందు దేహమునకు మొదటిసారి మూర్చ వచ్చెను. దేహము కృశింప ప్రారంభమాయెను. కారణము శోధించి, ప్రాణ శక్తి లోపమును కారణముగా గుర్తించినారు.

మాస్టర్ గారి నిర్దేశానుసారము, SS మరియు CV గార్ల ఆధ్యాత్మిక దేహములు అనంత ప్రాణ శక్తి మూలమును శోధింపసాగెను.

5.1.1921 నాటి మాస్టర్ గారి నోట్స్ ప్రకారము


27 మే 1910

M, T మరియు A డివిజన్ లను SS చేరి, మరింత ఉన్నత స్థితిలో అనంత ప్రాణ శక్తి మూలముని కనుగొనెను.

ఆ క్షణము నుంచి చందు నకు ట్రీట్మెంట్ నకు కావలసిన సమాచారమును SS వ్రాత రూపకముగా వ్యక్తపరచ సాగెను.

9.1.1921 నాటి మాస్టర్ గారి నోట్స్ ప్రకారము


28 మే 1910

SS, 10 వ డివిజన్ నుంచి అందిన సమాచారమునకు M అని సంతకము చేయసాగెను.

M మరియు M, T,  A ల స్థితి సమాచారముతో SS గారి ఆధ్యాత్మిక దేహములు భౌతికమునకు చేరినవి.

ఆ సమయములో SS తమ ఉద్యోగ విధులలో ఉండిరి.

9 మరియు 10.1.1921 నాటి మాస్టర్ గారి నోట్స్ ప్రకారము.


29 మే 1910

అనంత ప్రాణ శక్తికి సంబంధించిన విషయము, మాస్టర్ గారి స్టెబిలిటీనకు సృష్టిలోని కాస్మిక్ మార్గముతో నిమిత్తము లేకుండా, ఒక స్వతంత్ర మార్గముద్వారా చేరవేయబడెను.

ప్రాణ శక్తి లోపించినదని, సరఫరా జరుగవలెనని ఈథరిక్ చేత ప్రేరేపింపబడిన భావన, నిష్క్రియ స్థితిలో ఉన్న అనంత ప్రాణశక్తి స్థానములో కదలికను ఏర్పరచినది.

రాత్రి 8 గంటల సమయమునకు మాస్టర్ గారి స్టెబిలిటీ, జన్మ రాశి గృహమునందు భూత, వర్తమాన, భవిష్యత్ కాల ప్రమాణములు మరియు సృష్ట్యాది క్రమముల సమాచారముతో నిండి ఉన్న లగ్న గ్రంధులతో, భూమికి నిట్టనిలువుగా ఏర్పడిన మార్గము ద్వారా, సృష్టినందలి కాస్మిక్ మార్గముతో నిమిత్తము లేకుండా, సంపర్కమేర్పరచుకొనెను.

రాత్రి 9:30 – 11:00 మధ్య, మాస్టర్ గారి స్టెబిలిటీ సృష్టిని నందలి పరమాది స్థితి (కట్ ఆఫ్ లెవెల్ ) చేరుట జరిగి, సృష్టి శక్తుల ప్రభావములోని కాస్మిక్ మార్గముతో నిమిత్తము లేకుండా,  డైరెక్ట్ రూట్ ఏర్పడి పరమాది స్థితి లోని శక్తి వారిలో పనిచేయ ఆరంభించెను.

17.1.1921 నాటి మాస్టర్ గారి నోట్స్ ప్రకారము.


తదనంతరము, మానవులకు భౌతిక అమరత్వమునకై మానవ రూపనిర్మాణములోనూ, ఖగోళ నిర్మాణములోనూ చేయు మార్పులకు అవసరమయిన చర్యల తోడ్పాటు కొఱకు మీడియం లను చేర్చుకొని యోగ ప్రక్రియను పూర్తి చేసినారు.


-- శ్రీ ఉమాకాంత్ అక్కిరాజు గారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?