మాస్టర్‌ ఒక్కరే



మాస్టర్‌ ఒక్కరే 


ఈ యోగ మార్గములో సాధకుల  కొరకు, బయటికి చెప్పబడినది ఒకే ఒక మాస్టర్‌. 

వారు ఫిజికల్‌ మాస్టర్‌ సివివి

వేరేవ్వరిని మాస్టర్లుగా పిలవరాదు. 

అలా వేరే ఎవరిని పేర్కొన్నా అది అజ్ఞానముతో కూడిన పారపాటే అవుతుంది. 


మాస్టర్‌ గారు, వారి పేరు మాత్రమే సాధన చేయవలెనని చెప్పినారు. 

నేటి సాధకులు కోర్సులు చేయరాదు. 

కోర్సులు చేసినా చేయమని ప్రోత్సహించినా అది మాస్టర్‌ గారి ఆదేశములకు విరుద్ధముగా  చేసినట్లే. 

మాస్టర్‌ గారు భౌతికముగా ఉన్న సమయములో కూడా మీడియంలు తప్పుదారి పట్టినారు. 

కొంత మందిని బహిష్కరించినారు. 

మానవుని మనో స్వేచ్చను ఎవ్వరూ నియంత్రించలేరు. 

ఎవరికీ వారే తమ గతిని సరిచేసుకోవలెను. 

మాస్టర్‌ గారి యోగ ప్రక్రియ ద్వారా సృష్టిలో జరుగు మార్పులు 'ఆరిజిన్‌' యొక్క అభీష్టముగా జరుగుచున్నవని వ్రాసినారు. 


మాస్టర్‌ గారి సాహిత్యం పూర్తిగా భద్రపరచలేదు. 

లభ్యమయిన వాటిలో కొంతమేర సాంకేతిక వర్ణనలుగా చెప్పబడినవి. 

కొన్ని రహస్యముగా ఉంచబడినవి. 

అందుబాటులో ఉన్న వాటితో, మాస్టర్‌ ఎర్పరచిన నిర్మాణమును లేశమాత్రముగానైనా అర్ధము చేసుకొనే ప్రయత్నం అందరమూ చేయాలి. 

భౌతిక స్పృహకు తెలిసి కొందరు, తెలియక కొందరు మాస్టర్‌ గారి ఈ మహా నిర్మాణములో భాగస్వామ్యులయినారు. 

యోగ ప్రక్రియ పూర్తి అయినదని మాస్టర్‌ వ్రాసినారు. 

అది ప్రదర్శితమగు సమయము కొరకు వేచి ఉండవలెనని చెప్పినారు. 

మానవ రూపములు, ఖగోళ రూపములు ఈ క్రమములో మార్పు చెందును. 

మనము చేయు యోగ సాధన వలన అట్టి మార్పులకు మనల్ని మనము తీర్చిదిద్దుకోను ప్రయత్నముగా బావించవలెను.


మాస్టర్‌ వ్రాసి ఉంచిన సాహిత్యమే ప్రామాణికము. 

మాస్టర్‌ వ్రాయని పద్ధతులకు ప్రామాణికత లేదు. 

ఉపయోగమూ లేదు. 

మాస్టర్‌ గారు వ్రాసిన వివిధ మాస్టర్‌ కాన్సెప్ట్స్‌ బుద్దికి అందేవి కావు. 

అనుభవముతో నేడు అన్ని తెలిసికొనలేరు. 


ఉన్నత స్థాయిలలో ఈ యోగమార్గ నిర్దేశనము వివిధ మాస్టర్‌ రూపములచే చేయబడినది. 

అన్ని మాస్టర్‌ రూపములకు భౌతికరూప గుర్తింపు చూపబడలేదు. 6.12.1917 నుంచి 9.12.1917 వరకు, మాస్టర్‌ CVV గారి డైరీలో, ట్రాన్స్‌ మీడియం వెంకమ్మ గారి ఈథరిక్‌, ట్రాన్స్‌ స్థితిలోనికి వెళ్ళినపుడు జరిగిన విషయములకు ఇచ్చిన వివరణలో ఈ వివిధ మాస్టర్‌ రూపముల ప్రస్తావన చూడవచ్చు. 


వివిధ ట్రాన్స్‌ స్థాయిలలో జరిగిన విషయముల సారాంశము ఇలా ఉన్నది. 


1వ స్థాయి - భూమి యొక్క మహా పర నిర్వాణ స్టితిలో సచేతన మాస్టర్‌ రూపము ఆవిష్కరింపబడవలెను. కానీ, శ్రీమతి వెంకమ్మ గారి భౌతిక స్థితిలో కొరవడిన నిశ్చయత వలన, మాస్టర్‌ యొక్క సచేతన రూపము వెంకమ్మ గారి ఈధథరిక్‌ నకు ఆవిష్కరింపబడలేదు. 


2వ స్థాయి - ఒక పీఠము పై సాధారణ కుర్చీ లో కూర్చున్న సచేతన మాస్టర్‌ రూపము ఆవిష్కరింపబడినది. 

ఆ మాస్టర్‌, వెంకమ్మ గారితో సంభాషించుచున్న సమయములో, కాంతివంతమైన బంగారు ఛాయలోనున్న ఫిజికల్‌ మాస్టర్‌ రూపము ఆవిష్కరింపబడినది. 

ఆ మాస్టర్‌ రూపము కొన్ని విషయములను వెంకమ్మగారికి, మరికొన్ని విషయములు ఫిజికల్‌ మాస్టర్‌ నకు వివరించెను. 


ఈ రెండవ స్థాయిలో కొంత సమయము గడచిన తరువాత ఆ మాస్టర్‌ రూపము, కొన్ని రహస్య విషయములను తెలిసికొనుటకు, అవి చెప్పగలిగిన మరొక మాస్టర్‌ రూపమును సంప్రదించమని వెంకమ్మ గారికి తెలిపి అదృశ్యమయినది. 

ఆ మరొక రూపమును ‘డైరెక్ట్‌ లైన్‌ మాస్టర్‌” గా చెప్పినారు. 

“డైరెక్ట్‌ లైన్‌ మాస్టర్‌? 

రహస్య విషయములను ప్రశాంతమగు విధానములో వెంకమ్మ గారికి తెలిపెను. 

“డైరెక్ట్‌ లైన్‌ మాస్టర్‌” తెలుపునప్పుడు ఫిజికల్‌ మాస్టర్‌ అచటనే ఉన్న ప్రస్తావన లేదు. 


3వ స్థాయి - ఎంతో విశాలమైన ఫీల్డ్(Field) నందు 

ఒక స్క్రీన్‌ పై వెంకమ్మ గారి ఎథిరిక్(Etheric) ప్రతిబింబించిన పిదప 

మాస్టర్‌ చే నిర్దేశములు ఇవ్వబడినవి.


4వ స్థాయి - ఎంతో ఉన్నతమైన ఈ స్థాయిలో 

నిటారు వ్యవస్థ పైభాగమున 

MTA అక్షరముల మాదిరి రూపము ఆవిష్కరింపబడి అదృశ్యమయినవి. 

ఇక్కడ MTA అనునది మానవ రూపము కాదు.


భౌతిక స్థితిలో కనిపించే  మానవ రూపములలో, మెమరీ, ఎథిరిక్(Etheric) దేహము, స్టెబిలిటీ, కంసైన్స్‌ మొదలగునవి ఉండుట సాధారణము. 


అందరికి కనుపించే మాస్టర్‌ CVV గారి భౌతిక దేహములో వీటిలో కొన్నిలేవు. 

వారి భౌతిక దేహము ఒక ప్రయోగశాల. 


యోగ విధానమును నిర్దిష్టముగా అనుభవపూర్వకముగా ఇతరులు అర్ధము చేసికొనలేరు కావున, సులభముగా ఉండుటకు ఈ మార్గములోని పరంపరను - వన్‌ పాయింట్‌, MTA మరియు ఫిజికల్‌ మాస్టర్‌ CVV, అని తెలిపనట్టున్నారు. 


“మాస్టర్‌” అని పిలువబడేవారి స్థాయి ఎమిటో పై తేదీలలో వారి డైరీ చూస్తే మనందరికీ అర్థమవగలదు. 

ఈనాడు మాస్టర్‌ అనే పదము హాస్యాస్పదమయి పోయినది. 

మీడియంలకు, వారి శిష్యులకు, ఇంకా శిష్యుల శిష్యులకు - చనిపోయిన వారికి, బ్రతికి ఉన్నవారికి - మాస్టర్‌ అని తగిలించుట మాస్టర్‌ CVV గారి యెడల అమర్యాదపూర్వక ప్రవర్తనే. 

--------------

Reference: Master CVV's Yoga - Basic  Information 

Thanks to Umakant Akkiraju Garu and Prabhakar Mitra Mandali for their continuous efforts to reveal the master's true and authentic knowledge.

--------------------------------------------

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?