మానవజాతికి అమరత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి
మానవజాతికి అమరత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి
యోగ సాధనకు భౌతిక శరీరం చాలా అవసరం, ఈ భౌతిక శరీరాన్ని భౌతిక స్పృహలోనే ఉంచి ఆది పరబ్రహ్మని గ్రహించగలగాలి..
ఈ భౌతిక స్థితి సహజంగా అమరత్వం పొందాలి మరియు ఏ కోరిక లేకుండా స్వేచ్ఛతో దేనిపై ఆధారపడి ఉండరాదు(గాలి, నీరు, ఆహరం, మొదలగునవి ). ఈ భౌతిక స్థితి బ్రహ్మానందం అని పిలువబడే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలగాలి. మనిషి లక్ష్యం ఇటువంటి అమరత్వం అయ్యి ఉండాలి.
భౌతిక స్థితి అనగా ఏమిటి?, "భౌతికం" అంటే ఏమిటి?
భౌతిక స్థితి అనగా మన శరీరాన్ని తయారు చేసే ఎముకలు, కండరాలు మొదలైన వాటి మిశ్రమం కాదు. మన కంటికి కనిపించే శరీరం కాస్మోస్(cosmos)ప్రభావితమైనదే కాకా వాటి మూలకాలతో రూపుదిద్దుకోబడినది కావున ఈ శరీరం వాటి సొంతం అగును కానీ మానవుని సొంతం కాజాలదు.
ప్రస్తుత మానవుని అసలైన భౌతిక శరీరము కంటికి కనిపించని పారాభౌతిక శరీరమైన ఎథిరిక్(Etheric) మాతృక(Matrix). ప్రాణిక శక్తుల(Pranic Energies) శరీరం. కంటికి కనిపించే శరీరములోని అణువణువును నియంత్రిస్తూ జీవితాంతము దానిని సక్రమంగా నడిపే ఈ కనిపించని శరీరం అసలైన మానవ భౌతిక శరీరం.
మానవుని భౌతిక శరీరం ఎథిరిక్(Etheric) మాత్రమే, ఇది చక్రాలు(Mooladhara, Swadhisthana, etc) అని పిలువబడే వివిధ శక్తి కేంద్రాలను కలిగి ఉంటుంది, ఈ శక్తి కేంద్రాలు స్థూల భౌతిక పదార్థాన్ని వాటి వివిధ స్థానాలు మరియు విధులను కేటాయించి నియంత్రిస్తాయి.
ఈ ఎథెరిక్ బాడీ మరిన్ని బ్రహ్మాణువుల (మూలప్రకృతి నుండి ఉద్భవించే పరమాణువులు) ఎక్కువ నిక్షేపంతో ఘనీభవించి, ఘనమైన మానవ ఆకృతిలో "దైవాంగంగా" నిలబడాలి.
ఈ విధంగా ఘనీభవించిన క్షణం, ఈథరిక్ వెలుపల కాస్మోస్ మూలకాలతో నిర్మితమైన భౌతిక శరీరం, ఈథరిక్ శరీరం యొక్క శక్తి ద్వారా, అణువులుగా మారి ఈ ఎథిరిక్ శరీరం యందు ఐక్యమవుతుంది.
ఈ ప్రక్రియ మన అంతర్బాగములో ఇతరులు గమనించలేని విధంగా జరిగిపోవును.
కాబట్టి అరువు(Borrowed from cosmos) తెచ్చుకున్న ఈ కండకలిగిన శరీరం దైవాంగంగా మారి ఈ విశ్వం పై ఆధారపడకుండా మన ద్వారా మాత్రమే మరింతగా ఘనీభవించి శాశ్వతమైన భౌతికంగా నిలుస్తుంది.
ఇది నిజమైన అమర భౌతిక శరీరం. ఈ భౌతికం అమరత్వం పొందాలని ఎక్కడ చెప్పబడినా అది మన స్వంత నిర్మితమైన ఘనీభవించిన ఈథరిక్ శరీరం అని అర్థం చేసుకోవాలి, అంతేకాని ప్రస్తుతం మన కంటికి కనిపించే కాస్మోస్ ద్వారా అరువు(Borrowed from cosmos) తీసుకోబడ్డ భౌతిక శరీరానికి కాదు.
పైన పేర్కొన్న కారణాల వల్ల, కండకలిగిన శరీరంలో చక్రాలు(Mooladhara, Swadhisthana, etc) అని పిలువబడే వివిధ శక్తి కేంద్రాలు, మూడు ప్రాథమిక నాడీలు, ఇడా, పింగ్లా మరియు సుషుమ్నా కూడా కనుగొనలేము. అవి ఎథిరిక్ దేహమునకు సంబందించినవి గా అర్థం చేసుకొనవలెను.
For more clarification please refer below article:
https://mastercvvyogam.blogspot.com/2023/06/clarification-over-immortality.html
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి