పిల్లర్ టెస్ట్ - 26-Aug-1917

పిల్లర్ టెస్ట్

మానవ ఆకృతికి పిల్లర్(Pillar: స్తంభం) వంటిది ఆస్ట్రల్ దేహము.

Please refer: Jan 16, 1912 MTA Letter.



తేదీ: 26-ఆగస్టు-1917


సాయంత్రం 6 గంటలకు మాస్టారు గారు మెద్ది పైకి వచ్చారు.


20-ఆగస్టు-1917న తీసిన పిల్లర్ టెస్ట్‌ని ఎస్. నారాయణ అయ్యర్ చదివారు మరియు మాస్టారు గారు ఆంగ్లములోనికి అనువదించారు.


సాధారణ సలహా:


చాల మంది ఏదో వినోదం కొరకు ఈ సొసైటీ యందు చేరినట్లు తెలుస్తుంది, ఎందుకంటే ఈ సొసైటీ యందు చాలామంది సభ్యులు చేరి ఉండడం ఒక కారణము కాగా ఇంతక మునుపే సొసైటీ యందు చేరిన సభ్యుల బంధువులు మరియు స్నేహితులు అదనంగా చేరడం జరిగినది.


ఈ యోగమున మరణము రాదని ప్రకటించుట వలన మరియు ఈ యోగములో నిర్విరామముగా పది సంవత్సరాలు సాధన చేసిన ఈ దేహమునకు శాశ్వతత్వం చేకూరుననే ఉద్దేశముతో ఈ యోగమున చేరుట జరిగినది.


పురాతన పద్ధతుల ద్వారా జీవం యొక్క ఆయు పరిమితిని పొడిగించుట, యోగములోని అన్ని దశలను ధాటి జీవాత్మ యందలి అంతరాత్మను పరమాత్మమంతో నింపుట ద్వారానే సాధ్యమగును. ఇంతవరకు ఇది ఎవరికీ సాధ్యంకాలేదని మనందరికీ తెలుసు.


ఈ యోగ స్కూల్ ఆవరణ యందు అడుగిడి ప్రతిజ్ఞ పత్రమునందు సంతకము చేసినంత మాత్రాన అభివృద్ధి కలుగునని ఆలోచన కలిగి ఉండుట వలన ఉపయోగము ఏమి ఉండదు.


యోగము ద్వారా లభించు అన్ని సిద్ధులను ఈ సొసైటీలోని ప్రతిఒక్కరు వారి వారి భౌతిక దేహముతో పూర్తి ప్రజ్ఞతో  ఆనందించవొచ్చును. 


సాధన చేయనిదే జ్ఞానం పొందనిదే ఏ ఒక్కరు జీవనముక్తుడు కాలేడు.


ఈ యోగము ఏమిటి? ఈ యోగము ద్వారా మనము ఏమి చేయాలనీ ఉద్దేశించ బడింది? ఇప్పుడు మనము ఏమి చేయవలెను? ఈ సొసైటీ యందు చేరిన తరువాత ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనవలెను. మీరు కేవలం మీ కుటుంబ సభ్యులు కొరకే జీవించి ఉన్నట్లు ప్రకటించలేరు, స్వతహాగా మీ గురించి మీరు ఎంతోకొంత ఆలోచించుట సర్వ సాధారణమైన విషయము.


ఈ యోగము ద్వారా మనము ఏమి చేయాలి, మనము ఏమి సాధించగలం అనే విషయాలు నేర్చుకొనవలెను అప్పుడే ప్రతి ఒక్కరు ఆనంద ఉత్సాహముతో సాధన చేయగలరు, ఒక లక్ష్యం లేనిదే ఎవరు ఏమి చేయలేరు.


ఎటువంటి లోపం లేకుండా సాధన చేస్తామని మీరు సంతకం చేసిన ప్రతిజ్ఞ పత్రాలను నేను స్వీకరించాను.


అవిద్యావంతులు చాల నమ్మకంగా సాధన చేయుచున్నారు విద్యావంతులు యందు ఈ నమ్మకం కనిపించడం లేదు. ఇందువలన అవిద్యావంతులు త్వరగా అభివృద్ధి చెందుట జరుగుచున్నది కానీ విద్యావంతులు అభివృద్ధి చెందక వారి అభివృద్ధి బవిషత్తునకు వాయిదా పడుచున్నది.


ఈ రోజు సాయంకాలం వరకు ఎవరు ఈ యోగము యొక్క సిద్ధాంతాలను, ఈ యోగ లక్ష్యాలను నిర్ధారించుకోవడానికి మరియు యోగము యందలి లోపాలను సరిదిద్దు ఉదేశముతో నా వద్దకు రాలేదు.


ఈ సొసైటీ లో చాల మంది ఆరోగ్య సమస్యల మేర, దివ్య దృష్టులు వంటి వినోదాల కొరకు చేరడం జరిగినది. మీరు ఈ సొసైటీ లో చేరిన నాటి నుండి తప్పకుండ 10 సంవత్సరాలు వరకు నిర్విరామముగా సాధన చేస్తామని ఈరోజు మీరందరు ప్రతిజ్ఞ చేయవలెను. మీరు ఈ సొసైటీ ప్రాంగణం లోనికి వొచ్చి రాగానే మరణ రాహిత్యం లేదా జ్ఞానం సాధించలేరు.


మీరందరు గ్రహాల ప్రభావాలను సరిదిద్దుటయే కాక వాటి నుంచి బయట పడ గలిగే అంత గొప్పగా మీరంతా అభివృద్ధి చెందాలి అంతేకాక నిప్పు మొదలగు ఏ ఇతర పరికరాలు వస్తువులు మిమ్మల్ని గాయపరచలేనటువంటి ఉన్నత స్థితికి మీరు ఎదగాలి.


అన్ని రకాల వ్యాధుల నుంచి రోగనిరోధకత పొందినట్లు మనల్ని మనం నిరూపించుకోవడమేకాక పొరపాటున క్రింద పడిపోవడం వంటి ఇతరేతర ప్రమాదాలను మనంతటికి మనము నివారించుకొగలగాలి ఎలా అంటే 4 is 4, and 4 and(plus) 4 is 8 అనే విధంగా.


మీరు గ్రహాల ప్రభావాలను అధిగమించగలిగే స్థాయికి మిమ్మల్ని మీరు వృద్ధిపరుచుకున్నామని, మీ ఉన్నత స్థితిని మీరు అంచనావేసుకొని, మీ ఇంట్లో కూర్చొని ఇష్టానుసారంగా ఎటువంటి ప్రకటనలు చేయరాదు, వ్యాధులు, ఆక్సిడెంట్లు మొదలగునవి ఏమిచేయలేని విధంగా మీ మాస్టర్ గారే ఒక ఆధార పూర్వకంగా నిలబడినట్లు ఇంకా ప్రకటించలేదు కావున మీరు ఈ విషయానికి సంబంధించి ఎటువంటి ప్రకటనలు చేయరాదు.


తప్పుడు భావనలను వదిలి, నిర్దేశించిన సాధనను భక్తితో కొనసాగించ వలెను.

ఉదాహరణకు: ఏవిధంగానైతే ఒక డాక్టర్ నిర్దేశించిన మందు మోతాదులను( 5, 9 and 7 ratios of medicine) తూచాతప్పకుండా మనము పాటిస్తామో అలానే మీకు నిర్దేశించిన సాధనను పాటించవలెను కానీ డాక్టర్ చెప్పిన మోతాదులను నీటిపై రాసి ఆ నీటిని మందు లాగా వాడే విధంగా మీ సాధన ఉండకూడదు.


ఒక ప్రతీకాత్మక మార్గం మీ పురోగతికై నేను ఇచ్చినాను, ఈ ప్రతీకాత్మక మార్గం యొక్క అర్థం తెలుసుకొనే ప్రయత్నం చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనవలెను. మీరు ప్రతి విషయాన్నీ ఆచరణాత్మకంగా తెలుసుకొనే స్థాయికి ఎదిగిన తరువాత మీ అంతటికి మీరు ప్రతి విషయాన్నీ ఆచరణాత్మకంగా తెలుసుకొనవలెను.


మీలో కొందరికి అతీత శక్తులను సిద్దిన్చుకోను సామర్థ్యం ఏర్పడినప్పటికీ, ఈ సిద్ధులను మీరు ఆనందించడానికి అనుమతించకుండా ఇటువంటి సిద్ధులను నేను కావాలనే నిరోధించుచున్నాను.


సాధారణంగా ఇటువంటి సిద్ధులు ఈ  గడిచిన ఏడు సంవత్సరముల కాల వ్యవధిలో సాధించుట కష్టమైన పని. చాల మందికి ఈ సిద్ధులను అడ్డుకోవడం జరిగినది మరికొందరికి అనుమతించినాను.


మీ యోగ అభివృద్ధి తాళం చెవి నా వద్ద వున్నది 

1 . సాధన సమయములో మీరు ఏవేవో అనవసరమైనవి చూడడం జరుగుతుంది. 

2 . మీకు అవసరమైనవి చూడదలచినా మీరు చూడలేరు 

3 . నేను అనుమతించినచో మీరు చూడాలనుకొన్నవి చూడగలరు.


మీ మీద నాకు పూర్తి నమ్మకం ఏర్పడనంత వరకు కావాలనే మిమ్మలిని Trial Period లో ఉంచడం జరిగినది.


మీరు చాల తేలికగా యోగ శక్తులను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కాబట్టి కావాలనే మీకు సంక్రమించవలసి ఉన్న యోగ శక్తులను నిరోధించి మీ యోగ అభివృద్ధిని కొనసాగించుచున్నాను.


గడిచిపోయిన పాత తత్వ సిద్ధాంతాలను నా యోగముతో పోల్చి గందరగోళ స్థితి లో పడకుండా వాటిని సంపూర్ణంగా వదిలివేయడం చాల మంచిది.


గడిచిపోయిన పాత తత్వ సిద్ధాంతాలు మన పూర్వికులు అపస్మారక స్థితి యందు తెలుసుకోవడం జరిగినది, కానీ నా యోగమునందు ప్రతి సిద్ధాంతం మీరు మీ భౌతిక దేహముతో పూర్తి ప్రజ్ఞతో చూడగలరు.


మన పూర్వికులు మానవ భౌతిక దేహము పనికిరానిదని ఇది ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగించునని త్వరగా క్షిణింప బడునని దురభిప్రాయం కలిగి ఉన్నారు. కానీ నేను ఈ భౌతిక దేహాన్ని క్షిణించని విధంగా ఎల్లవేళలా జ్ఞానాన్ని ప్రసాదించునంతటి ఉన్నత స్థితికి అభివృద్ధి చేయ దలచినాను. పూర్వీకుల పద్ధతులందు జ్ఞాన సముపార్జన పధ్ధతి అంతర్ముఖం కాగా నా యోగములో జ్ఞాన సముపార్జన బహిర్ముఖం పద్ధతిన జరుగును. తత్వ సిద్ధాంత జ్ఞానం లేనివారు పైన చెప్పిన విషయాన్నీ పరిగణలో తీసుకొనవసరం లేదు తత్వ సిద్ధాంత జ్ఞానం ఉన్నవారు ఈ విషయాన్నీ అర్థం చేసుకొనగలరు. 


మాస్టర్ గారు Mr. K.S.K గారి లెటర్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడినారు.

చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి వారు వారి సందేహాలను వారి మెదడులోని నిక్షిప్తం చేసుకొని ఉన్నారు. కొందరు వారి వారి సందేహాలను బహిర్గతం చేసినారు అటువంటి ఒక విషయాన్నీ మీకు నేను చదివి వినిపిస్తాను.


ఉదాహరణకు దశరథ మహారాజు ఎటువంటి యోగ ప్రక్రియ ద్వారా 60,000 సంవత్సరాలు జీవించినారు, ఈ విషయములో మనము తాను ఏ కాలమానమున జీవించి ఉన్నారు మరియు ఆ కాలమానమున సాధారణ జనాల ఆయువు పరిమితి ఏమిటి అని ఆలోచించ వలెను. మనము ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆయువు పరిమితిని 100 సంవత్సరాలను మించి కొనసాగించడం సాధ్యం కానీ పని అని వేదాల ద్వారా ప్రకటించబడింది. (గమనిక: సమిష్టి మానవాళికి సంబంధించి అర్థం చేసుకొనవలెను, ఏదో ఒకరిద్దరు ఆ పరమాత్మా అభీష్టానికి వ్యతిరేకముగా ఉన్నత సిద్ధులు సాధించి వారి వారి ఆయు పరిమితిని పెంచుకున్న వారి గురించి కాదు.)


ఇదివరకే ఈ విషయం పై, నేను నా వివరణలు ఇచ్చి వున్నాను, ఎంత ఎదుగుదల ఉన్న ఆత్మ అయినా భౌతిక దేహము జీవించి ఉన్నంతవరకే, ఈ భౌతిక దేహము మరణించినచో గత జన్మల స్మృతుల లింకును కోల్పోవును. ఎవరికీ వారు, వారి ప్రస్తుత జన్మ యందు మరల మొదటి నుంచి జ్ఞాన సముపార్జన చేసికొనక తప్పదు.


ఉదాహరణకు ఒక వ్యక్తి 32 సంవత్సరాల వయసులో సాధన కొనసాగిస్తూ చనిపోయినచో, తన తరువాత జన్మ యందు సాధన మరల మొధటి నుంచి కొనసాగించ వలసిందే కానీ తన గత జన్మ సాధనలో వృద్ధి చెందిన స్థాయి నుంచి, ఈ జన్మ సాధన క్రమములో మరింత ఉన్నత స్థాయికి ఎదగడం వీలుకాదు.


జ్ఞాన పరంగా కొందరు అభివృద్ధి చెంది ఉన్నప్పటికీ, వారి దేహ ఆకృతి యందు సంపూర్ణత(నాడి వ్యవస్థ సంబంధిత), వారు వారి మాతృ గర్భము యందు ఉన్నపుడు ఏర్పడనిచో ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఒకవేళ ఒక మనిషి ఒక సెట్టు(One Set) గాంగ్లియా తన ఇదా నాడి(Ida Nadi) యందు ఏర్పడిన తరువాత మరణించినచో, తన తరువాత జన్మ యందు ఖగోళ కార్యాచరణల వల్ల కర్మ యొక్క అధినేతలు, అభివృద్ధి చెందిన గాంగ్లియాను మరు జన్మలో ఇయ్యచ్చు ఇయ్యకపోవచ్చును. 


నా ఈ ప్రేయర్ కాంట్రాక్టు ద్వారా నేను తెలియ చేసినదేమనగా, పది సంవత్సరములు నిర్విరామముగా సాధన చేసినచో, వారి భౌతిక దేహము, వారి వారి భౌతిక ప్రజ్ఞకు తెలియు విధంగా, ఈ జన్మలోనే వృద్ధి చెందును. 10 సంవత్సరాల సాధన కాల వ్యవధి పూర్తికాకుండానే ఎవరవుతే కోల్పోతారో వారికీ నా ప్రేయర్ కాంట్రాక్టు వర్తించదు. మీ ఎవరికీ పూర్తిగా ఏర్పడిన గాంగ్లియా గల సుషుమ్న ఇంకను ఏర్పడలేదు, T and T.S. నియంత్రణ ద్వారా ఏర్పడి ఉండవలసిన వెన్నుపూస పూర్తి భాగములు సంపూర్ణతను ఏర్పరుచుకొనలేదు.


ప్రస్తుతం అభివృద్ధి చెంది ఉన్న వెన్నుపూసను బోర్(Bore) చేసి సుషుమ్న ఏర్పాటు చేయు  నిర్మాణ ప్రక్రియ జరుగుచున్నది. ఈ ప్రక్రియను తట్టుకొని స్థిరత్వంతో నిలబడుటకు మీ భౌతిక దేహమునకు 10 సంవత్సరముల కాల వ్యవధి కావలెను. ఇంకను మీ భౌతిక దేహము మరియు ఆస్ట్రల్ దేహము మధ్య ఏర్పడి ఉన్న 12 డివిషన్ల(12 Divisions) మధ్య నిర్మితం అవవలసిన ఫిట్టింగ్స్ ఇంకను చాలా వరకు నిర్మించబడలేదు ఇదేవిధంగా ఆస్ట్రల్ దేహము మరియు మెంటల్ దేహము మధ్య ఏర్పడవలసి ఉన్నదీ.


థియొసాఫికల్ సొసైటీ వారు చెప్పిన విధంగా 7 డివిషన్లు కాదు 12 డివిషన్లు ఏర్పడవలసి ఉంటుంది. నా భౌతిక దేహమున ఏర్పడుచున్న అభివృద్ధి అనుభవాల అనుసారం నా రికార్డులు రాసుకోవడం జరిగినది మీరు యోగము ప్రాక్టీస్ చేయడానికే టైం కేటాయించలేని పరిస్థితులలో ఉన్నప్పుడు నా రికార్డులను పరిశీలించేందుకు టైం కేటాయించడం చాలా కష్టమని భావించుచున్నాను.


50 మంది దగ్గు జ్వరమును కేవలం ఒక రకమైన మందుతో ఎలాగైతే సంపూర్ణంగా తగ్గించలేమో ఏ ఇరువురి శరీరాకృతి ఒకేవిధంగా ఉండదు కనుక మోక్షమును ఏకకాలంలో ఏ ఇరువురు సాధించలేరు. 


నేను అన్ని వ్యాధులను తగ్గిస్తానని వాగ్దానం చేయలేదు. గ్రహాల ప్రభావం కేవలం భౌతిక దేహమునకు కాదు ఎథిరిక్, ఆస్ట్రల్ మరియు మెంటల్ రూప దేహములపై కూడా ఉండును. మనందరికీ మెంటల్ రూప పై మంచి అవగాహన ఉందని భావిస్తున్నాను. 


ఈ యోగ లక్ష్యం ఈ సొసైటీ యందు సాదించలేనిచో కేవలం అది నా ఆజ్ఞఅధికారాల వల్లనే అంతేకాకుండా ఈ యోగమునకు పది సంవత్సరాలు అవసరము అని నిర్ణయించే ఆజ్ఞఅధికారాలు కేవలము నాకు మాత్రమే కలదు.


ఈ యోగములో జరిపిన అనేక రకములైన పరీక్షలు మీ మాస్టర్ అభివృద్ధి కొరకే కానీ మీ లోని ఏ ఒకరి కోసం కాదు. కొన్ని నిర్దిష్ట కారణాల వల్ల దివ్య దృష్టిని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగినది మీరు అభివృద్ధి సాధించిన తరువాత దివ్యదృష్టిని తిరిగి ఇవ్వడం జరుగుతుంది.


కాపీ చేయబడిన తేదీ: 11 - Dec - 1933.


--------------------------------------------


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?