ఈ వ్యాసం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తత్వజ్ఞానం మరియు వ్యాధి గ్రస్తుల చికిత్సా యోగ విధానమును వెల్లడిస్తుంది.

ఈ వ్యాసం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తత్వజ్ఞానం మరియు వ్యాధి గ్రస్తుల చికిత్సా యోగ విధానమును వెల్లడిస్తుంది. CENTRE EVERY WHERE CIRCUMFERENCE NO WHERE "ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ | మా గృథ కస్య స్విద్ధనమ్ |" తేన త్యక్తేన భుంజీధాః “నామరూపాత్మకమైన ఈజగత్తు అంతా ఈశ్వరుని చేత ఆవరింపబడి ఉంది. ఈ జగత్తుగా మనం దర్శించే ఐశ్వర్య మంతా ఆయనదే కాని వేరు కాదు.” అని పెద్దలు చెపు తున్నారు. ఈ అనుభూతి అందరకూ అన్ని భూమికలలోను అందేది కాదు. అట్లని ఎవరికీ అందనిది కాదు. ఆ అందని వారు ఈ సృష్టిలో ఆ ఈశ్వరుని (పరమాత్మా) ఐశ్వర్యం కోసం వెదుకుతున్నారు. కాని మాకు ఆయన కనిపించుట లేదు. 'ఈశ్వ రుడు ఎచ్చట ఉన్నాడు? ఆయనను తెలుసుకునే మార్గ మేది? ఆయనను అందుకునే సోపానక్రమం(Hierarchy) ఎట్టిది?' అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నించే వారందరూ భక్తులు, ఆస్తికులు. ఇక నాస్తికులుకూడ కొద్ది సంస్కార భేదం ఈ ప్రశ్ననే వేస్తూ ఉంటారు. వారి ప్రశ్నలు ఇలా ఉంటాయి. 'దేవుడు లేడు. ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఏదీ కనిపించడేమి? నీకు కనిపిస్తే నాకు చూపించగలవా?' ...