వివాదాస్పద ప్రార్థనలు మరియు ఇతర ఆచార వ్యవహారాలకు సంబందించిన వివరణ

వివాదాస్పద ప్రార్థనలు మరియు ఇతర ఆచార వ్యవహారాలకు సంబందించిన వివరణ

Note: శ్రీ A.V. శ్రీనివాసాచార్యులు వారు, గౌరవనీయులైన మాస్టర్ గారి సాహిత్యం ఆధారముగా తెలియపరిచిన విషయాలు.


గౌరవనీయులైన మాస్టర్ గారు ప్రార్థన గది గురించి ఇచ్చిన స్పష్టీకరణ,


"ఆచరణ మరియు మౌన ప్రార్థన కోసం అందరూ కలిసే పవిత్రమైన సమావేశ స్థలంగా గదిని ఉపయోగించాలి.  భజనలు లేదా ఆచార పరమైన ప్రార్థనలు, పూజలు చేయరాదు.  మనది సత్య యోగ మార్గం అని మీరు తెలుసుకోవాలి."


Note: పైన తెలియపరిచిన వివరణ, మాస్టర్ గారు , విశాఖపట్నం వాస్తవ్యులు అయిన మీడియం నెం. 627 శ్రీ కె. సత్యనారాయణ మూర్తి గారికి  పంపిన పోస్టల్ లెటర్ నుండి సంగ్రహించబడింది.


ఓంకారం (OM)


ONE POINT సూచనల ప్రకారం,  మాస్టర్ గారి యోగంలో, ప్రార్థన ప్రారంభానికి ముందు, “ఓం” ఉచ్చారణ చేయరాదు.  (తేదీ 25.11.1912 చూడండి).


ప్రాణాయామం


ONE POINT సూచనల ప్రకారం, భృక్త రహిత తారక రాజయోగ (సత్యయోగం) సాధకులు "ప్రాణాయామం" అభ్యాసము చేయరాదు (తేదీ 2.3.1919 చూడండి)


ఆచార విధి ప్రకారమైన ప్రార్థన గురించి


భృక్త రహిత తారక రాజ యోగ సాధకులకు ఆచార విధి ప్రకారమైన ప్రార్ధన నిషేధించబడింది. ఆచార విధి ప్రకారమైన ప్రార్ధన అంటే ప్రారంభంలో దీపం వెలిగించడం, హారతి ఇవ్వడం, మాస్టర్ గారిని 108 లేదా 1008 సార్లు స్తుతిస్తూ అర్చన చేయడం, భజనలు చేయడం, మాస్టర్ గారి‌పై పాటలు పాడడం; మాస్టర్ గారి ముఖంపై కుంకుమను ఉంచడం. ఇవన్నీ ఆచార విధి ప్రకారమైన ప్రార్థనలు క్రిందకు వస్తాయి. భృక్త రహిత తారక రాజ యోగ సాధకులు ఇటువంటి ప్రార్థన విధానాలను పాటించరాదు.


ఒలిడియర్ ప్రార్థన ((Olidere Prayer)


23.03.1921, 7 p.m. ONE POINTక్రింది విధంగా సలహాను అందించడం జరిగినది.


"ఒలిడియర్ సూత్రాల(Olidere Principles)  గురించి మాస్టర్ గారు కొంత వివరణ ఇచ్చారు".


10.04.1921 న, జెనరల్ కాల్(General Call) 2వ రోజు ఉదయం 6.45 గంటలకు "ఒలిడియర్ పేరు (Olidere Name)  సాధన కొరకై మీడియమ్స్(Mediums) కు ఇయ్యడం జరిగినది".


పని మంచి పురోగతిని చూపుతుంది. ఒలిడియర్(Olidere) నియంత్రణ మెమోకు(Memo) చేరుకుంది, అని మాస్టర్ గారికి తెలియచేయడం జరిగినది.  14.07.1921 న, 6.45 p.m.

05.01.1922 న, 9 p.m. కు ONE POINT ఈ క్రింది విధంగా ఆదేశాలు ఇచ్చెను "Town Mediums రేపు ఉదయం 6 గంటలు నుండి ఒలిడియర్ 3వ పేరును(Olidere 3rd name)ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాలని మరియు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రాక్టీస్ కొనసాగించమని తెలియపరిచేను".



మెరిడియన్ ప్రార్థన (Meridian Prayer)


26.11.1919న ONE POINT మాస్టర్‌ గారికి  మెరిడియన్ ప్రార్థన ఇయ్యడం జరిగినది.

ఈ ప్రార్థన 1వ గ్రూప్ 04 మీడియంల ద్వారా కేవలం 30 రోజులు మాత్రమే చేయాలి. అయితే ఆ సమయంలో 1వ గ్రూపునకు చెందిన మిగిలిన ముగ్గురు సభ్యులు కూడా హాజరు కావాలి. వారు మాస్టర్ C.V.V పేరుని మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. 

మెరిడియన్ ప్రేయర్ చేసిన నాలుగు మీడియంల పేర్లు - శ్రీ మాస్టర్ సి.వి.వి., వి. రామచంద్ర అయ్యర్, టి. హబిలయ్య మరియు రాజారావు గారు.



ఈక్వినాక్స్ ప్రార్థన (EQUINOX PRAYER)


ఇప్పటి రోజుల్లో కోర్సు పేర్లు(Courses), ఎడ్జస్ట్మెంట్స్(Adjustments) మొదలగునవి మనుగడ సాగిస్తున్నాయి. అదే పద్ధతిలో ఈక్వినాక్స్ ప్రార్థన(Equinox Prayer) కూడా ఉనికిలోకి వచ్చింది. 


గౌరవనీయులైన మాస్టర్ గారు 1910 నుండి 1922 వరకు డైరీలు మరియు నోట్స్ మరియు ఇతర సమాచారాన్ని రాశారు. ఈక్వినాక్స్ ప్రార్థన(Equinox Prayer) మాస్టర్ గారి సాహిత్యంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు.


కుంభకోణంలో, మా గురుతుల్యులు శ్రీ N. R. B. వెంకటాచలం గారు మీడియం నెం.650, ఈ ప్రార్థనను ప్రపంచానికి పరిచయం చేయడం జెరిగినది. అనంతరం యోగ మిత్రుడు శ్రీ T. S. రామానుజం దేశంలోని యోగా సాధకులకు ఈక్వినాక్స్ ప్రార్థన(Equinox Prayer)ను కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. ఈ విధంగా ఈ ప్రార్థన వ్యాప్తి చెందింది.


కోడూరు రైల్వే సమీపంలోని బుడుగుంటపల్లెకు చెందిన మన యోగ మిత్రుల్లో ఒకరైన విధ్వాన్ లలిత కళానిధి శ్రీ మైనంపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు, హైదరాబాద్ లో ఉన్న శ్రీ ప్రభాకర పరిశోధక మండలి వారు ప్రచురించే మణి మంజరి (యోగ ప్రభ సం. 12 పేజీ 45 నుండి 56)కి, "గురుదేవులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు - యోగము - ప్రభోదము” అన్న శీర్షికలో ఒక వ్యాసం రాశారు. 


అది వాస్తవాలు, తెలుసుకోకుండా రాసినారు. పైన చెప్పబడిన పత్రిక సంపాదకులు కథనాన్ని ప్రచురించారు. ఇది విడిగా చర్చించాలి.


మా గురుదేవులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ఈక్వినాక్స్(Equinox) గురించి ఎప్పుడూ చెప్పలేదు. కుంభకోణంలో గౌరవనీయులైన మాస్టార్ గారిని చూసినప్పుడు, మాస్టార్ గారు అతనితో ఇలా అన్నారు "కుంభకోణంలో సమావేశం అయ్యేందుకు 2 ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఒకటి “మే నెలలో ఆఖరి వారం” మరియు మరొకటి “డిసెంబర్ నెలలో ఆఖరి వారం”. 


ఈక్వినాక్స్(Equinox)కు ఏదైనా ప్రాముఖ్యత ఉండి ఉంటే, గౌరవనీయులైన మాస్టర్ గారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి చెప్పి ఉండేవారు. శాస్త్రిగారు ప్రజ్ఞా ప్రభాకరంలో వ్రాసి ఉండేవారు.


మాస్టర్ గారు ఈక్వినాక్స్ ప్రార్థన(Equinox Prayer)ను ఎప్పుడూ ప్రార్థించలేదు మరియు ఈక్వినాక్స్ ప్రార్థన(Equinox Prayer)ను మీడియం(Medium)లలో ఎవరికీ ఇవ్వలేదు.


మాస్టర్ గారు ఆచరించనివి లేదా ఎవరికీ ఇయ్యనటువంటివి, శ్రీ ప్రభాకర శాస్త్రిగారు ఆచరించలేదు, మరియు మాస్టర్ గారి నియమాలు మరియు నిబంధనలను ఎన్నడూ ఉల్లంగించలేదు. శ్రీ M. V. సుబ్రమణ్యం గారి మాటల యందు పొరపాటు జరిగినట్లు నేను భావిస్తున్నాను.


-------------------------
-------------------------

Clarification over Controversial Prayers and other Ritual Practices - Sri A.V. Srinivasacharyulu. (Original Version)


Master’s Statement


“….....To use the room as the sacred place of meeting where all meet for practice and silent prayer……….. No bhajan or any ritualistic prayer or worship should be done. You must know that ours is the line of true knowledge.


Above statement is an extract from postal communication between Master and Sri K. Satyanarayana Murthy of Visakhapatnam Medium No. 627


ABOUT "OM"


Some of the unknowing and undeserving persons pronouncing "OM" before the commencement of the prayer. It is against the wishes of the One Point. (See dated 25.11.1912)


ABOUT PRANAYAMA


The "Pranayamam" also prohibited to Brikta Rahita Taraka Raja Yoga sadhakas by the One Point (see dated 2.3.1919). Unknowingly in some places they are doing the pranayamam deviating the One Point rules.


ABOUT RITUALISTIC PRAYER


The ritualistic prayer is prohibited for Briktha Rahitha Taraka Raja Yoga sadhakas. Ritualistic prayer means lighting in the beginning, giving harathy, doing archana with praising the Master 108 or 1008, doing bhajans, singing songs on Master; placing kumkum in his face. These are come under Ritualistic prayer. We are doing the above are doing injustice to the Briktha Rahitha Taraka Raja Yoga and they are getting sin on account of doing this.




ABOUT OLIDERE PRAYER


On 23.03.1921, 7 p.m. Origin gave through advice as follows. "Some explanation was given by the Master about the Olidere principles".


On 10.04.1921, general call 2nd day at 6.45 p.m. "the Olidere name distributed to the mediums for practice".


On 14.07.1921, 6.45 p.m. advised to self i.e. Master C.V.V. "The working shows the good progress. The Olidere regulation has reached the memo".


On 05.01.1922, 9 p.m. One Point gave advice as follows “To town mediums to begin practice from tomorrow 6 a.m. Olidere 3rd name and to continue until further orders".


ABOUT MERIDIAN PRAYER


The meridian prayer given by One Point to Master on 26.11.1919. It is to be done only 30 days by 1st group 4 mediums only. But not other 3 members of 1st group. However other 3 members also should present at that time. They should practice with Master C.V.V. The four persons are Sri Master C.V.V., V. Ramachandra Iyer, T. Habilaiah and Raja Rao.


ABOUT EQUINOX PRAYER


Now-a-days it became a fashion to repeat the course names, adjustments pronunciation. In the same manner the Equinox prayer also came into existence. The Master C.V.V. wrote Diaries and Notes and other informations from 1910-1922. The Equinox Prayer has not been mentioned anywhere in the literature of Master C.V.V.


In Kumbhakonam, our Gurudev Sri N. R. B. Venkatachalam garu Medium No.650, it seems he has been introduced this prayer. Afterwards the Yoga Friend Sri T. S. Ramanujam has propogated the Equinox prayer through pamphlets to Yoga sadhakas in the country. This is spread like cholera, plague in the country. It become uncontrollable disease.


One of our Yoga Friend Vidwan Lalitha Kalanidhi Sri Mainampati Venkata Subramanyam of Budugunta- -palle near Railway Kodur wrote an article to Mani Manjari (Yoga prabha Vol.12 page 45 to 56) a journal published by Sri Prabhakara Parisodhaka Mandali, Hyderabad in the heading "Gurudevulu Sri Veturi Prabhakara Sastri garu - Yogamu - Probhodamu).


It contains full of mistakes imaginary what he think with his poor knowledge, he wrote that without knowing the facts and figures. The editors of the above journal published the article. It is to be discussed separately.


My Gurudev Sri Sastriji never said about Equinox. When he saw the Master at Kumbakonan Master said him "there are 2 important days for gathering at Kumbakonam. One is in the month of May last week and another one is in the month of December last week". (see Pragnya Prabhakaram Telugu published by Prabhakara Mitra Mandali, Tirupati page No.113). 


If Equinox has got any importance. He might have told to Sastriji. Sastriji might have written in the Pragnya Prabhakaramu.


Master never prayed Equinox prayer never gave the Equinox prayer to any one of the mediums.


When Master neither practiced nor given to anyone, in such a case I think and as far as my knowledge goes Sri Prabhakara Sastriji never said deviating Masters rules and regulations, the above words of Sri M. V. Subramanyam. If we are going to accept it as an argument sake, Sastriji may do it or his father or grandfather may do it, it is not correct.


--------------------------------
--------------------------------

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?