మనిషి భూమి పై అవతరించు ప్రక్రియ మరియు లక్ష్యం



మనిషి భూమి పై అవతరించు ప్రక్రియ మరియు లక్ష్యం


మానవుని భౌతిక శరీరం అనగా మన కంటికి కనిపించే శరీరం కాదు ఇది కేవలం మానవుని ఎథిరిక్ శరీరముని అంటిపెట్టుకొని ఉన్న ఒక పొర మాత్రమే.

ఈ విషయం గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి క్రింది కథనాన్ని చూడండి:
https://mastercvvyogam.blogspot.com/2023/05/blog-post.html

అసలు ప్రణాళిక ప్రకారం 4వ ఫీల్డ్ కుండలిని పరిణామం సంపూర్ణంగా పూర్తి ఐన తరువాతనే మానవ ఆకృతి సంపూర్ణతను సంతరించు కొనవలసివుంది 

4వ ఫీల్డ్ కుండలిని పరిణామం గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి క్రింది కథనాన్ని చూడండి:
https://mastercvvyogam.blogspot.com/2023/05/blog-post_19.html

కానీ 4వ ఫీల్డ్ పరిణామం సంపూర్ణంగా పూర్తి అవడం చాల కాలవ్యవధితో కూడుకొన్న పని కావున ఆది పరబ్రహ్మ ఆదేశాల మేర Master C.V.V. మానవ ఆకృతి పరిణామక్రియను వేగవంతం చేయడానికై భూమి పై అవతరించెను. ఈ ప్రక్రియలో భాగంగానే మానవాళికి మాస్టర్ గారు భృక్త రహిత తారక రాజా యోగాన్ని అందించడం జరిగినది.

ఈ యోగమును భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలను పాటిస్తూ కనీసం 35 సంవత్సరములు సాధన చేసినచో మన మానవ ఆకృతి పరిపూర్ణత సంతరించుకోవడం జరుగుతుంది - Sri S. Narayana Aiyer Garu.


Man-Form Pituitary (విరాట్) నుండి మానవ రూప చిత్రం యొక్క ప్రణాళికను పొందిన తర్వాత; కుండలిని తన తదుపరి ప్రయాణంలో Pure Memory(stability encapsulated with pure memory) రూపంలో తన తదుపరి ప్రయాణం కొనసాగిస్తోంది. ఈ పూర్ మెమరీ రాశి గృహములకు చేరుకుంటుంది.

12 రాశిచక్ర గృహాల గురించి మనందరికీ తెలుసు.

ప్రస్తుత మానవ ఆకృతి ఈ రాశిచక్ర గృహాల లక్షణాలకు ఎందుకు లోబడి ఉంటుంది?




మాస్టర్ నోట్సులు నుంచి సేకరించిన సమాచారం:

మాస్టర్ తన నోట్స్‌లో మార్చి 1, 1920 న ఈ క్రింది విధంగా నమోదు చేసినారు:

“To each zodiac house at the rate of 360 births. Of 100 each, 10 houses works only are shown in the womb. 11th house in outer working and the 12th to end as gaseous for next birth.”

ప్రస్తుత మానవ ఆకృతి రాశీ చక్రం యందలి ప్రతి రాశీ గృహమున(Zodiac House) తప్పనిసరిగా 360 జన్మలకు లోనవుతుంది. 360 జన్మలలో 100 జన్మలు మాత్రమే భౌతిక దేహమును ఏర్పర్చుకొనుట జరుగును. 200 జన్మలు ఆస్ట్రల్ మరియు మెంటల్ ప్లేన్ యందు తీసుకొనుట జరుగును కానీ మెంటల్ ప్లేన్ ధాటి ఉన్నత ప్లేన్ ల యందు జన్మ తీసుకొనుట జరగదు.

ప్రతి జన్మలో బ్రీతింగ్ ప్రిన్సిపల్స్(Breathing Principles) అనే గుణాత్మక అంశాలు కూడా ఉంటాయి. వీటి సంఖ్య 60. అదనంగా, నాలుగు రాశిచక్ర గృహాలకు చెందిన 4 అంశాలు కూడా బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ లో భాగంగా ఉన్నాయి. ఈ 64 బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ గర్భంలో నిర్మించబడే మానవ రూపానికి సంబంధించిన డిజైన్(Design) అంశాలను అందిస్తాయి.

ఈ అంశాలలో కనీసం కొన్నింటి సమాచారం తెలుసుకోవడానికి మాస్టర్ గారి యొక్క అసలైన సాహిత్యాన్ని కలిగి ఉండటం మన అందరి అదృష్టం.

మాస్టర్ గారి సాహిత్యం అనుసారం 11 వ రాశీ గృహం(Zodiac House) భౌతిక జన్మలకు మద్దతు నివ్వదు

12 వ రాశీ గృహం తదుపరి జన్మ గురించి సమాచారాన్ని ఇస్తుంది కానీ భౌతిక జన్మలకు మద్దతు నివ్వదు.

కాబట్టి, ఒక జన్మ చక్రంలో(Birth Cycle), Pure Memory 10 రాశీ గృహాలలో వివిధ జన్మలు వివిధ ప్లేన్స్ యందు తీసుకొనుట జరుగును

ఒక జన్మ చక్రం(Birth Cycle) పూర్తయిన తర్వాత, తదుపరి చక్రం మళ్లీ మొదటి లగ్నం (శిశువు జన్మ తీసుకొన్న రాశీ గృహం) నుండి ప్రారంభమవుతుంది.

రాశిచక్ర గృహాలకు మాస్టర్ గారు వివిధ పేర్లను తన సాహిత్యం యందు ఉపయోగించినారు.

ఈ విషయం గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి క్రింది వీడియో చూడండి:
https://youtu.be/Yxw4MaQH7og


ఈ విధంగా Pure Memory రాశీ చక్రము యందు ప్రవేశించి రాశీ చక్రము యొక్క రాశీ గృహములలో అనేక భౌతిక జన్మలు తీసుకొనుటకై Pure Memory ఇంటెలిజెంట్ మెమొరీగా పరివర్తన చెందును.

ఈ విధంగా ఇంటెలిజెంట్ మెమరీతో కూడుకొని ఉన్న స్టెబిలిటీ చివరగా భౌతిక ప్రపంచమున(Earth) శిశువు రూపములోనికి ప్రవేశించును.

స్టెబిలిటీ(Stability) భౌతిక ప్రపంచమున ప్రవేశించుటకు మునుపు మానవ ఆకృతి యందలి వివిధ భాగాలను ఘనీభవింపచేయు ప్రక్రియ సమాచారాన్ని సేకరించడానికై రాశీ చక్రం (Zodiac Belt) యొక్క ప్రతి డిగ్రీ వద్దకు చేరి సమాచారాన్ని సేకరించుకోవడం జరుగును.

Intelligent Memory తో కూడుకొని ఉన్న స్టెబిలిటీ శిశువు హృదయ భాగమున చేరి జీవ ప్రజ్ఞగా కార్యాచరణ కొనసాగించును.

రాశీ చక్రం యొక్క డిగ్రీలను మాస్టర్ గారి నూతన యోగము నందు Quills అని అందురు.


Stability అనేక క్విల్ల్స్ ని తాకుతూ ప్రయాణిస్తుండగా రాశీ గృహ(Zodiac House) సంబంధిత పాలక గ్రహం యొక్క క్విల్ ముందుకు నెట్టుట ద్వారా Stability రాశీ చక్రం(Zodiac Belt) నుంచి బయటకి వెలువడి భౌతిక ప్రపంచమున ప్రవేశించును.



ఈ Stability భౌతిక ప్రపంచమున మొదట శిశువు తండ్రి తలపై నిలిచి భౌతిక ప్రపంచమున సేకరించ వలసిన సమాచారాన్ని సేకరించడం జరుగును. ఈ Stabilityని వేదాంతమున ప్రవేశాత్మగా ఉచ్చరించెదరు.

Stability వద్ద మానవ నిర్మాణ ఆకృతి సంబంధిత సమాచారం ఇమిడి ఉండును, ఈ Stability భౌతిక ప్రపంచమున నిర్వహించ వలసిన కార్యచరణ పూర్తియైన తరువాతనే, శిశువు తండ్రి యందు వీర్యకణాలు(sperm) ఏర్పడుటకు తోడ్పడడం జరుగుతుంది. ఈ వీర్య కణాలు శిశువు తల్లి యందు ప్రవేశించి తొమ్మిది నెలల తరువాత శిశువు రూపమున జన్మ తీసుకోవడం జరుగుచున్నదీ.


శిశువు తన మొదటి శ్వాసను తీసుకున్న క్షణంలో Stability  శిశువులోకి ప్రవేశించి గుండె భాగంలో స్థిరపడుతుంది. శరీరం యొక్క నిరంతర నిర్వహణ కోసం గ్రహాల నుండి  శక్తి ప్రవాహాన్ని స్వీకరించి మూలధార వద్ద ఉన్న శిశువు కుండలినికి సరఫరా చేయడం దీని పని.

(Contradictory Theory: Kundalini receives Prana flow from the planets and passes to stability then stability distributes this prana all over body for its maintenance) 

Stability అంటే "పురుష" సూత్రంగా చెప్పుకొనవొచ్చును.

అనేక ప్రక్రియల తర్వాత ఉనికిలోకి వచ్చి కుండలినీ మరియు Stability చేత నిర్వహించబడుతున్న ఈ మానవ శరీరం పనికిరానిదిగా వదిలివేయకూడదు(సమాధి స్థితి ద్వారా). ఇది యోగ సాధన ప్రయోజనం కోసం మనకు ఇవ్వబడింది  ఈ మానవ దేహమును ఒక నిధిగా(Treasure) పరిగణించాలి.


కుండలిని తన జ్ఞానాన్ని బహిర్గతం చేయకూడదనే ఆ పరబ్రహ్మ విధించిన బాధ్యత నుండి వైతొలిగి, మొత్తం 49 అడమంటైన్ తెరలను(నాలుగోవ ఫీల్డ్ యందలి వివిధ ప్లేన్ల సరిహద్దులు) తొలగించుకొని సుషుమ్నాలో పైకి లేచేలా చేస్తే, అది వివిధ ప్లేన్ల జ్ఞానం మరియు పనితీరును మన స్పృహకు చూపుతుంది. పైన పేర్కొన్న ప్రక్రియ ప్రకారం భౌతిక దేహానికి ఇటువంటి జ్ఞానాన్ని అందించడానికి, ప్రస్తుతం అభివృద్ధి చెందిన భౌతిక శరీరం యందు ఐదు అవరోధాలు ఉన్నాయి;


మానవ భౌతిక దేహము ఎథిరిక్ దేహము యొక్క మాతృక(Matrix) మాత్రమే, ఈ భౌతిక దేహము గ్రహాలు అందించిన అణువుల ద్వారా నిర్మితమైనది, ఒకవేళ మానవ కుండలిని తనయందు తాను పరిభ్రమించిన, ఆ పరిభ్రమించుట వలన ఏర్పడు శక్తిని తట్టుకొనలేక భౌతిక దేహము అపస్మారక స్థితికి చేరును, ప్రస్తుత భౌతిక శరీరము చాల బలహీనమైనది చిన్నపాటి కుండలిని ప్రకంపనలనుకూడా తట్టుకొనలేదు అటువంటిది ఎథిరిక్ దేహమందలి కుండలిని పైకి లేచి సహస్రారం చేరుట అంత సామాన్యమైన మరియు సాధ్యపడు విషయం కానే కాదు.


కుండలిని శక్తి శుషుమ్న ద్వారా సహస్రారం నుంచి బయటకి పోవుటచే ఉన్నత ప్లేన్స్ సంబంధిత జ్ఞానం లభించును కానీ ఈ ప్రక్రియ సాధ్యపడదు ఎందుకంటే మానవ ఎథిరిక్ దేహముయందు ఇంకా సుషుమ్న పరిపూర్ణంగా ఏర్పడలేదు కనుక, సుషుమ్న ఎథిరిక్ దేహముయందు ప్రస్తుత భౌతిక దేహముయందు ఏర్పడి ఉన్న వెన్నెముక స్థానములో ఏర్పడవలసి ఉన్నదీ, సుషుమ్న ఏర్పడనంతవరకు ప్రస్తుత మానవ దేహము(Physical and Etheric Bodies) కుండలిని శక్తిని తట్టుకొని ఊర్ధ్వముఖంగా ప్రయాణింప చేయుట అసాధ్యం.

కుండలిని శక్తి సుషుమ్న ద్వారా వెన్నెముక ఉపరితల భాగమున చేరి ఉన్నత ప్లేన్స్ యందలి జ్ఞాన సమాచారం మానవ మెదడుకు తెలియ చేయగల సంబంధిత అవయవాలు ప్రస్తుత మానవ భౌతిక దేహమున ఇంకా సంపూర్ణంగా ఏర్పడలేదు. 


ఈ అవయవాలు సంబంధిత సమాచారం 4th ఫీల్డ్ కుండలిని పరిణామం యందు ఇంకను తెలుపబడనందువలన ఉన్నత ప్లేన్స్ యందలి జ్ఞానం కుండలిని ద్వారా సేకరించడం అసాధ్యం.

నాలుగోవ ఫీల్డ్ కుండలిని పరిణామం గురించి మరింత తెలుసుకోవడానికై ఈ క్రింది కథనాన్ని చూడండి.

https://mastercvvyogam.blogspot.com/2023/05/blog-post_19.html

ఒకవేళ ప్రస్తుత మానవ దేహమున కుండలిని శక్తిని తట్టుకొను విధంగా సుషుమ్న సంపూర్ణంగా ఏర్పడినప్పటికీ ఉన్నత ప్లేన్స్ సంబంధిత సమాచారం సేకరించు ప్రక్రియ ద్వారా ఏర్పడు ప్రకంపనలను తట్టుకోను విధంగా ప్రస్తుత మానవ భౌతిక దేహము తీర్చిదిద్ద పడాలి(Rectify and Develop) ఈ విధంగా తీర్చి దిద్దబడ్డ దేహమును దివ్యంగము లేదా అప్రాకృత(Aprakrita) దేహమందురు. ఈ దేహము ప్రస్తుత గ్రహాల(Cosmos) అణువుల ద్వారా ఏర్పడిన భౌతిక దేహముతో పోల్చి చూసిన చాల ఉన్నత వ్యత్యాసములు కలిగి ఉండును.


4th ఫీల్డ్ కుండలిని పరిణామము యందు ప్రతి జీవం యొక్క కుండలిని పైన ఒక దానిపై ఒకటి అల మూడు పొరల ద్వారా గడిచిన మూడు కుండలిని ఫీల్డ్ పరిణామమునకు సంబందించిన సామూహిక జ్ఞాన సారమును ఆ పరమాత్మా ద్వారా బంధించబడినది, కావును నాలుగోవ కుండలిని పరిణామము యందు మనుగడ గావిస్తున్న ప్రతి జీవమునకు కేవలం నాలుగోవ ఫీల్డ్ కుండలిని పరిణామము యందు గడిచిన సామూహిక జ్ఞాన సారమును అందిపుచ్చుకొనే సామర్థ్యం కలిగివుంటుంది కానీ 

గడిచిన మూడు కుండలిని ఫీల్డ్ పరిణామమునకు సంబంధించిన సామూహిక జ్ఞాన సారమును జీవము యొక్క కుండలిని అంతర్బాగమున ఉన్న అంతరాత్మ వల్లనే సాధ్యపడును, ఈ అంతరాత్మ ఇప్పుడు నాలుగోవ ఫీల్డ్ జీవములకు సహకరించు స్థితిలో మార్పుచెంది ఉన్నదీ కానీ ఈ అంతరాత్మను ఎలా ఉపయోగించ వలెను అనే సంగతి కేవలం ఆ పరబ్రహ్మ / Onepoint నకు మాత్రమే తెలిసిన విషయము.

పైన పేరుకున్న కారణాల వల్ల కుండలిని శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపచేయుట అతి క్లిష్టమైన ప్రక్రియ మనంతటికి మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ సాధ్యంకాని పని. ఈ కుండలిని సంబంధిత సంపూర్ణ జ్ఞానం ఇంతవరకు ఆ పరమాత్మా ఎవరికీ వెల్లడించలేదు.

పతాంజలి యోగ మార్గం శాశ్వతత్వం లేదా సామూహిక జ్ఞాన సముపార్జన కొరకు లేదా పరబ్రహ్మ అభీష్టం మేర ఏర్పడిన యోగము కాదు ఈ యోగ ముఖ్య లక్ష్యం జనన మరణ చక్రం నుంచి వైతొలగడం. ఈ మార్గమున భౌతిక దేహమునకు ప్రాముఖ్యత ఇయ్యలేదు. 

పురాతన యోగములలో తలపైన ఉన్న బ్రహ్మరంధ్రమును ప్రాణ విసర్జన కొరకు వాడుట జరుగుచున్నది కానీ మాస్టర్ గారి నూతన యోగమున కొత్త ప్రాణ శక్తి సరఫరా వ్యవస్థను బ్రహ్మ రంధ్రం నుంచి కుండలిని వరకు ఏర్పాటు చేయు ప్రయత్నం జరుగుచున్నది ఈ వ్యవస్థ సంపూర్ణతను ఏర్పరచుకొన్న తరువాత కుండలినికి ప్రాణ శక్తి బ్రహ్మరంధ్రము ద్వారా చేరవేయుట జరుగును. (Downward Movement no Upward Movement)

మానవ శరీర ఆకృతి గురించి 5.1.1911న MTA ఈ విధంగా తెలియచేసెను.

".. మానవ శరీరం యొక్క నిర్మాణం చాలా అనర్గళంగా నిర్మించబడింది, వివిధ భాగాలుగా మనము ప్రతిదీ గుర్తించుకొను విధంగా ఆవిష్కరించ బడలేదు"

MTA మానవ నిర్మాణ ఆకృతిని 7 విభాగాలుగా(Planes in the Human Body) విభజించి వాటి పేర్లను క్రింది విధంగా తెలియచేయుట జరిగెను.

సహస్రారం - మహా పర నిర్వాణిక్ (Mahapara Nirvanic)

ఆజ్ఞ - పర నిర్వాణిక్ (Para Nirvanic)

విశుద్ధ - నిర్వాణిక్ (Nirvanic)

అనాహత - బుధ్ధిక్ (Buddhic)

మణిపూరక - మెంటల్ (Mental) 

స్వాధిష్ఠాన - ఆస్ట్రల్ (Astral)

మూలాధార - ఫిసికల్ (Physical)

ప్రస్తుత మానవ దేహమున పై విభజన భాగము(Human Body Plane) నుండి కేవలం దాని క్రింద ఉన్న విభజన భాగమునకు మాత్రమే సూచనలు లేదా సమాచారం చేరవేయబడుతున్నాయి (eg: Astral to Physical or Mental to Astral) కానీ మహా పర నిర్వాణిక్ ఇందుకు విరుద్ధముగా అన్ని విభజనములకు సూచనలు లేదా సమాచారం చేరవేయ సామర్థ్యం కలిగి ఉన్నదీ.

మహా పర నిర్వాణిక్ మానవ ఆకృతిని పునర్నిర్మించడానికి మాస్టర్ గారి యోగమున కీలకమైన పాత్రా పోషించడం జరుగుచున్నది.


పైన పేర్కొన్న మానవ దేహ సంబంధిత ప్లేన్స్ యందలి మూలాధార / ఫిసికల్ బాడీ ప్లేన్ యందు కుండలినీ ఉండును ఇది ఎథిరిక్ దేహమున నెలకొని ఉన్న ఒక శక్తి కణం మానవ నేత్రములతో కుండలినీని చూడడం సాధ్యం కాదు కానీ ఉన్నత దృష్టి కలవారు దీనిని ఒక మిక్కిలి ప్రకాశవంతమైన కాంతి కణమువలె దర్శించుట జరుగును. 

ఎథిరిక్ దేహమున ఏర్పడి ఉండు వివిధ విభజనలు(Planes in the Human Body) యందు నెలకొని ఉండు  ప్రాణ శక్తి సరఫరా చేయు కేంద్రాలను ఈ క్రింది చిత్రమున చూడగలరు.

గమనిక: కంటికి కనిపించే భౌతిక దేహము కేవలం ఎథిరిక్ దేహము యొక్క మాతృక(Matrix) మాత్రమే.


కుండలిని యొక్క స్థానం పెరెనియం(Perenium) అనే భాగానికి మధ్యలో ఉంటుంది. ఈ ప్రదేశం మూలధార లేదా భౌతిక ప్లేన్ యొక్క కేంద్రం. మానవ దేహమున నాభి స్థానం స్వాధిష్టానా లేదా ఆస్ట్రల్ ప్లేన్ కి కేంద్ర స్థానం. మణిపూరక లేదా మెంటల్ ప్లేన్ మానవ దేహమున కడుపు భాగమునకు కేంద్రం. Stability లేదా 'ప్రవేశాత్మ' ఉన్న హృదయ, అనాహత లేదా బుద్దిక్ ప్లేన్ యొక్క కేంద్రం. కాలర్ ఎముకలు(Collar Bones) కలిసే మెడ గొయ్యి విశుద్ధి లేదా నిర్వనిక్ ప్లేన్‌కు కేంద్రం. కనుబొమ్మల మధ్య బిందువు ఆజ్ఞ లేదా పరానిర్వానిక్ ప్లేన్‌కు కేంద్రం; తల పైభాగం మధ్యలో సహస్రారం లేదా మహాపరనిర్వానిక్ ప్లేన్ కేంద్రం ఉండును. 

ప్రతి రెండు ప్రాణ శక్తి సరఫరా చేయు కేంద్రాల మధ్య ఖాళీని రెండు సమాన భాగాలుగా విభజించినచో ఎగువ సగం ఎగువ ప్లేన్ మరియు దిగువ సగం దిగువ ప్లేన్ నకు చెందినది. హ్యూమన్ బాడీ ప్లేన్ గురించి మనం మాట్లాడేటప్పుడు, ప్రాణ శక్తి సరఫరా చేయు కేంద్రాల  పరిమితిలో ఉన్న శరీరంలోని మాంసం, నరాలు మొదలైన అవయవాల అన్నిటిని పరిగణించాలి.

ఈథరిక్ శరీరం యందలి కుండలిని Stability నుండి ప్రాణ శక్తిని స్వీకరించడం మరియు వివిధ నాడీ కేంద్రాల ద్వారా మొత్తం శరీరానికి పంపిణీ చేయడం తప్ప వేరే పని చేయదు. ప్రాణ శక్తి ప్రవాహం ఆగిపోతే, కుండలిని తన కార్యాచరణ నిలిపివేయుట జరుగును ఇందు వలన ఎథిరిక్ దేహమున ప్రాణ శక్తి సరఫరా ఆగిపోయి ప్రతి అవయవం యందు పనితీరు నిలిచిపోవును, తద్వారా శరీరం మరణావస్థకు చెరుతుంది.

జీవితాంతం శరీరాన్ని తన సాధారణ పనితీరులో ఉంచుటకు తోడ్పడు కుండలిని, సుషుమ్నా ద్వారా పైకి లేచి, వివిధ ప్లేన్ల యందు సంచరించి, అక్కడ సమాచారాన్ని జ్ఞానాన్ని భౌతిక స్పృహకు వెల్లడించు సామర్థ్యం కలిగి ఉండును. కుండలిని సుషుమ్న ద్వారా సహస్రారం దిగువన ఉన్న  స్థాయికి చేరుకొని, మేజర్ ట్రిపుల్ యొక్క మూడు పూతలను ఒక్కొక్కటిగా తొలగించవలసి ఉంటుంది, ఈ మూడు పూతలను(Coatings / Covers / Upadhies) తొలగించుట ద్వారా మూడు క్షేత్రాల(Fields) యొక్క వివిధ పనితీరు మరియు జ్ఞానాన్ని తెలియపరుచును. 

(గమనిక: కుండలిని యోగమున ఈ మూడు క్షేత్రాలను మూడు గ్రంథులుగా వర్ణించినారు)

కుండలిని పై ఉన్న మూడు పొరలను తొలగించుట ద్వారా స్వచ్ఛమైన అంతరాత్మ అంటే ఇంతవరకు సంభావ్య స్థితిలో ఉన్న పరమాత్మ సూత్రం జాగృతవస్థను సంతరించుకొని మానవ రూపమును పరబ్రహ్మ ప్రతిరూపముగా మార్చుట జరుగును  ఇది అసలైన మానవ రూపము ప్రస్తుత మానవ రూపము కేవలం గ్రహ నక్షత్రాలు ప్రోద్బలం ద్వారా ఏర్పడ్డ ఒక సాధారణ దేహము మాత్రమే. 

(గమనిక: కుండలిని యోగమున, బుద్ధిజం, టిబెటియన్ మార్గాలలో మానవ రూపమును పరబ్రహ్మ ప్రతిరూపముగా మార్చుట బదులుగా ఆ పరమాత్మాలో ఐక్యం చేసుకోవడం ద్వారా జీవుడు తన అస్థిత్వాన్ని కోల్పోవడం జరుగును)

మానవ రూపమును పరబ్రహ్మ ప్రతిరూపముగా మార్చుకొనుట అసలైన మానవ అంతిమ లక్ష్యం, ఈ లక్ష్యం చేరుకోవడం ద్వారా మానవుడు జీవనముక్తుడవుతాడు జీవాత్మ తన అస్థిత్వాన్ని కోల్పోకుండా పరమాత్మా గా పరివర్తన చెంది తన తోటి జీవులను తనంతటి స్థితికి అవలీలగా మార్చివేయు శక్తి సామర్థ్యాలు కలిగి ఉండును.

ముఖ్యమైన గమనిక: విదేహ ముక్తి(Bodyless Mukti), ముక్తి కానే కాదు, జీవం పరబ్రహ్మ నుంచి వెలువడి అనేక స్థితులను ధాటి జీవనముక్తి కోసం ప్రయత్నించును కానీ ఇందుకు వ్యతిరేకంగా తన అస్థిత్వాన్ని కోల్పోవు విధంగా ఆ పరబ్రహ్మం యందు ఐక్యమవజాలదు.

ఈ మానవ దేహము ఇంత గొప్ప కార్యము నిర్వర్తించడానికి ఎన్నో స్థితులను ధాటి మనకు ఏర్పడి ఉన్నదీ అటువంటి ఈ మానవ దేహమును సమాధి స్థితి ద్వారా లేదా పరమాత్మలో ఐక్యం అవుటకు వదిలివేయడం మిక్కిలి మూర్కత్వం.

“శరీరమాద్యం ఖాలు ధర్మ సాధనం”(Body is primary for fulfilling the law of being); ధర్మములలో అత్యంత ఉన్నతమైన ధర్మం ముక్తి సముపార్జన. 

ఎవరవుతే ఈ మానవ దేహ గొప్పతనాన్ని అర్థంచేసుకొనలేరో వారు అసలైన ముక్తి ని అర్థం చేసుకోవడములో వైఫల్యమైనట్లే.

మన మానవ దేహం వెలకట్టలేనటువంటి ఒక అమూల్యమైన నిధి(Treasure) వంటిది, మన మానవ దేహమును అతి ఉన్నతముగా ఉపయోగించుకోను పద్ధతి మాస్టర్ గారి యోగ మార్గము కావున ఈ యోగ మార్గమును అభ్యసించుటకై మన దేహమును సంపూర్ణంగా వినియోగించుకొనవలెను. 

మన ఈ జీవిత లక్ష్యం, శాశ్వతత్వం(Eternity) ద్వారా జనన మరణ చక్రమునుంచి వైతొలిగి ఆ పరబ్రహ్మ తత్వమును సంపూర్ణంగా అర్థంచేసుకొని మనము బ్రహ్మానందం పొందడమే  కాకా మన తోటి వారిని ఆ బ్రహ్మానంద స్థితి చేర్చుటకు తోడ్పడవలెను.

ఇటువంటి స్థితిని సాధించుటకై మరియు మాస్టర్ C.V.V (personification of parabramha)  గారి అనుగ్రహం సంపాదించుటకై మనల్ని మనము తగిన విధముగా మలచుకొనవలెను.

మానవ జాతిని ఉద్ధరించడానికై తనకు థానే జన్మ తీసుకొన్న ఒక మహానుభావుడు మాస్టర్ C.V.V.

కేవలం మాస్టర్ గారు మాత్రమే మానవ కుండలినిని, నశింపరాని దేహము ఏర్పరచుకొను విధముగా ఆదేశించగల సామర్థ్యం కలవారు.

కుల, మత, వర్ణ భేదాలు లేకుండా ఈ యోగాన్ని అనుసరించే భాగ్యం కలిగిన ప్రతి ఒకరిని ఆ మహానుభావుడు అనుగ్రహించ వలెనని ప్రార్థిస్తూ ఈ వ్యాసమును ముగిస్తున్నాను.

Master Namaskaram.

The above essay is an extract from Master C.V.V.'s direct disciples' (mediums) S. Narayana Aiyar's writings (T.S. Sankar Aiyer supported his writings.)

Few concepts included in this essay from 

Reference: Master CVV's Yoga - Basic  Information  

(Written by Sri. Umakant Akkiraju Garu)

References:

1) The New Yoga - S.Narayana Aiyar

2) Sri Potharaju Narsimham Garu Notes translated 

in to telugu by Gali Balasundar Rao Garu.


గణిత సిద్ధాంతాల ద్వారా పైన ఉన్న వీడియోలో వివరించిన ప్రతి విషయం నిరూపించబడినది.

మాస్టర్ గారు ప్రతిపాదించిన కుండలిని ఫీల్డ్ ఎవల్యూషన్ థియరీ, పైన వివరించిన గణిత సిద్ధాంతాలతో తాత్వికంగా ఏకీభవిస్తున్నట్లు మీరు గమనించగలరు.

Master Namaskaram.

------------------------

If you are new to this yoga, please join our whatsapp group: click over this link

మీరు కొత్తగా ఈ యోగమునందు చెర దలచినచో పైన ఇచ్చిన లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ యందు చేరగలరు. 


Please refer these youtube links for more information.


Zodiac Belt Animation - 12 Sanskrit Months

https://youtu.be/3iAxgCP8oPY

Zodiac Belt Animation - Nakshatras in Detail

https://youtu.be/3iAxgCP8oPY

More Information about Lagna(astrology term)

https://youtu.be/aMv-SvWDvis




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?