Giddiness



GIDDINESS

In Memory, Memorandum notes, Master CVV recorded on this topic on 20.12.1920, 23.12.1920, 24.12.1920.

Giddiness is not to be understood as light-headedness. Master used words to the nearest resembling meaning.

Giddiness is caused by a drop in Pure Memory working in Human Memorandum, i.e., human body. The radiation of Memory in human body rotates like a hand in the clock. If we take human form as 360º, then memory radiates from one degree to the next degree. The transit from one degree to next degree causes loss of pure memory radiation. In the absence of memory radiation, Kundalini action causes action in human form. This action is to be understood as Giddiness. Since this action is without involvement of Pure Memory, Master seems to have named it as Giddiness.

Master mentioned 3 types of Giddiness.

1. Vapour Giddiness – This happens in sleep state.

2. Producted Giddiness – In an undisturbed state without any external sounds this happens, when the form is conscious 

3. Throwing Giddiness – This causes human form to talk when in conscious state.

Giddiness can also be understood as the inconsistent thought process in human form.

In Master’s Line, Pure Memory shall radiate in all the 360º of the human form at the same time, instead of rotating from one degree to another.


24.12.1921

“So pure Memory will not travel but its speed alone acts.

Our line of work is to keep this Memory in center between derection and direction to act without giving giddiness.

By this line this Memory will absorb all the giddiness of the 360º and without showing it, the pure Memory to act will be made.”


---------------------------------


గిడ్డినెస్

మాస్టర్ సి.వి.వి గారు తమ మెమరీ, మెమొరాండం నోట్స్ నందు 20.12.1920, 23.12.1920, 24.12.1920 తేదీలలొ ఈ విషయముపై వ్రాసినారు.

విషయ వివరణకు మాస్టర్ గారు సాధారణ భాషని వాడినప్పటికీ, వ్యవహారిక అర్థమగు మగత గా భావింపరాదు.

మెమొరాండం, అనగా దేహములొ ప్యూర్ మెమరీ ప్రసరణలో ఏర్పడు అంతరాయము  గిడ్డినెస్ నకు కారణము. మానవ దేహములో మెమరీ, గడియారములోని ముల్లు వలె తిరుగుతూ ఉంటుంది. దేహ పరిధిని 360º గా తీసుకొనిన, ఒక డిగ్రీ నుండి మరొక డిగ్రీకి మెమరీ ప్రసరణ మారు సమయములో, ప్రసరణలో అంతరాయము ఏర్పడుతుంది. ఈ అంతరాయ  సమయములో కుండలిని వలన దైహిక చర్యలు జరుగును. ఈ చర్యలనే గిడ్డినెస్ గా అర్ధము చేసుకొనవచ్చును. యిట్టి చర్యలలో ప్యూర్ మెమరీ ప్రమేయము లేనందువలన,  స్వచ్ఛత లోపమునకు గుర్తుగా మాస్టర్ గారు గిడ్డినెస్ అని వాడినట్లున్నది. 


వీటిని మూడు విధములుగా చెప్పియున్నారు.

1. వేపర్ గిడ్డినెస్ – ఇది నిద్రాసమయములో ఎక్కువగా ఏర్పడేది.

2. ప్రొడక్టెడ్ గిడ్డినెస్ – ప్రశాంత వాతావరణములో, ఎటువంటి శబ్దములు లేనప్పుడు జాగృతావస్థలొ కలిగేది.

3. త్రోయింగ్ గిడ్డినెస్ – జాగృతావస్థలొ మనిషి మాట్లాడుటకు కారణమయ్యేది. 


గిడ్డినెస్ ను మానవులలోని ఆలోచనాప్రక్రియగా కూడా భావింపవచ్చు.

మాస్టర్ గారి మార్గములో, మానవులలొ ప్యూర్ మెమరీ 360º లలో ఏకకాలములో పనిచెయవలసి ఉన్నది.


24.12.1921 న క్రింది విధముగా వ్రాసినారు.

“ప్యూర్ మెమరీ స్వయముగా ప్రసరించుటలేదు. దాని వేగ ప్రభావము మాత్రమె యున్నది.

మన మార్గములో ఈ మెమరీని కేంద్రస్థానములో ఉంచి గిడ్డినెస్ లేని విధముగా పనిచేయించవలెను.

ఈ మార్గము వలన మెమరీ, 360º లలో ఏర్పడు గిడ్డినెస్ ను ఇముడ్చుకొని,  ప్యూర్ మెమరీ మాత్రమే పనిచేయువిధముగా చేయబడుతుంది.”





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?