HUMAN FORMAT
మానవుని ప్రస్తుత రూప నిర్మాణము పుర్రె నుంచి కుండలిని వరకు 7 వలయములు కలిగి ఉన్నట్లుగా మాస్టర్ గారు 5.3.1920 నాటి మెమరీ మెమొరాండం నోట్స్ నందు చిత్రముతో తెలియజేసినారు.
మానవ రూపమంటే, భౌతిక దేహమనే కాక, అంతకు పూర్వము ఏర్పడిన పారభౌతిక స్థితులు రూపములు కూడా. వీటి పరిణామ పురోగతి గురించి మాస్టర్ గారు మార్చ్ మరియు ఆగష్టు 1920 నాటి మెమరీ మెమొరాండం నోట్స్ లొ వ్రాసినారు.
మాస్టర్ గారు వ్రాసిన విషయములను క్రింది విధముగా అర్ధము చేసుకొనవచ్చును. ఇందులో కొన్ని విషయములు, బ్రహ్మాండ పురాణములోని విషయములను, థీయోసఫికాల్ సొసైటీ వారి సిద్దాంతములను పోలి ఉన్నట్టుగా అనిపించవచ్చును.
1. ఏడు గ్రహముల సమిష్టి ప్రభావమునకు పూర్వ స్థితి.
పరిణామ ప్రక్రియలో, రాశి మండలములోని ఏడు గృహములలో, ఏడు గ్రహముల ప్రభావముచే మానవ రూప నిర్మాణమునకు తోడ్పడే రూపనమూనాలు ఏర్పరచబడును. ఈ ప్రభావముతో మానవ రూపమునకు గ్రహ ప్రభావముచే ఒక తొడుగు ఏర్పరచబడెను.
2. మానస ధ్యానులు – 7 గ్రహముల సంఘటిత చర్యల ప్రారంభము మానవ రూప నిర్మాణమునకు దోహదపడెను. ఈ 7 గ్రహములు, విడివిడిగా మానవ రూపములో వలయములు ఏర్పరచి, సంఘటితముగా మానవ అంగముల నిర్మాణములో తమ తమ చేయుతనిచ్చెను. ఈ విధముగా ప్రారంభమయిన మానవ రూపములను ఆర్యులు గా మాస్టర్ పేర్కొనినారు. అయితే, ఈ ఆర్య అనే మాటని, చారిత్రకముగా చెప్పబడే ఆర్యులతో పోల్చరాదు.
అదే సమయములో, జీవ మరియు రూప సహిత లక్షములను ఏర్పరచగల శక్తులు ఏర్పడి వాటిచే ఇవ్వబడిన లక్షణ రూపములను ‘అహంకార’ అనే పేరుగల విధములుగా మాస్టర్ వ్రాసినారు. ఇట్టి లక్షణ రూపములను 'అగ్నిస్వత్త పితృలు' గా పేర్కొన్నారు. వీటి కారణముగా ఆర్య జీవ రూపములకు, ఆస్ట్రల్ స్థితిలో ‘స్వ’ స్వభావ లక్షణము ఏర్పడెను.
జ్ఞాన మౌనులు, గుణ గుప్తుల ఉద్భవము. వీటి గురించిన విస్తృత వివరణ మాస్టర్ గారి నోట్స్ లో లభ్యముకాలేదు.
బరిశత్ పితృల ఉద్భవము. వీటిని బాడీ గార్డ్స్ గా చెప్పినారు. వీటి వలననే రూపము, అహం, జ్ఞానము, విచక్షణతో కూడిన సంపూర్ణ మానవ రూప ఆవిర్భావము సంభవమయినది.
తదనంతరము, మానవ రూప నిర్మాణ పరిణామ ప్రక్రియలో అనేక ప్రయోగములు జరిగినవి. అవేమంటే-
- మానస పుత్రులు. అరూప భావ స్థితిలో, ఒక జన్మలో 100 ప్రాణస్థితులను నిలుప చూసినారు. ఇది సఫలమయి వాయు రూప స్థితిలొ దేహములు నిలువసాగెను. ఒక ప్రాణ స్థితి అనగా ఒక సంవత్సరకాలమునకు కావలసిన ప్రాణశక్తిగా భావింపవచ్చు.
- బుద్ధ. (బహుశా అంజనా పుత్రుడైన ఆది బౌద్ధ కావచ్చు) ఈ ప్రయోగములో 100 నుంచి 200 ప్రాణ స్థితులను నిలుప చూసినారు. కాని నిర్మాణములు నిలబడలేదు.
- ఆత్మవత్. ఈ ప్రయోగములో ఒక జన్మలో ఇవ్వబడు కనీస ప్రాణస్థితులను 100 నుంచి 60 కి తగ్గించి, 5 జన్మల ప్రాణ స్థితులను, అనగా 300 నిలుప చూసినారు. నిర్మాణములు నిలబడలేదు. అయితే, ఈ ప్రయోగము వలన, అంతకు ముందు ఉన్నటువంటి 100 ప్రాణస్థితులను నిలుపగలిగే లక్షణము కోల్పోయినారని మాస్టర్ వ్రాసినారు.
మానవుని పార భౌతిక నిర్మాణ ప్రక్రియ భౌతిక స్థితికి అర్ధమగు విధముగా వెరెవ్వరూ మాస్టర్ గారి వలే చెప్పిఉండలేదు.
HUMAN FORMAT
Present human format standing with 7 rings from skull to Kundalini portion as depicted by Master on 5.3.1920.
Human Format means, not only the physical body but also the preceding gaseous forms as well.
Unknown to physical conscience, several experiments happened in Human evolution as recorded by Master in Memory, Memorandum notes in March and August 1920.
We can broadly understand these aspects as below. Some of the information may appear similar to what is mentioned in traditional literature like Brahmanda Purana and in Theosophical literature.
1. Human format before the joint influence of 7 planets.
Seven zodiac houses are influenced by seven planets and each individually form a figure to contribute to development of different parts of human form. One of these planetary influences also form a cover to the human form.
2. Manasa Dhyanies. Facilitating joint working of 7 planets in Human form creation. All the seven planets’ individual covers became present in this new human format and the organ development happened in a coordinated manner. This started Arya race as per Master. This term ‘Arya’ shall not be misunderstood as is commonly used in historical sense.
Ahamkara type formation happened with a little touch in life principles and in figure principles. This is called Agnishwetha Pithrus. Evolution of ego at astral level happened at this stage and was give to Aryas.
Gnana Mownies and Guna Guptas formations. Not much detail is available on these.
Barishat Pithrus. Also called Body Guards. This is for evolution of rational physical human format with Rupam (Figure), Aham (Ego) and Gnanam (Wisdom).
Consequent to evolution of complete physical human format, several experiments happened causing different types of human formats coming into existence. These are –
- Manasa Putras. In Arupa bhava, in single life, 100 life principles’ pressure was attempted and this worked well and gaseous forms got established. One life principle can be understood as the amount of life wave needed to sustain form for one year.
- Budha. (May be Aadi Bouddha, Son of Anjana) Attempt was made to give 100 to 200 life principles pressure to the structure. It did not stand.
- Athmavath. Attempt was made to give 5 births’ breathing pressures, at 60 each, 300 life principles pressure. But physical structure did not stand the pressure. Due to this type of pressure introduction, 100 years period sustainability is lost.
Spiritual structure construction aspects were not described by anyone else as detailed by Master CVV for understanding of physical conscience.
-- Sri Umakant Akkiraju Garu.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి