థియోసఫీ దృక్కోణంలో ప్రస్తుత సృష్టి సంబంధిత సిద్ధాంతాలు - Introduction
థియోసఫీ దృక్కోణంలో ప్రస్తుత సృష్టి సంబంధిత సిద్ధాంతాలు
Introduction
మేడం హెలీనా పెట్రోవినా బ్లావెట్స్కిని గూర్చీ, ఆమె వ్రాసిన పుస్తకాలను గూర్చీ M.T.A మాస్టరు గారికి ఏమి చెప్పినారో వినండి.
నిజమైన సత్యాన్ని తెలుసుకోవడానికీ, తెలుసుకొనిన దానిని ఎట్లా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి. ఎప్పుడు ఉపయోగించాలి అనేదానికి కూడా కొంచం కామన్సెన్సు(Common Sense) అంటే ఇంగిత జ్ఞానం ఉండాలి.
ఈ ఇంగిత జ్ఞానం లేకుండా, సత్యం యొక్క విలువ తెలియకుండా, లోతు తెలియకుండా, చెత్తబుట్టలో చెత్తపడవేసినట్లు మనిషి కనిపించగానే వాడినెత్తిన రుద్దుతున్నారు.
సత్యం ఎప్పుడూ మానవులను విరోధింపజేయదు. సత్యం మానవులంతా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించేదానికి సహాయ పడుతుంది, ఇతరులకు అపకారాన్ని కలిగించదు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఉదారమైన, ఉన్నతమైన భావాలు కావాలి.
ఎవరైనా అడిగినప్పుడు సరియైన సలహాలు ఇచ్చే స్థితిలో ఉండాలి.
కొంతమందిని చూస్తే వాళ్లకున్న యోగ్యత ఏమిటో తెలుసు కోకుండా, ఏవిధమైన శ్రమా పడకుండా, హద్దుమీరి ఇతరులకు సలహాలు ఇస్తున్నారు.
పై విషయాలు హెచ్.పి.బి. అంటే హెలీనా పెట్రోవినా బ్లావెట్స్కీని గూర్చి చెప్పినాను.
కొంతమంది ఆమె ఏదో ఉన్నతమైన స్థితిలో ఉంది అని చెప్పడంచేత నేను ఈ విషయాలు వ్రాయవలసి వచ్చింది.
వ్రాయవలసి వచ్చిందే అని చింతిస్తున్నాను.
హెచ్.పి.బి. ని మాస్టరుగారు చూడలేదు. కారణాలు వినండి.
మేడం బ్లావట్స్కీ 21-12-1884 లో కడసారి మదరాసు(Chennai) వచ్చింది. చాలా జబ్బులో పడింది. 31-3-1885 న ఇండియా వదలి వెళ్లింది. అంటే మూడు నెలల పదిరోజులు మాత్రం ఉండినది.
మాస్టరుగారు 4-8-1864 లో పుట్టినారు. మేడం బ్లావెట్స్కే ఇండియా వదలి వెళ్లేటప్పటికి మాస్టరుగారి వయస్సు పదహారు సంవత్సరాల ఏడునెలల ఇరవై ఏడు రోజులు మాత్రం.
ఆనిబిసెంటును, సి.డబ్ల్యు లెబ్బీటరును, కూటాూమి లాల్ సింగును(Mahatma K.H), టి. సుబ్బారావును, రావుసాహెబ్. గ్రంథి సుబ్బయ్య శెట్టిని, వి.వి.చారిని, శ్రీనివాసన్ (వగైరాలంతా థీసాఫికల్ సొసైటి వాళ్లే. వీళ్లనందరినీ పేర్కొన్న మాస్టరుగారు బ్లావెట్స్కీని చూచివుంటే ఎందుకు పేర్కొనలేదు?
అందుచేత మాస్టరుగారు బ్లావెట్స్కేని చూడలేదు. కలవనూ లేదు.
శ్రీ A.V. శ్రీనివాసాచార్యులు
--------------------------
మాస్టరు గారికి పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, థియొసాఫికల్ సొసైటీ సంబంధిత ఆసక్తికర విషయాలు తెలుసుకొనుటకు మన తెలుగు జాతికి చెందిన శ్రీ తాళ్లప్రగఢ సుబ్బారావు గారి జీవిత చరిత్ర కొద్దివరకు దోహదపడుతుంది.
తాళ్లప్రగఢ సుబ్బారావు గారి జీవిత చరిత్ర (English Version)
ప్రస్తుత సృష్టి ఎలా కొనసాగుతుంది అని అర్థం చేసుకొనుటకు పూర్తి థియొసాఫికల్ సాహిత్యం తెలుసుకోవడం కొద్దిగ కష్టతరం కావున మనకు ఎంత వరకు అవసరమో అంతవరకు మాత్రమే Common Senseతో అర్థం చేసుకొనే ప్రయత్నం చేయుట మంచిది.
మాస్టరు గారి శిషులయిన శ్రీ పోతరాజు నర్సింహం గారి రచనల ద్వారా ఈ సృష్టి ఎలా ఏర్పడింది, మానవుడు ఎందుకని అనేక జన్మ పరంపరలు కొనసాగిస్తున్నాడు అన్న విషయాలు తెలుసుకొనుట జరిగెను.
మానవుడు మరియు జంతు - వృక్ష ప్రపంచమును ఎవరు ఇంత సజావుగా నడిపిస్తున్నారు, ఇలా నడిపించే వ్యవస్థ ఎటువంటిది, ప్రస్తుత మానవుడు -- పూర్ణ మానవుడుగా ఎదగడానికి ఏర్పర్చిన ప్రణాళిక | మొదలగు విషయాలు అర్థం చేసుకోవడం వలన మాస్టరు గారి ప్రయత్నం, ఎంతటి ఉన్నత స్థాయి ప్రయత్నం అన్నది తప్పక అర్థమవుతుంది.
ప్రస్తుత ఆధ్యాత్మిక సాధకులకు ఈ జ్ఞానము చాల అవసరము.
ఈ జ్ఞానము బ్రహ్మ-జ్ఞానముతో సమానము కావున వీలైనంత వివరముగా కనీసము 20 నుంచి 30 చిన్న చిన్న వ్యాసములుగా మన బ్లాగ్ యందు రాబోవు రోజులలో ప్రచురించడం జరుగుతుంది.
ఈ వ్యాసాలను అర్థము చేసుకోవడము ద్వారా ఆధ్యాత్మిక సాధకులు దైవాన్ని అర్థం చేసుకొనే విధానము పూర్తిగా మారిపోయే అవకాశం కలదు.
Master CVV Namaskaram.
------------------------------------------------
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి