డాక్టర్ శ్రీ గాలి బాల సుందర్ రావు గారు, జ్యోతిష గ్రంథములపై వెలువడించిన స్పష్టత.
డాక్టర్ శ్రీ గాలి బాల సుందర్ రావు గారు, జ్యోతిష గ్రంథములపై వెలువడించిన స్పష్టత.
శ్రీ యన్. ఆర్. బి. వి. గారి వద్ద “భుజండర్ నాడీ” అనే జ్యోతిష గ్రంథము వుండేది. అది అతి పురాదనమైనది, అందులో మాస్టరుగారి జాతకం మీడియముల జాతకములు ఉన్నవి. అది కొంతవరకు విని మాస్టరుగారు “ఇక మీదట మీడియములు ఈ గ్రంథం గానీ, యిటువంటి గ్రంథములు గానీ చదువగూడద” ని ఆజ్ఞాపించారట.
అందుకు కారణములు చాలా ఉన్నవి.
నాడీ, హోరా శాస్త్రాది జ్యోతిష గ్రంథములు కలియుగ ఆరంభములో వ్రాయబడినట్లు తోస్తుంది.
ఆనాడు ప్రచారంలో ఉన్న రాశి శీల, గ్రహ శీలములను బట్టి ఆ గ్రంథములు, రచనాకాలము నుండి కొన్ని వేల సంవత్సరముల వరకు కొన్ని ఆయనాంశ(astrological term), అక్షాంశముల మధ్య జరిగే మానవ జన్మ విశేషములను ఆ సూచనలో వున్న నిజానిజములు వివరములు గ్రహ-శీలముల స్థిరత్వము మీద ఆధారపడ్డవి.
వాటిని ప్రకాశించే మహత్తర శక్తి ఏదో వాటిని మారుస్తున్నప్పుడు ఆ పాతకాలపు జ్యోతిశ్శాస్త్ర సూత్రములు, వాటిననుసరించి, నిర్ణయించిన ఫలితములు వ్యత్యాసముతోను, విరుద్ధంగాను ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చును.
గ్రహగతులను మార్చదలచుకున్న మాస్టరు తన జాతక విషయంలో చెప్పిన ఫలితములను విశ్వసించి మీడియములు ఆవిశ్వాసమును ఏర్పరచుకోకుండా ఆ విధంగా శాశించి ఉంటారు.
ఈ గ్రంథములు భూర్జర పత్రము(Bhoj Patram) మీదనో, తాళ పత్రముల మీదనో వ్రాయబడ్డవి. కాలక్రమాన అవి శిధిలములు కాగా, మళ్ళీ తరువాత తరముల వారిచేత తిరిగి వ్రాయబడినప్పుడు అనేక అక్షర లోపములు, అన్యాక్షర లేఖనము జరిగి అర్థవ్యత్యాసములు(indifferent meanings) వచ్చి కలవరము కలిగించి ఉంటవి.
ప్రజలకు ఈ గ్రంథములపై ఉన్న విశ్వాసమును, భక్తిని పురస్కరించుకుని ఈ శాస్త్రము అసలే లేకుండానో, కొన్ని భాగములు ఉండి, కొన్ని భాగములు లేకుండానో, ఉన్నవారు తమకు తెలిసినదానిని బట్టి, జరిగినదానిని బట్టి, తెలియనిది జరుగనున్నది ఊహాగానము చేసి చెప్పడం వల్లనో, ఈ శాస్త్రమునకు - దుష్ట్యాతి(అపఖ్యాతి) యేర్పడి ఉంటుంది.
ఇలా చేసేవారిని నేను యెరుగుదును.
అసలు నాడీ హోరాలే నమ్మదగినది కాదనుకోవడం పొరపాటు శ్రీ యన్. ఆర్. వి. వి. గారే మాస్టర్ సాన్నిధ్యంలోనే భుజండర్ నాడీ చదువుతూ “అం కట్టన్” అనడానికి బదులు, “అం బట్టన్” అని చదివారట.
అంబట్టన్ అంటే ఆరవంలో “మంగలి”. ఇటువంటి అనివార్య లోపములు ఉన్నందువల్ల మాస్టరుగారు అట్లా ఆదేశించి ఉండవచ్చు.
సాధారణ జ్యోతిష్కులు మహాపోతే “త్రిశాంశ” వరకు పోయి ఫలితములు చెప్తారు.
నాడీ జ్యోతిషం అలా కాదు. అది సెకండులో ఆరవయ్యో భాగము వరకుపోయి కొన్ని ఫలితములను నిర్ణయిస్తుంది.
ధృవవాడి, భుజండర్ నాడి హోరాశాస్త్రము రచించిన ఋషులో ఋషులని పేరు పెట్టుకుని రచించిన వారో, మారిన, కాలక్రమాన మారుతున్న, గ్రహగతుల ననుసరించి - కొందరు మహా పురుషుల జాతకములు రాసినట్లు కనిపిస్తుంది.
హోరాశాస్త్రంలో మేధో మధ్యంలో ఒక గ్రంధి వుంటుందనీ దానిని 'మరకత సర్పం' అంటారని 'మరకతవల్లి' అనే అధిష్టాన-దేవతచే ఆది పాలింప బడుతుందనీ చెప్పబడి ఉన్నది.
"పిత్తా శయస్యసామీప్యే
వానపార్శ్వే ప్రతిష్ఠితే
జీర్ణాశయాత్ అధరఖాగే
అతి సూక్ష్మంచయంత్రకం
తత్యామ్యంతు విద్దిస్యాత్
కంఠాంతరప్రదేశ కే
అతి సూక్ష్మం విశ్మితాస్పదం
జీవసృష్ట్యార్ధ్య నిర్మితం
అతి ఉద్వేగగతితం
ఊచ్చాటన యివదృశ్యతే
శిరసాయా అంతరే భాగే
మేధా మధ్యేవ్యవస్థితే
పూర్వ కాల్యేవర్ణితంచ
మరకతసర్పమితిస్మృతం
జీవాధారస్యప్రాణీనాం
ముఖ్యకరంతులక్షణం
రక్షణార్ధం శక్తిఖ్యాం
మరకతవల్లీ యితిగీయతే
సహస్రదళ పద్మే
మహారాజ్ఞే చ ఆలయే
శిరో అంతరబాగేవ
మంత్రిణీరాజ్యకంచవత్.
పై శ్లోకమునకు అర్థము క్రింద వివరిస్తున్నాను.
“పిత్తాశయమునకు(Liver) సమీపములో ఎడమ ప్రక్క జీర్ణాశయము ఉన్నది (Stomach) దాని క్రింద భాగములో అతి సూక్ష్మములయిన (రెండు) యంత్రములున్నవి (Adrenals?).
అట్లాగే కంఠము ముందు ప్రదేశములో ఆశ్చర్యకరములయినవి, అతి సూక్ష్మము అయినవి. జీవ సృష్టి హేతువులయినవి అయిన యంత్రములు ఉన్నవి (Thyroids). ఆ యంత్రములు అతి ఉద్వేగమును పొందినపుడు ప్రాణోత్క్రమణము(death) జరుగుతుంది.
అలాగే శిరస్సులో మెదడు మధ్య ఒక గ్రంధి ఉన్నది దానిని పూర్వకాలములో “మరకత సర్పము” అని యోగులు, ఋషులు పేర్కొనేవారు. అది సర్వ ప్రాణులకు జీవాధారము, అతి ముఖ్యము అయినది. ఆ గ్రంథిని రక్షించే శక్తి “మరకతవల్లి" అని పిలవబడుతుంది. “సహస్రారము" అనబడే మహారాగ్ని ఆలయము అధరభాగములో(in the middle) అది ఉన్నది.
సహస్రారము అనే మహారాణికి అది మంత్రిణి వంటిదై రాజ్యము ఏలుతుంది."
ఆధునిక శరీర శాస్త్రానుసారంగా మెదడు క్రింద చిన్న గుంటలో పిట్యూయిటరీ గ్రంథి వున్నది. అది చాలా హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది. దానిని చాలా కాలము శాస్త్రజ్ఞులు గ్రంథిగానే భావించేవారు. కాని అత్యంతాధునిక పరిశోధనల వల్ల అందులో గ్రంథి ధాతువు లేదనీ జీవకణములు వరుసగా ఏర్పడినందున పాములాగా చుట్టుకొని వున్నదని ఆ పాము చివరినుండి వివిధ హార్మోనులు సందించబడతవనీ(Releasing) కనుకున్నారు. పీట్యూయిటరీ గ్రంథిలో 'ముందు' భాగము వెనుక భాగము అని రెండు భాగములున్నవి ఆ గ్రంథి-సందించే(Glandular) సృందనములలో(harmonal fluids) ఎండ్రినో ట్రాఫిక్ హార్మోను ఒకటి' ఎడ్రినల్ గ్రంథిలు రెండు ప్రక్కలా రెండు ఉన్నవి. అవి ఎడ్రినలిన్ అనే హార్మోనును ఉత్పత్తి చేస్తవి. స్వచ్ఛంద నరాశయములో(Auto-nomous Nervous System) Para-sympathetic నరాశయము శాఖ ఈ గ్రంథికి పోదు.
సర్వ మానవోద్రేకములకు ఈ గ్రంథి కారణము కోపము, దుఃఖము, వంటి అను భూతులలో రక్త నాళికలు(blood vessels) చిన్నవీ పెద్దవీ అవుతూ వుంటవి. అట్లాగే లివరులో నిలవ చేయబడివున్న గైకోజన్ ఈ ఎండ్రినల్ వల్ల గ్లూకోజ్గ మారి రక్తములోకి వస్తుంది. ఈ గ్రంథిలలోనే మూత్రాధిక్యత గలిగించే అల్డోషిరోన్ అనే హార్మోను తయారవుతుంది. పిట్యూయిటరీ గ్రంథికి పురుషులలో వీర్యోత్పత్తిని శాసించే హార్మో నును స్త్రీలలో రజఃకోశమును (Ovary) శాసించే హార్మోనును కూడా ఉత్పత్తి చేస్తుంది. కంఠము ముందు భాగములో ఉన్న థైరాయిడ్(thyroid) గ్రంథి సర్వజీవిత కార్యకలాపమును శాసిస్తుంది. పిట్యూయిటరీ గ్రంధికి స్పందనములు థైరాయిడ్ గ్రంథి ద్వారా కూడా లభిస్తాయి. పిట్యూయిటరీ గ్రంథి శుక్లశోణితముల(Male Sperms) ఉత్పత్తికి కారణ భూతమైన గోవాడో ట్రాఫిక్ హార్మోను ఆ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోనులలో ఒకటి. ఈ పై విషయములు ఆధునిక శాస్త్రజ్ఞులకు చాలా కొద్దికాలము క్రిందటనే తెలిసినవి. హోరా శాస్త్రము కలియుగారంభ కాలములో అంటే సుమారు నాలుగు వేల సంవత్సరముల క్రిందట వ్రాయబడినదని తెలుస్తుంది. అప్పటికే ప్రాచీన మహర్షులకు ఈ పరమ నిగూఢ శరీర ధార్మిక రహస్యములు తెలియునని హోరా శాస్త్రము రుజువు చేస్తున్నది. ఒకప్పుడు Pineal Body గురించి శాస్త్రజ్ఞులకు తెలియదు. ఈ మధ్యనే ఆ గ్రంథిని గురించి పరిశోధనలు జరుగుతున్నవి. పూర్వము సరీసృపములకు (Reptilia) మూడవ నేత్ర ముండేదనీ ఆ నేత్ర-చిహ్నమే (Vestige)పినియల్ గ్లాండు అని తెలుసుకున్నారు. మాస్టరు పిట్యూయిటరీ పినియల్ బాడీలను కలుపుతూ Hip-Rod అనేది యేర్పడుతుందన్నారు. ఈ యోగ సాధకులు శరీర ధర్మశాస్త్రము (Physiology) చదవాలని మాస్టరుగారు ఆదే శించారట. మాస్టర్ యోగ పరిభాషలో తరుచు కనుపించే పిట్యూయిటరీ అన్న శబ్దము ఆధునిక శరీర శాస్త్రములో వర్ణింపబడ్డ పిట్యూయిటరీ గ్రంథి అని గట్టిగా చెప్పలేము. కాని (Man-Form Pituitary) మానవ సృష్టి బీజములను ఉత్పత్తి చేస్తుందని ప్రవచించారు. జ్యోతిశ్శాస్త్రము కాల పురుష శరీరమును మానవదేహంగా భావించి ఆయా అవయవములకు(body organs), అంగములకు ఆయా గ్రహములు అధినేతలని పేర్కొన్నది. మాస్టరు బోధనలలో నక్షత్రములకు, గ్రహములకు, భూమికి, భూమిపై జన్మించే మానవులకు చాలా సంబంధ మున్నదని పేర్కొ న్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి