మాస్టరు గారి యోగమును ఉద్దేశించి శ్రీ గాలి బాలసుందర్ రావు గారు తెలియచేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు
మాస్టరు గారి యోగమును ఉద్దేశించి శ్రీ గాలి బాలసుందర్ రావు గారు తెలియచేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు.
కర్మను నిర్దేశించే శక్తి యేది?
వ్యక్తి చేయవలసిన కర్మలు ముందే నిశ్చయింప బడి వుంటే అతను చేసిన నేరాలకు అతన్ని శిక్షించటంలోగాని మంచి గుణాలను ప్రస్తుతించడంలో(rewarding) గాని అర్థమేమీ లేదు.
మానవుడిలో ఒక సదసద్వివేక శక్తి ఉన్నది. అది భగవద్దత్తమైనా కావాలి, స్వార్జితమైనదైనా కావాలి.
భగవద్దత్తమైనదే అనుకుంటే భగవంతుడు, చెడ్డవాళ్ళను కావాలనే సృష్టిస్తున్నాడన్న మాట. మానవుడే స్వశక్తి వలన ఆ చెడ్డ గుణాలను రూపు మాపుకోవాలి.
అప్పుడు తండ్రి చేసిన చెడ్డ ఋణాలు(debts) కొడుకు తీర్చినట్లు భగవంతుడు చేసిన లోపములు మానవుడు సవరించగలవాడవుతాడు. ఒక విధంగా భగవంతునికన్న గొప్ప వాడపుతాడు.
నిర్లోపమైన ఉత్తమ-గుణ-సంపద మాత్రమే కలిగిన వారిని సృష్టి శక్తి నిర్మించ లేకపోతున్నది. అట్టి వారిని నిర్మించాలని తాపత్రయపడుతున్నది.
సృష్టి ప్రారంభ కాలంలో బ్రహ్మపదం రెండు భాగాలై బహిర్భాగం(exterior) అనాసక్తమూ(Disinterested) అనంత శక్తి(infinite power) సంపన్నమూ (wealthy) అయినా నిర్వికారము(changeless, expressionless, emotionless) అయినది గానూ అభ్యంతర భాగము(The Objectionable Second Part) సృష్టి వాంధా-రుద్ధమూ(Objectionable) పూర్ణాత్పూర్వమూ(Fully Complete nor Fully Incomplete), అందువలన కించిత్ లోపభూయిష్టము అయిన సృష్టి --> శక్తి గా మారిందనుకుంటే ఈ సృష్టిలో లోపాలు వివరించటానికి, సవరించటానికి అవసరమైన శక్తి ప్రసాదించమని అనాసక్త(dispassionate/అభ్యంతర భాగము) బ్రహ్మను వేడుకుంటానికి, ప్రార్థనకూ, దైవ భక్తికి ఉన్న సంబంధమును ఊహించటానికి వీలుంటుంది.
సృష్టి కార్యములను నిర్వహించటానికై తరతమ శక్తి సంపన్నులైన గ్రహ గోళాది అధికారిక అధికారులను (Hierarchies) సృజిం చాడనీ, ఈ విశ్వ సృష్టి ఆ పరబ్రహ్మ చేసిన సృష్టి అనీ, ఇందులో లోపములన్నీ వారివేననీ ఆ లోపములు సవరించడానికై మాస్టర్ పూనుకున్నాడనీ అనేక పర్యాయములు మానవ రూపంలో జన్మించి, మానవుల లోపాలు సవరించుకునే శక్తి మానవులకే కలిగిస్తూ వచ్చాడనీ, ప్రేమాత్మకము, అనంతాయుర్దాయ సంపన్నమూ అయిన మానవజాతిని సృష్టించే విధానాన్ని ప్రసాదించటానికై “మాస్టరు సీవివి” గా అవతరించాడనీ అనుకుంటే సృష్టి కార్యము, సృష్టి లోపములూ వాటి సవరణ విధానములు, అర్థ మవుతవి. ఇది ఊహాగానం కాదు. ఇల్లా నేను భావించటానికి చాలా కారణములున్నవి.
మాస్టరు తమ విధానం ప్రస్తుత పరిణామ (Evolution) విధానం సాగిపోతుండగానే దానికి భంగమూ ఆటంకమూ వాటిల్లకుండా పరివర్తన ఏర్పరుస్తుందన్నారు.
మాస్టరుగారు తన యోగం Revolution in Evolution కలిగిస్తుందన్నారు.
మాస్టరుగారు బోధన అంతా 80% ఇంగ్లీషు పదములతో 9% ఆరవ పదములతో 1% తెలుగు పదములతో నిండి ఉన్నది. వారు ఇంగ్లీషు భాషలో తమ యోగ-తత్వమును(Yoga Philosophy) బోధించడానికి కారణములు చాలా ఉన్నవి. అవి వివరించటానికి వేరే పుస్తకమే రాయాలి.
ఇంగ్లీషు పెద్ద అక్షరముల (Capital Alphabets of English) వికసనము(looks blooming) యోగ వికాసమునకు అనుకూలంగా ఉండటం, ప్రచారంలో ఉన్న గీర్వాణ-సంస్కృత పదములు అనేక అర్థములు కలిగి వివాదములకు కారణం కావటం, ఇంగ్లీషు భాష ప్రపంచంలో బహుళ ప్రచారానికి వీలైనదిగా ఉండటం కొన్ని కారణములు, యోగ పరిభాష ఇంగ్లీషు లాగే ఉంటుంది. కాని ఇంగ్లీషు కాదు. ఉ॥ (Mechary. m. R. O. Lordians) మాస్టరు యోగాభ్యాస అనుభవములును వివరించే డైరీలన్నీ ఇంగ్లీషు భాషలోనే ఉన్నవి.
సర్వమతములవారు, సర్వవర్ణములవారు, సర్వజాతులవారు వారి వారి దేశ మత కులాచారములను పాటిస్తూ, స్త్రీ పురుష విచక్షణ లేకుండా యీ యోగాభ్యాసం చేయవచ్చును.
సాధకులుగా ‘గాయత్రీ మంత్రము తప్ప ఇతర బీజాక్షరములు ఉచ్చ రించరాదని మాస్టరు ఆదేశించారు.
(‘ఓం’ అనేది ప్రథమ బీజాక్షరము. ఆ ‘ఓం’ అనే ప్రథమ బీజాక్షరము క్రమముగా యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజములుగా ఉత్పత్తి చెందినది.
అవియే ‘ఐం’ ‘హ్రీం’ ‘శ్రీం’ ‘క్రీం’ ‘క్లీం’ ‘దం’ ‘గం’ ‘గ్లౌం’ ‘లం’ ‘వం’ ‘రం’ ‘యం’ ‘హమ్’ ‘రాం’ అనే బీజాక్షరములు.)
అది మాస్టరుగారు ప్రచురించిన యోగా స్కూల్ డైరీలో ప్రచురింపబడి ఉన్నది.
ఇంకా చాలా నిబంధనలు ఉన్నవి ప్రశిష్యులలో చాలామందికి అవి తెలియవు.
“ధి యోయోనః ప్రచోదయాత్” అన్న గాయత్రీ మంత్ర భావం “Please make me fit to realise Brahmam” అన్న ప్రార్థనా వాక్యానికి సమానము.
ఒక మందు అందరికీ వికటించదు. మంత్రమూ అంతే. మంత్రాక్షరముల ప్రభావమును అనుభవించడానికి జన్మాంతరీయ సంస్కారం కావాలి. ఆ అక్షరములను ఉచ్చరించగా ఉచ్చరించగా, ఆ సంస్కారం ప్రతి వారికి కలుగుతుంది.
“ఒరుఎళిత్తు కొల్లుం; ఒరు ఎళిత్తు వెల్లుం.” ఒక అక్షరం చంపుతుంది. ఇంకొక అక్షరం రక్షిస్తుంది. అని ఆ మాట కర్థము.
ఏ యితర బీజాక్షరములను ఉచ్చరించరాదని మాస్టరుగారు ఆదేశించారు.
యోగం అభ్యసించేవారు అల్లాచేయడం చాలా ప్రమాదకరమని స్వానుభవం వల్ల చెబుతున్నాను.
నూతన యోగంతో మానవుడు ఆది-మానవుడై(పరబ్రహ్మ ఆశించిన) బ్రహ్మత్వము పొందడానికి అవకాశం ఉంటుంది.
అప్పుడు ఊర్ధ్వలోకవాసులనీ అధోలోక వాసులనీ, భూలోకవాసులనీ వైవిధ్యం ఉండక, అందరూ కలేబెట్టిన ఉప్మాలో రవ్వ గణములలాగా క్రిందికి పైకి అటూ యిటూ తిరుగుతూ జ్ఞానాగ్ని ప్రాభావితులౌతూ బ్రహ్మలక్షణ సంపన్నులౌతారు.
సృష్టి కార్య నిమగ్నమైన సగుణమైన బ్రహ్మమూ, అనాసక్తమూ నిర్గుణమూ అయిన బ్రహ్మమూ శాశ్వతమూ, నిర్లోపమూ ప్రేమాత్మకము అయిన ప్రాణికోటిగా మారి పోతారు.
మన మందరమూ మన లోపాలను సవరించుకుని ఉత్తమమూ నిర్దోషమూ అయిన సంతానాన్ని కనాలని కోరుతున్నాము. ఆ కోరికతోనే మనలను సృజించిన శక్తి కూడా సృజించి ఉంటుంది. కాని నిర్లోపమైన సృష్టి చేయలేక పోయింది.
సృష్టి శక్తి, ఇచ్ఛాజ్ఞాన-క్రియా శక్తులలో అసమగ్రతవల్ల యీ లోపం యేర్పడి వుంటుందా?
ఆ లోప నివారణకు బ్రహ్మమే పూనుకుని మాస్టరు రూపంలో వచ్చి, సూతన యోగ మార్గాన్ని స్థాపించి, స్థూల శరీరం విసర్జించి అన్య-మండల ప్రవేశం చేశారు.
మరణం లేకుండా చేస్తానన్న మాస్టరే మరణించాడన్న ఆక్షేపణకు అర్థం లేదు.
పాంచ భౌతికమైన దేహం ధరించిన మాస్టరు, ఆ దేహ విసర్జనానంతరం మాస్టరు గుణలక్షణములు గల దివ్యదేహంతో (సూక్ష్మ రూపంతో) ఆకాశంలో సంచరిస్తూ, తన యోగవిధానాన్ని సంపూర్ణము చేస్తున్నారని భుజండర నాడి; గార్గ్య నాడి; హోరా శాస్త్రములు చెబుతున్నవి.
డాక్టరు వెంకటరంగం నాయుడుగారు, మాస్టర గారు భౌతిక రూపంలో తనకు కనిపిస్తున్నారనీ వారు మాట్లాడే మాటలు మాత్రం తాము వినలేకపోతున్నామనీ నాతో చెప్పేరు
శ్రీ వి. వెంకటరమణరావుగారు మాస్టరు కనబడుతున్నారనీ, తనతో మాట్లాడుతున్నారనీ చెబుతున్నారు.
వీరి ఇంద్రియములు నూతన యోగసాధనతో అత్తింద్రియములై మాస్టరు ధరించిన దివ్య దేహమును చూడగలుగుతున్నవి. వారి మాట వినగలుగుతున్నవి.
తరంగములను వెంకటరంగం నాయుడుగారు వినలేకపోతున్నారు. అందు కింకా సాధన కావాలి.
మాస్టర్ ప్రియ శిష్యులలో వొకరైన యస్. నారాయణయ్యరు గారి సతీమణి భౌతిక రూపంతో మరణించిన తన భర్త తనకు కనబడుతున్నాడనీ ఆయన మాటలు మాత్రం వినపడటం లేదనీ నాతో అనేవారు.
నారాయణయ్యరు దంపతుల పరిచయ భాగ్యం కలిగిన తరువాతనే అద్భుతములైన అనుభూతులను సాధనాకాలంలో నేను పొందకలిగేను, మాస్టరు ‘సచ్చిష్యులు’(శ్రద్ధగా యోగాభ్యాసము చేసి పరిణతి పొందిన వారు) భౌతిక మరణానంతరము, సూర్యమండలం ప్రక్కన నూతనంగా యేర్పడిన మండలంలో పునరావృత్తి లేకుండా వుంటారనీ భూమి మీద వుండే ‘సచ్చిష్యులు’ వారిని చూచి మాట్లాడగలుగుతారని హోరా శాస్త్రము చెబుతున్నది.
సాధారణ నేత్రములు చూడ లేని కాంతి కిరణములను – ఉదాహరణానికి మనం X-Ray కిరణములను అల్ట్రా వయొలెట్(Ultra Violet) కిరణములను చూడలేము.
యోగాభ్యాసంతో సాధారణ ఇంద్రి యములు అతీంద్రియములైనప్పుడు చూడగలవు. అల్లాగే ఇతర ఇంద్రియములు సాధారణ స్థితిలో గ్రహించలేని రేడియేషను లెన్నో వున్నవి.
ఇతరులు చూడలేని కాంతులను, వినలేని శబ్దములను ఈ నూతన యోగ సాధన వల్ల అభ్యాసకులు చూడగలుగుతారనీ వినగలుగుతారనీ అనుభవరీత్యా నిర్ధారించబడింది.
01-May-1962 నుంచి అట్టి అనుభూతులు కలుగుతున్నవి. ఇంకా చాలామందికీ కలుగుతున్నవి.
ఈ యోగము ఇంద్రియములను, మనస్సును లయింపజేసే మార్గం కాదు; అతీంద్రియ శక్తులను కలిగించే యోగము; ఇచ్చానుసారంగా జాగ్రదావస్థలోనే.
మనస్సును అనూహ్య దూరస్తములైన ఊర్ధ్వ మండలములకు పంపి, అచ్చటి విషయములను గ్రహింపజేయగల యోగము.
మాస్టరుగారూ, వారి సతీమణి అయిన వెంకమ్మగారూ, వారి ఆనుగ్రహపాత్రులైన కొందరు మీడియములూ ఈ అద్భుత శక్తు లను సాధించారు.
ఆ శక్తులతో ఆనుభూతములైన విషయములను మాస్టరుగారు స్వహస్త లిఖితములైన డైరీలలో తేదీవారీగా రికార్డు చేసి వుంచారు.
దీప-దర్శనము, శబ్ద-శ్రవణము, శిష్యప్ర శిష్యులలో కొంత సొధన చేసినవారిలో జన్మాంతరీయ సుకృతమును బట్టి చాలామందికి అనుభూతములవు తున్న ‘రోగ నిబర్హణః' శక్తి[Disease Healing(self/others)] కలుగుతున్నది.
కాని మనస్సును వారి ఇచ్చాశక్తితో ఊర్ధ్వమండలములకు పంపగల శక్తిని సంపాదించినవారు నాకు తెలిసినంతవరకు లేరు. ఈ శక్తిని సాధించకుండా చిలవలు పలవలు కల్పించి చెప్పేవారూ వున్నారు. వారు చాలా దయనీయులు(Miserable).
ఈ యోగ సాధనకు వైజ్ఞానిక వైఖరి, సత్యాన్వేషణా తత్పరత అవసరము.
మాస్టరుగారు వారి ముఖ్య శిష్యులూ భౌతిక దేహములు విడచి పెట్టడంతో ఈ యోగవిధానమే అంతరించిందనుకోడం అవివేకము. చనిపోయినవాళ్ళ జాతక వివరములు హోరా శాస్త్రంలోనూ నాడీ గ్రంథములలోనూ వర్ణింపబడవు.
మాస్టరు గారి జాతకం, నారాయణ అయ్యరుగారి జాతకం శ్రీ పి. నరసింహంగారి జాతకములు హోరా శాస్త్రంలో చూస్తే బ్రతికివున్న వారి జాతకములలోలాగే దశాభుక్తం వారీగా ఫలితములు చెప్పబడివున్నవి. అవి జరుగుతున్నవి.
మాస్టరుగారు అష్ట సిద్దేశ్వర్య సంపన్నుడిగా, జరామరణ విరహితుడని హోరా శాస్త్రంలో వర్ణింపబడి వుంది.
ఇనిషియేషన్(ఉపదేశము) అయిన క్షణం నుండి మీడియం నరాశయంలో మార్పులు జరుగుతవనడానికి, మీడియం ప్రయత్నం లేకుండా నమస్కారం రావడమే తార్కాణం. ఇంకా యితర అనుభూతులున్నవి.
కీ.శే. శ్రీ వేటూరు ప్రభాకరశాస్త్రి గారి చికిత్సా శక్తిని గురించి ఎరగనివారు అరుదు.
మాస్టరుగారు సృష్టి ఆరంభ దశను వివరిస్తూ Motion (చలనం)కు కారణం Truth (సత్+యం) అన్నారు. (ఈథర్ స్వభావమేమిటో ఎవరికి తెలియదు. అసలు ఈథరే లేదంటున్నారు కొందరు శాస్త్రజ్ఞులు. కానీ శూన్యము ‘మీడియము’గా వ్యవహరించలేదు.
ఈథర్ ద్వారానే విద్యుదయస్కాంత కిరణములు ప్రయాణం చేస్తవి.
ఈథరు పైన విద్యుదయస్కాంత కిరణములు ఆరంభించే “ఎలెక్ట్రో మేగ్నెటిక్ బెల్టు” వున్నది. (Electro Magnetic Belt) ఆ పైన యేముందో చాలా కాలం తెలియలేదు.
ఈ మధ్య ఒక భారతీయ శాస్త్రజ్ఞుడు అక్కడ ఏ ‘ఎలెక్ట్రిక్ ఛార్జీ లేకుండా కాంతి కిరణవేగంతో – అంటే సెకండుకు 1,88,000 మైళ్లు ప్రయాణించే రేణువులున్నవని కనుక్కున్నాడు.
శక్త్యాహతము(greater force) అయితేనే గాని ఏ వస్తువూ చలించదు. ఏ మహాశక్తి ఈ రేణువులను అంతటి వేగంతో చలింపజేస్తున్నది? (Truth?))
విజ్ఞానం ఈనాడు వివరిస్తున్న విషయాలు స్వహస్త లిఖితములైన డైరీలలో మాస్టరు గారు 1919 నాటికే వ్రాసి వున్నారు. (విద్యుదయస్కాంత పటలమే ఏ ఛార్జ్ లేని విశ్వ రేణువులకు ఛార్జ్ సమకూర్చి. పాజిటివ్, నెగెటివ్ రేణువులుగా మారుస్తున్నది.
అత్యంతాధునిక శరీర ధార్మిక(Physiological) పరిశోధనా ఫలితముల వల్ల
జీవకణ కార్యక్రమమంతా విద్యుదాకర్షణవల్లనే జరుగుతున్నదని తేలింది.
విశ్వరేణువులు ఎందువల్ల విద్యుద్ధన ఋణ రుద్దములై, సంఖ్యాభేదములతో కలునుకొనడం వల్లనే “అణు”, “కణ”, “ధాతు”, “కోవ”, “శరీరములుగా నిర్మింపబడ్డవో తెలుసుకుంటే బ్రహ్మపద స్వరూప-స్వభావములే అర్థమౌతవి.)
సృష్టికి మూలము బ్రహ్మం(one-point/parabramham/paramjyothi/etc) అనుకుంటే ఆ బ్రహ్మానికి సృష్టించే గుణమో, లక్షణమో వున్నది.
ఆ శక్తిచేత సృష్టింపబడిన మనం సృష్టిశక్తిని నిర్గుణంగా భావించడము, మనకు నిర్గుణత్వాన్ని ఆరోపించుకోడమే గదా!
దాన్ని తెలుసుకుని, మనం తనంతవాళ్ళము కావాలనే సృష్టికర్త అయిన బ్రహ్మం కోరుతున్నది.
అందుకే "బహుశాం ప్రజాయేయేతి” అని సంకల్పించుకున్నది.
అందుకే ఇంద్రియ, మనో, బుద్ధి-వివేకాదుల్ని మానవులకు ప్రసాదించింది. వాటి శక్తుల్ని పెంపొందించుకుని బ్రహ్మమును తెలుసుకోవాలి.
బ్రహ్మము అవాంజ్నానసగోచరమనీ, ఇంద్రియాతీతమనీ నీళ్ళు గారిపోవడం నిరాశా వాదము; పిరికితనము.
సృష్టిశక్తి మానవుల్ని నిర్మించి, ప్రతిభ, మేధస్సును యిచ్చి! అతీంద్రియత్వాన్ని ప్రసాదించే యోగ విజ్ఞానాన్ని ప్రసాదించి, యింతవరకు తెచ్చింది.
“ఇక మీద నాకు తెలియద" అని కాళ్ళు పార జాపడానికి కాదు.
విజ్ఞానమొకప్రక్క విశ్వరహస్య బేధనసాధనములను మానవులకు ప్రసాదిస్తున్నది.
అంతకన్నముందే పురాతన కాలములో సత్యసందర్శనశీలులైన ప్రపంచ మహర్షులు- వారే భౌతిక దేహ పరిత్యాగానంతరం విశ్వ మహర్షులౌతారు.
యోగాది శక్తులతో ఎంతవరకు పైకి పోవడానికి వీలుందో అంతవరకు వెళ్ళి, చూసి తమ ప్రయోగ వివరాలను ఫలితాలను “పరిభాషా కల్పితములైన సూత్రములలో వ్రాసిపెట్టేరు.
మేషశని సంచార కాలంలో మాస్టరుగారి చర్యలను వివరించే హోరా శాస్త్ర భాగంలో ఈ క్రింది వాక్యములు ఈ అభిప్రాయమును బలపరుస్తున్నది.
ఆది దేవెచ ఋగ్వేదే
సప్తవింశతి సంఖ్యకే
గౌతమేన ప్రయోగత్వే.
సప్తత్రింవస్తు ఆధ్యాయకే
అణున్నాం జణురూపత్యే.
రసాయ సేన ప్రక్రియాత్ !
——————————-
చికిత్సాయాంచ కర్మణ్యే
పునర్ హృదయం ప్రదర్శితం.
ఆది-వేదమయిన ఋగ్వేదంలో 27 వ సంఖ్యలో గౌతమ (ఋషి) ప్రయోగములు (వివరించబడ్డవి. ఆ వివరణలో) 37వ అధ్యాయంలో రసాయన ప్రయోగం వలన అణుపు “జణువు” రూపమును పొందే విధము వివరించబడ్డది. చికిత్సలో ధ్రాని సహాయంచేత మళ్ళీ హృదయం ప్రదర్శింపబడుతుంది.
[వానిచేత ఆగిపోయిన గుండె కొట్టుకునేటట్లు చేయవచ్చు.]
ఋషులనబడేవారు పురాతనకాలపు శాస్త్రవేత్తలనుకుంటే, వేదము వారి పరిశోధనలను వివరించే సంహిత అనుకుంటే అది ఒకేమారుగా చెప్పబడింది కాదనీ, సంహితము(Compiled) అని తెలుస్తుంది.
“అణువు” “కృణువు” “జణువు” “పర మాణువు” ఇవి ప్రత్యేకము విశిష్టమూ అయిన అర్థములతో వివరింపబడిన పారిభాషిక పదములు.
తెలుగు లిపిలో అచ్చు వేయబడిన ఋగ్వేదనామక పుస్తకంలో ఇవేవీ లేవు. ఇతర పాఠ్యాంతరములను గూడా చూడాలి. అవి గీర్వాణ వేత్తలు చేయవలసిన పని.
ద్రావిడ భాషలో మంత్ర, యోగ, వైద్యములను వివరించే 12,000 శ్లోకములున్న గ్రంథమును అగస్త్యుడు రచించాడనీ దానిని మాస్టరు చదివేరనీ హొరా శాస్త్రములో వున్నది.
కుంభకోణంలో విచారించినా మాస్టరు డైరీలు చూచినా ఆ విషయం కనబడడం లేదు.
ఒక్క మాట నిజం. హోరా శాస్త్ర కాలంనాడు (కలియుగారంభ కాలము 5000 సంవత్సరములకు ముందు) ఉన్న వేద శాస్త్రగ్రంథ ములు ఈనాడు ప్రచారంలో లేకుండా పోయినవనీ, అవి నాశనమైపోయినవనీ (వేదశాస్త్రా వినాశనం) హోరా శాస్త్రంలోనే వుంది.
అవి జీర్ణించినవో, నాశనము చేయబడినవో, తస్కరించబడినవో తెలియదు.
తల్లిదండ్రులు తమకన్నా గొప్ప వాళ్ళయ్యే సంతానాన్ని కోరతారు. తల్లిదండ్రులందరికీ మూలమైన ఆది దంపతులూ, వారిని సృష్టించిన బ్రహ్మమూ, యిల్లాగే కోరి ఉండాలి.
అందుకే ఆ శక్తి (బ్రహ్మమూ) విజ్ఞాన ప్రజ్ఞానములను కాలక్రమేణ ప్రసాదిస్తూ వస్తన్నది. ప్రకృతి రహస్యములను భేదించే శక్తినీ, ప్రజ్ఞను పరికరములనూ అప్పుడప్పుడు మనుష్యరూపంలో అవతరించి మానవకోటికి ప్రసాదిస్తున్నది.
మాస్టరు ఆటువంటి అవతారము.
ఈథర్(Ether) అన్నమాటకు బదులుగా ‘ఆకాశము’ అన్న మాటను కొందరు వాడుతారు. ఆకాశం, పంచ భూతములలో ఒకటి.
ఆకాశం పైన ‘మహాతమము’ దానిపైన ‘మహాశ్వేతము’ అనే భూతము లున్నవనీ వీటిని ఆవరించి బ్రహ్మపదమున్నదనీ హోరా శాస్త్రములో వున్నది. అంటే కొబ్బరి చిప్పల్లో కొబ్బరిలాగా, మారేడు డొల్లలో గుజ్జులాగా బ్రహ్మపధం గర్భంలో విశ్వమున్న దన్నమాట.
ఆకాశము భూతమైతే అంతకన్నా ‘సూక్ష్మ’ (Subtle) మైన దానినుండి, ఆది సృష్టి ప్రారంభంలో ఏర్పడి వుండాలి. ఆ అత్యంతమైనదీ పరమ-అవధి అయినదీ బ్రహ్మము.
పైన చెప్పబడిన ఏడు భూతములు గాయత్రీ సప్త వ్యాహృతులు కావచ్చు.
మాస్టరుగారు, తనయోగ సాథకులు గాయత్రి మంత్రాక్షరములు తప్ప మరే బీజాక్షరములు ఉచ్చరించరాదని ఆదేశించడానికి కారణమదేకావచ్చు.
బ్రహ్మపదము(బ్రహ్మం ఎరపడక మునుపు) సమకార, సమదూర, సమవాయములైన రేణుమయము. దాని ఏకత్వము, అనూహ్య సంఖ్యాత్మకమైన రేణువుల సమత్వములో వున్నది.
పంచదార, వెయ్యి గడప; లక్షకోతి అనే సాంప్రదాయంలో అనేకత్వములో ఏకత్వము ఊహించబడి ఆరోపించ బడ్డది.
పాంచ భౌతికమైన దేహం, భూతమిశ్రమము ఆయుర్వేదవిదులు అభివర్ణించిన వాయు, శ్లేష్మ పిత్తాది దోషములు భూత రూపాంతరములే.
వాయువు ఆకాశమునుంచి యేర్పడింది. (ఆకారాద్యాయు॥) ఆకాశము అత్యంత సూక్ష్మమైన భూతము
భూమి అత్యంత స్థూలము
జీవము(Life) అన్నది వాయుతేజోభూతముల మిశ్రమమేమో!
ప్రాణా, ఆపాన, వ్యాన, ఉదాన, సమానములని వాయువులు అయిదట అత్యంత సూక్ష్మమైన ఆకాశభూతమును --- ఆత్యంత స్థూలమైన భూమిని వదలి వేస్తే, మిగిలిన మూడు భూతములు క్రమంగా వాత, పిత్త, శ్లేషములు అనబడే త్రిదోషములుగా దేహములో వున్నవని, వాటి స్వస్థస్థితి అనారోగ్యమని ఆయుర్వేద విదులు భావించారు.
నీరు, తేజో వాయువులు ఆకాశభూతము కలిస్తేనే గాని జంతు శరీరము యేర్పడదు.
భోజ్యములైన వృక్షదేహములు నాలుగు భూతములతోనే ఏర్పడ్డవట. కాని మాంస భక్షణచేసే వైన వృక్షములు కూడా వున్నవి.
భూత మిశ్రమానికిగాని ప్రాణధారణ శక్తి వుండదు. ఆప్రాణధారణ కాలము వివిధ జీవుల్లో వివిధములుగా వున్నది.
జీవికి ఆహారము, ప్రాణవాయువు అవసరం. అందుకు జీర్ణ, శ్వాస, రక్త సంచార కోశములు అవసరం. ఆహారం వివిధ అణు మిశ్రమం. అ అణుపులన్నీ వాయువు (గాలి) యందు వున్నవి.
ఏ ఆహారపదార్థమైనా వివిధాణువులు సంఖ్యాభేదంతో కలియడం చేత ఏర్పడే కాంపౌండు వస్తువులు కలియడంవల్లనే ఏర్పడుతుంది.
అది పాక జీర్ణ ప్రక్రియలతో మార్పు చెందుతుంది. ఆ మార్పు జీర్ణకోశంలో జరుగుతుంది.
వాయువులో అణువుల్ని పీల్చి, వాటిని దేహ ధాతు నిర్మాణానికి అవసరమయిన రీతిలో జీవకణములే తయారు చేసుకుంటే జీర్ణ కోశంలోనూ రక్త సంచారకోశంతోనూ అవసరం వుండదు.
వివిధాణువుల కార్య కలాపాన్ని సమన్వయించడం కోసం, తన ఉనికికి, ధర్మ నిర్వహణకూ ఇతరకోశ ములపై ఆధారపడని నరకోశము ఒక్కటే ఉంటే చాలు.
మూలాధారాశ్రయమయిన కుండలినీ శక్తి, సహస్రారంలో వున్న సృష్టిశక్తిని చేరుకున్నప్పుడు విశ్వప్రేమాత్మ కములైన ప్రాణి దేహములు రావచ్చు గదా!
అన్ని ప్రాణులకు అన్య ప్రాణుల్ని ప్రేమించే స్వభావమే యేర్పడ్డనాడు, జీవితంలో ద్వేషజనితమైన సంఘర్షణా యుద్ధాలు, సైన్యాలు, ప్రభుత్వ విధానాలు అవసరం లేదుగదా?
ఈ నూతనయోగం శరీరధాతువుల రసాయనిక స్వభావమును మార్చి పైన వివరించిన శక్తుల్ని కలిగి స్తుందేమో! అయితే ఆ విధంగా రూపొందిన దేహము వాయుపటలంవరకే పోయి జీవించగలదు. ఆ పైకిపోయి జీవించాలంటే అపై పటలములు రసాయనిక నిర్మా ణమును గురించి అక్కడ వుండగలగడానికి దేహములో జరగవలసిన మార్పులను గురించి ఊహించ గలగాలి.
బ్రహ్మపదము ఏ వుద్దేశ్యంతో యీ సృష్టిః పూనుకున్నదో ఆ ఉద్దేశ్యమును నెరవేర్చే ప్రాణి నమూనా ఇంకా తయారు కాలేదు. ఆ నమూనాను తన యోగంతో మాస్టరు సృష్టించదలచారు.
ఇందులో కొన్ని సంపుటికృత శబ్దముల ఉచ్ఛారణతో, తరువాత వాటి మననంతో, సాధకుల దేహంలో మార్పులు జరుగుతవని అనుభవించి తెలియపరుస్తున్న విషయము ఇందుకు గురూపదేశము (Initiation) అవసరమనీ అందుకు అర్హత అవసరమనీ, అది అందరిలోనూ ఉండదనీ, కొన్ని పరిక్షలతో దాని ఉనికిని నిరూపించి, ఆ యోగార్హత వున్న వారినే మొదట్లో యోగ మిత్రమండలిలో(Master's Yoga School: Friends Society) జేర్చుకోవడం జరిగింది.
అప్పట్లో బ్రాహ్మణులైన స్త్రీ పురుషులకు ఇనిషియేషన్ రుసుములో భేదం కూడా వుండేది. కాని యోగ విధానం ఒక దశకు వచ్చిన తరువాత ఆ వివక్షణను మాస్టరే తీసివేశారు.
మీడియముల రోగ నిబర్హణ(disease healing) గూడా జరిగింది.
మాస్టరుగారు భౌతిక దేహం విడచిన తరువాత, కుంభకోణ వాస్తవ్యులూ, మాస్టరుగారి చేతనే ఇనిషియేట్ కాబడిన వారూ జ్యోతిష్కులు అయిన శ్రీ యన్. ఆర్. బి. వీ., ఒంగోలు వాస్తవ్యులూ, మాస్టరుగారే ఇనిషియేట్ చేసినవారూ అయిన మైనంపాటి నరసింహంరావుగారు ఇంకా కొందరు సీనియర్ మీడియములూ, మాస్టరు బిరుదు ధరించి ప్రార్థన వాక్యముతో సి. వీ. వీ. తో బాటు తను నామాక్షరములను చేర్చి. ఉపదేశములు సాగించారు;
దీనిని శ్రీయుతులు శ్రీ వేటూరు ప్రభాకరశాస్త్రి, యస్. నారాయణయ్యరూ, పోతరాజు నరసింహంపంతులూ సమర్ధించలేదు.
నేను, శ్రీ యన్. ఆర్. బి. వి. గారిచేత ఇనిషియేట్ చేయబడిన వాణ్నే.
“కుంభకోణత్తిల్, కుంభమాదత్తిల్, కుంభలగ్నత్తిల్, కుంభముని మురయిల్ ఉపదేశ మడైందిడువాన్” అని గణేశనాడిలో నా జాతకంలో చెప్పబడింది. “ఇతడు కుంభముని(అగస్త్యుడు) మార్గంలో కుంభకోణంలో కుంభ మాసములో కుంభ లగ్నములో ఉపదేశము పొందుతాడు” అని ఆ వ్యాక్యార్ధము ఆ వ్యాక్యార్థము ఆ నాడి ఇనిషియేషనుకు కొన్ని మాసములకు ముందు చదవబడింది.
హోరాశాస్త్రంలో “మూల గురోస్తు పరంపరా” అని వాడబడింది.
మాస్టరు సీ. వీ.వీ. మూల గురువు. ఆ యోగ సాంప్రదాయాన్ని అనేకులు ప్రచారం చేయకుండా ప్రపంచ వ్యాప్తి చెందదు.
యావత్ మానవ కోటికి అందదు.
నా అనుభవంలో ఈ యోగాభ్యాసానికి గురూపదేశముంటూ అవసరమేలేదు.
ప్రాప్తమున్న వారికి మాస్టరుగారే ఆ బుద్ధి కలిగిస్తారు. ‘మాస్టరు సీ. వీ.వీ. నమస్కారం” అన్నశబ్ద సంపుటీకరణమే శరీరంలో మార్పులు కలిగించి, దానిని అతీత-కాయంగా మారుస్తుంది.
“ఆటోబయోగ్రఫిక్, అధారిటేటివ్, ఆనోమటోపిక్ వేవ్స్ వల్ల చిరంజీవిత్వమును సాధిస్తా”నని మాస్టరుగారు చెప్పేరు.
(Auto= స్వకీయమైన Bios= జీవిత Graphic= చరిత్రకు సంబంధించిన --- Authoritative = కర్తృ(the author) సంబంధమైన Anomotopic=అనో మొటోపిక్ అంటే ఒకఫలితమును కలిగే శబ్దములకు బదులుగా అదే ఫలితములను కలిగించే ఇతర శబ్దములను సృష్టించడం. వేవ్స్ = తరంగములకు) మొదటి ప్రార్థన తరువాత మాస్టరుగారు యిచ్చిన కోర్సులు ఆనోమెటోపిక్ శబ్ద సంపుటీకరణములే.
“ధియోయోనః ప్రచోదయాత్” అన్న గాయత్రీమంత్ర పదానికి “నా బుద్ధిని ప్రచోదింపుము” అని అర్ధము.
Master C.V.V. Namaskaram! Please make me fit to realise Brahmam and attain Independency in this life” మొదటి ప్రార్థన, ‘నన్ను బ్రహ్మము తెలుసుకొనుటకు అర్హుణ్ణి చేయుము అన్న ప్రార్థనకు ---- “నా బుద్ధిని ప్రభోదింపజేయుము” అన్న ప్రార్థనకు ఏమీ భేదంలేదు.
అందుకే “ఈ యోగాభ్యాసం చేసేవారు కావాలంటే గాయత్రి చేసుకోవచ్చును.
బీజాక్షర సమేతములైన యింకే మంత్రోపాసన చేయగూడదన్నారు మాస్టరు.
Master C. V. V. అన్న శబ్దసంపుటీకరణములో 09 అక్షరములున్నవి. కాగా యిది నవాక్షరి. ఇంతకన్నా యిక్కడ చెప్పడానికి వీలులేదు.
ఇది అవైదికమయిన మార్గం కాదనీ (నహీ అవైదికం స్యాత్) మ్లేచ్చభాషలో వున్నంత మాత్ర దూష్యము కాదనీ హోరా శాస్త్రములో వున్నది.
“మాస్టర్ సి. వీ. వీ. సమస్కారం అన్న శబ్దములు ఉచ్చరిస్తేనే సాధకుడి దేహంలో జరగవలసిన మార్పులన్నీ జరుగుతవి.
‘ఫిజికల్’ (Physical) ఏస్ట్రల్ (Astral) ఈథరిక్ (Etheric) అని మూడు పొరలు (Layers) ప్రతి వారి దేహంలోనూ ఉంటవి ఈ శబ్దములచేత అవి ప్రాభావితములౌతవి
ఏస్ట్రల్ మారి పోతుంది. ఏస్ట్రల్ బ్రహ్మపదంతో ‘మానవాత్మ’కు సంబంధం కలిగిస్తుంది.
‘బహ్మ కర్మ’ (గాయత్రీ జపం) చేయడానికి ముందు “ఉత్తిష్టంతు భూతపిశాచాః” అనడంలో ఉద్దేశం యిదే కావచ్చు.
ఏస్ట్రల్, ఈతరిక్ ఉపదేహములను అతీంద్రియ శక్తి లేకుండా చూడలేము. ఈ యోగసాధన సాధారణ నేత్రములు చూడలేని రేడియేషన్లను చూడగలిగే శక్తిని కలిగిస్తుంది.
ఈతరిక్ బాడీ అని వర్ణింపబడినదేదీ నేను చూడలేదు గాని, వైజ్ఞానిక విద్యార్థిగా నేను వివరించలేని దృశ్యములను జాగ్రదావస్థలోనే చూచాను.
సాధన చేస్తూపోతే ఏమవుతుందో చెప్పలేను, ఈ యోగసాధన శరీర కార్యములలో మనం వివరించలేని మార్పులు కలిగిస్తుందన్న మాట సత్యము.
“ఏదో శబ్దములు ఉచ్చరిస్తే శరీరంలో మార్పులు జరగడమేమిటి? ఇచ్చాదీనములై కండరములు అనియధీనములై నమస్కారం చెయ్యడమేమిటి?” అని సందేహించి గణేశనాడి ఫలితములనూ నూతన యోగమును స్వయంగా పరీక్షించడానికి వెళ్ళి, ఆ అనుభూతిని పొంది, పరిపూర్ణ విశ్వాసంతో, నాకున్న అల్ప శరీర వైద్య పరిజ్ఞానములతో ఆధునిక అణు విజ్ఞాన లేశముతో కేవలం వైజ్ఞానిక వైఖరితో ఈ యోగమును అభ్యసిస్తున్న వాణ్ణి!
ఈ యోగ స్వరూప స్వభావాదర్శములను గురించి భిన్నాభిప్రాయములు ఉన్నవి.
ఈ యోగ ఫలితములలో మరణరాహిత్య మొకటని మాస్టరు Six Contracts(Onepoint to Master) తో చెప్పిన మాట నిజము.
మాస్టరుగారే భౌతిక దేహమును విడచి పెట్టేరు ఇంకేముందని మండలభ్రష్టులై, మాస్టరుగారి చేతనే ఉపదేశ మును పొందినవారే యోగాభ్యాసమును విడచిపెట్టేరు.
1959 నుంచి హోరా శాస్త్రంతో నాకు పరిచయముంది. ఆ శాస్త్రము చదివే శ్రీ ఎ. యస్. నటరాజశర్మ గారు సోదరవాత్సల్యముతో నా కెన్నో కాండలు చదివి వినిపించారు.
వాటి సారాంశ మేమిటంటే అష్టగ్రహకూట సందర్భంలో మాస్టరుగారు జరా-మరణ విరహితమైన మానవదేహ నిర్మాణానికి మరికొంత కాలం పడుతుందనీ, ప్రస్తుతం సాధకులు భౌతిక మరణానంతరం పూర్వజన్మ స్మృతి కలిగి చిరంజీపులై సూర్యబింబానికి కుడివైపున ప్రత్యేకంగా యేర్పరచిన నక్షత్ర మండలంలో శాశ్వతంగా దివ్యదేహధారులై వుంటారనీ, శ్రద్ధతో యీ యోగాబ్యాసం చేసే సచ్చిష్యులకు(ఉన్నతమైన మంచి శిష్యులకు) ఆ తేజోమయ రూపములు కనబడతవనీ, వారనే మాటలు వినబడతవనీ హోరా శాస్త్రంలో మాస్టరుగారి జాత కంలో వున్నది, పోతరాజు నరసింహంగారు దేహత్యాగం చేసిన తరువాత వారి జాతకం చదవగా ఆ విషయమే వివరించబడింది.
మాస్టరు గారి ప్రశిష్యులచేత(శిష్యులకు శిష్యులు) ఈ యోగ విధానం వ్యాప్తి చెందుతుందనీ చికిత్సా విధానములలో శిఖామణి అవుతుందనీ, ప్రపంచ మతములలో ముఖ్యమైన మతమై, ప్రేమాత్మకమూ సర్వమానవ సమానత్వమూ సాధించే నవ-మానవ సంఘాన్ని స్థాపిస్తుందని హోరా శాస్త్రం ఉద్ఘాటిస్తుంది.
"బుద్ధిః కర్మనుసారిణి". ఈ యోగప్రాప్తి వున్నవారికే దానిని గురించి తెలుసుకోవాలనే కుతూహలమూ కలుగుతుంది. అట్టి వారికి వివరించి చెప్పడం సాధకుల విధి.
ప్రశిష్యులు రెండు రకాలుగా ఉన్నారు.
1) మాస్టరుగారు చెప్పిన కోర్సు లన్నీ క్రమంగా చేస్తూ మాస్టరుగారూ, చనిపోయిన మీడియములూ తమ భౌతిక దేహములతో మళ్ళీ వస్తారని నమ్ముతూ ప్రార్థనలతో తమ ఉపదేశగురువుల నామాక్షరములను మాస్టరు సీ. వీ వీ. లో చేర్చి ఉచ్చరించేవారు.
2) హోరా శాస్త్రాది గ్రంథములు చదివి ఈ యోగము ప్రయోగ నిర్ధారితమైన(experimentally proven) పరమ సత్యమనీ, యోగా దర్శనము పూర్తిగా సాధింపబడలేదనీ ప్రస్తుతం సాధకులు అందరి మానవులలాగే భౌతిక మరణము ననుభవించి, తేజోరూపులై ఆఖరు జన్మలో ఉన్నరూపంతో ఉండి, పూర్వ స్మృతి కలిగివుంటూ, వివిధ దేశములలో యోగ వ్యాప్తి చేస్తూ ఊర్ధ్వలోక వాసులతో సంబంధము యేర్పరచుకుని వారి అనుభూతుల్ని క్రింది లోకముల వారికి అందిస్తూ యోగ మార్గమును పరిపూర్ణం చేస్తారనీ, ఆ స్థితినందుకుంటానికి మాష్టరు నామాక్షరములే చాలుననీ విశ్వసించే నా వంటివారు.
కాని ఉభయులకూ ఆది గురువు మూల గురువూ మాస్టరు సీ. వీ. వీ యే!
అందరూ ప్రేమ భావపరిశుద్దులూ సమానులూ ఆయినప్పుడు Desire (కోరిక) అంటూ ఉండదు.
ఏదో కోరిక కల్గి, అది తీరనప్పుడే అసంతృప్తి ఏర్పడుతుంది. ఆసంతృప్తి అగిషడ్వర్గాలకూ అశాంతికి కారణం. ఆశాంతి జనితములైన ఉద్రేకాలే రోగారంభానికి కారణమని అత్యంతాధునిక వైజ్ఞానిక పరిశోధనలు నిర్ధారించినవి.
ఒత్తిడి(Stress) లేనిదే వ్యాధి లేదు.
Desireless state ఏర్పడితేగాని Deathless state యేర్పడదు. అ తర్వాత గాని Decayless State ఏర్పడదు.
Desireless state ఏర్పడాలంటే కలిగిన కోరికలన్నీ తీరనైనా తీరాలి. అసలు కోరికలే కలగకుండానైనా ఉండాలి. అల్లాగే మరణరాహిత్యం కావాలనుకుంటే పుట్టినవారు చావ కూడదు. లేదా చచ్చినవారు మళ్ళీ జన్మ యెత్తగూడదు.
మనకు “జన్మ” అంటే యోని జన్మ అని మాత్రమే తెలుసు. ప్రాణి అంటే పాంచభౌతికమైన ప్రాణి అనే తెలుసు. మన ఇంద్రియాలకు గోచరించని ద్విభౌతిక, త్రిభౌతిక జీవులుండ వచ్చుగదా. అట్టివారిని మనం చూడ లేము.
డాక్టర్ శ్రీ గాలి బాలసుందర్ రావు గారు
శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి స్నేహితుడు మరియు
శ్రీ పోతరాజు నర్సింహం గారి సన్నిహితుడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి