శ్రీ పోతరాజు నర్సింహం గారి నోట్స్ - ఉపోద్ఘాతం(Introduction Part 03)
శ్రీ పోతరాజు నర్సింహం గారి నోట్స్ - ఉపోద్ఘాతం(Introduction Part 03)
శ్రీ పోతరాజు నర్సింహం గారి నోట్స్ యందు 4వ మండలం (Fourth Field) వంటి మాటలున్నవి. మాస్టరు C.V.V. “సృష్టియెల్లా యేర్పడింది?” అని అన్వేషించే యోగిగా ఆరంభించి, ఏ రోజు చూసింది(Paranormal Methods) ఆరోజు తేదీలవారీగా డైరీలో వ్రాసి పెట్టేరు.
ఎప్పుడు తెలుసు కున్న విషయాలు అప్పుడు ప్రార్థనా సమావేశములలో ముఖ్యంగా ఆరుమాసములకు ఒకమాటు జరిగే జెనరల్ కాల్ (General Call) సమావేశములలో వివరిస్తూ వచ్చేరు.
కొంతమంది ఆ ఉపన్యాసములూ, ప్రసంగములూ యధాతధంగానూ తామర్థం చేసుకున్న విధంగానూ, నోట్సుగా వ్రాసుకున్నారు. వ్రాసుకున్నప్పుడు కొన్ని మాటలు. (ఉ॥ మిత్రతి(Mithrathi), హర్మనౌర్గరే, మెర్చరీ, లోర్డియన్సు లార్డు పారిస్ట్ వంటి మాటలు) పూర్తిగా అర్ధమయ్యేవి కావు.
వాటిని మననం చేయగా చేయగా యేదో అర్థం స్ఫురించేది. ఆ స్ఫురితార్థమునుబట్టి కొందరు వారి మిత్రులతో ప్రసంగించేవారు.
మాస్టరు భౌతికదేహ పరిత్యాగానంతరం వీరు ఉపదేశాలు ప్రారంభించి వారి వారి శిష్యమండలములు యేర్పరచుకున్నారు.
అలా చేయగూడదనడం సత్య విరుద్ధము అని
నాడీ. హోరా(part of vedic astrology) శాస్త్రాదులలో మాస్టరును యెరగని వారి జాతకాలలో ఈ యోగ పూర్వాపరములను గురించే వారు ఈ యోగ మిత్రమండలిలో చేరడం గురించి, చెప్పబడి ఉన్నది.
కాబట్టి జరిగేవన్నీ దైవేచ్ఛ లేక బ్రహ్మేచ్ఛ ననుసరించి, జరుగు తున్నవనే అనుకోవాలి.
ఏ సాంప్రదాయాన్ని అనుసరించి సాధన చేసుకుంటూ పోతే ఏ ప్రవృద్ధి కలుగుతుందో, ఎలా చెప్పగలం?
మంత్ర శాస్త్రరీత్యా ప్రతి శబ్దమునకు ప్రకృతిలో ఏదో మార్పు తేగల శక్తి ఉన్నది.
బ్రహ్మపదం(One Point) నుంచి సృష్టి ఏ విధంగా పరిణమించిందో(Evolved) మాస్టరుగారు సాధనా కాలంలో గమనించి, బ్రహ్మపదందాకా పోయి అక్కడ తన్నే చూసి, తనే బ్రహ నని తెలుసుకున్నారు.
సృష్టిక్రమంలో వివిధ ఘట్టాలను చిత్రములద్వారా వివరించారు.
సృష్టి ప్రారంభం అయినతరువాత ఇప్పటికి మూడు పరిణామములు అయిపోయి నాల్గవ పరిణామం జరుగుతున్నది.
ఈ నాల్గన పరిణామము కూడా అయిపోయి 5వ పరిణామము, 6 వ పరిణామము ఏర్పడుతుందా?
ఇల్లా పరిణామం తరువాత పరిణామం ఏర్పడుతుందా? లేక ఆ సృష్టికి సంతృప్తి కలిగించే రూపము ఏర్పడిన తరువాత, సృష్టిక్రమం ఆగిపోతుందా?
సృష్టిశక్తికి సంతృప్తికరమైన సృష్టి జరిగిన తరువాత ఆ మూర్తులని సృష్టిశక్తి కానీ(One Point), బ్రహ్మపదం కానీ, తనలో కలుపుకుని ఏక మైపోతుందా? అన్న ప్రశ్నలు, సందేహాలు సహజంగా కలుగును.
మాస్టరు వివరించిన సృష్టి పరిణామ విధానంలో MTA, ATM అనేమాటలు ఉన్నవి.
అణురూపములు ఏర్పడడానికి ముందర కేవలం పరమాణుకల్పితమైన స్థితిని “Matter” లేక “మూలప్రకృతి” లేక “అవ్యక్త ప్రకృతి” అనుకుంటే.
అవ్యక్తప్రకృతి అణువులుగా పరిణమించింది అని విశ్వసిస్తే ‘Matter Turned Atom” అన్న వాక్యార్థ సంపుటీకరణమే(Abbrevation) “MTA” అవుతుంది.
మళ్ళీ ఆ Atoms (అణువులు) Matter(అవ్యక్త ప్రకృతి) గా మారిపోవటమును Atom Turned Matter అనుకుంటే, ఆ వాక్యముయొక్క హ్రస్వరూపము(short form) ATM అవుతుంది.
సృష్టిక్రమణ వివరిస్తూ, మాస్టరుగారు చిత్రించిన చిత్రములలో MTA Ground నుంచి సృష్టి ఆరంభించినట్లు తెలుస్తున్నది. ఆ MTA, Groundకు ముందర Hiddens” (హిడెన్స్) అన్న రూపంలో ఒక వలయము, దానిలో సమ చతురశ్రము- ఆ చతురశ్రము నాల్గు కోణముల దగ్గర నాలుగు వలయములు ఉన్న చిత్రము వున్నది.
మరింత సమాచారమునకు ఈ వ్యాసమును తప్పక చదవండి:
https://mastercvvyogam.blogspot.com/2023/05/blog-post_19.html
ఇప్పుడు నాల్గవ పరిణామంలో(Field 4) ఏర్పడవలసిన ఏడు ప్రహరములలో మానసిక (Mental) ప్రహరము(Plane) మాత్రమే ఏర్పడినది.
ఈ మానసిక ప్రహరం(Mental Plane) లో Rupa Mental, Arupa Mental అని రెండు ఉపప్రహరములు(sub-planes) ఉన్నవి. ఈ పరిణామమునకు సంబంధించి ఇంతవరకు బుద్ధిప్రహరము(Buddic Plane ఇంకా ఏర్పడలేదు. తక్కిన ప్రహరములు(nirvanic, paranirvanic, mahaparanirvanic planes) కూడా ఏర్పడలేదు. అవి ఏర్పడటానికి యెంతకాలము పడుతుంది! అంటే యెవరూ చెప్పలేదు.
ఈ ప్రహర పరిణామకాలమును(evolution time of a plane) తగ్గించేటందుకే ఈ తనయోగం పరబ్రహ్మ ఆదేశముచే బ్రహ్మం-కాసంభూతుడైన మాష్టరు కల్పింప బడినదని, ఈ నూతన యోగ సాధకుల దృఢ విశ్వాసము.
Arupa Mental మండలములో, ఆకారమున్నదే గాని, దానికి పేరంటూ లేదు (అది దృశ్యమానమైన, కాని నామరహితమైన స్థితి).
Arupa Mental స్థితినుండి మహాపర నిర్వాణ ప్రహరమువరకు (Mahaparanirvanic Plane) ఈ యోగసాధనతో మానవులు వృద్ధిపొందాలి.
అప్పుడు బ్రహ్మపతుల్యమైన, అపరిమిత శక్తివంతమైన మండలం ప్రకృతి మధ్యనే ఏర్పడి బ్రహ్మపదంతో సంబంధం ఏర్పరచుకుంటుంది.
అంతో ఇంతో పై పరిభాషతో పరిచయం ఉన్నవారికై శ్రీ నరసింహం పంతులుగారి వ్యాసం ఉద్దేశింపబడినవి.
ఆ పరిచయం లేనివారికి కూడా గ్రాహ్యం కావడానికై మాష్టర్ సంభావించిన విశ్వపరిణామ ఘట్టములను వివరించే చిత్రములు వాటి వివరణ చేశాను.
600 పేజీల నోటుపుస్త కాలలో మాస్టరుగారిచే స్వహస్తంతో వివరింపబడిన సృష్టి పరిణామ రహస్యములు ముందుగా చెప్పడము యెవరికి సాధ్యముకాదు.
ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి దండ్రులు తమకు తృప్తి కలిగించే సంతానాన్ని కోరినట్లే, సకాలమమైన, సగుణమైన బ్రహ్మపదము తనకు తృప్తికలిగించే సంతానాన్ని కోరుతూ అంతకంతకు అధిక మైన ప్రాణుల్ని సృష్టిస్తూ, పరిణమింపచేస్తూ(evolution) తనకు సంతృప్తి కలిగించని వారిని నశింపచేస్తూ, ఆ నశించిన వారినుండి అనశ్వరములు, జరామరణ విరహితములు సర్వజ్ఞములు అయిన జీవుల్ని, దివ్యదేహుల్ని, సృష్టించగలిగే వరకు ఈ పరి ణామం సాగుతూనే ఉంటుంది.
మాస్టరు రూపంలో పరబ్రహ్మం అవతరించి సృష్టి కార్యమును సాగిస్తూ ఆ పరిణామ రహస్యములను తెలియచేస్తూ ఉంటారు. విశ్వాత్మే విశ్వసంభవమయ్యేవరకు ఈ కార్యం సాగిపోతూనే వుంటుంది.
నిర్గుణబ్రహ్మమైనా, సృష్టికాలంలో నామ రూపములు కల దేహము ధరించవలసిందే. ధరించి, సాధనాక్రమములో వివిధ రహస్యములను తెలుసుకుని తన్ను తాను తెలుసుకోవలసినదే.
ఇందుకు అనుకూలంగా దేవ, అధిదేవ, గ్రహ నక్షత్రా దులను క్రమంగా మార్చవలసినదే.
ఆ స్థితి యెప్పుడు వస్తుంది ? ఎంత కాలానికివస్తుంది? అన్న ప్రశ్నలకు మాస్టరు ఇతమిద్దమైన సమాధానం చెప్పలేదు. వస్తుందని నమ్మి సాధన చెయ్యమన్నారు.
మనలో ఏడు ప్రహరములున్నట్లే(7 layers) విశ్వంలోనూ ఏడు ప్రహరములు ఉన్నవి. మాస్టరు తేజోమయరూపం ధరించి ఆకాశమండలములో పూర్వజన్మస్మృతితో ఈ యోగ పరిపక్వతకు పరిపూర్ణతకు ప్రయత్నిస్తున్నారని హోరాశాస్త్రము వివరిస్తున్నది. ఆ వివరములన్నీ క్రమంగా విజ్ఞాసువులకు అందించాలని మా అభిలాష’
మాష్టరు C.V.V. నమస్కారము.
డాక్టర్ గాలి బాలసుందరరావు
__________________________________



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి