శ్రీ A.V. శ్రీనివాసాచార్యులు వారికీ వారి గురువు గారైన శ్రీ ప్రభాకర శాస్త్రి గారితో పరిచయం ఎలా ఏర్పడింది.




శ్రీ A.V. శ్రీనివాసాచార్యులు వారికీ వారి గురువు గారైన శ్రీ ప్రభాకర శాస్త్రి గారితో పరిచయం ఎలా ఏర్పడింది.


Approximate Telugu Version:

శ్రీ ఎ.వి. శ్రీనివాసాచార్యులు అను నేను  చాలా అదృష్టవంతుడిని. శ్రీ శాస్త్రి గారితో అనుబంధం నాకు  చాలా విచిత్రంగా జరిగింది. 1939-1940 విద్యా సంవత్సరంలో తిరుపతిలోని  శ్రీ  వేంకటేశ్వర పరిశోధనా మరియు ఓరియంటల్ కళాశాలకు తెలుగు శాఖాధిపతిగా శాస్త్రి గారు వచ్చారు. అప్పట్లో నేను సంస్కృత విభాగంలో విద్యార్థిని. నా విద్యార్థి జీవితంలో నేను చాలా అల్లరి విద్యార్థిని. శాస్త్రిగారు కాలేజీలో అడుగుపెట్టగానే, నేను మా క్లాస్మేట్స్తో, “ఒక చిన్న ఏనుగు మన  కాలేజీకి వచ్చింది” అని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత ఆ మాటలు శాస్త్రి గారి దృష్టికి వచ్చాయి. వెంటనే పక్క క్లాసులో ఉన్న నన్ను దగ్గరకు పిలిచి "అలా చెప్పావా?" అని నన్నుఅడిగినారు నేను "అవును" అని బదులిచ్చాను. వెంటనే అతను నన్ను "చిన్న ఏనుగు" అని పిలవడానికి  నీకు ఎంత ధైర్యం అని అడిగారు? ఆ తర్వాత, “ఇప్పుడు నీ చెంప మీద కొడితే గురువుగారి శక్తి ఏంటో  తెలుస్తుంది అన్నారు. నేను నా తప్పును ధైర్యంగా ఒప్పుకున్నాను. కానీ నేను అబద్ధం చెప్పలేదు. ఈ సంఘటన తరువాత, శ్రీ శాస్త్రిగారు ముద్దు పెట్టడానికి తన కుడి చేతిని నా చెంపపైకి తీసుకున్నారు. అతను నా ప్రవర్తనను మెచ్చుకున్నాడు. మరియు అది నన్ను అతనికి దగ్గర చేసింది. ఆ తేదీ నుండి, నేను శ్రీ శాస్త్రి గారికి చాలా సన్నిహితుడు అయ్యాను.

మేం చదువు కోసం రోజూ ఉదయం, సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లేవాళ్లం. శ్రీ శాస్త్రిగారు కూర్చుని ప్రార్థనలు చేస్తూ పాఠాలు చెప్పే వద్ద చిన్న ఫోటో ఒకటి ఉండెడిది. ఆ ఫోటోలో మూడు అక్షరాలు, సి.వి.వి అని ఉన్నాయి. "ఈ ఫోటోలో ఉన్న ఈ పెద్దమనిషి ఎవరు" అని మేము తరచుగా శ్రీ శాస్త్రిగారిని అడిగేవాల్లం. "ఈ మూడు అక్షరాలు సి.వి.వి  ప్రాముఖ్యత ఏమిటి అని అడిగేవాల్లం. శ్రీ శాస్త్రిగారు బదులిచ్చారు, "అతను నా భర్త మరియు అతను భౌతిక శరీరం విడిచిపెట్టాడు, అందువల్ల, నా నుదుటి పై ఎటువంటి ఆచార చిహ్నాలు లేవు". మళ్ళీ మేము అతనిని అడిగాము, మగవారికి భర్త ఉంటాడా అని?" అది తర్వాత వెల్లడిస్తా అని మాట దాటేసేవారు’. ఈ మూడక్షరాల గురించి ఆయన సోమయ్య, భీమయ్య, వెంకయ్య, రామయ్య అని చెప్పేవారు కానీ అసలు పేరు మాత్రం బయటపెట్టలేదు.

కొద్ది రోజుల తరువాత, శాస్త్రి గారు నన్ను కూర్చొని  కళ్ళు మూసుకుని దేవునికి ప్రార్థన చేయమని అడిగారు . మనం ఎవరిని ప్రార్థించాలి అని అడిగితే. "మీరు ఏ దేవుడి గురించి ఆలోచించవద్దు, కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించండి మరియు మీ శరీరం లోపల ఏమి జరుగుతుందో గమనించండి" అని బదులిచ్చారు.

క్రమంగా, మేము ఉదయం మరియు సాయంత్రం ప్రార్థనలకు హాజరు కావడం అలవాటు చేసుకున్నాము. నేను ప్రార్థనలకు రెగ్యులర్గా(Regular) వెళ్లలేకపోయేవాడిని. మా కుటుంబానికి సహాయం చేయడానికి నేను పూజారిగా గుడికివెళ్ళవలసి ఉండేది. దాదాపు 8  గంటలకు (రాత్రి) భోజనం చేసిన తర్వాత, శాస్త్రి గారు మా ఇంటికి చాలా సమీపంలో ఉన్నందున నడక ద్వారా మా ఇంటికి వచ్చేవాడు. శాస్త్రి గారు ఆప్యాయంగా  నా భార్యను "దేవుడు(Sri A.V. Srinivasa Acharyulu) ఎక్కడ ఉన్నాడు" అని అడిగేవారు. "అతను గుడికి వెళ్ళాడు" అని ఆమె సమాధానం ఇస్తూ ఉండెడిది. శ్రీ శాస్త్రి గారు  ఆమెతో, "నీ ప్రేమికుడు చూడడానికి వచ్చాడని అతనికి చెప్పు " అని చెప్పి, శాస్త్రి గారు  తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయేవారు.

గుడి నుంచి వచ్చాక  (శాస్త్రి గారు) నిన్ను పిలవడానికి వచ్చారని నా భార్య చెబుతుండేది - వెంటనే నేను కొన్ని పువ్వులతో శాస్త్రి గారి ఇంటికి వెళ్ళేవాడిని. ఆ సమయంలో ఆయన విశ్రాంతి తీసుకుంటుండేవారు. నేను పువ్వులను బెంచ్ లేదా మంచం మీద ఉంచేవాడిని, పువ్వుల సువాసన గమనించి నేను వొచ్చినట్లు గుర్తించేవారు "ఎవరో ఒకరి బాధ మరియు అతని బాధ నన్ను కలవరపెడుతోంది". నేను ఇప్పటికే అలసిపోయాను అతని ఉపశమనం కోసం ప్రార్థన చేయండి".  “మనము ప్రేయర్ చేయుట వెనుక ఉన్న ఉద్దేశం బాధ పడుతున్న వ్యక్తికి ఉపశమనం కలగాలి" అని శాస్త్రి గారు చెప్పేవారు, "మీ ప్రార్థన మరియు నా ప్రార్థన మధ్య తేడా లేదు మరియు ఈ ఉపశమనం కలిగించేది ఒక అదృశ్య వ్యక్తి ". ఆ సమయంలో కూడా శాస్త్రి గారు అతను అసలు పేరును వెల్లడించలేదు.

నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు, నేను బాధపడే వ్యక్తిని మరియు అతను కోరుకుంటున్న వ్యాధి ఉపశమనాన్ని చూసి అది శ్రీ శాస్త్రి గారికి తెలియచేసెడివాడిని. ఆ తర్వాత “సర్దుబాటు అయింది(adjusted) అని శాస్త్రి గారు తెలియపరిచేవారు.ఈ ప్రక్రియ తర్వాత శాస్త్రి గారికి రెండు టెలిగ్రామ్లు వచ్చాయి 
Telegram - 1: వ్యాధి పేరు 
Telegram - 2: Adjusted (సర్దుబాటు అయింది)
వినడానికి ఇది కొంచం ఆశ్చర్యకరంగా ఉంటుంది, శాస్త్రి గారు ఏదన్నాఉదంతాన్ని చూడమనగానే నేను ఆ ఉదంతాన్ని చూడగలిగే వాడిని. శాస్త్రి గారు చూడు అనగానే చూసా అని బోధులిచ్చేవాడిని ఈ విధంగా నాకు సీసా(SEE-SAW) అనే పేరు ఏర్పడింది. అతను నాపై ప్రత్యేకమైన ముద్రను కలిగి ఉండేవారు. మరియు నేను ఈ  యోగా లైన్కు(Yoga Line) మరింత ఉపయోగకరంగా ఉంటాను అని భావించేవారు.

శ్రీ శాస్త్రి గారి ఆశీర్వాదంతో, నేను సృష్టి సిద్ధాంతాన్ని అర్థం చేసుకొనగలిగాను, ఆత్మా భూమి పై ఎలా అవతరిస్తుంది మరియు పురుషుని యందు ఏ సమయమున మరియు ఏ తేదీన ఎలా ప్రవేశిస్తుంది అంతే కాకా ఆత్మ ఏ సమయమున మరియు ఏ తేదీన ఏ విధంగా "స్త్రీ " యందు ప్రవేశించి ఏ విధంగా తిరిగెడిది అంతటిని గమనించి శాస్త్రి గారికి తెలియపరిచేవాడిని.
ఈ విషయముగా నేను శాస్త్రి గారికి  బాగా దగ్గరయ్యాను. గౌరవనీయులైన ఆరాధన యోగ్యులైన గురువు సి.వి.వి. మరియు నా విద్యా మరియు ఆధ్యాత్మిక గురువు శ్రీ ప్రభాకర శాస్త్రి గారి అశీసులతో, ఆత్మ భౌతిక శరీరం నుండి నిష్క్రమించడాన్ని నేను చూడగలిగినాను.

ONE పాయింట్ మాస్టర్ C.V.V గారికి 6 కాంట్రాక్టుల హామీని ఇచ్చింది. మాస్టర్ ఈ "ఆరు ఒప్పందాలను" స్వీకరించారు. ఈ  ఒప్పందంలో "జీవితాన్ని పొడిగించడం మరియు చనిపోయినవారిని మల్లి భౌతిక లోకానికి పిలిపించడంవంటివి ప్రస్థావించబడినాయి. ఇప్పుడు వన్ పాయింట్(One Point) మరియు మాస్టర్ తమ ఒప్పందాలను అమలు చేస్తున్నారు. మాస్టారు సి.వి.వి గారి దయతో మనం ఆ అద్భుతాలను చూస్తున్నాము.

ప్రభాకర శాస్త్రి గారు ఎదుటివారి రోగాలు నశించాలని ప్రార్థించమని అడిగేవారు. శాస్త్రి గారు ఈ ప్రక్రియను  నిశితంగా గమనించి సంతృప్తి చెందెడివారు.

ప్రభాకర శాస్త్రి గారు సాన్నిహిత్యం కారణంగా, మాస్టర్ C.V.V గారి ఇతర Mediumsతో నాకు మరింత పరిచయం ఏర్పడింది. శ్రీ శాస్త్రిగారు తరచుగా రేడియో ప్రసంగం మరియు ఇతర విషయాల కోసం మద్రాసు వెళ్లేవారు. నేను శాస్త్రి గారికి తోడుగా వెళుతూ ఉండేవాడిని. ఈ విధంగా నేను ఇంచు మించు 23 మాస్టర్ గారి డైరెక్ట్(Direct) మీడియంలను కలిసే భాగ్యం కలిగినది.

23 Mediumల పేర్లు:

1. సి.వెంకమ్మ గారు
2. ఎస్.నారాయణ అయ్యర్ గారు
3. ఆర్.వైద్యనాథ అయ్యర్ గారు
4. పి.నరసింహం గారు
5. ఎన్.రఘునాథ అయ్యర్ గారు
6. V.S.ప్రణతార్తిహర అయ్యంగార్ గారు 
7. T.S.శంకరయ్య గురువు
8. వి.ప్రభాకర శాస్త్రి గారు
9. ఎ. హరసింగరావు గారు
10. డా.వి.చంద్రశేఖర శాస్త్రి గారు
11. పద్మనాభ మొదలియార్ గారు
12. వి.మహాలక్ష్మమ్మ గారు
13. డా.టి.జానకిరామ్ గారు
14. ఆర్.సీతారామలాక్షమ్మ గారు
15. డా.టి.వెంకటరంగం నాయుడు గారు
16. బి.ఆర్.బి.వెంకటాచలం గారు
17. వి.రుద్రపతి పిళ్లై గారు
18. పి.సత్యవతమ్మ గారు
19. వి.వెంకటరమణరావు గారు
20. కాజ శారదాంబ గారుగారు
21. కాజ శారదాంబ గారు
22. ఎం.కాళిదాస్ గారు
23. కప్పగంతుల మీనాక్షమ్మ గారు

నాకు తెలిసినంత వరకు, శ్రీ ప్రభాకర శాస్త్రి గారు మరియు శంకర్ అయ్యర్ మినహా, ఇతర Mediumలు ONE  POINT యొక్క అభిప్రాయాల మరియు లక్ష్యాలను సరిగ్గా అర్థం చేసుకొనలేకపోయారు.

Telugu Translation credit goes to Sri Allu Rajendra Garu.
తెలుగు అనువాదం చేసినవారు  శ్రీ అల్లు రాజేంద్ర గారు .


English Version (Original)

I am(Sri A.V. Srinivasacharyulu Garu) a very lucky man. Sri Sastriji's association was very peculiar to me. He came as a Head of the department of Telugu to Sri Venkateswara Research Institute and Oriental College, Tirupati, during the academic year 1939-‘ 40. At that time I was student in Sanskrit section. In my student life, I was a most mischievous student. As soon as Sastriji entered into the College, I told to my classmates, “one small baby elephant came to our College". After a few days, those words reached Sastriji's notice. Immediately in the next class, he called me near and asked "Have you told like that?" I replied "Yes". Immediately he shouted me, how dare are you to call me as "Small elephant"? Afterwards, he told, “If I give a slap on the cheek, you will come to know the power of a Teacher". I replied boldly the truth that I have uttered. But I did not say lie. After this event, Sri Sastriji took his right hand to my cheek to take a kiss. He has appreciated my behaviour. and that dragged me into his fold. From that date onwards, I am very close associate to Sri Sastriji.

We use to go daily to his house both morning and evening for our studies. There was a small photo where Sri Sastriji sits, prays and teaches us the lessons. There are three letters in that photo i.e., C.V.V." We often used to request Sri Sastriji, “who is this gentleman in this photo". "What is the significance of these three letters C.V.V. Sri Sastriji replied, "he is my husband and he left his physical, therefore, I am not having any ritualistic symbols on my forehead". Again we asked him, "Is there a husband for a man?" He replied that "it will be revealed later". About these three letters, he used to say as Somaiah, Bhimaiah, Venkaiah, Ramaiah etc., but he never revealed the original name.

After sometime, he asked us to sit and close your eyes and do prayer to God. If we asked, "whom we have to Pray". He replied, "You do not think of any God, simply sit, close your eyes, pray and observe what is going on inside your body".

Gradually, we are accustomed to attend Prayers both morning and evening. I was not regular to the Prayers as I have to go to temple as a priest to assist others (who brought me up). After taking meals at about 8 0'clock (night) he used to come to my house by walk as it is very near to his house. He asks my wife "Where is Devudu". She replies "he went to temple". Sri Sastriji tells her, "tell him that your lover came to see you" and he returns to his house.

After coming from the temple, my wife use to tell that father (Sastriji) came to call on you - go immediately. I used to rush to his house with some flowers. At that time, he was taking rest. When I simply keep the flowers on the bench or cot, the fragrance of the flowers reaches him and says that "some one is suffering and his suffering is troubling me". Do prayer for his relief as I have already exhausted". When I immediately replied "what is the use of doing prayer other than you, and the relief should come to the sufferer”. Sastriji said, "there is no difference between your prayer and my prayer and the act is being done by some unknown person". Even at that time also, he never revealed the original name.

When I close my eyes and start doing prayer, I happen to see the sufferer and the manner of ailment and relief what he requires. It will be intimated to Sri Sastriji. Then he says, “it is adjusted". After this incident, Sastriji receives two telegrams "one is for his suffering and another is adjusted". It is very peculiar in the nature. When he asked to see immediately, I was telling that I saw this instance. After that he named me as "SEE SAW". He had a special impression on me and thought "that he is more useful to the Yoga line".

On the blessings of Sri Sastriji, I experienced the creation theory, when the soul was despatched, the time and date,

how it is descending to the Earth, when it enters upon the male human body, the time and date, how it rotates in the body and when it enters into the female body, date and time. All are noted and put forth to the Sastriji's notice. After this incident, I became very close to him. of late, the blessings of the revered worshipful Master C.V.V. and my Educational and spiritual Guru Sri Sastriji, I am able to witness the departure of the soul from the physical.

The one point gave assurance of 6 contracts to Master C.V.V. The Master experienced these "six contracts". In that contract "prolongation of life and recalling the dead" are mentioned. Now a days the One Point and Master are executing their contracts. We are witnessing the same with the grace of Master C.V.V.

He used to ask us to pray to eradicate the other's diseases and ailments. He closely observes the process. He finds very much Happy.

On account of Sastriji's close association, I have more touch with the other mediums of Master C.V.V. Sri Sastriji oftenly goes to Madras for Radio talk and other things. I used to accompany him.
The names of the 23 mediums :

C.Venkamma garu
S.Narayana Iyer garu
R.Vaidyanatha Iyer garu
P.Narasimham garu
N.Raghunatha Iyer garu
V.S.Pranatharthihara Iyengar garu Tharti
T.S.Sankaraiah guru
V.Prabhakara Sastri garu 
A. Harasinga Rao garu
Dr.V.Chandrasekhara Sastri garu 
Padmanabha Modaliar garu
V.Mahalakshmamma garu 
Dr.T.Janakiram garu
R.Seetharamalakshamma garu
Dr.T.Venkatarangam Naidu garu
B.R.B.Venkatachalam garu
V.Rudrapathi Pillai garu
P.Satyavathamma garu
V.Venkataramana Rao garu
Kaja Saradamba garu
Justice P.Chenchaiah garu
M.Kalidas garu
Kappagantula Meenakshamna garu 

As far as our knowledge goes, except Sri Sastriji and other  Sankar Iyer, the other mediums were not properly understood the aims and and objects of ONE POINT'S VIEWS.

--------------------------------------------



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?