మాస్టర్ గారి కోర్సులకు సంబంధించి స్పష్టత
మాస్టర్ గారి కోర్సులకు సంబంధించి స్పష్టత (Approx. Telugu Version) Note: ఈ వ్యాసము శ్రీ A.V. శ్రీనివాసాచార్యులు గారు రాసిన ఆంగ్ల వ్యాసమునకు తెలుగు ట్రాన్సలేషన్ మాత్రమే. ఆసక్తి గల అభ్యర్థులు, ఎవరైనా క్రొత్తగా (మాస్టర్ గారి యోగా మార్గములో) చేరడానికి వస్తే, అతని పూర్వానుభవం మరియు పూర్వ పాపాలను, ONE POINT, మాస్టర్ సి.వి.వి. గారికి బహిర్గతం చేసేవారు. ONE POINT నిర్దేశించిన ఈ క్రింద వివరించిన కోర్సులను అందజేస్తూ వారిని అభివృద్ధి చేయమని ONE POINT మాస్టర్ గారిని ఆదేశించింది. తదనుగుణంగా మాస్టర్ గారు ONE POINT ఆదేశాలను పాటించారు మరియు కొత్తగా ఫ్రెండ్స్ సొసైటీ లో చేరిన Mediumలను అభివృద్ధి చేశారు. మా గురుతూల్యులు శ్రీ C.రాధాకృష్ణ పిళ్లై Medium No.26, 28.05.1911న మాస్టర్ గారి యోగమున చేరారు. 30.01.1914 నుండి, 9.18 p.m. అతను కొత్తగా వచ్చిన వారికి పరీక్షలు(Scanning) తీసుకోవడం ప్రారంభించారు. ONE POINT → M.T.A ద్వారా సూచనలను రాధాకృష్ణ పిళ్లైగారికి ఒక సూచనప్రాయంగా అందచేసేవారు. మా గురుతూల్యులు శ్రీ D. మహదేవ అయ్యర్, Medium No.176, 24.06.1914న మాస్టర్ గారి యోగమున చేరారు. చేరిన తర్వాత శ్రీ సి...