Origin No.I మరియు Origin No.II (Telugu Version)
ఈ మార్గ ఔత్సాహికులు అనేకులు వీటి ప్రస్తావన తరచుగా చేయడము కలదు. లభ్యమయిన మాస్టర్ C.V.V. గారి స్వీయ రచనలలో అట్టి ప్రస్తావన కనపడదు. అయితే మాస్టర్ C.V.V గారు మౌఖికముగా వివరించిన విషయములను కొన్నింటిని ఫస్ట్ Group సభ్యులయిన శ్రీ C. రాధాకృష్ణ పిళ్ళై (మీడియం నెం.26) వ్రాసి ఉంచినట్లుగా తెలియవస్తుంది. అట్టి మూల ప్రతి దొరకనప్పటికి, CR డైరీలో అట్టి ప్రస్తావన ఉండటము వలన, ప్రచారములో ఉన్న సమాచారమును ఇక్కడ అందిచడమైనది.
CR Diary 25-12-1918
“సా. గం.6:40 నుంచి 8:15 వరకు మాస్టర్ గారు ప్లానేటరీ లీడింగ్ వివరముల ఇస్తున్నారు (వేరే నోట్ బుక్ లో వ్రాయబడినది)”
Explanation by The Master C.V.V.
25-12-1918 6-45 PM
ఆరిజిన్ అనగా ఒరిజినల్ స్థితి మరియు బాహ్య వ్యక్తీకరణగా సృష్టింపపడుతున్న దానికి కారణము.
ఇప్పుడు మనము ఈ సమస్త సృష్టిని ఒక వ్యక్తీకరణగా చూచినట్లయితే, దీనికి ఖచ్చితముగా ఒక ఆరిజిన్ అనేది ఉండవలసినదే.
అట్టి ఆరిజిన్ ను No.I అనుకుందాము. ఈ ప్రస్తుత భూమి వ్యక్తమగు వరకు జరిగిన సృష్టి విధానము అట్టి No.I యొక్క ముద్ర. ఈ ముద్రతో No.I ద్వారా ఏర్పడే వ్యక్తీకరణ అంతా మార్పు చెందుట (నశించుట అనే భావన) అనే ముద్రతో కూడినదే. ఈ మార్పు చెందుట (నశించుట) అనే ముద్రను రెండు వర్గీకరణలుగా ఇప్పుడు చూడవలెను.
a. భూమి ఏర్పడుట
b. భూమి పై Man-Form సృష్టింపబడుట
“No.I చేత సృష్టింపబడేది అంతా మార్పు చెందలవసినదే”, అనేది అంతటా వర్తించే నిబంధన.
మన లైన్ యొక్క చర్యల ఉద్దేశ్యము, ఈ నిబంధనను మార్చి, సృష్టిలో ఉత్పత్తి అయిన వాటిని మార్పు లేని విధముగా (నిత్యములుగా) చేయుట.
అయితే ఈ ప్రక్రియకు కూడా ఒక ఆరిజిన్ ఉండవలెను కనుక దీనిని No.II అని పిలుచుకుందాము. No.II అనేది భూమి పైన ఉన్న ఒక మానవ రూపము. ఈ II, ఇప్పుడు No.I ను రూపములను నిత్యముగా ఉంచమని అడుగుచున్నది. అనగా No.I నందే మార్పు జరుగవలసి ఉన్నది. ఒక మానవరూపమును అమర్త్యముగా చేసే ప్రక్రియను అర్ధము చేసుకొనుటలో తెలిసేది ఏమనగా, మానవరూపమునకు ఆధారమయిన ఈ భూమిని కూడా అమర్త్యముగా No.II చేయవలసి ఉన్నది అని.
మానవరూపమును మరియు భూమిని, నిత్యములుగా చేయడమనే పైన చెప్పిన రెండిటినీ స్థాపించుటకు, భూమిలోనూ, మానవ రూపములోనూ చేపట్టబడుచున్న నిర్మాణ ప్రక్రియల సిద్ధాంతములను భూమికి కూడా తెలియజేయడము అవసరము.
ఈ భూమి ఒక ఈథరిక్ పదార్ధముచే ఆవరింపబడి ఉండగా, దానిని ఆవరించుకొని ప్లానేటరీ ఫీల్డ్ ఉన్నది. ఈ ఈథరిక్ ఒత్తిడి వలన మనము భూమిపై అక్షాంశము, రేఖాంశములకు లంబకోణములో నిలుపబడి ఉన్నాము. మనము భూమి మీద నిలువుగా ఉన్నామనడం నిస్సందేహము. మానవుడితో సహా భూమి ఈథరిక్ లో భ్రమణము చేస్తున్నప్పటికీ, ఈథరిక్ యొక్క భ్రమణము భూభ్రమణమునకు వ్యతిరేక దిశలో ఉండటము వలన మనము స్థిరముగా ఉంచబడుచున్నాము. నూతన ప్రక్రియల కొఱకు ఇప్పుడు No.II తన ఫోర్సులను గ్రహములకు పంపగా, అవి తిరిగి M.F.(బహుశా Man Form) నకు పంపును. గ్రహములు ఈ విధముగా త్రిప్పి పంపుట వాటికి లీడింగ్ (భూమిక), అనగా No.II నుంచి అందుకొన్న ఎటర్నల్ ప్రిన్సిపుల్ నకు స్పందించి M.F. నకు త్రిప్పి పంపుట. గ్రహముల యొక్క అసలైన భూమిక అయిన No.I యొక్క చర్యలను అమలు చేయడము అనేది సెంటిగ్రేడ్ డిగ్రీలలో ఉండగా, No.II చే ఇవ్వబడిన చర్యల అమలులో గ్రహముల లీడింగ్ (భూమిక) పరిమితి లేని గ్రేడ్ నకు చెందినది. శబ్దఉచ్చారణ ద్వారా తరంగముల వలె ఫోర్సులను పంపు No.II యొక్క చర్య, “అధారిటేటివ్ ఆథెన్టిసిటీ బ్లేజింగ్ ఆటోబయోగ్రాఫిక్ వేవ్స్ బై అనమటోపియా” గా పిలువబడినది. గ్రహముల నుండి వాస్తవముగా M.F. నకు పంపబడుచున్న ఫోర్సు, వైబ్రేషన్స్ (దేహ ప్రకంపనలు) గా వచ్చును. No.II సెంటర్ నుంచి గ్రహములకు ఇవ్వబడుచున్న ప్రక్రియను టెలిఫోన్ తోనూ, గ్రహముల నుంచి M.F. నకు పంపబడుచున్నవి టెలిగ్రామ్ తోనూ పోల్చవచ్చు. మానవునికి ఆరు వైపులా ఆవరించుకొని ఉన్న ఈథర్ భాండారము, అతనికి అన్ని వైపులా కలిగించే వొత్తిడి యొక్క సాంద్రత దూరమును బట్టి మారుతుంటుంది. కావున భౌతికముగా కూర్చబడి, భూఉపరితలము పై ఉన్న M.F. ఒక నిర్దిష్ట సాంద్రతతో కూడిన ఈథర్ చే ఆవరింపబడి ఉండును. కానీ, ఈథరియల్ దేహము కనుక భౌతికదేహము నుంచి వేరుపడినట్లయితే, అది ఒక స్థాయి వరకు పైకి లేపపడిన తరువాత, ఉపరితలమునకు దగ్గరగా ఉన్న ఈథర్ సాంద్రత కంటే భిన్నమైన సాంద్రత గల ఈథర్ వలన తేలుచూ ఉండును. ఈ విధముగానే భూమి మరియు గ్రహములు కూడా ఈథర్ చేత ఆవరింపబడి ఉండి, ఇటువంటి భ్రమణమే ఆ ఫీల్డ్ నందు కూడా జరుగుచుండును.
ఔత్సాహికులు సునిశితముగా పై సమాచారమును గమనించి తమ తమ అభిప్రాయములను ఏర్పరచుకొనవలెను. వివరణలలో భాగముగా మాస్టర్ C.V.V. గారు ఉదాహరించిన వాటిని, కొన్ని రూపములుగానో, వ్యవస్థలగానో మనకు అర్ధమయిన దాని ఆధారముగా నిర్ణయించుకొనరాదు. ఎందువలనంటే మాస్టర్ C.V.V. గారి యోగమార్గ వ్యవస్థను అనుభవపూర్వక జ్ఞానము లేకనే సంపూర్ణముగా ఏ ఒక్కరూ అర్ధము చేసుకొనలేరు కాబట్టి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి