నూతన మానవ నమూనా – మాస్టర్ C.V.V గారి కుమారుడు భృక్త


 

నూతన మానవ నమూనా – మాస్టర్  C.V.V గారి కుమారుడు భృక్త

మాస్టర్ C.V.V.గారు చేపట్టిన మహాయజ్ఞములో భాగముగా, కుండలిని నుంచి ప్రసరించుచు భౌతిక శరీరమునకు ఇబ్బంది కలిగించుచుండెడి 64 బ్రీతింగ్ ప్రిన్సిపుల్స్, మరియు వాటి ప్రభావము వలన దేహ రుగ్మతలుగా ప్రకటితమయే 1899 ట్రాన్స్ స్థితులను సరిదిద్దుట జరిగినదని వారి యోగవాజ్మయములో గమనింపవచ్చును. ప్రారంభములో 15 బ్రీతింగ్ ప్రిన్సిపుల్స్ మాత్రమే సరిదిద్దబడగా తదనంతరము అన్నింటినీ ఈ లైన్ చక్కదిద్దినదని వారు వ్రాసి ఉన్నారు.

ఈ సందర్భములో అబ్బురపరచే విషయమేమనగా, ఆనాటి సృష్టి ప్రక్రియలోని రూప నమూనాలో ఉన్న 64 ప్రిన్సిపుల్స్ కాక అదనముగా మరియొక 10 ప్రిన్సిపుల్స్ ను వారు నమూనాలో ఏర్పరచినట్లుగా తెలియుచున్నది. అట్టి వినూత్న రూప నమూనా యొక్క సఫల పరీక్ష శ్రీమతి C.వెంకమ్మాళ్ ద్వారా కలిగిన రెండవ కుమారుడు భృక్త యొక్క దేహములో జరిపినట్లుగా వారి రచనలలో ఈ క్రింది విధముగా వ్రాయబడి ఉన్నది. (స్వేచ్ఛానువాదము, ఆంగ్లములో యధాతధముగా)

డైరీ 15-1-1918 భృక్త గురించి

“నిర్మాణములోని అతని ఈథరిక్, మార్పు చెందుచూ బంగారు వర్ణములో ఉన్నది. ఇంటలెక్ట్ భాగము క్రమబద్ధీకరించబడుచున్నది. ఆతని బ్రీతింగ్ ప్రిన్సిపుల్స్, నెలనెలకు మారు విధముగా కాక రోజువారీ పద్ధతిలో ఒక్కొకటి పనిచేయు విధముగా క్రమబద్ధీకరించబడి ఉన్నవి. ఆతని K, ఎటువంటి పై పొర లేకుండా, ఏ విషయము పై అయిననూ భౌతిక చైతన్యము స్పృహ కలిగి ఉండని విధముగా కాక, మీ కంటే (అనగా మాస్టర్ గారి చైతన్య వర్తన కంటే) మెరుగుగా ఉన్నది.”

డైరీ 16-1-1918 (కంటిలోని కటకముల గురించి)

“భృక్త – ఆతనిలోని అనుసంధానము మీకు ఉన్న మాదిరిగా ఉన్నప్పటికీ కటకముల లోపల ఎట్టి కవాటములూ ఏర్పడి ఉండలేదు.”

మెమరీ మెమొరాండం 24-1-1922

“74వ బ్రీతింగ్ భృక్త యొక్క దేహములో పరీక్షించబడినది, అది నిలచినది కూడా.”

“అనగా 64 బ్రీతింగ్స్ పైన 74 వది పరీక్షించబడుటయే కాక, ఎబ్బింగ్ ప్రాసెస్ వలన అది సెంటిగ్రేడ్ లెవెల్ నందు పనిచేయగలదు.”

మాస్టర్ C.V.V. గారి మహోన్నతమైన ప్రయోగములలో వారి కుమారుడు ‘భృక్త’ కూడా భాగస్వామ్యులే అని తెలుస్తూంది. అత్యంత అసాధారణ విషయములు గల అట్టి రచనలను అందరూ చదువవలెను.





--------------------------------------------

Join our Whatsapp Community:
https://chat.whatsapp.com/GqLS5VEQ9SnEn0mzjBxBXm

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?