మానవ రూప పరిణామము, ప్రయోగములు
మానవుని ప్రస్తుత రూప నిర్మాణము పుర్రె నుంచి కుండలిని వరకు 7 వలయములు కలిగి ఉన్నట్లుగా మాస్టర్ గారు 5.3.1920 నాటి మెమరీ మెమొరాండం నోట్స్ నందు చిత్రముతో తెలియజేసినారు.
మానవ రూపమంటే, భౌతిక దేహమనే కాక, అంతకు పూర్వము ఏర్పడిన పారభౌతిక స్థితులు రూపములు కూడా. వీటి పరిణామ పురోగతి గురించి మాస్టర్ గారు మార్చ్ మరియు ఆగష్టు 1920 నాటి మెమరీ మెమొరాండం నోట్స్ లొ వ్రాసినారు.
మాస్టర్ గారు వ్రాసిన విషయములను క్రింది విధముగా అర్ధము చేసుకొనవచ్చును. ఇందులో కొన్ని విషయములు, బ్రహ్మాండ పురాణములోని విషయములను, థీయోసఫికాల్ సొసైటీ వారి సిద్దాంతములను పోలి ఉన్నట్టుగా అనిపించవచ్చును.
ఏడు గ్రహముల సమిష్టి ప్రభావమునకు పూర్వ స్థితి. పరిణామ ప్రక్రియలో, రాశి మండలములోని ఏడు గృహములలో, ఏడు గ్రహముల ప్రభావముచే మానవ రూప నిర్మాణమునకు తోడ్పడే రూపనమూనాలు ఏర్పరచబడును. ఈ ప్రభావముతో మానవ రూపమునకు గ్రహ ప్రభావముచే ఒక తొడుగు ఏర్పరచబడెను.
మానస ధ్యానులు – 7 గ్రహముల సంఘటిత చర్యల ప్రారంభము మానవ రూప నిర్మాణమునకు దోహదపడెను. ఈ 7 గ్రహములు, విడివిడిగా మానవ రూపములో వలయములు ఏర్పరచి, సంఘటితముగా మానవ అంగముల నిర్మాణములో తమ తమ చేయుతనిచ్చెను. ఈ విధముగా ప్రారంభమయిన మానవ రూపములను ఆర్యులు గా మాస్టర్ పేర్కొనినారు. అయితే, ఈ ఆర్య అనే మాటని, చారిత్రముగా చెప్పబడే ఆర్యులతో పోల్చరాదు.
అగ్నిస్వత్త పితృలు - అదే సమయములో, జీవ మరియు రూప సహిత లక్షములను ఏర్పరచగల శక్తులు ఏర్పడి, వాటిచే ఇవ్వబడిన లక్షణరూపములను ‘అహంకార’ అనే పేరుగల విధములుగా మాస్టర్ వ్రాసినారు. ఇట్టి లక్షణరూపములను ‘అగ్నిస్వత్త పితృలు’గా పేర్కొన్నారు. వీటి కారణముగా ఆర్య జీవరూపములకు, ఆస్ట్రల్ స్థితిలో ‘స్వ’ స్వభావ లక్షణము ఏర్పడెను.
జ్ఞాన మౌనులు, గుణ గుప్తుల ఉద్భవము. వీటి గురించిన విస్తృత వివరణ మాస్టర్ గారి నోట్స్ లో లభ్యముకాలేదు.
*బరిశత్ పితృ*ల ఉద్భవము. వీటిని బాడీ గార్డ్స్ గా చెప్పినారు. వీటి వలననే రూపము, అహం, జ్ఞానము, విచక్షణతో కూడిన సంపూర్ణ మానవ రూప ఆవిర్భావము సంభవమయినది.
తదనంతరము, మానవ రూప నిర్మాణ పరిణామ ప్రక్రియలో అనేక ప్రయోగములు జరిగినవి. అవేమంటే-
- మానస పుత్రులు. అరూప భావ స్థితిలో, ఒక జన్మలో 100 స్థితులను నిలుప చూసినారు. ఇది సఫలమయి, వాయు రూప స్థితిలొ దేహములు నిలువసాగెను. ఒక ప్రాణ స్థితి అనగా ఒక సంవత్సరకాలమునకు కావలసిన ప్రాణశక్తిగా భావింపవచ్చు.
- బుద్ధ. ఈ ప్రయోగములో 100 నుంచి 200 ప్రాణ స్థితులను నిలుప చూసినారు. కాని నిర్మాణములు నిలబడలేదు.
- ఆత్మవత్ (క్రీస్తు గా కూడా పిలచినారు). ఈ ప్రయోగములో ఒక జన్మలో ఇవ్వబడు కనీస ప్రాణస్థితులను 100 నుంచి 60 కి తగ్గించి, 5 జన్మల ప్రాణ స్థితులను, అనగా 300 నిలుప చూసినారు. నిర్మాణములు నిలబడలేదు. అయితే, ఈ ప్రయోగము వలన, అంతకు ముందు ఉన్నటువంటి 100 ప్రాణస్థితులను నిలుపగలిగే లక్షణమును మానవులు కోల్పోయినారని మాస్టర్ వ్రాసినారు.
మానవుని పార భౌతిక నిర్మాణ ప్రక్రియ భౌతిక స్థితికి అర్ధమగు విధముగా వెరెవ్వరూ మాస్టర్ గారి వలే చెప్పిఉండలేదు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి