అసలు Initiation అంటే ఏమిటి?




అసలు Initiation అంటే ఏమిటి?



ప్రాథమిక అణువులు(పరబ్రహ్మ ఇచ్ఛ శక్తితో ఉద్భవించిన అణువులు) ఒకటవ, రెండొవ మరియు మూడోవ ఫీల్డ్(Field) అనుభవాల సారాంశాన్ని మరియు జ్ఞానాన్ని వాటి పై ఒక పూత(Cover/Coating) రూపమున(ఈ పూతను వేదాంత పరిజ్ఞానంలో ఉపాధి అందురు)  ఏర్పరుచుకొని నాలుగోవ ఫీల్డ్(4th Field) యందు రావడం జరుగుతుంది.


ప్రాథమిక అణువుల సమాచారం కొరకు క్రింది లింక్ క్లిక్ చేయగలరు

https://mastercvvyogam.blogspot.com/2023/05/primary-atoms.html


ఈ ప్రాథమిక అణువులపై పూతలు( 3 Covers/Coatings) ఆది(పరబ్రహ్మ) సూచనల మేర ఒకటవ, రెండొవ, మూడోవ ఫీల్డ్ జ్ఞానాన్ని మరియు అనుభవాలను  నాలుగోవ ఫీల్డ్ యందు వ్యక్త పరచకుండా నిరోధిస్తాయి. ఈ పూతలు ఆది(పరబ్రహ్మ) సూచనల మేర ఏర్పడుట వలన వీటిని విచ్చిన్నం చేయుట అసాధ్యం. ఈ పూతల మెమరీ యందు దాగి ఉన్న ఒకటవ, రెండొవ, మూడోవ ఫీల్డ్ అనుభవ జ్ఞానానికి రింగ్ పాస్ నాట్(Ring pass not) వలే ఈ పూతలు వ్యవహరించుట వలన నాలుగోవ ఫీల్డ్ యందు గత జరిగిపోయిన మూడు ఫీల్డులు యొక్క అనుభవ జ్ఞాన సారం బహిర్గతం కాజాలదు.


ప్రాథమిక అణువుల పై ఒకటవ పూత, రెండొవ పూత, మూడోవ పూత అనగా ఒకటవ ఫీల్డ్ రెండొవ ఫీల్డ్ మరియు మూడోవ ఫీల్డనకు సంబందించిన ప్రతి ప్లేన్ / డివిజన్ల యొక్క సంపూర్ణ జ్ఞాన మరియు అనుభవ సారంగా బావించవలెను.


కుండలిని పై ఒకటవ పూత కూడా ఏర్పడక మునుపు కూడా కుండలిని అనే పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కుండలిని పై ఒకటవ పూత, రెండొవ పూత, మూడోవ పూత ఏర్పడిన తరువాత కూడా కుండలిని అనే మన సౌలభ్యం కొరకు పిలవడం జరుగుతుంది.


కుండలినిని ఒక పూత కుండలిని రెండుపూతల కుండలిని మూడుపూతల కుండలిని అని పిలవరాదు, ఇప్పుడు ప్రస్తుత పరిణామం నాలుగోవ ఫీల్డ్ యందు కొనసాగుతుంది కావున ఈ కుండలిని పై ఇప్పటికే మూడుపూతలు ఏర్పడినప్పటికీ మూడుపూతల కుండలిని అని పిలవడం సరికాదు, కేవలం కుండలిని అని మాత్రమే పిలవవలెను.



మనందరమూ నాలుగోవ ఫీల్డ్ యందు మనుగడ కొనసాగిస్తున్నాము కాబట్టి, ఇచట కుండలిని అనగా మూడు పూతలు ఉన్న కుండలినిగానే అర్థంచేసుకొనవలెను.


మనము కుండలిని యోగమునకు సంబందించిన గ్రంథాలు పరిశీలించిన యడల, ఈ గ్రంథాల యందు ఒక అణువు లేదా కుండలిని జ్యోతికి మూడున్నర(3½) చుట్లు చుట్టుకొని ఉన్న పామును చూపించుట జరుగును. ఈ మూడున్నర(3½) చుట్లూ పరమార్థం ఇప్పటివరకు గడిచిపోయినా మూడున్నర(3½) కుండలిని ఫీల్డ్స్ గా అర్థం చేసుకొనవలెను.


మానవుని కుండలిని నాలుగోవ ఫీల్డ్ యందు ప్రవేశించి ఈ కుండలిని పై మూడోవ పూత ఏర్పడిన సత్వరమే జరిగిపోయిన గత మూడు పరిణామాల జ్ఞాన అనుభవ సారమంతయు సంపూర్ణంగా బంధించబడును.


ప్రస్తుత నాలుగోవ ఫీల్డ్ యందలి ఉన్నత ప్లేన్లు/డివిషన్లు యందలి జ్ఞాన మరియు అనుభవ సారము వాటి ఉన్నత కార్యాచరణ సామాన్య మానవుడు అర్థంచేసుకోలేని విధంగా ఈ ప్లేన్ల సరిహద్దులు(partitions) అడ్డుకట్టలాగా వ్యవహరించును ఇటువంటి పార్టీషన్ల మొత్తం 49(only 4th field). ఈ 49 పార్టీషన్ల సరిహద్దులను తొలగించి నాలుగోవ ఫీల్డ్(4th Field) యందలి ఉన్నత ప్లేన్లు/డివిషన్లు యందలి జ్ఞాన మరియు అనుభవ సారము వాటి ఉన్నత కార్యాచరణ అవగతమవ్వు విధంగా శిశుల(Mediums) తాహత మేరకు ఈ పార్టీషన్ల సరిహద్దులను తొలగించి ఆ పరబ్రహ్మం  (Onepoint ) సంకల్పం మేరకు శిశుల(Mediums) తదుపరి వ్యూహాత్మ కార్యాచరణ ప్రణాలికను శిశుల కుండలిని యందు నిర్దేశన సూచనములుగా నిలుపు విధి విధానా ప్రక్రియను initiation గా బావించవలెను.


ఈ నూతన యోగములో Initiation ఇవ్వగల సామర్థ్యం మాస్టర్ గారికి మాత్రమే ఉంది. కొన్ని సందర్భాలలో మాస్టర్ గారు కొంత మంది యోగమున చేరుటకు వొచ్చిన ఔత్సాహికులను వారు ఈ నూతన యోగమునకు అనర్హులని చేర్చుకొనుటకు నిరాకరించారు.   


ఈ నూతన యోగమున చేరు ఔత్సాహికులకు సవినయముగా మనవి చేయునది ఏమనగా? 


మీరు ఎవరివద్ద initiation తీసుకోవలసిన అవసరం లేదు, కుంభకోణము వెళ్లి మూడు రోజులు అక్కడ ఉండి Initiation తీసుకోవలసిన అవసరం లేదు, ఎవరో వొచ్చి మీకు initiation ఇస్తారు అని ఎదురు చూడనవసరం లేదు, ఎవరికీ ఎటువంటి రుసుము(money) చెల్లించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. భౌతిక ప్లేన్ యందు మాస్టర్ గారి ఉనికిని ప్రశ్నించకుండా మాస్టర్ గారు ఉన్నత ప్లేన్ల(Planes ) యందు తన కార్యాచరణ నిర్వహిస్తున్నారని ప్రగాఢ నమ్మకంతో ఈ యోగము యొక్క నియమ నిబంధనలను పాటించిన సరిపోవును.


మీ Initiation భాద్యత మాస్టర్ గారే చూసుకొందురు.



The above essay is an extract from Master C.V.V.'s direct disciples' (mediums) S. Narayana Iyer's writings (T.S. Sankar Aiyer supported his writings.)


--------------------------------------------

Join our Whatsapp Community:

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?