ఉపనిషత్తుల ఆధారంగా పరమాత్మా మరియు జీవాత్మ భావం.



ఉపనిషత్తుల ఆధారంగా పరబ్రహ్మ భావం.

పరబ్రహ్మం అనగా ఆది, అంతం లేని, నిరాకారుడు. (గమనిక: బ్రహ్మం, పరబ్రహ్మం, పరమాత్మ, పరంజ్యోతి, ఆది మొదలగు పరియాయి పదాలు అర్థం ఒక్కటే)

ప్రతిచోటా మరియు ఎల్లప్పుడూ ఉనికిలో ఉండడం జరుగుతుంది.

గుణాలు మరియు కార్యకలాపాల యొక్క అన్ని పరిమితులకు అతీతుడు, పరబ్రహ్మమునకు మించి ఈ సృష్టి లో ఏమి లేదు.

పరబ్రహ్మం అనగా అనంతమైన సంభావ్యత, సమస్త శక్తికి మూలం. మానవ ఆలోచన మరియు మాటలతో వర్ణింపరానిది. 

పరబ్రహ్మం కోరికలకు అతీతం మరియు తరుగుదల అనే మాటే లేకుండా ఎల్లప్పుడూ సంపూర్ణత కలిగి ఉండును.

మనలో అనగా మన అంతర్బాగమున ఉన్నదీ ఆ పరబ్రహ్మమే.

ఎప్పుడవుతే మనము పరబ్రహ్మముగా మారుట జరుగునో, ఆనాడు మనమే ఆ పరబ్రహ్మస్వరూపం, ఆ పరబ్రహ్మస్వరూపమే మనము, అని అర్థం చేసుకోవడం జరుగును.

ఉపనిషత్తులు చెప్పినట్లు "నీవే బ్రహ్మము." బ్రహ్మమే ఈ సృష్టి ఉనికికి ఒక పునాదిగా మరియు పరిమితి లేకుండా ప్రతిచోటా విస్తరించి సృష్టించబడింది.

విశ్వం పరిణామం చెందుతోంది. 

పరబ్రహ్మం ఈ విశ్వం యందలి జీవ మరియు నిర్జీవ పదార్థమునకు మూల ఆధారం. 

మన చుట్టూ కనపడుచున్న వ్యత్యాసాలు, ఈ వ్యత్యాసాల నాణ్యత, మరియు కార్యాచరణ ఇదంతా బ్రహ్మం ద్వారా సృష్టించిన ఈ ప్రపంచం యొక్క వ్యవహారాలు మాత్రమే. ఈ ప్రపంచం వరకే పరబ్రహ్మ ద్వారా ఏర్పడింది,  పరబ్రహ్మ ద్వారా ఏర్పడిన ఈ ప్రపంచము యొక్క ప్రాపంచిక  వ్యవహారాల యందు పరబ్రహ్మమును చూడరాదు.

పరబ్రహ్మను లేదా పరమాత్మను, పరమాత్మ ద్వారా సృష్టించబడిన ఇతరేతర రూపాల నుంచి వేరుచేసి చూపించుటకు ఈ ఇతరేతర రూపాలను జీవాత్మలని, ఈ జీవాత్మలన్నీ ఆ పరమాత్మ నుంచి ఆవిర్భవించిన ప్రతిబింబములుగా పరిగణించవొచ్చును.



ఉపనిషత్తుల ఆధారంగా జీవాత్మ భావం.

ప్రతి జీవాత్మ పరమాత్మ(పరబ్రహ్మ) యొక్క ప్రతిబింబము

జీవాత్మ మానవుని కంటికి కనిపించని ఒక అణువు, జీవాత్మలన్నీ పరమాత్మ నుంచి వెలువడడం చేత పరమాత్మ స్వభావం కలిగి ఉండును, ఈ జీవాత్మలు మూడు తొడుగులు(Covers) ఒక దాని పై మరొకటి ఏర్పరుచుకొని ఉండును.

జీవాత్మ,  పరమాత్మా ద్వారా మూడు లక్షణాలను పొందివున్న ఘనీభవించిన ఒక శక్తి కణం(like a seed), ఈ శక్తీ కణం తన సొంత అస్థిత్వాన్ని కలిగి ఉండుటచే పరిణామ క్రమములో తన సొంత వ్యక్తిగత రూపమును సంతరించుకొనును.

ఈ జీవాత్మ పరమాత్మా ద్వారా మూడు ఉపాధిలను(Covers / Coatings / లక్షణాలు) పొంది ఉండుటచే  త్రిమూర్తుల ప్రతిబింబముగా అభివర్ణించడం జరుగుచున్నదీ. ఈ జీవాత్మనే యోగ సాహిత్యమునందు కుండలినిగా వ్యక్తపరచడం జరిగినది.

మనిషి యొక్క కుండలిని ఆధారితంగా మూడు దేహములు ఏర్పడుట జరుగును, 1 - మానసిక(Mental), 2 - ఆస్ట్రల్(Astral), 3 - భౌతిక(Physical), మనిషికి ఈ దేహములు ఏర్పడుట వలన, జీవాత్మ స్వతంత్ర అస్తిత్వంతో జీవంగా పరివర్తన చెందడం జరుగుతుంది.

జీవంగా పరివర్తన చెందినప్పటికీ ఈ జీవానికి ఆధార అణువు అయిన కుండలిని కేంద్ర స్థానమున పరమాత్మ తత్వం ఏర్పడి ఉండును, దీనినే అంతరాత్మ అందురు. ఈ అంతరాత్మ వివిధ పొరలు చేత కప్పబడి ఉంటుంది ఈ పొరలు ఆది పరబ్రహ్మ నుంచి ఇప్పుడు మనము జీవించి ఉన్న భౌతిక ప్లేన్(Physical Plane) వరకు ఏర్పడిన అనేక ప్లేన్ ల  సమూహముతో కప్పబడి ఉండును. (ఒక ప్లేన్ సంబంధిత ఉమ్మడి స్మారక స్థితి(Collective Consciousness) ఒక పొర వలె ఏర్పడును.)

పరమాత్మా తత్వమైన అంతరాత్మ పై అనేక పొరలు ఏర్పడి ఉండుటచే మానవుడు అనేక పరిమితులకు లోబడి ఉండుట జారుగుచున్నది, పరమాత్మా అనుభవించు వర్ణానాతీతమైన స్వేచ్చని కోల్పోవడం జరుగుచున్నదీ. ఈ స్వేచ్చని కోల్పోవడాన్నే మనిషి కర్మ ద్వారా కట్టివేయపడ్డాడు(బవబాంధవ్యాలకు కట్టుపడిపోయాడు) అని మన పూర్వికులు పేరుకొనడం జరిగినది.

ఈ భవబంధవ్యాలు మనిషిని అనేక పరిమితులకు గురిచేస్తాయి ఈ పరిముత్తులే భయము, బాధ, ఇంకా మరెన్నో.

Sri Paripoornananda Swamy of vyasa ashram (Kundalni Yogi).

Bramha Gnanam and Athma Gnanam in context of Vedas and Upanishads



To know experiences of Kundalini Yoga Sadhakas please read this book: 

The above essay is an extract from Master C.V.V.'s direct disciples' (mediums) S. Narayana Iyer's writings (T.S. Sankar Aiyer supported his writings.)

-------------

If you are new to this yoga, please join our whatsapp group: click over this link

మీరు కొత్తగా ఈ యోగమునందు చెర దలచినచో పైన ఇచ్చిన లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ యందు చేరగలరు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?