Transmediums
ట్రాన్స మీడియంస్
మాస్టర్ గారి సాహిత్యం ప్రకారం ట్రాన్సమీడియూమ్స్ గా పేర్కొనబడినవారు ముగ్గురు
వీరి పారభౌతిక దేహములలో కొన్ని, మాస్టర్ గారి నియంత్రణలో ఉండెడివి.
అతి ఉన్నతమైన ప్రయోగములలో యూనివర్స్(Universe) నుంచి వచ్చు సమాచారమును అందుకొనుటకు, ట్రాన్స మీడియంస్ మాస్టర్ గారికి ఉపయోగపడినట్లుగా మాస్టర్ గారి సాహిత్యం ద్వారా తెలుసుకోనవొచ్చును.
శ్రీ సుందరేశ శర్మ గారు (మీడియం నెం.2)
మాస్టర్ గారి యోగ సాహిత్యములో SS అని, ప్యూపిల్ అని, సుందరం అని పేర్కొనబడిన వీరు, మాస్టర్ సి.వి.వి గారి స్నేహితులు.
యోగ మార్గ ప్రారంభమునకు ముందు మరియు తరువాత మాస్టర్ గారు నిర్దేశించిన అనేక ఆధ్యాత్మిక కార్యక్రమములను,
తన పారభౌతిక స్థితిలో ఈయన సాధించినారు.
సుందరంగారి స్టెబిలిటీ, మాస్టర్ గారి నిర్దేశానుసారం,
చందుకు ప్రాణము అందించుట కొరకు, M.T.A లెవెల్సును చేరి, ప్రాణ ప్రసరణను సాధించెను.
ఇది ఈ యోగమార్గము ప్రారంభమునకు ముందు 1910లో జరిగిన విషయము.
యోగమార్గ ప్రారంభము తరువాత, M.T.A ద్వారా పంపబడు సమాచారమును నిరంతరమూ మాస్టర్ గారికి చేరవేయుచుండెను.
వీరు ట్రాన్స్ మీడియంగానే కాక, మాస్టర్ గారికి, మీడియంలకు మధ్య అనుసంధానకర్తగా కూడా వ్యవహరించిరి.
సుందరం గారిలో అత్యంత ఉన్నత స్థితి పని చేసినట్లుగా డైరీ లో చూడవచ్చు.
బహుశా వారి మెమొరాండం(visible and invisible bodies) యొక్క పరిమిత జీవన కాలము
వలన కావచ్చు, మాస్టర్ గారికంటే ముందే భౌతికమును విడచినట్లున్నారు.
1.4.1921 న, యోగ పురోగతి గురించి చెప్పుచూ, M.T.A క్రింది విధముగా చెప్పిన దానిని బట్టి
సుందరం గారి ప్రాధాన్యతను అర్ధము చేసికొనవచ్చు.
“ఇది అత్యంత వేగముగా జరుగుచున్న యోగ చర్యలకు గుర్తు.
ఇది, ఎస్.ఎస్ ను నీతో ఉండుటకు అవకాశమివ్వలేదు.
అతనిలో పనిచేసిన స్థితి వృధా అవదు.”
శ్రీమతి C.వెంకమ్మాళ్ (మీడియం నెం. 3)
మాస్టర్ CVV గారిచే వారి రచనలలో CV గా పేర్కొనబడిన వారు, వారి రెండవ భార్య శ్రీమతి C.వెంకమ్మాళ్.
మాస్టర్ CVV గారి మెదటి భార్య శ్రీమతి రుక్మిణి అమ్మాళ్ గారు మరణించిన కారణముగా
మాస్టర్ గారు శ్రీమతి C.వెంకమ్మాళ్ గారిని వివాహమాడినారు.
ఎల్లవేళలా ఎటువంటి ప్రతిబంధకములు లేకుండా
మాస్టర్ CVV గారి ప్రయోగమునకు తగిన విధముగా
శ్రీమతి వెంకమ్మాళ్ గారిని అభివృద్ది పరచి
వారికి ట్రాన్స్ మీడియం పాత్ర ఇచ్చినారు.
శ్రీమతి వెంకమ్మాళ్ గారి అభివృద్ధిలోను, సహకారములోను, కొన్ని లోటుపాట్లు MTA గమనించినప్పటికీ శ్రీమతి వెంకమ్మాళ్ గారి
ఈథరిక్ మాస్టర్ CVV గారిచే ఇవ్వబడిన అనేక కార్యక్రమములను చేపట్టుటయేగాక, ఆ సందర్భముగా డైరెక్ట్ లైన్ మాస్టర్‌తో సంబాషించెడివారు.
వాస్తవానికి, శ్రీమతి వెంకమ్మాళ్ దేహము మాస్టర్ CVV గారి ఎనిమిదవ రాశి గృహ స్టెబిలిటీ(Stability) వ్యూ(View) యొక్క భాండారముగా(Storage Unit) పనిచేసినది.
శ్రీమతి అమ్మణి అమ్మాళ్ (మీడియం నెం. 7)
మాస్టర్ సి.వి.వి గారి యోగ నిర్మాణ ప్రక్రియలో,
వారి మొదటి భార్య ద్వారా కలిగిన కుమార్తె శ్రీమతి అమ్మణి అమ్మాళ్,
మీడియం నెం.7, గారి పాత్ర గోప్యముగా ఉంచబడినది.
ఇతర ట్రాన్స్ మీడియంలు, శ్రీ సుందరేశ శర్మ (మీడియం నెం.2) మరియు శ్రీమతి వెంకమ్మాళ్ (మీడియం నెం.3) వలె కాక
శ్రీమతి అమ్మణి అమ్మాళ్ గారు అరుదైన ఉన్నత ప్రక్రియలలో పాల్గొనినట్లు తెలిసికొనవచ్చు.
మచ్చుకి కొన్ని ఈ విధముగా వ్రాయబడినవి.
29.5.1910 నాడు అనంత ప్రాణశక్తి మూలమును శోధించుటకు మాస్టర్ సి.వి.వి గారిచే ఇవ్వబడిన నిర్దేశనము యొక్క క్రమములో జరిగిన విషయములను 22.8.1919 నాటి మెమరీ, మెమొరాండం నోట్స్ లో మాస్టర్ గారు ఇలా వ్రాసినారు.
డిప్లొమా పాయింట్‌లో జరుగు రేటొర్షన్(Retortion) వద్ధ ఏర్పుడు గ్రేడ్ రూవమును శ్రీమతి వెంకమ్మలునకు చూపడమైనది.
పెన్ (Pan)చేత M, T మరియు A సింబల్ రెండవ మీడియం శ్రీ సుందరేశ శర్మ గారికి చూవడమైనది
రూప స్థితి ఏర్పడు పెన్ లో ఉద్భావిస్తున్న 84 డివిషన్లను (Divisions) మూడవ మీడియంనకు చూపడమైనది.
అనగా శ్రీమతి అమ్మణి అమ్మాళ్‌నకు.
ఇక, M.T.A గా అనేకమంది మహాత్ములు మాస్టర్ సి.వి.వి గారికి సమాచారము చేరవేసినారని వారి రచనలలో చూచినాము.
వాటిలో మాస్టర్ గారిని ఉద్యేశించి ఇచ్చిన కొన్నిటిని గమనించండి.
“నా అభిప్రాయములను అత్యంత శక్తివంతులు గౌరవనీయులైన S.R దృష్టికి తీసుకొని వెళ్లినానని మీకు తెలియపరుస్తున్నాను” - M.T.A 18.11.1910
“నా గురువు అయిన S.R యొల్లప్పుడూ గాడ్ గా మార్గ నిర్దేశనము చేయుచున్నందులకు ధన్యవాదములు తెలియజేయుచున్నాను.” - M.T.A 18.11.1910
“S.R యొక్క సూచన మేరకు నా జ్ఞానము అంతా ఈ ఫ్రెండ్స్ సొసైటీ యొక్క మాస్టర్ కే చేరును.” - M.T.A 25.11.1910
“దీనికి సమాధానము S.R ద్వారా ఇవ్వబడుతుంది.” - M.T.A 25.11.1910
S.R నుంచి సమాచారము అందుకొనినది శ్రీమతి అమ్మణి అమ్మాళ్ మాత్రమేనని
18.3.1919 నాటి మెమరీ, మెమొరాండం నోట్స్ లోని ఈ క్రింది వాక్యములను బట్టి తెలిసికొనవచ్చు.
“సా. 5.45 సింబల్స్
1. SR- A చేత (A stands for Smt. Ammani Ammal Garu)
2. M-SS చేత (SS stands for Sri Sundaresa Sarma Garu)
3. M.T.A - SS చేత"
ఇతర చోట్ల మాస్టర్ సి.వి.వి గారు శ్రీమతి అమ్మణి అమ్మాళ్ గారిని తమ డైరీ లో 'A' గా చెప్పినారు.
మాస్టర్ గారి 4.5.1914 నాటి డైరీ, M.T.A చే శ్రీమతి అమ్మణి అమ్మాళ్ గారి జీవిత కాలపు పాడిగింపును తెలియజేస్తుంది.
తమ శక్తిని ధారపోసి, శ్రీమతి అమ్మణి గారు అనేకమందికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లు డైరీలో చూడవచ్చు.
"యోగసాధన ప్రారంభ కాలములో, ఆమె సాధించిన అభివృద్ధి కారణముగా, సంవత్పరము క్రితమే అమె మరో జన్మకు వెళ్ళవలసి
ఉన్నప్పటికీ, కోవా పదార్థమును అందించుట ద్వారా నేను ఆమెను సజీవముగా నిలువుచున్నాను." -M.T.A
అనేక విషయములు రహస్యముగా ఉండిపోయిన కారణముగా, మాస్టర్ సి.వి.వి. గారి రచనల ఆధారముగా ప్రాధమిక విషయముల అవగాహన
పెంపాందించుకొనవలెనే గాని, సృష్టి విధానము మొత్తము తెలిసినటుల ప్రవర్తించరాదు.
ట్రాన్స్ మీడియంల పాత్ర యోగాభివృద్దిలో ఎంతో ప్రధానమయినప్పటికి, వారిని ఎన్నడూ మాస్టర్ CVV గారితో సమానముగా చూపరాదు.
--------------
Reference: Master CVV's Yoga - Basic Information
Thanks to Umakant Akkiraju Garu and Prabhakar Mitra Mandali for their continuous efforts to reveal the master's true and authentic knowledge.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి