వన్ పాయింట్ (One Point)
ఈ యోగ మార్గములో చెప్పబడిన పరంపర, మాస్టర్ సి.వి.వి - M.T.A - వన్ పాయింట్ మాత్రమే.
మరే ఇతరులను ప్రస్తావించలేదు .
20.12.1921 నుంచి 16.1.1922 తేదిలలో మాస్టర్ గారి నోట్స్ నందు వన్ పాయింట్ యొక్క వివరణలు చూడవచ్చును.
అయితే, ఇది అర్ధము చేసుకొనే క్రమములో ప్రాచీన తత్వ సిద్ధాంత ప్రాతిపదికలను, అందులో ఉపయోగింపబడిన పదజాలములను వదలివేయట మంచిది.
భౌతికస్థితిలోని మనము,
భౌతిక దేహమును, స్థితిని అర్థము చేసుకొనుటకు ఏవిధముగానైతే మన దేహమునకు గల యాంత్రిక లక్షణములను నిర్వచించగలుగుతున్నామో,
అదే విధముగా పారభౌతిక స్థితుల (భౌతిక స్థాయిలో ఉండి చూడలేని స్థితిని) యాంత్రిక లక్షణములను,
భౌతికస్థితికి అర్థమగు విధముగా మాస్టర్ గారు వివరించినారు.
ఈ దృక్పధం కలిగి ఉండటము మాస్టర్ గారి వివరణలను అర్థము చేసికొనుటకు ఉపకరిస్తుంది.
"వన్ పాయింట్ ” అనగా ఎంతో శక్తితో నిండి ఉన్న అత్యంత సూక్ష్మ ప్రదేశం
20.12.1921 మాస్టర్ గారు ఇలా వ్రాసినారు.
“అది పాదరసమువలె గోళాకారమును కలిగి ఉండును. ” అని. మాస్టర్ గారు దీనిని “డెసిమల్ వన్” అని కూడా పిలచినారు.
"దీని స్థితిని Truth మెర్క్యూరీ” గా చెప్పుకొనవొచ్చును.
ఇంకా ఇలా వ్రాసినారు.
ఈ డెసిమల్ వన్ కు ఎటువంటి భావనలను ఆపాదింవరాదు.
ఇది One గా నిరంతరమూ ఉండుటకు మారే ప్రయత్నమూ చేయుచు, "0" zero గా మారకుండా 'డెసిమల్ వన్' గానే వుండే విధముగా ప్రవర్తించే ఆలోచన చేస్తుంది. ”
సాధారణ మానవుడు స్పృహలో ఒక స్థితిలో మాత్రమే ఉండగలుగుటవలన,
ఒక స్థితిలో "డెసిమల్ వన్" గా ఉంటూనే వేరే స్థితిగా చెప్పబడిన "0" Zero స్థితిగా 'మారటమనేది మన బుద్ధికి అందని విషయము.
ఈ “డెసిమల్ వన్”, "0" Zero గా మారే ప్రయత్న స్థితిని మాస్టర్ గారు ɸ అనే చిహ్నమును ఉదహరించినారు.
ఈ ప్రయత్నములో పాందిన వేగమును “1” గా ఉదహరించినారు.
ఇప్పటివరకూ ఈ “డెసిమల్ వన్” Zero “౦” గా మారే ప్రయత్నము సఫలమవలేదని వ్రాసినారు.
“వన్” కు సంబంధించి, మరియు “వన్ లెవెల్” కు సంబంధించిన
ప్యూర్ వన్, (Pure One)
స్టాగ్నంట్ వన్, (Stagnant One)
సెకండ్స్ వన్, (Seconds One)
ఎనర్జేటిక్ వన్, (Energetic One)
ఆటేఎంపట్ వన్ (Attempt One)
మరియు హై లోబ్స్ వన్ (Hi lobes one) - పదములకు
మాస్టర్ గారు నిర్వచనములను వ్రాసినారు.
ఈ యోగ మార్గములో చెప్పబడిన పరంపరను తెలిసికొని అవగాహన కలిగి ఉండుట ఎంతో అవసరము.
పైన చెప్పిన తేదిలలో మాస్టర్ గారి నోట్స్ ను సాధకులు పరిశీలించవలెను.
వన్ పాయింట్ నమస్కారం అని మనము ప్రేయర్ యందు వాడకూడదు.
వన్ పాయింట్ గురించి అతిగా పరిశోధన చేయాలనీ, సమాచారాన్ని సేకరించడము వంటి ప్రయాసలు
సాధకులకు అంత మంచి విషయం కాదు.
మన ద్యాస కేవలం మాస్టర్ గారి మీద నిలుపుట చాల మంచిది.
--------------
Reference: Master CVV's Yoga - Basic Information
Thanks to Umakant Akkiraju Garu and Prabhakar Mitra Mandali for their continuous efforts to reveal the master's true and authentic knowledge.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి