Master CVV గారి యోగ మార్గము
Master CVV గారి యోగ మార్గము
మాస్టర్ గారు తమ మార్గమును “యోగ లైన్” అని పిలచినారు. యోగ అన్న మాటతో, ఈ మార్గము కూడా సాధారణముగా వాడుకలో ఉన్న ఇతర యోగముల వలెనని అనేక మంది భావించుట కలదు.
సంప్రదాయ యోగ పద్దతులకు, మాస్టర్ గారి యోగ మార్గమునకు, ప్రాధికమైన మరియు గుణాత్మకమైన భేదము కలదు.
సంప్రదాయ యోగ మార్గమంటే, పతంజలి యోగమార్గముగా భావించవచ్చు.
పతంజలి యోగ మార్గములోని ఉన్నతమైన సమాధి స్థితి, జీవుడు జన్మపరంపర నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశించినది.
ఇందుకు కారణము, భౌతిక జన్మము నిశ్ఫలమని, దీని నుండి తప్పించుకొనుటయే మోక్షమార్గమని భావించుటయే.
మాస్టర్ గారి యోగ మార్గములో భౌతిక దేహము అత్యంత ఉన్నతమైనది. దీనికి మరింత పరిణామ అభివృద్ది కల్పించుటయే ఈ యోగ లక్ష్యము.
పరిణామము నెమ్మదిగా జరుగు నిరంతర ప్రక్రియ అను విషయము అందరలకు ఎరుకయే. మానవుని జీవనకాలము చాలా తక్కువ అగుట
చేత, సృష్టి పరిణామములోని మార్పులు వ్యక్తి జీవనకాలములో గమనమునకు రావు.
ఈ దిశగా ఆలోచించిన యెడల మాస్టర్ గారి మార్గమును అర్థముజేసుకొనుట సులభమగును.
మాస్టర్ CVV గారు ఆవిష్కరించినది, పరిణామ క్రమముగా, భౌతిక అమరత్వముతో కూడిన మానవుని యొక్క ఉన్నత అభివృద్ధి మరియు
పూర్తి స్పృహలో సృష్టిలోని మాయా విధానమును గుర్తింప గలుగుట.
సాధకుని ఆధ్యాత్మిక ఉన్నతిని బట్టి, సాధనలో భౌతిక దేహమునందు జరిగే మార్పులని గమనింపవచ్చు. ఒక విధముగా ఇది మానవునిలో
జరుగు పరిణామ ప్రక్రియను గమనింపగలుగుటయే.
మాస్టర్ CVV గారు భాతికముగా ఉన్నప్పుడు వారు సాధించినది, ఈ నూతన మానవ పరిణామక్రమాన్ని నిర్దేశించి, భౌతిక అమరత్వము సాధించు ప్రక్రియను సృష్టిలో ప్రారంభించుటయే.
నేడు సాధకులు చేయగలిగినది, అట్టి ప్రక్రియకు తమని తాము అనుసంధానించుకొనగలుగుట మాత్రమే.
ప్రాచీనముగా తారక రాజయోగ మార్గము అతి గుప్త యోగము. ఈ ప్రాచీన మార్గములో సృష్టిలోని శక్తులను మానవ రూపములుగా భావించుట, పూజించుట ఉండదు.
సంకల్ప శక్తితో (విల్ పవర్) సాధకులు తమలోనూ, సృష్టిలోను గల శక్తుల ఆధారముగా ఉన్నతిని సాధించెడివారు.
దక్షిణా-పథములో, సత్యమును తెలిసికొనుటకు రెండు మార్గములను ప్రధానముగా పూర్వీకులు సూచించినారు.
1. ఉన్నత విలువలతో సాధారణ జీవనము గడుపుచూ, కాలక్రమములో క్రమేపీ ఐహికవాంఛల నుండి విముక్తులై, అంతర్ముఖులుగా
ఉంటూ ఆధ్యాత్మిక తేజో దర్శనము పొందుట ద్వారా నిర్వాణమును సాధించుట.
ఇది సురక్షితమైన మార్గము కావున దినిని పాటించవలసినదిగా పూర్వీకులు చెప్పియున్నారు.
అయితే ఒక జీవన కాలములో ఇది దాదాపు అసాధ్యమనే చెప్పవలెను.
2. ప్రాచీన తారక రాజయోగ మార్గము: పూర్తి నిస్వార్దత, మానవాళి కొరకు తమను తాము అర్పించుకొనగలుగుట,
తమ సొంత ఉనికిని కూడా త్యజించగలిగెడి సంకల్పబలము వంటి లక్షణములు రక్షణగా కలవారు మాత్రమే ఇట్టి సాధన చేయగలరు.
అట్టి ఉన్నతమైన భావనలు కలవారు మాత్రమే సాధించగలిగిన యోగమది.
శుక్ల యజుర్వేదమునందలి అద్వయతారకోపనిషత్తు నందు వివరణలు చూడవచ్చు.
గురు సమక్షములో చేయవలసిన ముద్రలతో కూడిన అత్యంత ప్రమాదకరమైన మార్గమిది.
శాంభవీ ముద్ర వంటివి దీనిలో భాగమే.
పైన చెప్పినటువంటి తారక రాజ యోగ మార్గములోని, సాధకుని దహించేటి భృక్త (hidden)ప్రక్రియలు లేనిది (రహిత) కనుకనే,
మాస్టర్ గారి మార్గమును “భృక్త రహిత తారకరాజ యోగము అనే పేరుతో కొందరు పిలచుట జరుగుచున్నది.
ఉపదేశము ఇచ్చుట ద్వారా మీడియంలకు, తక్షణ ఉన్నతిని కల్పించి,
ఈ మార్గములో సురక్షితమైన విధముగా
సులభరీతిలో
యోగ విధాన నిర్మాణ ప్రక్రియల కొరకు,
మాస్టర్ గారి స్వీయ అభివృద్ది కొరకు
మీడియంలచేత సాధన చేయించినారు.
--------------
Reference: Master CVV's Yoga - Basic Information
Thanks to Umakant Akkiraju Garu and Prabhakar Mitra Mandali for their continuous efforts to reveal the master's true and authentic knowledge.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి