M.T.A
M.T.A
M.T.A అనగా సృష్టిలో అభివృద్ది చెంది ఉన్నత స్థితిని పాందిన మునులు, బుషులు, మహానుభావులు లేదా వారి చైతన్య స్థితిగా మన సౌలభ్యం కొరకు అర్థం చేసుకోనవొచ్చును
Note 1: M.T.A అనగా మహానుభావులు లేదా వారి చైతన్య స్థితిగా అనే కాకా వేరు వేరు అర్థాలతో వేరు వేరు విధంగా సందర్భాన్ని పట్టి మాస్టర్ గారి సాహిత్యం యందు MTA పదమును అర్థం చేసు కొనవలసి ఉంటుంది.
సృష్టిలో మాస్టర్ గారి ద్వారా, సృష్టి యొక్క సమ్మతితో జరుగుచున్న పరిణామ ప్రక్రియకు దోహదపడుతున్నందువలన,
పైన పేరుకొనబడిన ఉన్నత స్థితిని పాందిన వారందరు సృష్టికి ప్రతీకగా M.T.A అనే అక్షరములనే ఉపయోగించిరి.
ఒక సందర్భములో మాస్టర్ గారికి వీరికి మధ్య సంతకము మార్చవలెనా అనే చర్చకూడా జరిగినట్టు నోట్సులో చూడవచ్చు.
M.T.A అనే అక్షరములనే ఉపయోగించవలెనని నిర్ణయించినారు.
వీరు, కొందరు మీడియంలకు భౌతికరూపములో కనుపించినటుల నోట్స్ లొ వ్రాయబడి ఉన్నది.
M.T.A అనేది సృష్టిలొ అంతర్లీనంగా గల పద్ధతికి మరియు సృష్టికి గుర్తుగా భావించవలెను.
ఆ విధముగా అన్వయించుకొనిన యెడల మాస్టర్ గారి నోట్సులో కొన్ని భాగములు అర్థమగును.
జీవులు అత్యున్నతమైన స్థితిని పాందుట సృష్టి యొక్క పరిణామమే.
సృష్టి యొక్క అభివృద్ధి జీవుల అభివృద్దికి మించి ఉండజాలదు.
M.T.A - మానవ రూప నిర్మాణ అంతః రూపము,
ఈ అక్షరములవలెనే ఉన్నట్టుగా మాస్టర్ బొమ్మ వేసి ఉన్నారు.
మానవ రూపమే సృష్టిలో అత్యున్నత స్థితి అని మాస్టర్ వ్రాసియున్నారు.
మానవ రూపము సృష్టికి ప్రతీకయే.
మానవ దేహనిర్మాణములో చేయు మార్పు సృష్టిలో
ప్రతిబింబించునని మాస్టర్ వ్రాసినారు.
M.T.A లెవెల్ - 15.1.1921 నాడు మెమరీ మెమొరాండం నోట్స్ నందు మాస్టర్ సి.వి.వి గారు,
ఎస్. సుందరం (Medium 2) గారిచే అందుకొనబడిన నోట్ సులలో
M.T.A అని సంతకము చేయుటకు గల కారణమును వివరించినారు.
ఈ యోగ మార్గము M.T.A లెవెల్ ను దాటి మరింత
ఉన్నత స్థాయిలో పనిచేసినదని మాస్టర్ గారు వ్రాసినారు.
30.1.1921 న ఇలా వ్రాసినారు. “M.T.A లోని నూరవ డివిజన్ లో నాలుగవ రౌండ్ లో సి.వి. (Smt. Canchupati Venkamma Garu - Trans Medium) తప్పిదము చేసినది” అని.
MTA అని వ్రాయుటను, మొదటగా శ్రీ S.సుందరం (మీడియం నెం.2 మరియు ట్రాన్స్ మీడియం) మే, 1910 లో అనంత ప్రాణశక్తి మూలమును కనుగొను సందర్భములో ప్రారంభించినట్లుగా 16.1.1921 నాటి మెమొరీ మెమోరాండం నోట్స్ నందు మాస్టర్ C.V.V గారు తెల్పినారు.
అయితే, M అను ఇంగ్లీష్ అక్షరమును కేవలం వ్రాయుటలో సౌలభ్యత కొరకు మాత్రమే వాడినారు.
ఈ లెవెల్ నకు గుర్తుగా మాస్టర్ C.V.V గారు వ్రాసిన చిహ్నం సిగ్మా Σ.
శ్రీ S.సుందరం (Sundaresa Sarma - Medium 2), 28.5.1910 న M మరియు M.T.A లెవెల్స్ లను చేరినట్లుగా మాస్టర్ C.V.V గారు వ్రాసినారు.
అట్టి అత్యున్నత లెవెల్స్ నుండి సమాచారము అందుకొనుటకు వీలుగా సుందరం గారి సిస్టమ్ 1000 & కోట్ల గ్రేడ్ నకు అభివృద్ది పరచబడినది అని, దరిమిలా ఆనాటి రాత్రి శ్రీ సుందరం డిప్లామా పాయింట్ చేరినారని కూడా వ్రాసినారు.
--------------
Reference: Master CVV's Yoga - Basic Information
Thanks to Umakant Akkiraju Garu and Prabhakar Mitra Mandali for their continuous efforts to reveal the master's true and authentic knowledge.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి