మోక్షంతో శాశ్వతత్వం ఎలా సహసంబంధం కలిగి ఉంది



మోక్షం లేదా ముక్తితో శాశ్వతత్వం(eternity) ఎలా సహసంబంధం(correlation) కలిగి ఉంది


మోక్షం గురించి ఇప్పటికే ఉన్న నమ్మకాలు


1. మనిషి ముక్తిని పొందాలనే ఉద్దేశ్యంతో తన తపన మరియు అనేక ప్రయత్నాలతో  ప్రపంచం యొక్క అర్థం తెలుసుకొనే ప్రయత్నంలో జనన మరణ చక్రంయందు చిక్కుకొనిపోవడం జరుగుచున్నది. 

2. మనిషి భవ బాంధవ్యాల కర్మచే బంధింప పడివున్నాడు తత్ఫలితంగా భయాందోళనలకు మరియు నిర్బంధాలకు లోబడి, అతను విముక్తి పొందాలనే కోరిక కోరికగానే మిగిలిపోయింది.

అనేక జన్మల కర్మ పొరలు శుద్ధికానిదే జీవాత్మ( మానవుడు) పరమాత్మలో ఐక్యం కాజాలదు అనే భావనతో అనేక ప్రయత్నాలలో విఫలమవడం జరుగుచున్నది.

యోగము, ఈ ప్రయత్నంలో సఫలీకృతం అవడానికి ఒక మార్గంగా భావించడం జరుగుచున్నది.

అనేక మంది ఆధ్యాత్మిక గురువులు ఈ సిద్ధాంతాన్ని బలపరచడం ద్వారా వారి అనుయాయులు మరియు సామాన్య ప్రజానీకం, గురువులకు తెలిసినంత మనకేమి తెలుసులే అని -  మోక్షం అంటే జీవాత్మ పరమాత్మలో కలవాలి అని ఒక నిశ్చయ స్థితిని వారి మనసు నందు ఏర్పరుచుకొని, ఇక మోక్షం ఎలాగైనా సాదించాలి అనే పట్టుదలతో తప్పటడుగులు మీద తప్పటడుగులు వేసుకొంటూ ఇంకొంత కర్మాణి మూటకట్టుకొని జనన మరణ చక్రమణే  ఊబి లో మరింత లోతుకి దిగజారడం జరుగుచున్నది.

అయితే, పై సిద్ధాంతాలను నిశితంగా పరిశీలిస్తే,   ఈ సిద్ధాంతాలన్నీ పరిణామ(evolution of universe) స్ఫూర్తికి విరుద్ధమైనవి, అందువలన పైన వివరించిన సిద్ధాంతాలవలన మోక్షం అనేది అసాధ్యం. 

అనేక మతాల ఆచారాలు విధానాలు పరిణామ స్ఫూర్తికి విరుద్ధరీతిలో ఉండుట చేత, పాత ఆధ్యాత్మిక పద్ధతులు నుంచి మన ఆలోచన శైలిని మరల్చి, తార్కిక విశ్లేషణ ను జోడించి కొద్దిగా వైవిధ్యంగ ఆలోచించిన యడల  పరిణామ స్ఫూర్తికి విరుద్ధరీతిలో కాకుండా అనుకూల రీతిలో అసలైన మోక్షం ఏమిటో మనకి అర్థమగును.

ఒక గులాబీ తన సువాసన, తాజాదనం మరియు తన అందాన్ని చూసుకొని ఎంతో మురుసుకుంటూ మరోవైపు బాధపడుతూ "ఓహ్! నేను త్వరలో వాడిపొయ్యి అందవిహీనంగ మారడం తథ్యం అయితే, ఈ సువాసన, అందం మరియు తాజాదనం వల్ల ప్రయోజనం ఏమిటి, ఎందుకంటే అవి త్వరలో నశించిపోవుట తథ్యం అని తెలుసుకొని అమరత్వ స్థితిలో ఉండలేనందుకు చింతించుచు నశించిపోవుటను ఆపలేని ఒక నిస్సహాయ స్థితిలో నశించిపోవుట జరుగును.

అమరత్వ స్థితిలో ఉండాలనే కోరికతో, నశించిపోవుటను ఆపలేని ఒక నిస్సహాయ స్థితిలో నశించిపోవుట వలన ఆగ్రహ ఆవేశాలతో తనను సృష్టించిన మూలమునకు వెళ్లి, ఏదో తాత్కాలికంగా నాకు ఇచ్చిన  సువాసన, తాజాదనం మరియు అందం ఎందుకు పనికిరానిదిగా అభివర్ణించి అమరత్వ స్థితిలో ఉండాలనే కోరిక వలన మరల తన జన్మకు థానే కారకురాలై మరల తన అందాన్ని చూసుకొని ఎంతో మురుసుకుంటూ మరోవైపు బాధపడుతూ జీవన చక్రమును అనుసరిస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తోంది.

పైన చెప్పిన ఉదాహరణ ఏదో ఒక రోజా పువ్వుకు మాత్రమే కాదు సమస్త మానవాళికి వర్తిస్తుంది.   

ఒక రోజా పువ్వు ఆగ్రహ ఆవేశాలతో తనను సృష్టించిన మూలమునకు వెళ్లి ప్రశ్నించగాలేనిదీ ప్రకృతి లోనే అత్యంత ఉన్నత స్థితికి వృద్ధి చెందిన మానవుడు నిరంతరం తన మెరుగుదల కోసం మూలం తో సంఘర్షించుట సత్యం. అమరత్వ స్థితి కోసం నిరంతరం ప్రయత్నిస్తూ జనన మరణాల అవస్థను అధిగమించలేక భరిస్తూ జనన మరణ చక్రముయందు అనేక కష్టాలు అనుభవాలు పొందుతూ పరిణితి చెందుతూ ముందుకు పోవడం జరుగుచున్నది

సృష్టిలో మూలమును చేరుకొని మూలములో ఐక్యమవడం అనేది మన ఓటమిని మనమే అంగీకరించడం వంటిది ఇటువంటి చర్య మోక్షం కాజాలదు. కావును మూలములో ఐక్యం అవడం అనే ప్రసక్తే ఈ సృష్టి లో లేనిదీ అంతేకాక అమరత్వ సిద్ధి కొరకు సృష్టి యావత్తు పరిణితి చెందుతూ ముందుకు సాగడం అసలైన సత్యం. 

మోక్షము అంటే నిత్యా ఆనందమయ మరియు అతి ఉన్నతముగా ఉండును కానీ ఆది లో ఐక్యం అయ్యి తన ఉనికిని కోల్పోవడానికి ఒక చిన్న రోజా పువ్వు కూడా ఈ సృష్టి లో అంగీకరించదని అర్థం చేసుకొనవలెను.

జీవాత్మ(మానవుడు) పరమాత్మ లో ఐక్యం అవడమును మోక్షం అనుకోవడం మనల్ని మనము ఆది(మూలము)ని మించి తెలివైన వారీగా వూహించుకోవడమే కాకా అది(మూలము) ద్వారా నిర్మించ బడ్డ ఈ సృష్టి ఈ సృష్టి యందలి మనము మన ఉనికి మొత్తం వ్యర్థం మరియు వృధా ప్రయాసగ అగుపించును. 

మనం ఇక్కడికి ఎందుకు పంపబడ్డామో, ఎలా పంపబడ్డామో, మనిషి అంటే ఏమిటి మరియు అతని అసలు లక్ష్యం ఏమిటో మనం పూర్తిగా అర్థంచేసుకొనలేక విస్మరిస్తున్నామని మాత్రమే ఇది సూచిస్తుంది.

అసలికి మనిషి ఎవరు, మనిషికి శరీరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి మరియు శరీర అవయవాల ద్వారా  మనిషి యందు జరుగు సరైన పనితీరు ఏమిటో తెలుసుకోవడం మనిషి యొక్క కర్తవ్యం.

ఆది(మూలము) ఏదో చేయరాని ఒక తప్పిదం వళ్ల  ఈ సృష్టిని, సృష్టి యందలి మానవుని  సృష్టించలేదు 

మనిషి తన కర్మ పొరలను పూర్తిగా వదిలించుకొని ఆది(మూలము) యందు ఐక్యం అవడానికి సిద్ధపడే ప్రక్రియకు ఎటువంటి అర్థం లేదు,  మనిషి తాను సాధించిన జ్ఞానం, అనుభవాలు, కష్టాలు, మానవ పరిణామం అంతటిని మూలము లో ఐక్యం చేసి తన ఉనికిని కోల్పోవడం ఒక పనికిమాలిన చర్యగ పరిగణించ వొచ్చు ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం వలన మనిషి ఈ సృష్టి పరిణామంలో ఎటువంటి నిర్మాణాత్మకమైన చర్య లేకపోవడమే. ఈ విధంగా కాకా మనిషి పరిణామానికి వ్యతిరేకంగా వెళ్లి దానిని రద్దు చేయగలమని ఆలోచించడం.  ఒక వెర్రి మరియు చిన్న అహంకార పూరితమైన చర్యనే కాకా మిక్కిలి అసాధ్యం.

పరిణామం యొక్క సానుకూల లక్ష్యం ఏమిటో కనుగొని, ఫలితాన్ని సాధించడానికి మానవాళి ప్రయత్నించాలి, తద్వారా ఆది(మూలం) సంకల్పం నెరవేరుతుంది.

ఆది లో ఐక్యం అయ్యి జన్మ రాహిత్యం పొందాలనే తపనతో పూర్వం నుంచి అనేక యోగులు ఋషులు వివిధ పద్దతులను అవలంబించడం జరుగుచున్నది ఈ పద్ధతులలో ముఖ్యమైనవి ఆసనాలు, ప్రాణాయామ, దేవత ఉపాసనలు, ఇంకా మరెన్నో. ఈ పద్దతుల యందు ఉన్నతిని సాధించిన వారిని యోగులని, మహాత్ములని, జన్మ రాహిత్యం సాధించిన మహానుభావులుగా అభివర్ణించడం జరుగుచున్నది ఇట్టి మహానుభావుల జీవాత్మలు ఆది(మూలము) నందు ఐక్యం అవ్వడం అసాధ్యం కనుక ఈ జీవాత్మలు జనన మరణ చక్ర వలయములోనికి చేరుట జరుగుచున్నది.


మోక్షం లేదా ముక్తికి సంబంధించిన కొత్త ఆలోచనా విధానం.

జీవ-ఆత్మ పరమాత్మలో కలిసిపోవడం వంటి ప్రక్రియ ఎప్పుడూ జరగదు.

ఎందుకంటే ప్రాథమికంగా అవి (జీవ-ఆత్మ మరియు పరమాత్మ) ఎల్లప్పుడూ ఒక్కటే.

బౌతికంగా వేరు వేరు చోట ఉన్నపటికీ జీవాత్మలన్నీ మూలప్రకృతి ద్వారా పరమాత్మతో(ఆది లేదా మూలముతో) అనుసంధానింపబడి ఉంటాయి. 

జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడాన్ని (ఒక నీటి బిందువు సముద్రంలోకి తిరిగి వెళ్లడం వంటిది గా కొందరు వర్ణించారు) ఇవన్నీ సత్య వర్ణనలు కావు.   

యోగ అనేది జీవ-ఆత్మ స్థాయికి పరమాత్మ శక్తుల యొక్క పూర్తి కార్యాచరణ సామర్థ్యాన్నితీసుకొని వొచ్చి జీవాత్మను పరమాత్మ సమానముగా తీర్చిదిద్దగలిగే సాధనమై ఉండాలి.  

కర్మ సంకెళ్లు, స్వీయ ఎదుగుదలను ప్రోత్సహించు ఆధ్యాత్మిక పద్ధతులు, ఇటువంటి పద్ధతుల ద్వారా వొచ్చిన మోక్షం, కేవలం జనన మరణ చక్రములో కొట్టుమిట్టాడు జీవాత్మలకు వరికే పరిమితం, కానీ జీవాత్మ అంతర్బాగమున ఉన్న పరమాత్మ సూత్రం(అంతరాత్మ or అక్షరపురుష) పై ఎటువంటి ప్రభావం ఉండదు.

భగవద్ గీత యందు క్షర పురుష తో పోల్చిచూసినచొ అక్షర పురుష శ్రేష్టమైనది మరియు  విశిష్టమైనదిగా పేర్కొనబడినది.

కర్మ బాంధవ్యాలు, మోక్షం వంటి పదాలు పరమాత్మా యొక్క ప్రతిబింబస్తితి అయినా అక్షర పురుషునకు వర్తించవు. కోరికలు, జనన మరణాలు, దుఃఖాలు, రోగాలు కేవలం క్షర పురుషునకు వర్తిస్తాయి. యోగము ఈ క్షర పురుషుని యందు నిక్షిప్తమైన రుగ్మతలను సరిచేయు విధానమే ఉండవలెను.

జీవాత్మ(క్షర పురుష) తన అంతర్బాగమున ఉన్న పరమాత్మ సూత్రాన్ని(అంతరాత్మ or అక్షరపురుష) అవగతం చేసుకొని ఆ పరమాత్మని తన యందు నిలుపుకునే తీవ్ర పట్టుదలతో కూడిన ప్రయత్నం చేయవలెను, అప్పుడే మానవుడు పూర్ణ మానవునిగా పరిణామం చెంది ఆహారం, నీళ్లు, గాలి వంటి కనీస అవసరాలు నుంచి విముక్తుడవుతాడు, ఇటువంటి ప్రయత్నం లేదా సాధన విధానమును యోగ సాధన అందురు

ముక్తి లేదా మోక్షం అంటే ఎలాంటి లోపాలు లేకుండా భూమిపై నిజమైన అమరత్వం పొందడం ఇది కేవలం ఆ పరమాత్మాను మనలో ఆహ్వానించి నిలుపుకోవడం  ద్వారానే జరుగుతుంది అంతేకాని మనము పరమాత్మలో ఐక్యం అవడం అనేది అసాధ్యం. 

ప్రకృతి మనకు ఈ దేహమును ఇచ్చుటకు మూల కారణం ఏమనగా, ఈ దేహం సహాయముతో మనిషి యోగ సాధన గావించి తనలోనే ఉన్న అంతరాత్మ సహకారముచేత ఆ పరమాత్మను తనలోకి ఆహ్వానించి శాశ్వతముగా నిలుపుకొనే ప్రయత్నం చేయవలెను.

పరమాత్మ నుండి వచ్చే ప్రవాహం, దానిని స్వీకరించడానికి తన యోగ ప్రయత్నం ద్వారా సంసిద్ద పరుచుకున్న వ్యక్తిలోకి ఆకస్మికంగా వస్తుంది.

నిజమైన అద్వైత సిద్ధి జీవాత్మ యందు పరమాత్మాను  శాశ్వతముగా నిలుపుకొనుటను బోధిస్తుంది 

మనం సంసిద్ధంగా ఉన్నప్పుడు మరియు ఆయన కోరుకున్నప్పుడు ఆయనే మనలోకి రావాలి అంతేకాని మనము అతని వద్దకు తిరిగి వెళ్ళలేము. ఎందుకంటే, అతను ఎల్లవేళలా అన్నిచోట్లా ఉన్నాడు కనుక.

ప్రకృతిలో ఎక్కడికీ తిరిగి వెళ్లడం లాంటివి ఏమీ లేవు;
పరిణామం ప్రారంభం నుండి ప్రతిదీ ముందుకు సాగుతోంది
ప్రకృతిలో ఎక్కడికీ తిరిగి వెళ్లడం లాంటివి ఏమీ లేవు;
పరిణామం ప్రారంభం నుండి ప్రతిదీ ముందుకు సాగుతోంది. 

ఈ మానవాళి అంతటి ని ఒకటిగా భావించే ఆ పరమాత్మ, ఏ ఒక్క మానవుడు సంసిద్దుడై తన యందు ఆ పరబ్రహ్మను(adi or moolam) దించుకొను ప్రయత్నమున సఫలీకృతం అవుతాడో ఆనాడు సమస్త మానవాళి ఈ కర్మ బాంధవ్యాల నుంచి విముక్తి పొందడం జరుగుట తథ్యం.

ఏదో ఒక మనిషికి మోక్షమునిచ్చు యోగ సాధన సరియైన యోగ సాధన కానే కాదు.

మోక్షం ఏదో ఒకరికి వొచ్చి మిగితా అందరికి రాకుండా ఉండదు 

యోగా-ప్రయత్నంలో ఎలాంటి స్వార్థానికి తావు లేదు.

అందరిలో తనని, తనలో అందరినీ చూడనివాడు ఎప్పటికీ యోగాన్ని - సిద్ధిని పొందలేడు. 

వాస్తవానికి ఈ సృష్టి ఉద్భవించినప్పటినుంచి ఇప్పటి వరకు ఎవరికీ మోక్షమనేదే రాలేదు అని నొక్కి వ్యాఖ్యానించవొచ్చు, కొన్ని ఆత్మలు సృష్టి యందు లొసుగులను ఉపయోగించుకొని సృష్టి పరిణామం యందు విశ్వాసం కోల్పోయి అనేక పరియాయలు జనన మరణాలు అనుభవించుట ఇష్టం లేక ఒక నిశ్చల మరియు నిర్జీవ స్థితిలో గోప్యం గా పడిఉండుట జరుగుచున్నది ఇటువంటి స్థితి మోక్షం లేదా ముక్తి కానే కాదు.


The above essay is an extract from Master C.V.V.'s direct disciples' (mediums) S. Narayana Iyer's writings (T.S. Sankar Aiyer supported his writings.)

--------------------------------------------


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?