మానవ ఆకృతి మరియు వివిధ ప్లేన్స్


 

ఎథెరిక్ శరీరం భౌతిక శరీరాన్ని ఇతర సూక్ష్మ శరీరాలతో అనుసంధానిస్తుంది, ఇది భౌతిక పెరుగుదలకు మాతృకగా (Matrix: Something from which something else originates, develops, or takes form.) పనిచేస్తుంది, ఈథెరిక్ భౌతిక శరీరంలోని ప్రతి కణము యొక్క ఉపరితలం పైన వ్యాపించి దానికి మాతృకగా పనిచేస్తుంది.

 మనిషి ఎలా ఏర్పడతాడు.

మనిషి అంటే ఏమిటి మరియు అతను ఎలా ఏర్పడతాడో క్లుప్తంగా చూద్దాం. 

మనిషీ  ప్రాణమున్న ఒక వ్యక్తిగత జీవాత్మగా చెప్పుకొనవొచ్చును.

మనిషీ మెమొరాండం(శరీరం) మూడు పొరలుగా జత చేయబడింది, ఈ పొరల పేర్లు ఏమనగా .

" మానసిక్ శరీరం " (Mental Body)

" సూక్ష్మా శరీరం " (Astral Body)

"భౌతిక శరీరం " (Physical Body )

ఈ మూడు శరీరాలు, మనిషీ ఈ విశ్వ ప్రకృతి యందు పరిభ్రమించడానికి ఉపయోగపడు వాహనాలు. ఈ మూడు శరీరాల నిర్మాణానికి ఉపయోగపడ్డ అణువులు వేరు అయినప్పటికీ ఈ అణువులన్నిటికి మూలం జీవాత్మ.

భౌతిక శరీరం అత్యంత ఘన సంక్షేపణం కలది, ఈ శరీరం జీవాత్మ యొక్క చివరి పరిమితి.

మనిషీ భౌతిక శరీరం ద్వారానే ఈ విశ్వ ప్రకృతిలో ఒక ఆకరరూపంగా ఆవిర్భవించడం జరుగుతుంది.

మనిషి యొక్క భౌతిక, సూక్ష్మా మరియు మానసిక శరీరాలు వ్యక్తిగత(individual) జీవాత్మలు విశ్వంలో పనిచేయడానికి మరియు అభివృద్ధి చెందడానికి ఉపకరించడమేకాక, వివిధ రకాలైన ఆకృతులుగా పరిణామం చెందుతూ, అనేక రకాల గుణాలను వ్యక్తపరుస్తాయి.

ఈ మూడు శరీరములలో అతి పలుచనైనది మానసిక శరీరం కాగా, భౌతిక శరీరం అత్యంత ఘన సంక్షేపణం కలది, సూక్ష్మ శరీరం ఈ రెండిటికి మధ్యస్థంగా ఉండును.

ఈ విశ్వమునందు తనకంటూ ఒక ఉనికి ఉన్న ప్రతి రూపం జీవాత్మ నుంచి ఉద్భవించినట్లుగా పరిగణించవలెను.  

ఈ విశ్వమునందు స్తరీకరణ(Stratification: arrangement of something into different groups) వివిధ పరిధుల యందు విభజించి ఉండుట వలన, అనేక రకాల రూపాలు వాటి విధులకు అనుగుణంగా వాటి పరిధులు నిర్ణయించపడ్డాయి.

ఈ రూపాలు వాటి పరిమితులకు లోబడి పనిచేస్తూ మనకు కనపడినప్పటికీ, వీటి అసలైన లక్షణాలు దాని వెనుకున్న అసలైన సత్యం వాటి ఉన్నత స్థాయికి సంబంధించిన అనుభవాలు అంత తేలికగా అర్థంకాని విషయం.

ఈ రూపాలు ఏదో వాటి పరిధి రీత్యా పని చేస్తూ మనకు కనిపించే వాటి ప్రవర్తనను Law of Cosmic Process of Becoming గా అర్థంచేసుకొనవలెను (పరిణామ క్రమములో ఎదుగుదల ప్రయత్నంగా అర్థంచేసుకొనవలెను)

భౌతిక ఆవరణ(Physical Plane) యందు ఒక రూపం భౌతిక పరమైన చర్యలు వరికె చూపించ గలుగుతుంది అంతేకానీ తన ఉన్నత స్థాయిలందు రూపములను వాటి యందు జరుగు విధులను వ్యక్త పరచలేను అసమర్థతకు గురవుతుంది.

వేరు వేరు రూపములు వాటి వేరు వేరు విధులకు అనుగుణంగా ఏర్పడిన వేరు వేరు ఆవరణలను ప్లేన్స్ గా(Planes: Level of Existence) పరిగణించుట జరుగుచున్నది.

16.1.1912న MTA కాస్మిక్(Cosmic) శక్తులను రూప ఆవరణ స్థితులుగా(Planes: Level of Existence) మార్చడాన్ని ఈ క్రింది విధంగా వివరించింది.

ఆది: ఈ ఆది భౌతిక, సూక్ష్మ మరియు మానసిక ఆవరణ స్థితులుగా మార్చబడింది.

పరమాధి: పరమాధి మానసిక, బుద్ధిక్ , నిర్వాణిక్ ఆవరణ స్థితులుగా మార్చబడింది.

మహా ఆది లేదా ముక్తి ఆది: నిర్వానిక్ , పర నిర్వానిక్ మరియు మహా పర నిర్వానిక్ ప్లేన్‌లుగా మార్చబడింది.

Our Earth is in Physical Division of a Etheric Plane of a Kundalini Evolution Field of Minor Square of 4th Field of Kundalini Evolution for more details please refer below url link.

https://mastercvvyogam.blogspot.com/2023/05/mta-atm.html





Law of Cosmic Process of Becoming ఒకొక్కో ప్లేన్ యందు ఒకొక్క విధముగా క్లిష్టతరంగా కాకుండా అన్ని ప్లేన్స్ యందు ఒక్కటే నియమ నిబంధనలతో పని చేయును.

Note: As per the Law of Cosmic Process of Becoming దిగువ స్థాయి దేహం దాని ఉపరితల స్థాయి దేహం నియంత్రణలో  ఉంటుంది 

ఈ విధంగా ఏర్పడిన ప్లేన్స్ మన సౌకర్యనుగూణంగా ఉన్నత ప్లేన్ మరియు దిగువ ప్లేన్స్ గా తప్పక విభజించినచో ఉన్నత ప్లేన్ యొక్క సరిహద్దు దాని దిగువ ప్లేన్ హద్దుగా(boundary limit) పరిగణించవలెను. ఈ దిగువ ప్లేన్ యందలి రూపాలు ఎగువ ప్లేన్ సరిహద్దును దాటలేవు. 

ఈ విధంగా అన్ని ఎగువ ప్లేన్ లు దిగువ ప్లేన్ లకు విధించు సరిహద్దులను మాయ అని అందురు. ఈ హద్దులు కేవలం రూపాలకే కాకుండా వాటి జ్ఞానమునకు కూడా వర్తిస్తుంది. 

మాయ అనగా ఒక ప్లేన్ యందలి రూపాలు హద్దును ఛేదించి ఇంకొక ప్లేన్ యందలి రూపాలకు జ్ఞానాన్ని అందచేయలేని ఒక నిస్సహాయ స్థితి.

మాయ ఒక ప్లేన్ యందు ప్రాపంచిక ప్రక్రియను విస్తరింపచేయడానికి దోహదపడు ఒక విధానంగా భావించవొచ్చును.

ఒక ప్లేన్ కి మరో ప్లేన్ కి మధ్య ఉన్న ఈ  చేధించరాని హద్దుల వల్లనే భౌతిక ప్లేన్ యందలి యోగులు లేదా తాంత్రికులు సమాధి స్థితిలో సముపార్జన చేసుకున్న జ్ఞానాన్ని లేదా అనుభవాలను సమాధి స్థితి నుంచి సాధారణ భౌతిక స్థితికి చేరిన పిదప ఏదో ఒక అద్వితీయమైన ఆనందాన్ని ఆస్వాదించినట్లు తెలియచేయుట జరుగును కానీ అచట వారు అనుభవించిన ఆ అద్వితీయ ఆనందానికి కారణం తెలుపలేరు.

సమాధి స్థితి లో ఉన్నంత వరకు తాత్కాలికంగా వారు ఆకలి దప్పిక వంటి సాధారణ అవసరాలను జయించినప్పటికీ, ఎప్పుడైతే సాధారణ భౌతిక స్థితికి చేరిన పిదప ఆకలి, దప్పిక, కోరిక వంటి భావనలు వారిని సర్వసాధారణంగా చుట్టుముడతాయి.

ఏ విధంగా ఒక చనిపోయిన వ్యక్తి ఈ భౌతిక ప్రపంచం నుంచి ఏమి తీసుకొని వెళ్లడం కుదరదో అదే విధంగా సమాధి స్థితి నుంచి ఏది సాధించాలన్న సాధించలేక అసఫలీకృతులవుతారు.


The above essay is an extract from Master C.V.V.'s direct disciples' (mediums) S. Narayana Iyer's writings (T.S. Sankar Aiyer supported his writings.)

--------------------------------------------


Join our Whatsapp Community:
https://chat.whatsapp.com/GqLS5VEQ9SnEn0mzjBxBXm

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?