మూలప్రకృతి - బ్రహ్మం / పరబ్రహ్మం

 


మూలప్రకృతి - బ్రహ్మం / పరబ్రహ్మం


14-11-1912 నాటి డైరీలో తమిళంలో ఇలా వ్రాసినారు.



Muulaprakritiai patriyum, brahmavai patriyum inda prasannangal muluvadum tiirmaanikka pattadu.

 

మూల ప్రకృతి గురించి, బ్రహ్మం గురించి వేసిన ప్రశ్నలకు పూర్తిగా వివరణ ఇవ్వడమైనది. 


అయితే అట్టి వివరణలు లభ్యము కాని కారణముగా ఇతరత్రా కొంత సేకరించి ఇలా అర్ధము చేసికొనవచ్చు.


పురుష అనగా సమస్త సృష్టిలోను అంతర్లీనముగా గల సిద్దాంతము. (Hidden Principles of Universe)

ప్రకృతి అనగా పదార్థము లేదా శక్తి. [Universe Matter or Force (Energy)]

ప్రకృతి ద్వారా మాత్రమే పురుష వ్యక్తమవగలదు.

ఉదాహరణకు, కరెంట్‌(ప్రకృతి) మరియు బల్బ్(పురుష) వలె.


మూలప్రకృతి శాశ్వతము (మూలప్రకృతి: Undifferentiated cosmic matter)

కానీ ప్రకృతి శాశ్వతము కాదు.

తైత్తరీయ, శ్యేతాశ్వవతార ఉపనిషత్తులలో వీటి వివరణలు చూడవచ్చు.


ప్రాచీన వాజ్మయములో రెండు విధములైన ప్రకృతిని చూడవచ్చు. 


మూలప్రకృతి. దీనినే సాంఖ్య దర్శనములో 

ప్రధాన అని చెప్పినారు. 

ఇది సమస్త సృష్టికి సంబంధించినది.


ప్రకృతి. ఇది వ్యక్తిగతమైనది. 

మాయ, అవిద్యల ప్రభావము దీని మీదనే. 


ఇక మాస్టర్‌ గారు 15.9.1921 నాటి మెమరీ మెమొరాండం నోట్స్‌ లో ఇలా వ్రాసినారు. 



“According to K Key and then 100 squares, work is to take one Purusha, Prakriti in one square. This square will reveal only of the present working evolution and not all.”


“K కీ ప్రకారము, 

100 స్క్వేర్‌ లలో ఒక్క పురుష ప్రకృతి చర్యలు ఒక్క స్క్వేర్‌ నందు జరుగును.

అట్టి ఒక్క స్క్వేర్‌ లో జరుగు పరిశీలన

కేవలము ప్రస్తుత పరిణామ విషయము మాత్రమే తెలుపును.” 


పై వాక్యములను బట్టి, ప్రకృతిని మూడు విధములుగా చూడవలాను. 


- మూలప్రకృతి (Undifferentiated cosmic matter, it is eternal)

- పరిణామ ప్రకృతి (Evolutionary Matter / Force / Energy, Not Eternal). 

   పరిణామ ప్రకృతి ఇది ఒక్క పరిణామము మొత్తమునకు సంబంధించిన స్కేర్‌ లోని ప్రకృతి [Evolutionary Universe(matter/force/energy) pertaining to one Square]

- వ్యక్తిగతమైన ప్రకృతి [(Maya / Illusionary world around us (all lokas of various planes)]

Prakrithi: World of objects in space and time is called prakrithi in its collective aspects.
(Fundamental Stuff of the world beyond even "akasa") - T.S. Sankar Iyer.

Since Master C.V.V had the knowledge of the complete evolution from the very origin in conscious state, mention of this information of 100 squares and the Prakriti in one square was done by him only. That is the reason why he only is called ‘Master’. 

సృష్ట్యాదిక్రమముల జ్ఞానము పూర్తిగా భౌతిక స్పృహలో కల వారు కావున మాస్టర్‌ గారు మాత్రమే పరిణామ ప్రకృతిని ప్రస్తావించినారు.

అంతటి మహోన్నతులు కావుననే సి.వి.వి గారు మాత్రమే మాస్టర్‌ అయినారు.


ఇక గర్భములో దేహ నిర్మాణము చేసేవి, కుండలిని, మెమరీ మరియు వెలుపల ఉన్న స్టెబిలిటీ అని సాధకులకు తెలిసినదే.

మరి పురుష అనేది కుండలినిలో ఉండునా, లేక మెమరీలో ఉండునా అనే సందేహము కలుగవచ్చు.

రాశి మండలములోనికి వెలుపల నుంచి తొలుత ప్రవేశించునది మెమరీ కావున, 

కుండలిని లక్షణములు రాశి మండలముచే ఇవ్వబడును కావున, 

పురుష సిద్దాంతము మెమరీ లోనే ఉండునని భావింపవచ్చు. 


అనేక మంది మాస్టర్‌ గారిని బ్రహ్మం అని, పరబ్రహ్మ అని వేద పరిభాషలోని పదములను ఉదాహరిస్తూ వ్రాయుచున్నారు.

అవి అన్నియు సత్యదూరములే.

మాస్టర్‌ గారే బ్రహ్మము లేదా పర బ్రహ్మము అనేది అసంబద్దమైన మాటే.

మాస్టర్‌ గారి డైరీలొ గాని నోట్స్‌ లో గాని వారే బ్రహ్మము, పరబ్రహ్మము అనే ప్రస్తావనే లేదు.

ఈ యోగమార్గములో ఎం.టి.ఎ. చెప్పిన వారు ముగ్గురే. 

మాస్టర్‌ సి.వి.వి., ఎం.టి.ఎ. మరియు వన్‌ పాయింట్‌. 


బ్రహ్మం అంటే ఎమిటో మాస్టర్‌ గారు మెమరీ, మెమొరాండం నోట్స్‌ నందు 17.10.1920 న క్రింది విధముగా వ్రాసినారు.


“కన్ఫోలేషన్‌ లెవెల్‌ (Consolation Level) నందు అనేక స్పిరిట్స్‌ కలవు.

ఒక రకముగా చెప్పవలెనంటే, భూమిపై బ్రహ్మం గా చెప్పబడేది కన్ఫోలేషన్‌ లెవెల్‌ పై స్థితి.”


“ఈ(బ్రహ్మం) స్థితికి పైన, డీప్‌ లెవెల్‌ నందు, కన్ఫోలేషన్‌ స్పిరిట్‌ తో సంబంధము లేని, స్వతంత్రమైన స్థితిలో ఒక ఉన్నత స్థితి పని చేయడం  జరిగినది.” 


పైన చెప్పిన దాన్నిబట్టి, ప్రాచీన పద్ధతులలో చెప్పబడిన బ్రహ్మం స్థితి కంటే ఉన్నత స్థితిలో ఈ మార్గము పని చేసినట్లు తెలుస్తుంది.


ఇక మాస్టర్‌ సి.వి.వి గారిని పరబ్రహ్మముగా చెప్పుట గురించి.

ఈ పదము యొక్క నిర్వచనము మాస్టర్‌ గారి రచనలో గోచరించదు.

పరబ్రహ్మముగా చెప్పుట వలన వారికి అత్యంత ఉన్నత స్థితిలో చూచుచున్నామని చెప్పుట సరి కాదు.


ప్రాచీన తత్వపరిభాషలో పరబ్రహ్మ అనగా - మూల కారణము అని, 

సృష్టి ప్రళయ కాలములో క్రియారహితముగాను, 

పరిణామక్రమములో క్రియాశీలముగా ఉండునదియని, 

అది మానవుని బుద్ధికి అందని స్థితి అని, 

అది పదార్థము కాజాలదని, 

బుద్ధికి అందెడి స్పృహ కూడా కాజాలదని, 

ఉపాధితో నిమిత్తములేని 

స్పృహను ఊహించలేని కారణముగా అట్టి సృహ కూడా కాజాలదని, 

నిశ్చయమగు ఉనికికి సంబంధముగల బుద్ధికి అందదని 

ప్రాచీనులు నిర్వచించినారు.


ఇది ఒక అనిర్వచనీయ స్థితిని వ్యక్తీకరించెడి తత్వపదము.


అద్వైత పరంగా, సాంఖ్యమార్గ పరంగా ఈ పదము గురించి ఎంతో చర్చలు చేసి ఉన్నారు. 

మాస్టర్‌ గారే పరబ్రహ్మము అని ఎవరైనా చెప్పడము పదాడంబరము కొరకు మాత్రమే.

ప్రాచీన పరిభాష అన్వయము వలన కాలక్రమేణా, 

మాస్టర్‌ గారి మార్గములోని సత్యజ్ఞాన మార్గముపై సాధకులు దృష్టి కోల్పోయే అవకాశము గలదు.

ప్రాచీన సంప్రదాయములు, అందలి తత్వపదజాలములు ఈ మార్గమునందు ఆప్రస్తుతములని గమనింపవలెను.


మాస్టర్‌ సి.వి.వి గారిని మాస్టర్‌ గానే సంబోధించాలి గాని, 

అన్యధా అలంకారికముగా బ్రహ్మం అనో, పరబ్రహ్మం అనో, మరో విధముగానో సంబోధించరాదు.

--------------

Reference: Master CVV's Yoga - Basic  Information 

Thanks to Umakant Akkiraju Garu and Prabhakar Mitra Mandali for their continuous efforts to reveal the master's true and authentic knowledge.

--------------------------------------------

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాస్టర్ గారి ప్రార్థన విధానమునకు సంబంధించిన వివరణ

Hierarchy of Universe

మాస్టరు C.V.V. స్థాపించిన నూతన యోగంలో శ్రీ పోతరాజు నర్సింహం అనే నేను ఎందుకు చేరేను?