Understanding the Concept of K (Kundalini) and the New Yoga - Sri C.R. Sreenivasa Iyer (Medium No. 38)
Understanding the Concept of K (Kundalini) and the New Yoga - Sri C.R. Sreenivasa Iyer (Medium No. 38) C.R. Sreenivasa Iyer Diary (21-9-1914) ప్రస్తుతము ఉన్న విశ్వ సూత్రముల ప్రకారము ఏర్పడిన మానవ వ్యవస్థలో ఒక నూతన లైఫ్ ప్రినిపుల్ ను ప్రవేశపెట్టడము ద్వారా ఒక క్రొత్త విధాన ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావడమే ఈ నూతన యోగ మార్గము యొక్క లక్ష్యము. చుట్టూరా జరుగుచున్న సాధారణ పరిణామ ప్రక్రియ యధావిధిగా జరుగుతున్నపుడే, ఈ నూతన ప్రాణ శక్తి వాహకులుగా ఉండగలరు అనే భావనతో మనలను మీడియంలు అని పిలచినారు. సాధారణ పరిణామప్రక్రియ ప్రస్తుత మానవ రూపములో తన పరిమితిని చేరినది. ఈ పరిణామ సూచన మానవ కుండలినిలో నిక్షిప్తమయి ఉన్నది. తగిన విధముగా పరిశీలించినట్లయితే, అది పొందిన అనేక పరిణామస్థితులను తెలియజేయగలదు. ఈ పరిణామమునకు బ్రహ్మగా ఉన్నది ఏ ప్రాధమిక జీవసిద్ధాంతము నుంచి వచ్చినదో, దాని నుంచే ఈ కుండలిని అనే సిద్దాంతము కూడా తీసుకోబడినది. ఈ నూతన యోగమార్గము ద్వారా ప్రవేశపెట్టబడుచున్న ప్రాణ శక్తికి కూడా మూలము అదే కానీ, ఈ ప్రాణ శక్తి విశ్వపరిణామములోని పరిమితులకు లోబడినది కాదు....