థియోసఫీ దృక్కోణంలో ప్రస్తుత సృష్టి సంబంధిత సిద్ధాంతాలు - Introduction

థియోసఫీ దృక్కోణంలో ప్రస్తుత సృష్టి సంబంధిత సిద్ధాంతాలు Introduction మేడం హెలీనా పెట్రోవినా బ్లావెట్స్కిని గూర్చీ, ఆమె వ్రాసిన పుస్తకాలను గూర్చీ M.T.A మాస్టరు గారికి ఏమి చెప్పినారో వినండి. నిజమైన సత్యాన్ని తెలుసుకోవడానికీ, తెలుసుకొనిన దానిని ఎట్లా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి. ఎప్పుడు ఉపయోగించాలి అనేదానికి కూడా కొంచం కామన్సెన్సు(Common Sense) అంటే ఇంగిత జ్ఞానం ఉండాలి. ఈ ఇంగిత జ్ఞానం లేకుండా, సత్యం యొక్క విలువ తెలియకుండా, లోతు తెలియకుండా, చెత్తబుట్టలో చెత్తపడవేసినట్లు మనిషి కనిపించగానే వాడినెత్తిన రుద్దుతున్నారు. సత్యం ఎప్పుడూ మానవులను విరోధింపజేయదు. సత్యం మానవులంతా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించేదానికి సహాయ పడుతుంది, ఇతరులకు అపకారాన్ని కలిగించదు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఉదారమైన, ఉన్నతమైన భావాలు కావాలి. ఎవరైనా అడిగినప్పుడు సరియైన సలహాలు ఇచ్చే స్థితిలో ఉండాలి. కొంతమందిని చూస్తే వాళ్లకున్న యోగ్యత ఏమిటో తెలుసు కోకుండా, ఏవిధమైన శ్రమా పడకుండా, హద్దుమీరి ఇతరులకు సలహాలు ఇస్తున్నారు. పై విషయాలు హెచ్.పి.బి. అంటే హెలీనా పెట్రోవినా బ్లావెట్స్కీని...