పోస్ట్‌లు

నవంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

శ్రీ పోతరాజు నర్సింహం పంతులు గారి పుట్టుపూర్వోత్తరాలు - ఉపోద్ఘాతం(Introduction Part 02)

చిత్రం
శ్రీ పోతరాజు నర్సింహం పంతులు గారి పుట్టుపూర్వోత్తరాలు ఉపోద్ఘాతం(Introduction Part 02) కి॥ శే॥ శ్రీ పోతరాజ నరసింహం పంతులుగారు 13-10-1883 రాత్రి గం॥ 12-20 ని॥లకు జన్మించారు.   బాల్యంలోనే తల్లిని ఆ తర్వాత రెండు సంవత్సరాలకు తండ్రినీ పోగొట్టుకొని, వారి మేనత్తగారి పోషణలో పెరిగారు.  స్కూలు ఫైనలు వరకు విశాఖపట్టణంలోను ఆ తర్వాత M.A. వరకు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోను చదివేరు.  తర్వాత ఎడ్యుకేషనల్ సర్వీసులో (M.ES.) చేరి ఫిలాసఫీ ప్రొఫెసరుగా, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోను, కుంభకోణము ప్రభుత్వ కళాశాలలోను పనిచేసి రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాలుగా రిటైరైనారు. శ్రీ P.N. (శ్రీ నరసింహం పంతులుగారిని ఈ యోగసాధకులందరు శ్రీ పి. యన్. అని పిలవడం అలవాటు) 1913-1914 ప్రాంతంలో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో పనిచేస్తుండేవారు అప్పుడు వారు థియోసాఫికల్ సొసైటీ మెంబరుగా ఉంటూ వారి కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండేవారు. అప్పట్లో ఆ సంఘ సభ్యులందరు  నమ్ముతూ వస్తున్న కొన్ని విషయాలు వమ్ము(తప్పులని నిరూపించబడడం) అయిపోయిన కారణంగా వారి కార్యకలాపాలలో నమ్మకము పోయి, మత విషయాలలో మానవుల నమ్మకాల మీద వారికి ద్...

శ్రీ పోతరాజు నర్సింహం గారి నోట్స్ - ఉపోద్ఘాతం(Introduction Part 01)

చిత్రం
శ్రీ పోతరాజు నర్సింహం గారి నోట్స్ - ఉపోద్ఘాతం(Introduction Part 01) డాక్టర్ శ్రీ గాలి బాలసుందరరావు గారు కుంభకోణంలో మాస్టరు సీ. వీ. వీ. నూతనయోగం స్థాపించారు.  ప్రారంభ దశలో కొన్ని పరీక్షలు చేసి వారి వారి పూర్వజన్మ సంస్కారాదులను గురించి వివరములను సేకరించి ఉపదేశము చేశారు. వారి ఉపదేశ విధానమును ‘ఇనిషియేషను’ అంటారు.  ఆ యోగాదర్శములు ఈ పుస్తకములో వివరింపబడ్డవి. ఈ నూతన యోగ మార్గమును ‘నూతన యోగమని “భృక్తరహిత తారక రాజయోగమనీ” అతీత కాయ కల్పయోగమనీ అంటారు.  ఈ నూతనయోగాదర్శములు పూర్తిగా సాధింపడకుండానే మాస్టరు గారు. . . 12-6-1922 సాయంత్రం 3 గంటలకు భౌతిక దేహమును విసర్జించారు.  వారు స్వయంగా 752 మందిని ఇనిషియేట్ చేశారు.  వారిలో  కుంభకోణం వాస్తవ్యులు శ్రీ యస్. ఆర్. బి. వి. గారు,  ఒంగోలు వాస్తవ్యులు మైనంపాటి నరసింగరావు గారు,  పండిత కవులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు  నాకు తెలిసినంతవరకు యీ నూతన యోగమును గురించి ప్రచారం చేశారు. మాస్టరుగారు భౌతిక దేహమును విసర్జించిన తరువాత వారి శిష్యులను మూడు వర్గాలుగా విభజించ వచ్చును.  మొదటి వర్గము “ఉపదేశార్హత, మాస్...