పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

మాస్టరు గారి గురించి వారి ప్రత్యక్ష శిషులైన శ్రీ శంకర్ ఐయేరు గారు పంచుకున్న కొన్ని వాస్తవాలు.

చిత్రం
మాస్టరు గారి గురించి వారి ప్రత్యక్ష శిషులైన శ్రీ శంకర్ ఐయేరు గారు పంచుకున్న కొన్ని వాస్తవాలు. Telugu Transcript of above video is provided below. శ్రీ T.S. శంకర్ అయ్యర్ గారు ‘అరవై ఏళ్ళ తపస్సు’ అన్న వ్యాసంలో తన అనుభవాలను పొందుపరిచారు ఈ రోజు వాటిని మీతో పంచుకుంటున్నాం. 1912వ సంవత్సరం నాటి మాట. అప్పుడు నేను ఒక ప్రభుత్వ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిని. ఒక మిత్రుడు ‘మేరి కరోల్’(Marie Corelli) వ్రాసిన పుస్తకం ‘ ది లైఫ్ ఎవర్ లాస్టింగ్ ’(the life everlasting) ఇచ్చాడు చదవమని. The Life Everlasting written by Marie Corelli: Read / Download అది చదివినప్పుడు ‘మాస్టర్’ అనే పదం నన్ను ఆకర్షించింది. ‘మాస్టర్’ అనే మాటకు ఆమె చక్కని నిర్వచనం చెప్పంది. మాస్టర్, సాధకుడు అనే పదాలను వర్ణించి శాశ్వతత్వం అంటె ఏమిటో చెప్పింది. మేరీ కరోల్ వర్ణించిన మాస్టర్ స్పెయిన్ దేశంలో ఎక్కడో ఉన్నాడు. మాస్టర్ ని కలుసుకోవాలని నాలో ఆశ కలిగింది. కొన్ని రోజుల తరువాత ఒక రోజు శ్రీ S. నారాయణ అయ్యర్ తో మాట్లాడుతున్నాను. ఆయన నాకు బంధువు. మాస్టర్ గారి శి ష్యుడు. ఆయనే ఈ యోగాన్ని గురించి నాకు చెప్పారు. మేరీ కరోల్ వర్ణన, నారాయణ అయ్యర్ వర్...