మాస్టరు గారి యోగమును ఉద్దేశించి శ్రీ గాలి బాలసుందర్ రావు గారు తెలియచేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు

మాస్టరు గారి యోగమును ఉద్దేశించి శ్రీ గాలి బాలసుందర్ రావు గారు తెలియచేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. కర్మను నిర్దేశించే శక్తి యేది? వ్యక్తి చేయవలసిన కర్మలు ముందే నిశ్చయింప బడి వుంటే అతను చేసిన నేరాలకు అతన్ని శిక్షించటంలోగాని మంచి గుణాలను ప్రస్తుతించడంలో(rewarding) గాని అర్థమేమీ లేదు. మానవుడిలో ఒక సదసద్వివేక శక్తి ఉన్నది. అది భగవద్దత్తమైనా కావాలి, స్వార్జితమైనదైనా కావాలి. భగవద్దత్తమైనదే అనుకుంటే భగవంతుడు, చెడ్డవాళ్ళను కావాలనే సృష్టిస్తున్నాడన్న మాట. మానవుడే స్వశక్తి వలన ఆ చెడ్డ గుణాలను రూపు మాపుకోవాలి. అప్పుడు తండ్రి చేసిన చెడ్డ ఋణాలు(debts) కొడుకు తీర్చినట్లు భగవంతుడు చేసిన లోపములు మానవుడు సవరించగలవాడవుతాడు. ఒక విధంగా భ గవంతునికన్న గొప్ప వాడపుతాడు. నిర్లోపమైన ఉత్తమ-గుణ-సంపద మాత్రమే కలిగిన వారిని సృష్టి శక్తి నిర్మించ లేకపోతున్నది. అట్టి వారిని నిర్మించాలని తాపత్రయపడుతున్నది. సృష్టి ప్రారంభ కాలంలో బ్రహ్మపదం రెండు భాగాలై బహిర్భాగం(exterior) అనాసక్తమూ(Disinterested) అనంత శక్తి(infinite power) సంపన్నమూ (wealthy) అయినా నిర్వికారము(changeless, expressionless, emotionless) అయినది గానూ అభ్యంతర భా...